“ఇదిగో ప్రజలందరికి కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు.” లూకా 2:10,11
2000 సంవత్సరాల క్రితం బెత్లెహేము నగర ఆకాశ వీధుల్లో దేవదూతల గణముళ చేత ప్రకటింపబడిన ఆనాటి సుమధుర సువార్తమానము నేటికిని విశ్వమంతటిలో తన భక్తుల ద్వారా ప్రకటింపబడుతూనే ఉంది.
ఇంతకీ ఏమిటా సువార్తమానం? దేవుని కుమారుడైన క్రీస్తు యేసు పరలోక వైభవాన్ని విడిచిపెట్టి, రిక్తునిగా జేసుకొని, నరావతారిగా ఈ లోకంలో జన్మించి పాపులైన ప్రతి మానవుని వారి పాపములనుండి రక్షించి, నరక బాధ నుండి తప్పించి పరలోక రాజ్యాన్ని దయచేస్తాడన్నదే ఆ సువార్తమానం.
నేను పాపిని కాదు గదా! నాకు రక్షణ అవసరం ఏమొచ్చింది? అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. రక్షణ ఎందుకు అవరసరం అయ్యింది అనగా! దేవుని చేత పవిత్రంగా సృష్టింపబడిన ఆదిమానవులగు హవ్వ ఆదాములు దేవుని ఆజ్ఞను మీరి పాపం చేశారు. ఫలితంగా పాపులకై నరక పాత్రులయ్యారు. దేవుని ఉగ్రతకు గురియై దేవుని పవిత్ర సహవాసాన్ని, సన్నిధిని పోగొట్టుకున్నారు. వారి ద్వారా పాపం ఈ లోకంలో ప్రవేశించింది. అనగా “ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణము అందరికి సంప్రాప్తమాయెను” అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం బయలు పరుస్తూ వుంది. (రోమా 5:12) అంతేకాదు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడని, ఏ బేధమును లేదు అందరూ పాపం చేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారని వివరిస్తూ ఉంది. (రోమా 3:10,23) పాపమునకు వచ్చు జీతం మరణం, భౌతికంగా మరణించిన తరువాత పాపులందరికి దేవుని చేత తీర్పు తీర్చబడి మరణశిక్ష విధింపబడుతుంది. ఈ మరణశిక్ష నరకంలో వేయబడుట ద్వారా అమలు పరచబడుతుంది. ఈ నిత్య నరకం అగ్నిగంధకముల చేత భాదింపబడే స్థలం. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచు స్థలం (ప్రకటన 14:10,11) ఎందుకనగా అగ్ని ఆరదు పురుగు (ఆత్మ) చావదు” (యెషయా 66:24). ఇంత బాధాకరమైన నరక బాధనుండి రక్షింపబడుటకు మార్గం లేదా? దీనికి సమాధానం కొందరంటారు నరక శిక్షకు పరిష్కార మార్గం – మంచి నడవడిక, ఆచార వ్యవహారాలు, నిష్ట నియామకాలు, ధర్మకార్యాలు, సంఘ సేవ తదితరమైన కార్యాలు చేస్తే సరిపోదా అని. గాని పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే “ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు, ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది” (రోమా 3:20). గనుక మన నీతి క్రియలు మనలను పాపంనుండి రక్షించలేవని తేట తెల్లమగుచున్నది. ఈ సందర్భంగా బైబిలు వివరించు మహా సత్యం ఏదనగా “ఎవరి వలన రక్షణ కలుగదు, యేసు క్రీస్తు నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము”.(అపో.కా 4:12) పాపులను రక్షించుటకు జన్మించిన “రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు” (లూకా 2:11) అను ఈ సువార్తమానము సిలువలో కార్యరూపము దాల్చింది”. ఆయన మనందరి అతిక్రమ క్రియలనుబట్టి గాయపరచబడెను. ఆయన పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెహోవా మన అందరి దోషములను అతని (యేసు క్రీస్తు) మీద మోపెను. (యెషయా 53:5,6)
క్రీస్తు యేసు పాపముల నిమిత్తమై సిలువలో తన పవిత్ర రక్తాన్ని చిందించి, మరణించి, పాతిపెట్టబడి, మరణమును జయించి, మూడవనాడు సమాధినుండి మృత్యుంజయుడై తిరిగి లేచి మనకు రక్షణనిచ్చి మనందరి కొరకై తండ్రితో నిరంతరము విజ్ఞాపన చేయుచున్నాడు.
ఇంతటి గొప్ప రక్షకుడు జన్మించిన దినమే క్రిస్మస్. అయితే క్రీస్తును రక్షకునిగా అంగీకరించే విధమేమనగా
“మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల అయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక అయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రలనుగా చేయును “ (1యోహాను 1:9) మరియు “ప్రభువైన యేసునందు విస్వసముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షింపబడుదురు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది.
సహోదరి సహోదరుల్లారా మీరు పాపము నుండి రక్షింపబడవలెనని పరలోకరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఆశిస్తున్నారా? నేడే రక్షణ దినం. రండి క్రీస్తు యేసును రక్షకునిగా అంగీకరించండి. ఆయన రక్తము ప్రతిపాపము నుండి మనలను పవిత్రులనుగా జేయును . ఈ క్రిస్మస్ పర్వదినం మీ జీవితంలో నిజమైన రక్షణ దినం కావాలని శాంతి సమాధానములను, ఆశీర్వాదములను బహుమెండుగా క్రీస్తు ద్వారా మీరు పొందాలని కోరుకుంటూ .....
llll
1. శాఖమూరు.
2. మందడం.
3. యెర్రబాలెం.
4. తాళ్ లాయిపాలెం.
5. దొండపాడు.
6. తుళ్లూరు
7. లింగాయపాలెం.
8. నూతక్కి.
9. పెదపరిమి.
10. వెలగపూడి.
Isaiah 53:
యెషయా 53:
Luke 23:34
34. Then Jesus said, "Father, forgive them, for they know not what they do." And they parted His raiment and cast lots.
లూకా సువార్త 23:34
34. యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లువేసిరి.
Isaiah66:2
2. For all those things hath Mine hand made, and all those things have been," saith the LORD. "But to this man will I look: even to him that is poor and of a contrite spirit, and trembleth at My word.replica seiko
యెషయా 66:2
2. అవన్నియు నా హస్తకృత్యములు అవి నావలన కలిగినవని యెహోవా సెలవిచ్చు చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను.
Luke 23:42-43
42. And he said unto Jesus, "Lord, remember me when Thou comest into Thy Kingdom."
43. And Jesus said unto him, "Verily I say unto thee, today shalt thou be with Me in Paradise."
John19:26-27
26. When Jesus therefore saw His mother and the disciple standing by whom He loved, He said unto His mother, "Woman, behold thy son!"
27. Then said He to the disciple, "Behold thy mother!" And from that hour, that disciple took her unto his own home.
యోహాను సువార్త 19:26-27
26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా,యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను,
27. తరువాత శిష్యుని చూచి యిదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియనుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను.
12. "Honor thy father and thy mother, that thy days may be long upon the land which the LORD thy God giveth thee.
మోషే లిఖించిన మొదటి గ్రంధమ ఆదికాండము
పురాతన ప్రతులైన ఆదికాండము మొదలుకొని ద్వితీయోపదేశకాండము వరకు ఉన్న ఐదు పుస్తకములను నిబంధన పుస్తకములందురు. (2 దినవృత్తాంతములు 34:30). క్రీ.పూ 3వ శతాబ్దములోని రచయితలు హెబ్రీ భాష నుండి గ్రీకు భాషకు సాతనిబంధన గ్రంథమును తర్జుమా చేసిన సెప్టోలెజెంట్ భాషాంతర తర్జుమాదారులు వీటిని ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితియోపదేశకాండము అని ఐదు వివిధమైన పేర్లతో పిలిచిరి.
ఉద్దేశ్యము : ప్రపంచముల నిర్మాణమును గురించిన ముఖ్యాంశములను వ్రాయుటను దేవుని ఆరాధించుటకు ఒక ప్రత్యేక జనాంగమును ఎర్పరచుకొనుట దీని ముఖ్య ఉద్దేశ్యము.
రచయిత : ఈ ఐదు కాండముల (పుస్తకముల) ముఖ్య రచయితగా యూదావంశపువారును, యేసును అపోస్తలుల ద్వారా అంగీకరించబడిన వ్యక్తి మోషే, ప్రవక్తయైన మోషేకు దేవునికి మధ్య నలువది రాత్రింబవళ్ళు జరిగిన సంభాషణలో తన చర్యను గూర్చి తాను చేయబోయెడి విధానమును గూర్చిన వివరణ: నిర్గామకాండము 24:18, నిర్గామకాండము 34:28 వచనములలో చదువగలము. ఆ సంభాషణ ఫలితమే ఈ ఐదు కాండము (పుస్తకము) లని అనుకొనుట యుక్తమైయున్నది. మార్కు 12:26, యోహాను 1:17; యోహాను 5:46; యోహాను 7:19, యోహాను 7:23; అపో. కార్యములు 7:37- 38; అపో. కార్యములు 13:39; అపో. కార్యములు 15:1; అపో. కార్యములు 15:21; అపో. కార్యములు 28:23.
ఆదికాండము అని పేరు : ఆది అనగా ప్రారంభము అని అర్ధమిచ్చును. భాషాంతరమున పరేషిత్ అనే హెబ్రీ బాషాపదముతో పాతనిబంధన ప్రారంభమయినది. ఈ పుస్తకమునకు ఆదికాండము అను పేరు పెట్టుటకు గల కారణము ఈ పుస్తకములోని ప్రారంభపదమే దీనికి మూలకారణం. ఆది అనే సంస్కృత మాటకు సృష్టి , ప్రారంభము, పుట్టుట అను అనేక విధములైన పర్యాయపదములు కలవు.
రచించిన కాలము : క్రీ.పూ 1480 – 1410
గత చరిత్ర : మధ్య తూర్పుదేశము అనగా ప్రస్తుతమందు పిలువ బడుచున్న మిడిల్ ఈస్ట్.
ముఖ్య వచన భాగములు : ఆదికాండము 1:27; ఆదికాండము 12:2-3
గ్రంథ పరిశోధన : ఆదికాండములో సమస్త సృష్టి యొక్క చరిత్రయైన ఆకాశము, భూమి, వాటి నిర్మాణమును గురించిన వివరణ మరియు రాత్రింబవళ్ళు, సస్యమృగములు పక్షిజలచరములు, మానవుడు, భాషలు క్రమ శిక్షణ, సంబంధ బాంధవ్యములు వంటివి ఏ విధముగా ఏర్పరచబడినవి అను వాటిని గురించి పరిపూర్ణ అవగాహననిచ్చుచున్నది. పాపము యొక్క ప్రారంభ చరిత్ర దానికి దేవుడుreference చేసిన ప్రాయశ్చిత్తము ఈ పుస్తకము యొక్క ముఖ్య ఉద్దేశ్యమగును. భూగోళ శాస్త్రములోని మూడు ముఖ్యమైన విభన్న దేశ సంబంధములను ఈ ఆదికాండము తెరకెక్కించుచున్నది. యూప్రటీసు, టైగ్రీసు నదీతీరములు మొదటి భాగమునకు, కనాను దేశ ప్రాంతము రెండవ భాగమునకు, ఐగుప్తు మూడవ భాగమునకు విశిదీక రింపబడియున్నవి. మొదటి అధ్యాయము మొదలుకొని 11వ అధ్యాయము వరకునున్న మొదటి
భాగములో అన్నింటి ప్రారంభమును గురించి మొదటి మానవుని నిర్మాణమును గురించి, వారి వంశావళిని గూర్చిన చరిత్ర యిమిడియున్నది. మరియు 12వ అధ్యాయము మొదలుకొని 38వ అధ్యాయము వరకుగల రెండవ భాగములో ఆనాటి మానవుల వంశావళుల చరిత్రలో అబ్రాహాము అను ప్రత్యేకమైన మనిషిని దేవుడుreference పిలిచి ఏర్పరచి, ఆ అబ్రాహాము కుటుంబము ద్వారా యాకోబు సంతతివారిని మాత్రము తన సొంత జనాంగముగా ఎన్నుకొనుట దేవుని సంకల్పమైయున్నది. 39వ అధ్యాయము మొదలుకొని చివరి అధ్యాయము వరకునున్న మూడవభాగములో యాకోబు సంతతివారు యోసేపు ద్వారా ఐగుప్తుకు వలస వెళ్ళడం అక్కడ వారు బహుజనాంగముగా ఏర్పడి విస్తరించడము ఇందులో వ్రాయబడియున్నది. ఈ మూడు భాగములు కలిపి సంగ్రహించి కాలపరిమితి గలవై ఈ విధముగా సంగ్రహీకరింపబడియున్నది.
మొదటి భాగము : (1 - 11 వరకైన అధ్యాయములు) సృష్టి క్రీ. పూ 4000 లేదా దానికన్నా ముందుగా ఆది 1:1 ప్రారంభము నుండి తెరహు మరణము వరకు గల సంవత్సరములు 2090 ఆది 11:32 వరకు దాదాపు రెండువేల సంవత్సరాలకాల చరిత్ర
రెండవ భాగము : (12 - 38 వరకు గల అధ్యాయములు) అబ్రాహాము తన యింటి నుండి బయలుదేరు కాలము మొదలు కొని యోసేపు ఐగుప్తు దేశము వచ్చి చేరువరకు గల చరిత్ర కాలఘట్టము క్రీ.పూ 2090 నుండి 1897 వరకు దాదాపు 193 సంవత్సరములు.
మూడవ భాగము : (39- 50 వరకు గల అధ్యాయములు) యో సేపు ఐగుప్తు దేశములో ఉన్నప్పటి జీవితకాల చరిత్ర క్రీ.పూ 1897 నుండి 1805 వరకు దాదాపు 93 సంవత్సరములు.
ప్రాముఖ్యులు : ఆదాము, హవ్వ, హేబేలు, హనోకు, నోవహు , అబ్రాహము, శారా, ఇస్సాకు, బ్యా, యాకోబు, యోసేపు.
గ్రంథ విభజన : 1. ప్రపంచము, భూమి, మానవుడు, వాటి నిర్మాణము. Gen,1,1-2,25, 2.మానవుని పతనము దాని ప్రతిఫలము. Gen,3,1- 5,32. 3.న్యాయతీర్పు నుండి నోవహు కుటుంబము రక్షింపబడుట, Gen,6,1-9,29. 4.మానవుల వంశావళులు వృద్దీ చెందుట మరియు విభజింపబడుట Gen,10,1-11,32. 5.అబ్రాహాము జీవితము. Gen,12,1-25,18. 6.ఇస్సాకు యొక్క కుటుంబము. Gen,25,1-27,45. 7.యాకోబు గోత్రకర్తలు. Gen,28,1-38,30. 8.యోసేపు జీవిత చరిత్ర. Gen,39,1-50,26
కొన్ని సంఖ్యా వివరములు: పరిశుద్ధ గ్రంథములో మొదటి గ్రంధము ; ఆధ్యాయములు 50 ; వచనములు – 1,533 - చరిత్రాత్మిక వచనములు 1,385; ప్రశ్నలు 148 ; ప్రవచనములు 146; నెరవేరిన ప్రవచనములు 123; నెరవేరని ప్రవచనములు 23 ; ఆజ్ఞలు -106 ; వాగ్దానములు 71 : దేవుని యొద్ద నుండి పాముఖ్యమైన అంశములు 95 ; హెచ్చరికలు 326.
మోషే లిఖించిన ద్వితీయ గ్రంథము
ఉద్దేశ్యము : ఐగుప్తులోని ఇశ్రాయేలీయులు బానిసత్వము నుండి విడిపింపబడుట మరియు వారు ఒక దేశముగా ప్రబలుటను గురించినది.
గ్రంథకర్త : మోషే
కాలము : సుమారు ఆదికాండ గ్రంథకాలములోనే క్రీ.పూ 1480 – 1410
రచించిన స్థలము : ఇశ్రాయేలీయులు అరణ్య ప్రాంతము గుండా పయనించు సమయములో సీనాయి సమతల భూభాగమునందు.
గత చరిత్ర : ఐగుప్తు దేశమునందు అనుకూల కాలవ్యవస్థ యందు జీవించిన ఇశ్రాయేలీయులు ఇప్పుడు దాస్యమునందున్నారు. దేవుడు వీరి బానిసత్వము నుండి విడుదల దయచేయుచున్నాడు. (ఐగుప్తు దాస్యములో నుండి విడుదల)
ప్రాముఖ్య వచనములు : నిర్గామకాండము 3:7-10
ప్రాముఖ్యులు : మోషే, మిర్యాము, ఫరో, ఫరో ప్రజలు, యిత్రో, అహరోను, యెహోషువ, బెసాలీయేలు,
కాలేబు.
ప్రముఖ స్థలములు : ఐగుప్తు, గోషేను, నైలునది, మిద్యాను, ఎఱ్ఱసముద్రము, సీనాయి సమతల భూమి, సీనాయి పర్వతము.
గ్రంథ విశిష్టత : పాతనిబంధన గ్రంథములోని అన్ని గ్రంథముల కన్నా అధికమైన అద్భుతములు లిఖించబడియున్న గ్రంథము ఇది. పది ఆజ్ఞలు ఈ గ్రంథము యొక్క ప్రాముఖ్యాంశము.
సమకాలీన చరిత్ర : క్రీ.పూ 1710 నుండి 1570 వరకు నున్న మధ్య కాలము 140 సంవత్సరములు ఐగుప్తు దేశమును పాలించిన రాజులు (ప్రభువులు) హి క్కోసు వంశపు వారుగా పరిగణింపబడు భూరాజులు అన్యదేశీయులుగా ఉండిరి. తూర్పు పాశ్చాత్య దేశమైన కనాను, సిరియా దేశస్టులైన వీరు బలవంతులు, యుద్ధ ప్రియులు. ఈ హిక్కోషీయులు అన్యులైనందున అన్యులతోనే సహవాసము కలిగియుండిరి. వీరిలో ప్రాముఖ్యుడైన అపోపి అనే రాజు (ఫరో) వీరి నాగరికతకు తగిన రీతిగానే అన్యుడుగా ఎంచబడిన యోసేపును అధిపతిగా చేసి ఐగుప్తు దేశములోని ఫలవంతమైన
గోషేనును ఇశ్రాయేలీయులకు నివాసస్థలముగా యిచ్చెను. ఈ హిక్కోషు ఫరోలు ఆ దేశస్థులైన ఐగుప్తీయుల యెడల నిర్దయతో అనాగరికముగా ప్రవర్తించారు. రక్త ప్రవాహము ద్వారా వీరు అధికారములోనికి ప్రవేశించారు, వారు స్వదేశీయులైన జనాంగమును శ్రమలపాలు చేసెడివారు. ఐగుప్తు దేశములోని స్త్రీలను,
పిల్లలను హింసించి పట్టణములను పాడుచేసి, దేవాళయములను పడగొట్టి, అగ్నిచేత వారిని దహించివేసేవారు. ఇటువంటి శ్రమలను అనేక దినములు సహించిన ఐగుప్తీయులు వారి దేశములో కలహములను రేపి అధికారమును ప్రజలే చేజిక్కించుకొనిరి ఈ విధముగా ప్రజలే ఫరోలను నిర్ణయించిరి. హిక్కో షు వారిపై ఐగుప్తీయులకు ఉన్న పగకు నిరఫరాధులైన ఇశ్రాయేలీయులు బలయ్యారు. ఇశ్రాయేలు జనాంగము శక్తినొంది అభివృద్ధి నొందుచున్నందున, ఐగుప్తీయులు వీరు తమకు విరోధముగా రావచ్చునేమో అని తలంచి తప్పుగా బావించి ఈ విధముగా వారిని బాధించెడివారు. వీరు దేశమునకు కరువు వచ్చునని బావించి అక్కడ నివసించే ప్రజలు 20 లక్షల కంటే ఎక్కువ మంది అన్యులని భావించి దేశాన్ని సంరక్షించుటకై కరువు నుండి తప్పించుకొనుటకై ఆహార వస్తువులను, ధాన్యములను నిలువచేయుటకై పెద్ద పెద్ద గదులు నిర్మాణించుటకు తీర్మానించిరి. ఈ పని పూర్తి చేయుటకు కావలసిన ఇటుకలు చేయుటకు లక్షలకొలది పనివారు కావలసి వచ్చెను. ఈ పని ప్రారంభించుటకు బానిసలుగా జనసంఖ్య బలాభివృది పొందుచున్న ఇశ్రాయేలీయులపై వీరు ధ్యాసనుంచిరి. ఐగుప్తు ఫరో దృష్టి ఇశ్రాయేలీయులపై పడినందున, అప్పటి నుండి ఇశ్రాయేలీయులకు శ్రమల కాలము ప్రారంభమైనది. యోసేపు పేరు ద్వారా సుకుమార జీవనమును గడుపుచున్న ఇశ్రాయేలీయులు బానిస బ్రతుకులకు దాస్యముగా లొంగిపోయిరి. కఠినమైన పనిలో వీరిని భాదించి పీతోము, రామె సెసను ఆహార దాన్యములు నిల్వచేయు ధాన్యాగారముల పట్టణములను కట్టిరి. అప్పటి నుండి కఠినమైన పనులలో ఇటుకల పని, కట్టడపని వీరికి బహుకఠినమాయెను, అవి వారికి భరించలేని భారమైపోయెను. హిక్కోషు ఫరోల ప్రీతికరమైన ప్రజలు కఠినమైన బానిసలుగా పనిచేయుట తట్టుకోలేకపోయిరి. అన్యదేశములో ప్రవచన రీతిగా తాము చేయుచున్న పెట్టి పనులను బట్టి వారు నిట్టూర్పులు విడిచిరి, వారి నిట్టూర్పులు దేవుని చెవిని చేరినవి. ఇశ్రాయేలీయుల బానిసత్వము దేవుని అనాది సంకల్పములో ఒక భాగమని ఐగుప్తు ఫరో గ్రహించలేక పోయెను. నిర్ణయకాలము వచ్చువరకు అనేక శ్రమానుభవముల తర్వాతనే ఐగుప్తు ఫరోలు వారికి విడుదల దయచేసిరి. మోషే నాయకత్వములో క్రీ.పూ 1446 లో విడిపింపబడిన పావురములవలె వాగ్దానభూమికి యాత్రుకులైరి. దీనినే నిర్గమమందురు.
భాగములు : 1. రక్షకుడైన మోషే Exo,1,1 – 4,31. 2. ఫరోతో జరిగిన యుద్ధకాండ Exo,5,1- 13,19. 3. ఐగుప్తు నుండి సీనాయి పర్వతము వరకు Exo,13,20-19,2. 4. నిబంధన నెరవేరు కాలము Exo,19,3-24,8. 5.దేవుని ఆరాధించుటకు ప్రత్యక్షపు గుడారములు Exo,24,9-40,38.
కొన్ని సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో రెండవ గ్రంథము; అధ్యాయములు 40; వచనములు 1,213; చరిత్రాత్మిక వచనములు 1089; నెరవేరిన ప్రవచనములు 129; నెరవేరనివి 2; ప్రశ్నలు 58; దేవుని సందేశములు 73; ఆజ్ఞలు 827; హెచ్చరికలు 240; వాగ్దానములు 28; మోషే ద్వారా చేయబడిన అద్భుతములు 35 తో కలిపి అద్భుతములు 42.
మోషే లిఖించిన తృతీయ గ్రంథము
Leviticus - లేవీయకాండము
ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశమును విడిచి సాగిపొమ్మని దేవుడు వారికి ఆజ్ఞాపించిన తరువాత, విడుదల పొందిన ఆ జనులను దేవునిలో కేంక్రరింపబడే ఒక జనసమూహముగా చేయుట అవశ్యకమై యున్నది. వారిని ఎల్లప్పుడు సేవించు ప్రజలుగా ఆయన నియమించెను. ఈ విధముగా వారు దేవుని ఎలా సేవించాలి? ఎలా ఆరాధించాలి? ఆయనకు లోబడి ఎలా జీవించాలి? అని మోషే ద్వారా యెహోవా దేవుడు ఆజ్ఞలను వివరించి చెప్పెను. ఈ ఆజ్ఞల సంపుటియే లేవీయకాండము. ఈ ఆజ్ఞలను గైకొనుటయే దీని యొక్క ప్రాముఖ్యాంశము. ఇశ్రాయేలీలు ప్రజలకు అనగా తన జనులకు దేవుడు దయచేసిన ఒక చరిత్రాత్మిక పుస్తకమే ఈ లేవీయకాండము.
ఒక యూదబాలుడు తన జీవితములో మొట్టమొదటిగా నేర్చుకొనవలసిన పుస్తకమే ఈ లేవీయకాండము. ఇందులోనున్న ఒక్కొక్క దృశ్యభాగము రాబోవు కాలములో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు చేయదలచిన మానవాళి రక్షణ కొరకైన కార్యమును వ్రేలెత్తి చూపిస్తున్నది. ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండమను ఈ మూడు పుస్తకములు మానవుని క్రమశిక్షణ, దైవికమైన మూడు పద్ధతులను వివరించుచున్నవి. ఆదికాండములో - నశించిపోయెడి మానవుని గురించి, నిర్గమకాండములో - రక్షింపబడిన మానవుడు, లేవీయకాండములో - ఆరాధించునట్టియు, గైకొనునట్టియునైన మానవుని గురించి మనము చూడగలము.
ఉద్దేశ్యము : యాజకులకు ఆరాధన సంబంధమైన కర్తవ్యములు, హెబ్రీయులకు పరిశుద్ధ జీవితమును జీవించు మార్గములను నిర్దేసిస్తున్నది.
గ్రంథకర్త : మోషే
కాలము : క్రీ.పూ 1446 – 1445
గతచరిత్ర : సీనాయి పర్వతము. ఇశ్రాయేలు జనాంగము ఏవిధముగా ఒక పరిశుద్ధమైన ప్రజలుగా జీవితమును జీవించుటను గురించి దేవుడు వారికి నేర్పించిన విధము.
ప్రాముఖ్యమైన వచనములు : లేవీయకాండము 19:2 ; 17 11; 20 7-8.
ప్రాముఖ్యులు : మోషే, అహరోను, నాదాబు, ఎలియాజరు, ఈతామారు.
ముఖ్యస్థలములు : సీనాయి పర్వతము.
గ్రంథ విశిష్టత : పరిశుద్ధతను గురించి ఏ పుస్తకములో లేని విధముగా ఈ పుస్తకమందు అతిపరిశుద్ధతను గురించి 152 సార్లు చెప్పబడినది. పాత నిబంధన గ్రంథకాలములో వేరే దేశములతో ఉన్న నియమ నిబంధనలతో పోల్చి చూచినట్లయితే దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞల యొక్క సత్య విలువను గ్రహించగలము. ప్రత్యక్ష సాక్ష్యముగా నిర్గమకాండము 20వ అధ్యాయములో చూడగలము. “దొంగిలింపబడిన దాని విషయం" అనే ఆజ్ఞను గమనించినట్లయితే దొంగ దొంగిలింపబడిన వస్తువును బట్టి శిక్షింపవలెనన్న నియమము నియమించెను. ఒకవేళ వాడు పరిహారము చెల్లించలేకపోయినట్లయితే వానిని చంపవలెనన్న నియమములేదు. అయినప్పటికి 300 సంవత్సరములకు ముందు కాలములో జీవించిన బబులోను రాజైన హమ్మురాబ్బుని చట్ట ప్రకారము దొంగ దొంగిలింపబడిన వస్తువు యొక్క విలువను అచ్చుకొనవలయును, లేనియెడల వానిని చంపవలెనన్న నియమము కలదు. నేరస్థుని స్థానము ఏదైనప్పటికిని ఆ నేరస్థునికి ఒకే శిక్ష విధింపవలెను, “ అదే కంటికి కన్ను పంటికి పన్ను చెల్లింపవలెను” ఇదే ఈ ఆజ్ఞయొక్క పరమార్ధం. (లేవీయకాండము 24:20) విదేశీయులు (పరదేశి) చేసినట్లు పక్షపాతము లేక తీర్పు తీర్చవలెను, లేనట్లయితే దేవుడు వారికి కఠిన శిక్ష విధించును. దేవుని శాసనములో అనాధలకు, గ్రుడ్డివారికి, బీదలకు, చెవిటివారికి, సంరక్షణ కలదు. దేవుని దృష్టిలో ధనికుని సమృద్ధిలో నుండి పొందే అవకాశము వీరికి కలదు. స్వంతగా జీవించలేని బీదల (వారి కాళ్ళమీద వారు నిలబడలేని వారి) యెడల దేవుడు అక్కర కలిగియున్నాడు. లేవీయకాండము 19:9 ; లేవీయకాండము 19:13-14 ; లేవీయకాండము 15:32-37 పొరుగు వారితో నీవు నడవవలసిన విధులు వారి అక్కరలలో వారిని పరామర్శించు విధానమును గూర్చిన హెచ్చరికలు : నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను (లేవీయకాండము 19:18 ) అనే ఆజ్ఞనువారికి వివరించెను.
గ్రంథ విభజన : 1. అనేక ఆజ్ఞల వివరములు 1 - 17 అధ్యాయములు, 2. పరిశుద్ధతకై అనుసరించవలసిన ఆజ్ఞలు 18 - 27 అధ్యాయములు వీటి యందు మొదటి భాగములో దేవుని జనాంగము పాటించవలసిన ఐదు రకములైన బలులు వాటి యొక్క వివరములు, రెండవ భాగము నందు వారందులో చేయదగిన, పాటించదగిన విశ్రాంతి దినమును, సంవత్సరమంతయు ఆచరింపవలసిన ఏడుపండుగలను గురించిన వివరములు మనము చూడగలము.
కొన్ని సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో మూడవ గ్రంథము; అధ్యాయములు 27; వచనములు 859 ; ప్రశ్నలు 3 ; నెరవేరిన ప్రవచనములు 58 ; నెరవేరని ప్రవచనములు 6; చరిత్రాత్మిక వచనములు 799; ఆజ్ఞలు 795 ; వాగ్దానములు 26 ; హెచ్చరికలు 125; దేవుని యొద్ద నుండి ప్రాముఖ్యమైన అంశములు 35.
లేవీయకాండములో ప్రాముఖ్యమైన వచనములు : లేవీయకాండము 17:11 ; లేవీయకాండము 20:7-8
ముఖ్యాంశములను పొదిగించిన అధ్యాయము : 16 వ అధ్యాయము.
మోషే లిఖించిన చతుర్థి గ్రంథము
Numbers - సంఖ్యాకాండము
ఇశ్రాయేలీయులు అవిశ్వాసము, అవిధేయత వలన దాదాపుగా 40 సంవత్సరాలు అరణ్యములో సంచరించిన చరిత్రనే సంఖ్యాకాండము చెప్పుచున్నది. హెబ్రీమూల భాషలో దీనికి చెప్పబడిన మొదటి మాట వాక్వేతెబర్ (చెప్పబడినది) అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ అని దాని అర్ధము. ఆజ్ఞ అరణ్య ప్రయాణం ప్రారంభంలోనే ఇశ్రాయేలీయులలో యుద్ధమునకు వెళ్ళుటకు అర్హులు ఎంత మంది అని లెక్కించి తీర్మానించాలి. దాదాపుగా 38 సంవత్సరముల తరువాత రెండవ సారి ఒక లెక్కింపు జరిగినది. అప్పుడు వారి అరణ్య ప్రయాణపు చివరి ఘట్టములో మోయాబు మైదానములోనికి వచ్చిరి. ఆ సమయములో మోషే ఎదుట ఉన్నవారిలో ఇద్దరు తప్ప తక్కిన వారంతా రెండవ తరమువారు. ఈ రెండు లెక్కింపులు ఈ పుస్తకము యొక్క పేరుకు బలమునిచ్చేవిగా నున్నవి. జన సంఖ్య లెక్కింపులో నేర్చుకొనవలసిన శ్రేష్ఠమైన పాఠం ఒకటున్నది. మొదటి లెక్కింపు జరిగినపుడు యుద్ధవీరులుగా లెక్కించబడినవారు ఆరు లక్షలుకు పైగానున్నారు. వారందరు అరణ్యములో రాలిపోయిరి. ఏదేమైనప్పటికి కనానులో కాలు మోపే సమయమునకు ఇంకొక ఆరు లక్షలకు పైగా యుద్ధవీరులు యుద్ధ భూమిలోనికి దుమికిరి. దేవుని యొక్క ఉద్దేశ్యములు ఎల్లప్పుడు సరిఅయిన సమయములో నెరవేరును. దానిని ఎవరు అడ్డుకొనలేరు.
అధిక సంచార పయనం : కాదేషు బర్నేయలో నుండి కనాకు వెళ్ళుటకు పదకొండు దినముల ప్రయాణము చాలును. దానికి బదులుగా 38 సంవత్సరాలు అరణ్యమార్గమున సంచరించి కష్టములు అనుభవించిరి. దేవుడు 95 కీర్తనలోని రెండు వచనములలో ఇశ్రాయేలీయుల క్లిష్ట పరిస్థితిని గూర్చి చెప్పెను నలువది యేండ్ల కాలము ఆ తరమువారి వలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలిసికొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి - వీరెన్నడును నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితిని. (Psa 95:10-11)
అన్ని పాపములకు నివాసం అవిశ్వాసమే. దాని ఫలితం సర్వనాశనమని హెబ్రీ గ్రంథకర్త ఈ చరిత్రను జ్ఞాపకము చేసికొని 3, 4 అధ్యాయములలో విశదీకరించెను. ఈ విధంగా దేవుని ప్రజల మధ్యకు వచ్చిన అవిశ్వాసము అనే పాపము విపత్తులకు విత్తనములు విత్తినది. వారు అరణ్యములో చనిపోయిరి. ప్రధానయాజకుడైన అహరోను ఆయన సహోదరి మిర్యాము వాగ్దాన దేశమును చూడకుండా పోయిరి. మోషే ప్రజలను బట్టి విసుగుచెంది కోపగించుకుని దేవుని ఎదుట పాపము చేయడం జరిగినది. సీను అరణ్యములో నీరులేకజనులు సణిగినపుడు నీరు ఇమ్మని బండతో మాట్లాడమని దేవుడు ఆజ్ఞాపించెను. మోషే రెండు మారులు బండను కొట్టెను. కాబట్టి వాగ్దాన దేశమును చూడటం మాత్రమే గాని, దానిలో నీవు కాలు పెట్టవు అని దేవుడు చెప్పెను. మోషే పిస్గా కొండ శిఖరమున మరణించెను. సంఖ్యాకాండము 26 నుండి 33 వరకు ఉన్న అధ్యాయములలో మోయాబు మైదానములోనికి వచ్చిన క్రొత్త తరము వారు కనానును స్వతంత్రించుకొనుటకు దేవుడు వారిని స్థిరపరచడాన్ని చూస్తున్నాము. దేవుని దీర్ఘశాంతము, నమ్మకత్వము ఇక్కడ ప్రత్యక్షమగుచున్నది. యెహోషువ మోషేకు బదులుగా దేవుని ప్రజల నూతన నాయకునిగా అభిషేకం చేయబడడం ఇక్కడ చూడవచ్చును.
ఉద్దేశ్యము : వాగ్దాన దేశములోనికి ప్రవేశించుటకు ఇశ్రాయేలీయులు ఏలాగు తెగించిరి? వారి యొక్క పాపము ఏలాగు శిక్షించబడినది? వారు ఇంకను ప్రవేశింప ఏలాగు ప్రయత్నించిరి?
గ్రంథకర్త : మోషే
కాలము : క్రీ.పూ 1450 నుండి 1410
గతచరిత్ర : సీనాయి ప్రాంతపు పెద్ద యిసుక ఎడారి కనానుకు ఈశాన్యములో ఉన్న ప్రాంతము.
ముఖ్య వచనములు : సంఖ్యాకాండము 14:22-23 ; సంఖ్యాకాండము 20:12 .
ముఖ్యమైన వ్యక్తులు : మో షే, అహరోను, మిర్యాము, యెహోషువ, కాలేబు, ఎలియాజరు, కోరహు, బిలాము.
ముఖ్యమైన స్థలములు : సీనాయి పర్వతము, వాగ్దాన దేశమైన కనాను, కాదేషు బర్నేయ, హోరేబు కొండ, మోయాబు మైదానము.
గ్రంథ విభజన : సంఖ్యా కాండమును మూడు ముఖ్యమైన భాగములుగా విభజించవచ్చును. 1. ప్రయాణమునకైన సిద్ధపాటు ప్రయాణ ప్రారంభము 1 - 13 అధ్యాయములు, 2. అవిశ్వాసము వలన తిరుగులాడిన స్థితి 14 - 25 అధ్యాయములు, 3. కనానును ఆక్రమించుకున్న క్రొత్త తరమును సిద్ధపరచుట 26 - 36 అధ్యాయములు
కొన్ని క్లుప్తమైన వివరములు : పరిశుద్ధ గ్రంథములో నాలుగవ గ్రంథము; అధ్యాయములు 36; వచనములు 1288 ; ప్రశ్నలు 59 ; నెరవేరిన ప్రవచనములు 42; నెరవేరని ప్రవచనములు 15; దేవుని సందేశములు 72; ఆజ్ఞలు 554 ; వాగ్దానములు 5; హెచ్చరికలు 79.
మోషే లిఖించిన పంచమి గ్రంథము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
120 సంవత్సరాల వృద్ధుడైన మోషే 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణమును ముగించాడు. వాగ్దాన దేశమును స్వతంత్రించుకొనడానికి సిద్ధముగా ఉన్న రెండవ తరము వారైన ఇశ్రాయేలీయులను పంపడానికి అతడు ఇచ్చిన సందేశమే ద్వితీయోపదేశకాండము. లేవీయకాండమువలె ఈ పుస్తకములో పెద్ద ఆజ్ఞల పట్టికను చూడవచ్చును. కాని లేవీయకాండములో ముఖ్యముగా యాజక వంశముతో మాట్లాడినట్లుగా ఇక్కడ సాధారణ ప్రజలతో మాట్లాడుచున్నాడు. వారిముందు తరమువారి భయంకర నాశనమునుండి పాఠము నేర్చుకొనునట్లును, లోబడుటలో ఉన్న గొప్పతనమును అర్ధము చేసుకొనునట్లును మోషే పిలుపునిచ్చుచున్నాడు. ఈ పుస్తకములో ఆజ్ఞల యొక్క బంధకాలను చూడకుండ దేవుని వాక్యములోని మాధుర్యాన్ని దర్శించుచున్నాము అనునదే ఈ పుస్తకము యొక్క ప్రాముఖ్యతగా ఉన్నది. లోబడుట ద్వారా వచ్చు ఆశీర్వాదమును లోబడక పోవుట ద్వారా వచ్చు శాపమును వివరించుటకే ఈ పుస్తకము వ్రాయబడినది.
ద్వితీయోపదేశకాండము - క్రీస్తు: ప్రభువు (క్రీస్తు) తరచుగా ఈ పుస్తకములోని లేఖన భాగములను ఉపయోగించేవాడు. సాతానుతో పోరాడుటకు ప్రభువు ఉపయోగించిన మూడు వచనములు ద్వితీయోపదేశ కాండము నుండి తీసుకొనబడినవే. (మత్తయి 4:-10). పరిత్యాగ పత్రికను గురించి యూదులతో మాట్లాడేటప్పుడు, ధర్మశాస్త్రములోని ప్రధానమైన ఆగ్నేమిటి అని ప్రశ్న వేసినప్పుడు ప్రభువు ఎత్తిచూపినవి ఈ పుస్తకములోని వచనములే (మత్తయి 19:3-8 ; మత్తయి 22:30-40)
పుస్తకము యొక్క పేరు: హెబ్రీ భాషలో ఈ పుస్తకము హార్టేబరీమే అనే మాటతో ప్రారంభమగుచున్నది. “ఆ వాక్యములు" అని అర్ధమునిచ్చే, ఆ మాటే పుస్తకము యొక్క పేరుగా ఇయ్యబడినది. మోషే యొక్క ఆ మాటలే దేవుడిచ్చిన ధర్మశాస్త్ర వాక్యములే అని ఈ మాట చూపించుచున్నది. సీనాయి పర్వతమునందు ఇవ్వబడిన ధర్మశాస్త్రమును తిరిగి చెప్పే పుస్తకము అను సందర్భములో ద్వితీయోపదేశకాండము అనే పేరు తెలుగులో ఇవ్వబడుట బహుసరిగా నున్నది.
సమకాలీన పరిస్థితులు: యెరికోకు, యొర్దాను నదికి తూర్పున వున్న మోయాబు మైదానములో జరిగిన సంగతులు ఈ పుస్తకములో చూపించ బడుచున్నవి. ఈ సంగతులన్ని సుమారు రెండు నెలలలో జరిగినవని అనుకొనవచ్చును. దీనిలో రెండవ నెల మోషే గురించి ఇశ్రాయేలీయులు ప్రలాపించిన దినములుగా ఉన్నవి దానిని విడదీస్తే అరణ్య ప్రయాణము చివరి ఒక నెలలో (క్రీ.పూ 1405) దీనిలో చెప్పబడిన ముఖ్యమైన సంగతులు జరుగుచున్నవి. Deut 1:3 ; Deut 34:8 ; యెహోషువ 5: 6-12 , ఈ వాక్యభాగములను పోల్చి చూస్తే ఇది తేటపడుతుంది. క్రొత్త తరము కనానులో ప్రవేశించుటకు సిద్ధమగుచున్న సమయములో, వారు దేవుని విశ్వసించి, లోబడి దైవీక ఆశీర్వాదములను స్వతంత్రించుకొనవలెననే లక్ష్యంతో వ్రాయబడిన పరిశుద్ద పుస్తకముగా దీనిని ఎంచవచ్చును.
ఉద్దేశము: దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు చేసినవి మరలా వారికి జ్ఞాపకము చేయుట, వారిని మరలా ఒక అర్పణకు ప్రోత్సాహించుట.
గ్రంథకర్త: మోషే (మోషేమరణము తరువాత మిగిలిన భాగమును యెహోషువ వ్రాసినట్లుగా చెప్పబడుచున్నది)
ఎవరికి వ్రాసిరి: వాగ్దానదేశములో ప్రవేశించడానికి సిద్ధముగా ఉన్న నూతన ఇశ్రాయేలు సంతతికి
కాలము: క్రీ.పూ 1405
గత చరిత్ర: యోర్దానునది తూర్పు ప్రాంతము
ముఖ్యవచనము: Deut 7:9
ముఖ్యమైన వ్యక్తులు: మోషే, యెహోషువ
ముఖ్యమైన స్థలాలు: మోయాబు దేశములోని అరాబా మైదానము.
గ్రంధ విభజన: ముందు సీనాయిపర్వతము మీద దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రమును పోలిన మాదిరిగా మోషే ఇచ్చిన మూడు సందేశములే ఈ పుస్తకములోని ముఖ్యాంశములు
మొదటి సందేశములో Deut,1,1-4,43 వరకు దేవుడు తన ప్రజల కొరకు చేసిన కార్యములు. 2.రెండవదిగా Deut,4,44-26,19 వరకు దేవుడు వారి దగ్గర నుండి ఎదురుచూచిన కార్యములు. 3.మూడవదిగా ద్వితీయ 27వ అధ్యాయము నుండి 33వ అధ్యాయము వరకు భవిష్యత్తులో దేవుడు వారి కొరకు చేయ నిశ్చయించినవి మోషే చెప్పుచున్నాడు. ఈ విధముగా మోషే దేవుని ధర్మశాస్త్రమును ఎత్తి చూపి, వివరించి, స్థిరపరచుచున్నాడు.
కొన్ని క్లుప్తమైన వివరములు: పరిశుద్ధ గ్రంథములోని ఐదవ పుస్తకము, అధ్యాయములు 34; వచనములు 958; ప్రశ్నలు 33; చరిత్రకు సంబంధించిన వచనములు 690; నెరవేరిన ప్రవచనములు 230; నెరవేరనివి 37; దేవుని సందేశములు 33; ఆజ్ఞలు 519; వాగ్దానములు 47; హెచ్చరికలు 497.
Joshua - యెహోషువ
మోషే యొక్క పంచకాండములకు తరువాత యెహోషువ మొదలుకొని ఎస్తేరు గ్రంథము వరకు ఉన్న 12 చరిత్ర పుస్తకములు బైబిలులోని రెండవ భాగము అని చెప్పవచ్చును. వాటిలో మొదటి పుస్తకమైన యెహోషువ పంచకాండముల పుస్తకములను, ఇశ్రాయేలీయుల చరిత్రను కలుపుచున్నది.
మూడు ముఖ్యమైన యుద్ధముల ద్వారా కనానును జయించుట ఈ పుస్తకము యొక్క సారాంశము. యెహోషువ నాయకత్వంలో దాదాపుగా 30 శత్రు సేనలను ఇశ్రాయేలీయులు జయించిరి. జయము అనునది సైన్యము యొక్క బలము వలన కాదుగాని, దానికి బదులుగా దేవుని మీద ఉన్న విశ్వాసము, దేవుని వాక్యమునకు లోబడుట ద్వారా సాధ్యము అని ఈ పుస్తకము నిరూపించుచున్నది. దీనివలె ధైర్యమును ప్రోత్సాహము, దైవజ్ఞానమును ఇచ్చు పుస్తకము పాత నిబంధనలో ఇంకొకటి లేదు అని చెప్పవచ్చును. పుస్తకము యొక్క పేరు: పుస్తకము యొక్క ముఖ్యమైన వ్యక్తి అయిన యెహోషువ పేరే ఈ పుస్తకమునకు పెట్టుట గమనించదగినది. యెహోషువ యొక్క మొదటి పేరు హోషేయా (Num13 8). “రక్షణ” అనునది ఈ పేరుకు అర్ధము. మోషే ఆ పేరును యెహోషువ అని మార్చినాడు. సంఖ్యాకాండము 13:16 , “యెహోవాయె రక్షణ” అనునది దీని అర్ధము. గ్రీకు భాషలో యేసు అనునదే హెబ్రీభాషలో యెహోషువ. కనానును జయించే పనిలో ఇశ్రాయేలీయుల నాయకునిగా యెహోషువ ఉన్నప్పటికి నిజమైన జయశీలుడు దేవుడే అని ఈ పుస్తకము చెప్పుచున్నది.
భౌగోళిక పరిస్థితి: యెహోషువ పుస్తకములో మనము మూడు భౌగోళిక పరిస్థితులను చూచుచున్నాము. అవి యొర్దానునది, కనాను దేశము, 12 గోత్రములు నివసించిన స్థలములు.
ఉద్దేశము: ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశమును స్వతంత్రించు కొనుటను వివరించుట
గ్రంథకర్త: యెహోషువ (చివరి భాగమును ఆయనతో ఉండిన ఫీనెహాసు వ్రాసియుండవచ్చును).
గతచరిత్ర: వాగ్దాన దేశమైన కనాను (ఇప్పటి ఇశ్రాయేలు దేశము).
ముఖ్యమైన వ్యక్తులు: యెహోషువ, రాహాబు, ఆకాను, ఫీనెహాసు, ఎలియాజరు.
ముఖ్యమైన స్థలములు: యెరికో, హాయి, ఏబాలు పర్వతము, గెరిజీము కొండ, గిబియోను, గిల్గాలు, షెకేము. ప్రత్యేకత: 20 లక్షల కంటె ఎక్కువ మంది ఐగుప్తు నుండి బయలుదేరినప్పటికి 20 సంIIలకు పైనున్న వారిలో యెహోషువ, కాలేబు మాత్రమే వాగ్దాన దేశములోనికి అడుగిడిరి.
పుస్తకము యొక్క ముఖ్య భాగములు: స్వతంత్రించు కొనుట అనునది ఈ గ్రంథము యొక్క ప్రాముఖ్యమైన మాట. ఇంకా ముఖ్యమైన భాగములు యెహోషువ 1:2-3 ; యెహోషువ 1:8 ; యెహోషువ 11:23 ; యెహోషువ 23:14
యెహోషువ గ్రంథములో 24వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనది. యెహోషువ చివరి సందేశమును విన్న ఇశ్రాయేలీయులు దేవునితో నిబంధన చేయుట. యెహోషువ మరణము, పాతి పెట్టుట అనునవియే ఈ అధ్యాయము యొక్క ముఖ్యాంశములు.
గ్రంథ విభజన: యెహోషువ గ్రంథమును రెండు పెద్ద భాగములుగా విభజింపవచ్చును.
1 వాగ్దాన దేశమును జయించుట, Josh,1,1-13,7 వరకు 2 వాగ్దాన దేశమును పంచి గోత్రములను నివసింపచేయుట Josh,13,8-24,33 వరకు
ఈ భాగములలో కనబడే అంశముల విషయ సూచిక ఈ క్రింద ఇవ్వబడుచున్నది.
సైన్యమునకు కావలసిన ఆత్మీయత మరియు లోక సంబంధమైన సిద్ధపాటు 1 - 5 అధ్యాయములు, మోషే యెహోషువకు ఇచ్చిన ఆలోచనలు వేగుచూచుట, మొర్దాను, నూతన తరము వారి సున్నతి ఆచారములు ఈ భాగములో ఉన్నవి. మధ్య కనాను మీద యుద్ధమునకు పోవుట Josh,6,1-8,35 వరకు. దక్షిణ కనాను, ఉత్తర కనానుల మీద యుద్ధము చేయుట Josh,9,1-13,7 వరకు. పంచి పెట్టుట, నివాస స్థలము ఏర్పాటు చేయుట Josh,13,8-24,33 వరకు. ఈ భాగములో గోత్రము గోత్రముగా నివసించవలసిన స్థలములు వివరించుటలో కాలేబుకు హెబ్రోను కొండ ఇచ్చుట, ఆశ్రయ పురములను ఎన్నుకొనుట, లేవీయుల నగరములు, యెహోషువ చివరి సందేశము, మరణము, పాతి పెట్టబడుట మొదలగునవి చెప్పబడినవి.
కొన్ని క్లుప్త వివరములు: పరిశుద్ధ గ్రంథములోని 6వ పుస్తకము, అధ్యాయములు 24; వచనములు 658; చరిత్రకు సంబంధించిన వచనములు 624; నెరవేరిన ప్రవచనములు 42; ప్రశ్నలు 21; దేవుని సందేశములు 14; ఆజ్ఞలు 98; హెచ్చరికలు 44; వాగ్దానములు 15.
Judges - న్యాయాధిపతులు
యెహోషువ పుస్తకములో తేటగా చెప్పబడిన ఇశ్రాయేలీయుల పరిస్థితికి భిన్నమైన పరిస్థితిని చెప్పే పుస్తకమే ఈ “న్యాయాధిపతులు". లోబడె గుణము కల్గిన ఒక సమూహము దేవుని శక్తిని ఆనుకొని కనానును జయించుట మనము యెహోషువలో చూస్తున్నాము. న్యాయాధిపతులలో లోబడని, విగ్రహారాధన చేయు ప్రజలు దేవునికి వ్యతిరేకముగా నిలుచుట వలన మరలా మరలా ఓటమి పొందిన దృశ్యమును చూస్తున్నాము. దేవుని ఆజ్ఞలను విడిచి పెట్టిన తరువాత తమ ఇష్టము చొప్పున నడచు ఈ ప్రజలు అనేక రకములైన జనాంగముల వలన హింసను, కౄరత్వమునకు బలైయ్యారు. సుమారు 350 సంవత్సరాల ఇశ్రాయేలీయుల చరిత్ర ఈ పుస్తకములో చెప్పబడుచున్నది. ఈ పరిస్థితుల మధ్య వారిని విడిపించుటకు పరాక్రమము గల నాయకులను దేవుడు లేవుచున్నాడు. ప్రతినాయకుని కాలంలో ప్రజలు పశ్చాత్తాపపడినప్పుడు, సమాజములో మంచి పరిపాలన సమాధానము స్థిరపరచబడుచున్నది. అయినప్పటికిని ఆ నాయకుల తరువాత మరలా వారు మహా గొప్ప దేవుని విడిచి పెట్టి పాపములోనూ, విగ్రహారాధనలోను పడిపోవుచుండిరి.
పుస్తకము యొక్క పేరు: హెబ్రీ పరిశుద్ధ గ్రంథములో ఈ పుస్తకమునకు ఇవ్వబడిన పేరుకు తెలుగు తర్జుమాయే “న్యాయాధిపతులు". హెబ్రీ పరిశుద్ధ గ్రంథములో “షో పెట్రీమ్" అను పేరునకు న్యాయాధిపతి, ఏలువాడు, విమోచకుడు, రక్షకుడు అను అర్ధాలు ఉన్నవి. గ్రీకు బైబిలులో వాడబడిన "క్రిట్టాయి” అను పేరునకు కూడ న్యాయాధిపతులని అర్థము. “ ఓటమిపుస్తకము” అని కూడా ఈ పుస్తకమును పిలుస్తారు. న్యాయాధిపతుల పరిపాలనా కాలము: యెహోషువ మరణకాలంలో కూడా కనానులో ఆక్రమించుకొనవలసిన ప్రాంతములు ఇంకను అనేకం ఉండినవి. యెహోషువ క్రీ.పూ. 1390లో మరణించెను దానికి సుమారు 10 సంవత్సరములకు ముందు అంటే క్రీ.పూ. 1380 నుండి సుమారు. క్రీ.పూ. 1045 వరకు ఉన్న 335 సంవత్సరముల చరిత్రను ఈ న్యాయాధిపతుల గ్రంథము వివరించుచున్నది. ఒత్నీయేలు నుండి సంసోను వరకు 13 మంది, 1 సమూయేలులో మనము చూస్తున్న ఏలీ, సమూయేలు, యోవేలు, అబీయా అను నలుగురును చేర్చినయెడల మొత్తం 17 మంది. ఇశ్రాయేలులో న్యాయాధిపతులుగా పరిపాలన చేసిరి. సమూయేలు పుస్తకములో జరిగిన సంభవముల కాలమైన 30 సంవత్సరములను చేరిస్తే మొత్తము సుమారు 365 సంవత్సరములు ఇశ్రాయేలులో న్యాయాధిపతుల పరిపాలనా కాలమగును.
ఉద్దేశ్యము: దేవుడు పాపమును శిక్షించును అనేది ఖచ్చితము. అయినప్పటికి పశ్చాత్తాప పడువారిని క్షమించి, ఆయనతో ఉన్న సంబంధమును, నూతన పరచును అనే కార్యము దృఢపరచడమైనది.
గ్రంథకర్త: సమూయేలు
నేపథ్యము: తరువాత ఇశ్రాయేలుగా పిలువబడిన కనాను దేశము దేవునిని ద్వేషించువారు అనేక రాజ్యములుగా నున్న కనానును లోపరచుకొనుటకు దేవుడుreference ఇశ్రాయేలీయులకు సహాయము చేసెను. వారు దేవునికి లోబడనందున ఆదేశమును పోగొట్టుకునే పరిస్థితులలో వారున్నారు.
ముఖ్య వచనములు: న్యాయాధిపతులు 17:6
ముఖ్యమైన వ్యక్తులు: ఒత్నీయేలు, యెహూదు, దెబోరా, గిద్యోను, అబీమెలెకు, యెఫ్తా, సంసోను, దెలీలా.
పుస్తకము యొక్క ప్రత్యేక: ఇశ్రాయేలు దేశములో మొట్టమొదటి అంతర్గత యుద్ధమును తెలియజేయుచున్నది.
గ్రంథ విభజన: 1. న్యాయాధిపతుల దినములలో నున్న పరిస్థితులు Judg,1,1-3,6; 2. ఇశ్రాయేలీయులను శ్రమపరచిన రాజ్యములు, Judg,3,7-16,31; 3. విగ్రహారాధన, దేశీయ అంతర్గత యుద్ధము Judg,17,1-21,25
కొన్ని క్లుప్త వివరములు: పరిశుద్ధ గ్రంథములో 7వ పుస్తకము ; అధ్యాయములు 21; వచనములు 618; చరిత్రకు సంబంధించిన వచనములు 585; నెరవేరిన ప్రవచనములు 33; ప్రశ్నలు 92; దేవుని ప్రత్యేక సందేశములు 23; ఆజ్ఞలు 71; హెచ్చరికలు 26; వాగ్దానములు 5.
తుది కూర్పు: న్యాయాధిపతులు 17 నుండి 21 వరకు ఉన్న అధ్యాయములు ఈ పుస్తకము యొక్క తుది కూర్పుగా చెప్పవచ్చును. దేవుని విడిచి స్వంత మార్గములకు తిరిగి ఇశ్రాయేలీయుల అంతర్గత కలహమును, క్రమశిక్షణను మీరిన భయంకర స్థితిని మనము చూస్తున్నాము. న్యాయాధిపతులు 19లో చూచిన విధముగా క్రమశిక్షణలేని హీనమైన జీవితము బైబిలులోని వేరే భాగములలో ఎక్కడైనా చూడవచ్చునా అని సందేహముగా ఉన్నది. పాపము ఎక్కువైన స్థలములో దేవుని కృప కూడా ఎక్కువగుట అనే దేవుని సత్యమును జరిగిన సంగతుల మూలముగా మనము అర్ధము చేసుకొనవచ్చును.
Ruth - రూతు
న్యాయాధిపతుల యొక్క అంధకార యుగములో కల్తీలేని ప్రేమతో, నిష్కపట భక్తికి వర్ణకాంతులు విరజిమ్ముచున్న ఒక ఆదర్శ స్త్రీ చరిత్ర రూతు గ్రంథము. ఇశ్రాయేలు ప్రజలను, ఇశ్రాయేలు దేవుని ప్రేమించడానికి తన స్వజాతితో ఉన్న సంబంధములను, ఆచారములను త్రోసివేసి బెత్లెహేముకు వచ్చిన ఒక మోయాబు స్త్రీయే ఈ పుస్తకము యొక్క కథానాయకురాలు. బోయజు అనే ఉత్తమ భర్తను, ఓబేదు అనే మంచి కుమారుని ఆమె యొక్క భక్తి, ప్రేమ, దీనత్వము మొదలగు వాటికి బహుమతులుగా దేవుడు ఇచ్చెను. దావీదు రాజు తండ్రియైన యెష్షయి యొక్క తండ్రియే ఈ ఓబేదు. ఈ విధముగా ఆమె దావీదు పితరుల వంశావళి పట్టికలో స్థానం పొందినది. ఐక్యత అనే అర్ధమునిచ్చే “రియూత్ " అనే హెబ్రీమాట యొక్క అర్థమే రూతు అను పేరు.
రూతు యొక్క కాలము: రూతు కథ నాలుగు రకములైన పరిస్థితులతో జరుగుచున్నది. రూతులో జరిగిన సంఘటనలు నాలుగు విభిన్న పరిస్థితులుగానుండెను. 1. మోయాబు దేశము (రూతు 1:1-18 ); 2. బెత్లెహేములో ఒక పంట పొలము (Ruth,1,19-2,23); 3. బెత్లెహేములోని ఒక ధాన్యపు కళ్లము (రూతు 3:1-18 ); 4. బెత్లెహేము నగరము (రూతు 4:1-21). ఇశ్రాయేలుకు పొరుగు రాజ్యమైన మోయాబు దేశము మృత సముద్రము యొక్క ఈశాన్యములో ఉన్నది. రూతు యొక్క మొదటి వచనము గత చరిత్రను స్పష్టీకరించుచున్నది. చూడండి, “న్యాయాధిపతులు యేలిన దినములయందు” (రూతు 1:1) విశ్వాసము, త్యాగము, యుద్ధము, క్రమశిక్షణా రాహిత్యము, అక్రమము, అరాచకము అనునవి రాజ్యమేలిన ఆ అంథకార యుగములో దేవుని ఆజ్ఞలను పట్టుదలతో వెంబడించిన ప్రజలు దేశములో ఉండినట్లుగా ఈ పుస్తకము దృఢపరచుచున్నది. ఆ ప్రత్యేక కాలమట్టము యొక్క చరిత్ర సందేశమును చెప్పుట మాత్రమే గాక, అందమైన ఒక సంభవమును చిత్రించుటకు ఈ పుస్తకము వ్రాయబడినది. కనుక దీని వర్తమానకాలమును గణించుట కఠినమైనది. కాని ముందుగా చెప్పిన నాలుగు పరిస్థితులను ప్రాథమికముగా పెట్టుకొని అది జరిగిన కాలమును మనము ఈ విధముగా గుర్తించవచ్చును. (1). రూతు 1:1-18 లోని దృశ్యము జరిగిన స్థలము మోయాబుదేశము, కాలము - సుమారు 10 సంవత్సరాలు. (2). Ruth,1,19-2,23 లోని దృశ్యము జరిగిన స్థలము - బేల్లెహేములోని ఒక పొలము, కాలము - సుమారు 1 నెల. (3). రూతు 3:1-18 లోని దృశ్యము జరిగిన స్థలము - బేబ్లె హేములోని ఒక కళ్లము, కాలము - ఒక రాత్రి. (4) రూతు 4:1-22 లోని దృశ్యము జరిగిన స్థలము - బెత్లెహేము నగరము. కాలము ఒక సంవత్సరము.
ఉద్దేశము: చుట్టు ఉన్నవారందరు తొట్రిపడిపోవుచున్నప్పుడును, శ్రేష్ట స్వభావములోను, దేవునితో ఉన్న యథార్ధ సంబంధములోను ఏవిధముగా స్థిరముగా నిలబడగలము అను చూపించుట కొరకు.
గ్రంథకర్త: పుస్తకములోని ఏ భాగములోను గ్రంథకర్తను గురించిన వివరములు లేవు. దీని గ్రంథకర్త రచించినది సమూయేలు అని కొందరు అభిప్రాయపడుచున్నారు. ఈ పుస్తకములో తేటగా చెప్పబడిన కొన్ని భాగములను బట్టి చూచినట్లయితే సమూయేలు మరణము తరువాత ఇది వ్రాయబడినది.
కాలము: న్యాయాధిపతుల కాలము. క్రీ.పూ. 1375 – 1050.
నేపథ్యము: తమ ఇష్టానుసారముగా జీవించిన ఇశ్రాయేలీయుల అంథకారయుగము. (న్యాయాధిపతులు 17:6) ముఖ్యవచనము: రూతు 1:16 .
ముఖ్యమైన వ్యక్తులు: రూతు, నయోమి, బోయజు.
ముఖ్యమైన స్థలములు: మోయాబు, బెత్లెహేము.
గ్రంథ విభజన: 1. నయోమి మోయాబుకు వెళ్ళి నివశించుట, తిరిగి వచ్చుట. రూతు 1:1-22 . 2. రూతు స్వీకరించబడినది Ruth,2,1-3,18. 3. బోయజు, రూతు రూతు 4:1-21 .
కొన్ని క్లుప్త వివరములు: పరిశుద్ధ గ్రంథములో 8వ పుస్తకము ; అధ్యాయములు 4; వచనములు 84; ప్రశ్నలు 16; ప్రవచనములు లేవు. ఇశ్రాయేలీయులకు ఒక ప్రవక్త ద్వారా కూడా సందేశమును తీసుకురాని మొదటి పుస్తకము, ఆజ్ఞలు 30; వాగ్దానములు 2.
సమూయేలు మొదటి గ్రంథము
ఇశ్రాయేలీయులులో దీర్ఘకాలము న్యాయాధిపతుల ద్వారా పరిపాలన చేసిన రాజ్యము తన స్థలమును ఖాళీ చేసి ఇచ్చే కాల మార్పునే ఈ మొదటి సమూయేలు పుస్తకము చెప్పుచున్నది. ఇశ్రాయేలీయుల రాజ్యమును గురించి చెప్పు ఆరు పుస్తకములు ఈ పుస్తకము నుండి ప్రారంభమగుచున్నవి. వీటి యొక్క విషయ సూచికలను చూద్దాము.
1 సమూయేలు - మనుష్యుని అర్హతలను బట్టి సరి అయిన రాజు - సౌలు.
2 సమూయేలు - ఆత్మీయ యోగ్యతలను బట్టి దేవుడు ఎన్నుకున్న రాజు - దావీదు.
1 రాజులు - సొలోమోను, ఇశ్రాయేలు.
2 రాజులు - ఇశ్రాయేలీయుల రాజవంశము.
1 దినవృత్తాంతములు - సొలొమోను, దేవాలయము.
2 దినవృత్తాంతములు - రాజంశములు, దేవాలయము.
ఇశ్రాయేలీయులలో 500 సంవత్సరాల రాజుల పాలన చరిత్ర ఈ పుస్తకము నుండి ప్రారంభమగుచున్నది. ఈ పుస్తకములో తలఎత్తి నిలువబడిన ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులను ఈ గ్రంథకర్త మన దృష్టికి తీసుకువస్తున్నాడు.
(1). చివరి న్యాయాధిపతియైన సమూయేలు. (2). మొదటి రాజైన సౌలు. (3). అభిషేకము పొందిన రాజు గా ఉండినప్పటికి 10 సంవత్సరాలు పారిపోయి దాగుకొనిన దావీదు.
జీవిత చరిత్రకు ఆకర్షణీయమైన వస్త్రములను ధరింపజేసి గ్రంథకర్త పొందుపరచాడు. అందరు ఇష్టపడు ఒక విషయము. సన్నివేశమును వివరించుట. క్రైస్తవ కుటుంబములలో పెరిగే చిన్న బిడ్డలు పిన్న వయసు నుండి వినే కథలుగా చిన్న సమూయేలు జీవితము (అధ్యా - 3), దావీదు - గొల్యాతును సంధించుట (అధ్యా 17), దావీదు యోనాతానుల స్నేహము (అధ్యా 18లో) కనబడుచున్నవి.
పుస్తకము యొక్క పేరు : హెబ్రీబైబిలులో సమూయేలు 1, 2 పుస్తకములు ఒకే సమూయేలు పుస్తకముగా కనబడుచున్నవి. సమూయేలు అను పేరునకు “దేవుని దగ్గర అడిగిపొందబడినవాడు” అని అర్థము. జీవితమంతటిని దేవుని కొరకు అప్పగించుకొనిన సమూయేలు, అన్నింటికంటే పైగా ఒక ప్రార్ధనా వీరుడుగా ఉన్నాడు. ప్రార్థనా శక్తికి మార్గము చూపించే ఒక పుస్తకముగా సమూయేలు గ్రంథము ఉన్నది. న్యాయాధిపతుల పరిపాలనలోని అంధకారయుగములో జీవించిన ఒక ప్రార్థనా పరురాలి చరిత్రతో ఈ పుస్తకము ప్రారంభమగుచున్నది. ఈ విధముగా దేవునిని అడిగి ఆమె పొందిన సమూయేలు ఏలీ ఎదుట యోహోవాను సేవించెను (1 సమూయేలు 3:1 ) దేవునికి ఉపయోగకరమైన పాత్రగా బాలుడైన సమూయేలు ఉన్నాడు. (1 సమూయేలు 3:1-19 ) దేవుని ప్రజలకు ప్రార్థన ద్వారా జయమును సంపాదించే ప్రవక్తగా సమూయేలు పెరిగెను. (1 సమూయేలు 7:5-10 ). తన ప్రజలు ఒక రాజు కొరకు అడిగినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసెను (1 సమూయేలు 8:6 . ఈ విధముగా విజ్ఞాపన ప్రార్థన సమూయేలు యొక్క జీవితములో ముఖ్యమయిన భాగముగా ఉన్నది.
ఉద్దేశము : ఇశ్రాయేలీయుల చివరి న్యాయాధిపతి అయిన సమూయేలు జీవిత చరిత్ర, మొదటి రాజైన సౌలు పరిపాలనా మరియు పతనము, ఇశ్రాయేలీయుల మహోన్నతమైన రాజుగా దావీదును ఎన్నుకొనుట. తర్ఫీదు చేయుట యొక్క వివరములు.
గ్రంథకర్త : సమూయేలు (నాతాను, గాదు అనే ప్రవక్తల రచనలు కూడా ఉన్నవి. 1 దినవృత్తాంతములు 29:29.
గత చరిత్ర : న్యాయాధిపతుల కాలంలో ఈ పుస్తకము ప్రారంభమగుచున్నది. దేవుని పరిపాలన నుండి రాజుపాలనకు పరివర్తన చెందుటను గూర్చి వివరించుచున్నది.
ముఖ్యవచనములు : 1 సమూయేలు 8:7-9
ముఖ్యమైన వ్యక్తులు : ఏలీ, హన్నా, సమూయేలు, సౌలు, యోనాతాను, దావీదు.
గ్రంథ విభజన : సమూయేలు మొదటి పుస్తకమును మూడు భాగములుగా విభజింపవచ్చును.
సమూయేలు న్యాయము తీర్చిన కాలము ( అధ్యా 1-7); 2. సౌలు పరిపాలనా కాలము (అధ్యా 8 -15 ); 3. సింహాసనమును పొందిన దావీదు అజ్ఞాతవాస కాలము ( అధ్యా 16 -31) ఈ కాలములో సౌలు రాజుగా కొనసాగాడు గిల్బోవ పర్వత శిఖరమున సౌలు, అతని కుమారులు చనిపోయిన వెంటనే దావీదు తిరుగులాడిన కాలము ముగిసినది.
పుస్తకము యొక్క చివరి అధ్యాయములో (అధ్యా 31) నల్లని బట్టలు ధరించిన దుఃఖభరితమైన, కథ చాలా హీనమైన, పడిపోయిన దృశ్యమును చూచుచున్నాము. సొంతకత్తి మీదపడి చనిపోయిన సౌలు సొంత కత్తితో ఆత్మహత్య చేసికొని చనిపోయిన మనిషి యొక్క ప్రతిబింభమును అక్కడ చూచుచున్నాము. బంగారు యౌవనమో లేక సాధించిన గొప్ప విజయములో జీవితముగింపులో జయమునకు హద్దుగా ఉండవు. లోబడుటలో జీవిత ముగింపు వరకు నిలిచే వ్యక్తులే జీవ కిరీటమునకు యోగ్యులగుదురు. లోబడకపోవుట, గర్వం, అసూయ మొదలగు వాటికి, ఎరగా మారి నాశనమైన ఒక వ్యక్తి యొక్క విషాధమైన చిత్రముతో ఈ పుస్తకము యొక్క కథకు తెరదిగుచున్నది.
ఈ కొన్ని క్లుప్త వివరములు : 9వ పుస్తకము : అధ్యాయములు 31; వచనములు 810; ప్రశ్నలు 157; నెరవేరిన ప్రవచనములు 50; నెరవేరని ప్రవచనము 1; దేవుని యొద్ద నుండి ప్రత్యేక సందేశములు 29; వాగ్దానములు 4; ఆజ్ఞలు 117; హెచ్చరికలు 57.
సమూయేలు రెండవ గ్రంథము
సౌలుకు భయపడి మొదట యూదాలో, తరువాత ఫిలిప్తీయుల దేశములో దాగుకొని జీవించిన దావీదు, సౌలు మరణము తరువాత దేవుని ఆలోచన చొప్పున యూదాకు, తదుపరి ఇశ్రాయేలు దేశమంతటికి రాజై పరిపాలన చేసిన చరిత్రే సమూయేలు రెండవ పుస్తకము. దావీదు జీవిత చరిత్ర 1 రాజుల గ్రంథము మొదటి రెండు అధ్యాయముల వరకు కనబడినప్పటికీ, దావీదు యొక్క పరిపాలన గురించి ఎక్కువగా చెప్పిన గ్రంథము రెండవ సమూయేలు. దావీదు సింహాసనమును ఎక్కుట, చుట్టువున్న శత్రువుల మీద జయము పొందుట, చెదరిపోయే స్థితి నుండి ఇశ్రాయేలును స్థిరమైన దేశముగా రూపించుటకు ఆయన నాయకత్వము వహించుట మొదలగువాటిని గురించి ఈ గ్రంథము చెప్పుచున్నది. దావీదు యొక్క విజయాలను తెలుపుటతో పాటు, దిగజారిన స్థితిని కూడా నిజాయితీగా చిత్రించుటలో ఈ పుస్తకము ప్రత్యేకతను సంతరించుకొనినది. ఆయన జీవితమును పుట్టుకురుపు బాధించిన వ్యభిచారము, నరహత్య మొదలగు వాటి భయంకరమైన ప్రతిఫలములు ఆయన కుటుంబమును, దేశమును ఏలాగు కలవరపరచినవో ఈ గ్రంథములో చూడవచ్చును. గ్రంథము యొక్క పేరు, దానికి సంబంధించిన సమాచారము గురించి 1 సమూయేలు పరిచయములో చూడగలము. ఆ పుస్తకములో వ్రాయబడిన రాజ్య చరిత్ర కొనసాగింపే ఈ రెండవ పుస్తకములో చూచుచున్నాము.
ఉద్దేశము : 1. దావీదు పరిపాలనా కాలచరిత్రను చెప్పుటకు. 2. దేవుని పరిపాలన క్రింద ఎంత ఉన్నతముగా పాలన జరిగినదో చూపించుటకు. 3. ఒక వ్యక్తి ద్వారా మార్పులను తీసుకురాగలము అని చూపించుటకు. 4. దేవుని సంతోషపరచుటకు అవసరమైన గుణశీలములు ఏమిటి అని చూపించుటకు. 5. ఎన్నో కొరతలు ఉన్నా ఒక దేశములో మహా గొప్ప రాజుగా దావీదును చిత్రించి క్రొత్తది మరియు సంపూర్ణమైన ఒక దేశము
యొక్క మాదిరి గల నాయకుని రాబోయే క్రీస్తుని దావీదు మూలంగా ప్రతిబింబింపచేయుట (అధ్యాయము 7).
గ్రంథకర్త : యూదా పారంపర్యమునుబట్టి సమూయేలు, కానీ 1 దినవృత్తాంతములు 29:29 ప్రకారము నాతాను, గాదు అని కొందరు భావించుచున్నారు.
నేపథ్యము : దావీదు పరిపాలన క్రింద ఉన్న ఇశ్రాయేలు రాజ్యము.
ముఖ్యవచనములు : 2 సమూయేలు 5:12
గ్రంథ విశిష్టత : దావీదును అభిషేకించి దేవుని కొరకు జీవించ సలహానిచ్చిన సమూయేలు ప్రవక్త పేరు, ఈ పుస్తకమునకు ఇవ్వడినది.
సౌలు - దావీదు : సాధారణ గొర్రెలకాపరి స్థితి నుండి ఇశ్రాయేలీయుల శ్రేష్ఠుడైన రాజపదవికి దేవుడు తనను హెచ్చించెను అనునది దావీదు ఎప్పుడూ మరువలేదు. సౌలుకు, దావీదుకు మధ్య పోల్చి చూచి పరిశోధన జరిపితే ముఖ్యమైన వ్యత్యాసము బహిరంగపరచబడుట చూడగలము. ఇశ్రాయేలీయుల అతిచిన్న గోత్రము యొక్క సాధారణ కుటుంబములో నుండి దేవుడు తనను ఎన్నుకొన్నాడు అనే గహింపు ప్రారంభములో
సౌలుకు ఉండినది. కానీ కాలము గడిచే కొలది తన పూర్వస్థితిని సౌలు మరచిపోయెను. దేవుని ఆజ్ఞలను విడచి అవిధేయత అనే పాపంలో దావీదు, సౌలు దాదాపుగా ఒకే విధముగా పడిపోయినప్పటికీ వారిద్దరూ తప్పు ఒప్పుకొనే స్థితిలో చాలా గొప్ప వ్యత్యాసమున్నది. సౌలు పాపములను ఒప్పుకొన్నప్పటికి ఒక నిజమైన పశ్చాత్తాపము ఆయనలో ఎన్నడూ ఏర్పడలేదు. దావీదైతే విరిగిన హృదయముతో దేవునికి మొఱ్ఱ పెట్టి, నిజమైన హృదయ మార్పుకు తనను తాను అప్పగించుకొనెను. అందువలన దావీదు దేవుని కృపను సంపాదించుకొనెను. వృద్ధాప్యంలో ఘనత, ఐశ్వరము కలిగి దావీదు మరణించగా, (1 దినవృత్తాంతములు 29:28 ) సౌలు సొంత ఖడ్గము మీదపడి భయంకరమైన మరణమును ఎదుర్కొనెను. (1 సమూయేలు 31:4 )
గ్రంథ విభజన : ఈ గ్రంథమును మూడు పెద్ద భాగములుగా విభజింపవచ్చును. I. దావీదు పొందిన జయములు (1 - 10 అధ్యాయములు). 2. దావీదు యొక్క పాపం (11 అధ్యాయము). 3. పాప ఫలితము వలన దావీదు అనుభవించవలసిన శ్రమలు (12 - 24 అధ్యాయములు)
కొన్ని క్లుప్త వివరములు : పరిశుద్ధ గ్రంథములోని 10వ పుస్తకము : అధ్యాయములు 24; వచనములు 695; ప్రశ్నలు 125; చరిత్రకు సంబంధించిన వచనములు 679; నెరవేరిన ప్రవచనము 9; నెరవేరనివి 7; దేవుని సందేశములు 11; ఆజ్ఞలు 70; వాగ్దానములు 13; హెచ్చరికలు 25.
రాజులు మొదటి గ్రంథము
జ్ఞానులకు జ్ఞానియైన సొలొమోను రాజు పరిపాలన, ఆయన గొప్ప కార్యములను గురించి ఈ గ్రంథము యొక్క మొదటి భాగము చెప్పుచున్నది. సొలొమోను పరిపాలనా కాలము ఇశ్రాయేలు రాజ్యపు స్వర్ణ యుగముగా ఉండినది. శిల్పకళలో శ్రేష్టమైన గుర్తుగా యెరూషలేము దేవాలయము కట్టబడినది. అతని పాలనలో ఇశ్రాయేలు మహిమ చేరినది. దీనిని సొలొమోను యొక్క శ్రేష్టమైన కార్యముగా చెప్పవచ్చును. ప్రతి దినము రెండు లక్షల మంది పనివారు ఏడు సంవత్సరములు పనిచేసి ఈ దేవాలయమును కట్టిరి. గొప్ప జ్ఞానియూ, కవియూ అయిన సొలొమోను యొక్క జ్ఞానమును వినుటకును, ఆయన అంతఃపురము యొక్క మహాత్యమును చూచుటకు పలు దేశముల నుండి రాజులు, రాణులు యెరూషలేముకు వెళ్ళుట ఆనాటి అలవాటుగా ఉండినది.
అయినప్పటికి ఆయన వృద్ధాప్యము ఒక దుఃఖకరమైన స్థితికి సాక్ష్యమిచ్చినది. ప్రజల మధ్యలో అసంతృప్తి ఏర్పడినది. దేశములో విభజనలు, అంతర్గత కలహములు పెరిగినవి. మహిమ కలిగిన దేశము అతి త్వరగా చిన్నాభిన్నమైనది. ఈ నాశనమునకు కారణములు ఏమిటి అనేది చూద్దాం.
(1). ఆడంబర జీవితము, అనవసరమైన ఖర్చులు పెరిగి ప్రజలకు భారమాయోను. (2). రాజులందరు తమ నైపుణ్యము వలన జయించుటకు చేసిన ప్రయత్నముల మధ్య దేవుని కేంద్ర బిందువుగా చేయడం సొలొమోను మరచినాడు. (3). ఆయన వివాహ జీవితము సుఖభోగము యెక్క గుర్తుగా ఉండినది. ఆయన అంతఃపురంలో 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉండేవారు. ఆయన యొక్క అన్యులైన భార్యలు ఆయనను విగ్రహారాధనలోకి లాగిపడవేసిరి.
మహిమతో నిండిన యెరూషలేము దేవాలయమును కట్టిన రాజు విగ్రహారాధికునిగా మారుట ఎంత దుఃఖకరము. అయిననూ సొలొమోను జీవితములో ఇదే సంభవించినది.
ఉద్దేశ్యము : ఇశ్రాయేలు మరియు యూదా రాజుల చరిత్రను చెప్పుటతోబాటు, దేవుని ఆజ్ఞలు గైకొని నడుచువారిని, వాటిని మీరి నడచువారిని పోల్చి చూపించుట.
గ్రంథకర్త పేరు : యిర్మీయా
నేపథ్యము: ఇశ్రాయేలు దేశము విభజింపబడుచున్నది. లోక పరిస్థితిలో మాత్రము కాక, ఆత్మీయ స్థితిలోనూ వేరుపరచబడినది.
ముఖ్యవచనములు : 1 రాజులు 9:4-5
ముఖ్యమైన వ్యక్తులు : దావీదు, సొలొమోను, రెహబాము, యరొబాము, ఏలియా, ఆహాబు, యెజెబెలు.
ప్రత్యేకత : మొదటి, రెండవ రాజులు రెండూ కలిసి ప్రారంభములో ఒకే పుస్తకముగా ఉండినవి.
కాలము : క్రీ.పూ. 722 సంవత్సరంలో ఇశ్రాయేలు రాజ్యము ఆషూరు చెరకు, క్రీ. పూ. 586 సంవత్సరంలో యూదా రాజ్యము బబులోను చెరకు తీసికొనిపోబడుటకు కారణం లోబడకపోవడం, విగ్రహారాధన, చెడునడత అనునవే అని వివరించే అక్షరచిత్రముగా రాజుల పుస్తకములలో గోచరమగుచున్నవి. సొలొమోను రాజ్యమునకు వచ్చిన క్రీ. పూ. 970 నుండి అహజ్యా యొక్క పాలన ముగిసిన క్రీ. పూ. 853 వరకు ఉన్న 123 సంవత్సరాల చరిత్ర మొదటి రాజులు పుస్తకపు విషయ సూచికమగును. ఈ పుస్తకము క్రీ.పూ. 930 సంవత్సరమును గమనించేటట్లుగా చేయుచున్నది. సొలొమోను మరణించుటతోడనే దేశము రెండుగా విడిపోవుట ఈ సంవత్సరములోనే జరిగినది.
మహా గొప్ప జ్ఞానియూ, రాజకీయ చతురుడైన సొలొమోను వృద్ధాప్యములో ఒక బుద్దిహీనుడుగా ప్రవర్తించడం మనము చూస్తున్నాము. దీనిని బట్టి దేవుడు ఇశ్రాయేలు నుండి 10 గోత్రములను తీసి ఆయన సేవకుడైన ఇంకొకరికి ఇచ్చెను. పన్నును తగ్గించమని అడిగిన ప్రజలకు కఠినమైన జవాబు ఇచ్చిన రెహబాముకు రెండు గోత్రములు మాత్రమే ఇవ్వబడినవి. యూదా, బెన్యామీను గోత్రములే అవి. తక్కిన 10 గోత్రములు యరొబాముతో కలిసి ఉత్తర ఇశ్రాయేలు దేశముగా ఏర్పడినవి. అది ఆయనకు, అనుచరులకు సొంతమైనది.
గ్రంథ విభజన : ఈ పుస్తకమును తేటగా రెండు పెద్ద భాగములుగా విభజించవచ్చును.
ఒకటిగా కలిసిన ఇశ్రాయేలు దేశము (1 - 11 అధ్యా వరకు). 2. విడిపోయిన దేశము - ఉత్తర ఇశ్రాయేలు, దక్షిణ ప్రాంత యూదా (12 - 22 అధ్యా వరకు)
కొన్ని క్లుప్త వివరములు : పరిశుద్ధ గ్రంథములో 11వ పుస్తకము; అధ్యాయములు 22; వచనములు 816; ప్రశ్నలు 66; నెరవేరిన ప్రవచనములు 71; నెరవేరని ప్రవచనము 1; దేవుని సందేశములు 36; ఆజ్ఞలు 92; హెచ్చరికలు 73; వాగ్దానములు 6.
రాజులు రెండవ గ్రంథము
వాగ్దానదేశములో నివాసమును స్థిరపరచిన దేవుని ప్రజల అంధకార దినములను గూర్చి రాజుల రెండవ పుస్తకము చిత్రించి చూపించుచున్నది. దేవునితో ఉన్న ఒడంబడికను దేవుని ఆజ్ఞలను మరచి విగ్రహారాధన చేసి చెడిపోయిన జీవితములో మునిగిపోయిన ప్రజల మీదికి వచ్చిన భయంకర న్యాయ తీర్పునే ఈ పుస్తకములో మనము చూచుచున్నాము. చివరి ఘట్టం వరకు ఇశ్రాయేలులోనూ, యూదాలోనూ పాలించిన రాజుల గురించిన దృశ్యములను మార్చి మార్చి చూపించుచున్నాడు గ్రంథకర్త.
ఇశ్రాయేలు, 19 మంది దుష్టపాలకుల పరిపాలన ముగిసిన తరువాత అపూరుకు బానిస అయినది. దీనితో పోల్చి చూసినపుడు యూదా చరిత్ర ఉన్నతముగా ఉన్నది అని చెప్పవచ్చును. అక్కడ అప్పుడప్పుడు దైవభక్తి కలిగిన కొందరు రాజులు లేచి తమ పితరులు నిలిపిన బలిపీఠములను, విగ్రహములను తీసివేసి ప్రజల జీవితమును చేతనైనంత వరకు పరిశుద్ధపరచ ప్రయత్నించిరి అయినప్పటికీ, చిట్టచివరికి నీతికి బదులు అధికముగా పాపము పెరిగి యూదారాజులు, దేశ ప్రజలు బబులోనుకు చెరగా వెళ్ళిరి.
కాలము : బబులోను చెరపట్టిన కాలమైన క్రీ. పూ. 586 కు ముందు రాజులును గూర్చి ఈ గ్రంథములో ఎక్కువ భాగము వ్రాయబడియుండవచ్చును. సొలొమోను మరణము, ఇశ్రాయేలు విభజన క్రీ.పూ. 930 సంవత్సరములో జరిగినది. ఐక్య ఇశ్రాయేలు రాజ్యము క్రీ.పూ. 1050 నుండి 930 వరకు 120 సంవత్సరములు నిలిచియుండినది. తదుపరి ఉత్తర ఇశ్రాయేలు రాజ్య ము క్రీ.పూ 930 నుండి 722 సంవత్సరముల వరకు 208 సంవత్సరములు కొనసాగినది. క్రీ.పూ 722 సంవత్సరములో అషూరు ఇశ్రాయేలును హస్తగతం చేసుకుని అనేకులైన ప్రజలను చెరగా తీసుకుని వెళ్ళినది. దక్షణ యూదా రాజ్యము దీని తదుపరి 136 సంవత్సరములు కొనసాగినది. క్రీ. పూ. 586 లో బబులోను చెర ద్వారా అది కూడా పతనమైనది. ఈ విధముగా క్రీ.పూ 1050 నుండి 586 వరకైన 464 సంవత్సరములు ఇశ్రాయేలు చరిత్రకాలములో ప్రపంచములో చాలా గొప్ప రాజకీయ మార్పులు చోటుచేసుకున్నవి. పాలస్తీనా భూభాగము పై అనేక సార్లు ఐగుపుకు, అషూరుకు మారిమారి అధికారము, పాలన ఉండినది. అప్పుడు విస్తరించిన అషూరు సామ్రాజ్యము కొంచెము కాలము తరువాత పతనమైనది. బబులోను దానిని తనలో విలీనం చేసుకున్నది.
ఉద్దేశ్యము : దేవుని న్యాయకత్వమును అంగీకరించుటకు సిద్ధమనస్సు లేని ప్రజల భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చూపించుట.
గ్రంథకర్త : యిర్మీయా
నేపథ్యము: ఒకే రాజ్యముగా ఉండిన ఇశ్రాయేలు దేశము విభజింపబడిన నూరు సంవత్సరముల తరువాత
ముఖ్య వచనములు : 2 రాజులు 17:22-23; 2 రాజులు 23:27
ముఖ్యమైన వ్యక్తులు : ఏలియా, ఎలీషా, షూనేమీయురాలు, నయమాను, యెజెబెలు, యెహూ, యోవాషు, హిజ్కియా, మనషేయోషియా, యెహోయాకీము,సేన్హేరీబు, యెషయా, సిద్కియా, నెబుకద్నేజరు.
పుస్తకము యొక్క ప్రత్యేకత : పాత నిబంధన చివరలో కనబడు 17 ప్రవచన పుస్తకములు రెండవ రాజుల పుస్తకముతో పోల్చి చూసి నేర్చుకొనదగినవి.
గ్రంథ విభజన : రాజులు రెండవ పుస్తకమును రెండు పెద్ద భాగములుగా విభజించవచ్చును. . 1. విడిపోయిన తరువాత ఏర్పడిన రెండు రాజ్యముల చరిత్ర. (1 - 17 అధ్యాయము) 2. అష్హురుతో యుద్ధము తరువాత నిలిచియున్న ఏక రాజ్య మైన యూదా చరిత్ర ( 18 - 25 అధ్యాయము).
ఇశ్రాయేలు పతనమునకు ఆరు సంవత్సరములకు ముందు హిజ్కియా యూదాకు రాజాయెను. ఆయన యొక్క మంచి దైవభక్తి చేసిన ఉజ్జీవ కార్యములు, వీటిని బట్టి దేవుడు యూదాను శత్రువుల నుండి విడిపించి వారికి ఐశ్వర్యమును, సుఖవంతమైన స్థితిని ఇచ్చెను. అయినప్పటికి హిజ్కియా కుమారుడైన మనషె కాలంలో దేశము చెడుతనములోకి తిరిగి కూరుకుపోయినది. మనషె యొక్క మనుమడైన యోషియా
మెచ్చుకొనదగిన, పరిశుద్ధపరచు కార్యముల వలన రావలసిన నాశనమును ఎన్నటెన్నటికి రాకుండా ఆపలేకపోయినది. యోషియా తరువాత వచ్చిన నలుగురు రాజుల కాలంలో బబులోను యొక్క తీవ్రమైన యుద్ధములు కొనసాగినవి. బబులోను రాజు మూడుసార్లు యూదులను చెరపట్టుకుని వెళ్ళెను. మూడవసారి యెరూషలేము నగరము, దేవాలయము నాశనమైనవి. చివరి ఘట్టములో యూదాలో మిగిలిపోయిన వారికి రాబోవు నిరీక్షణను చూపి, ఒప్పింపజేసి ఈ పుస్తకము ముగింపగుచున్నది. ఇశ్రాయేలులోనూ ఇంకా యూదాలోనూ రాజుల పరిపాలనా కాలయములో మనుష్యుల హృదయములను దేవుని వైపు త్రిప్పుటకు అనేక మంది ప్రవక్తలను దేవుడు తపెను, ఏలియా, ఎలీషా, ఆమోసు, హోషేయా అనువారు ఇశ్రాయేలులోను ఓబద్యా, యోవేలు, యెషయా, మీకా, నహూము, జెఫన్యా, యిర్మీయా, హబక్కూకు అనువారు
యూదాలో వారి సేవలను జరిగించిరి.
కొన్ని కుప్ల వివరములు : పరిశుద్ధ గ్రంథములోని 12వ పుస్తకము ; అధ్యాయములు 25; వచనములు 719; ప్రశ్నలు 118; చరిత్రకు సంబంధించిన వచనములు 560; నెరవేరిన ప్రవచనములు 58; నెరవేరనివి 1; హెచ్చరికలు 65; ఆజ్ఞలు 118; వాగ్దానములు 3; దేవుని సందేశములు 20.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
సమూయేలు రెండవ గ్రంథము మొదలుకొని రాజులు రెండవ గ్రంథము వరకు చెప్పబడిన యూదా చరిత్ర యొక్క పలు కోణముల మరులిఖితమైయున్నది. అయినను ఇది మరొకసారిచెప్పుట కాదు. ఇశ్రాయేలు చరిత్రకు దేవుడు ఇచ్చిన ఒక వివరణ అని దీనిని చెప్పవచ్చు. రెండవ సమూయేలు, మొదటి, రెండవ రాజులు ఇశ్రాయేలీయుల సంపూర్ణ రాజకీయ చరిత్రగా కనబడుచుండగా, దావీదు నుండి ప్రారంభమైన యూదా రాజ కుటుంబమును మాత్రము ఒక మత చరిత్రగా దినవృత్తాంతముల పుస్తకములు వ్రాయబడినవి.
సమూయేలు, రాజులు అనే పుస్తకముల వలె ఈ పుస్తకములు కూడా హెబ్రీ భాషలో ఒకే పుస్తకముగా వ్రాయబడిననూ గ్రీకు “సెప్టోజెంట్ " తర్జుమాలో రెండుగా విభజించబడినవి. దీని మొదటి పుస్తకములో దావీదు జీవిత చరిత్రను, రెండవ పుస్తకములో దావీదు నుండి ప్రారంభమైన యూదా రాజకుటుంబ చరిత్ర వరకు కనబడుచున్నది. దావీదు వంశావళి వివరణలో మొదటి పుస్తకము ప్రారంభమగుచున్నది. ఆయన యొక్క న్యాయపరిపాలన, ఆత్మీయ శ్రేష్ఠతను ప్రత్యక్షపరచి అది ముగియుచున్నది.
దినవృత్తాంతముల గ్రంథము హెబ్రీ గ్రంథములో చివరి పుస్తకములైనందున 1 నుండి 9 అధ్యాయములలో కనిపించే విశేష వంశావళి యొక్క వివరణ క్రొత్త నిబంధన యొక్క మొదటి పుస్తకములో కనిపిస్తున్నది. యేసుక్రీస్తు యొక్క వంశావళికి ప్రారంభమని చెప్పవచ్చును.
దినవృత్తాంతముల పుస్తకము హెబ్రీ భాష శీర్షికమైన "డిబారెహయామిమ్” అనుమాటకు అనుదిన కార్యక్రమములు అని అర్థము ఇది గ్రాహ్యమగునట్లుగా తెలుగులో తీసుకొనబడిన మాటే ఈ దినవృత్తాంతములు.
ఉద్దేశము : దేవుని ప్రజలను ఐక్యపరచడం, దావీదు వంశావళిని వ్రాయుట, సమాజములోను, వ్యక్తిగత జీవితములోను నిజమైన ఆరాధనకు ప్రథమ స్థానం ఇవ్వబడవలెనని చెప్పుట.
గ్రంథకర్త : ఎజ్రా, (యూదా పారంపర్య నమ్మికనుబట్టి)
వ్రాసిన కాలము : క్రీ.పూ. 430 (క్రీ.పూ. 1000 - 960 కాలములో జరిగిన సంఘటనలు వ్రాయబడినవి).
నేపథ్యము : రెండవ సమూయేలు వివరణగా ఈ పుస్తకమును చెప్పవచ్చును. యూదా మరియు ఇశ్రాయేలు మత చరిత్రకు దీనిలో ప్రాముఖ్యత ఇవ్వబడినది. చెర తరువాత ఒక మత గురువు (యాజకుని) నేతృత్వములో ఈ పుస్తకము వ్రాయబడినది.
ముఖ్యవచనము : 1 దినవృత్తాంతములు 14:2
ముఖ్యమైన వ్యక్తులు : దావీదు, సొలొమోను
ముఖ్య స్థలములు : హెబ్రోను, యెరూషలేము
గ్రంథ విభజన : బబులోను చెర నుండి తిరిగి వచ్చు వరకు ఇశ్రాయేలు గురించి మొత్తం చరిత్రకు ఇంకొక ప్రతి బింభముగా ఉన్నది. ఇశ్రాయేలులో తిరిగివచ్చిన శేష దైవ ప్రజలకు వారి యొక్క పాతకాలపు జీవితమును గురించిన ఒక ఆత్మీయ దృష్టిని ఇచ్చుటకు ఈ పుస్తకము వ్రాయబడినది. ఈ మొదటి పుస్తకము అంతయు సమూయేలు రెండవ పుస్తకము వలె దావీదు జీవిత చరిత్రను వివరించుటకు ఉపయోగపడుచున్నది. ఈ క్రింది విధముగా రెండు ముఖ్య భాగములను ఈ పుస్తకములో చూడవచ్చును.
(1). అధ్యాయము 1 నుండి 9 వరకు దావీదు వంశావళి పట్టిక. ఈ భాగములో దావీదు మరియు ఇశ్రాయేలీయుల పూర్వీకుల పారంపర్య ప్రారంభము నుండి ఇవ్వబడినది. పుస్తకము పూర్తిగా యూదా రాజ్య చరిత్రతో నిండిన యూదా, బెన్యామీను అను గోత్రములకే ముఖ్యత్వము ఇచ్చి ఈ పూర్వీకుల పట్టిక ఉద్భవించబడినది. ఈ పుస్తకములో యాజక ప్రాథమిక దృష్ట్యా లేవీ గోత్రమునకు ఉన్నతమైన స్థానము ఇవ్వబడినది.
(2). అధ్యాయము 10 - 29 వరకు. దావీదు జీవిత ముఖ్య సంఘటనలు వివరించు ఈ భాగములో సౌలుకు భయపడి ఆయన చేసిన అజ్ఞాత జీవితం, హెబ్రోనులో 7 సంవత్సరములు యూదా గోత్రమును మట్టుకు యేలినది. అనునవి విడువబడినవి. అదేవిధముగా బెత్సేబాతో దావీదు పడిపోయిన సంఘటనను ఈ గ్రంథకర్త వదిలివేసెను. దేవుని క్షమాపణ, ప్రేమ ఆశీర్వాదమహిమ అను వాటికి ముఖ్యత్వము ఇచ్చి చెర నుండి వచ్చిన దేవుని ప్రజలను విశ్వాసములోను, లోబడుటలోను, దేవుని భయంలోను దృఢపరచి స్థిరపరచవలెనన్న ఉద్దేశ్యముతో వదలవలసిన భాగములను వదిలి పెట్టి చేర్చవలసిన భాగములను చేర్చి పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి ఈ గ్రంథకర్త ఈ గ్రంథమును వ్రాశాడు. దేవుడు దావీదుకు దేవాలయము కట్ట అనుమతిని ఇవ్వకపోయినప్పటికి కట్టుడు పని నిమిత్తము సకల సిద్ధపాటులను ఆయన చేయగలిగెను. దావీదు యొక్క బహిరంగమైన స్తోత్రముతో, సొలొమోను సింహానాసీనుడయ్యే దృశ్యముతో ఈ పుస్తకము ముగింపగుచున్నది.
కొన్ని క్లుప్త వివరణలు : పరిశుద్ధ గ్రంథములో 13వ పుస్తకము ; అధ్యాయములు 29; వచనములు 942; చరిత్రకు సంభందించిన వచనములు 927; నెరవేరిన ప్రవచనములు 81; నెరవేరనివి 71; హెచ్చరికలు 30; ఆజ్ఞలు 53; ప్రశ్నలు 19; వాగ్దానములు 9; దేవుని సందేశములు 8.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఉద్దేశము : రాజులకు తీర్పునిచ్చే కొలబద్ద చూపించుచూ, నిజమైన ఆరాధనకు మనుష్యులను ఐక్యపరచుట, యూదాలోని నీతి మంతులైన రాజులను వారి యొక్క పరిపాలనలో జరిగిన ఆత్మీయ ఉజ్జీవమును చూపించుట. చెడు రాజుల పాపములను బహిరంగముగా చూపించుట.
గ్రంథకర్త : ఎజ్రా (యూదా పారంపర్య నమ్మకమును బట్టి).
కాలం : క్రీ.పూ. 430 ( సొలొమోను పరిపాలన ప్రారంభమైన క్రీ. పూ. 970 నుండి బబులోను చెర ప్రారంభమైన క్రీ.పూ. 586 వరకు జరిగిన సంఘటనలు వ్రాయబడినవి).
నేపథ్యము: ఒకటి, రెండు రాజుల రెండు పుస్తకముల ఉన్న చరిత్రను దినవృత్తాంతముల రెండవ పుస్తకములో వివరించుచున్నది. ఉత్తర భాగము ఇశ్రాయేలు అని దక్షిణ భాగము యూదా అని విభజింపబడిన దానిలో ఉత్తర ఇశ్రాయేలు దేశము మరియు అక్కడ ఏలిన రాజులను గురించిన చరిత్ర యించుమించు పూర్తిగా ఈ పుస్తకములో తీసివేయబడినది. ఈ పుస్తకము వ్రాయబడిన కాలంలో అధర్మం, విగ్రహారాధన వలన నాశనమైపోయిన ఆదేశములో యేదియును మిగలలేదు. దాని చరిత్రను వ్రాసి సమయమును వ్యర్థము చేయకూడదని గ్రంథకర్త తీర్మానము.
దీనికి బదులుగా దేవాలయమును కట్టుటకు అనుమతిని పొంది తిరిగి వచ్చిన దైవ ప్రజలైన యూదా ప్రజలకు ఆత్మీయ ప్రోత్సాహము ఇచ్చుటకు వారి గత కాలపు మహిమను గూర్చిన గర్వమును, భవిష్యత్తును గురించిన మంచి నమ్మికను వారిలో పెంచటానికి ఈ పుస్తకము ద్వారా గ్రంథకర్త ప్రయత్నిస్తున్నాడు. దైవభక్తి లో ఉన్నతముగా ఉండిన దావీదు రాజు కాలము తరువాత ఆయన వారసులుగా పరిపాలన సాగించిన ఎనిమిది మంది ఉత్తమమైన రాజుల చరిత్రను, వారి యొక్క సంస్కరణలను వివరించుటకు పుస్తకములోని అధిక భాగమును గ్రంథకర్త ఉపయోగించాడు. తమ దేశము స్థిరపరచబడుటకు దైవ ఆరాధన ప్రాధమిక పునాది అనుకొని గ్రంధకర్త యెరూషలేము దేవాలయ మహిమ అక్కడ జరిగిన ఆరాధనను నొక్కి చెప్పుచున్నాడు గ్రంథకర్త.
ముఖ్యవచనము : 2 దినవృత్తాంతములు 7:14
ముఖ్య వ్యక్తులు : సొలొమోను, షేబారాణి, రెహబాము, ఆసా, యెహోషాపాతు, యెరొబాము, యోవాషు, ఉజ్జియా, అహాజు, హిజ్కియా, మనషె, యోషియా.
ముఖ్యస్థలము : యెరూషలేము
గ్రంథ విశిష్టత : దేవాలయపు పనివివరములు వ్రాయబడినవి
గ్రంథ విభజన : (1). సొలొమోను పరిపాలనా కాలము : 1 నుండి 9 వరకు ఉన్న అధ్యాయములు, సొలొమోను పరిపాలనా కాలము సమాధానము, ధన సమృద్ధి, ఆరాధన అనువాటి యొక్క స్వర్ణయుగముగా ఉండినది. ఈ కాలములో యూదా ఐకమత్యములో, ధన సమృద్ధిలో ఉన్నత స్థానములో ఉండినది. సొలొమోను యొక్క ఐశ్వర్యము, జ్ఞానము, రాజభవనము, దేవాలయము అనునవి ఈ కాలములో ప్రఖ్యాతిగాంచినవి. ఈ భాగము యొక్క 9 అధ్యాయములలో మొదటి ఆరు అధ్యాయములు దేవాలయపు కట్టడపు పని, అర్పణ అనువాటిని కేంద్రముగా చేసుకున్నవి అనునది గమనించదగినది. (2). యూదా రాజుల యొక్క పరిపాలన : అధ్యాయము 10 - 36 వరకు దురదృష్టకరముగా ఇశ్రాయేలు మహిమ, ఐశ్వర్యము ఎక్కువ కాలము నిలువబడలేదు. సొలొమోను మరణము తరువాత అతని కుమారుడైన రెహబాము రాజు అయిన వెంటనే దేశము రెండుగా విడిపోయినది. విభజన ఫలితముగా ఏర్పడిన రెండు రాజ్యముల మధ్య పోరాటము వచ్చినది. కొంచెము కొంచెముగా తమ నాశనము దిగజారిపోయినవి. అప్పుడప్పుడు వచ్చిన కొందరు ఉత్తములైన యూదా రాజుల ఆత్మీయ సంస్కరణల వలన నాశనమగుటకు కొంచెము ఆలస్యయినది. యూదాను పరిపాలించిన 20 మంది రాజులలో 8 మంది ప్రజలను విగ్రహారాధన నుండి, క్రమశిక్షణా రాహిత్యము నుండి పైకి లేపుటకు ప్రయత్నించిరి. అయిననూ ఎవరి ప్రయత్నమైననూ ఒక తరము కంటె మించి నిలువబడినట్లుగా కనబడలేదు.
చివరిగా యోషియా తరువాత వచ్చిన నలుగురు రాజుల పాలన కాలములో దేశమునకు పూర్తిగా నాశనము వచ్చినది. మూడుసార్లు బబులోను రాజులు యూదా ప్రజలను, రాజులను చెరపట్టి తన దేశమునకు తీసుకువెళ్ళిరి. చివరిసారి అంటే క్రీ. పూ. 586లో యెరూషలేము నగరము, దేవాలయము పూర్తిగా నాశనమైనవి. అయినప్పటికిని 70 సంవత్సరముల బానిసత్వము తరువాత అప్పటి పారశీక రాజైన కోరెషు (ఈ విరామ కాలములో బబులోను రాజ్యము ముగింపై మాదీయ పారశీక సామ్రాజ్యము స్థాపించబడినది. యూదులు తమ దేశమునకు మరలుటకును, యెరూషలేము దేవాలయము కట్టుటకు, ఆజ్ఞాపించెను. “ఆయన ప్రజలందరిలో ఎవడు ఉన్నాడో వాడు వెళ్ళవచ్చును వాని యొక్క దేవుడైన యెహోవా వానికితోడై ఉండునుగాక” అనునది ఆజ్ఞ యొక్క సారాంశము.
క్లుప్త వివరణలు : పరిశుద్ధ గ్రంథములోని 14వ గ్రంథము ; అధ్యాయములు 36; వచనములు 822; చరిత్ర సంబంధమైన వచనములు 583; నెరవేరిన ప్రవచనములు 31; నెరవేరనివి 7; హెచ్చరికలు 42; ఆజ్ఞలు 45; వాగ్దానములు 8 ; దేవుని ప్రత్యేక సందేశములు 21; ప్రశ్నలు 47.
Ezra - ఎజ్రా
దినవృత్తాంతములు రెండవ పుస్తకము తరువాత జరిగిన చరిత్ర మార్పును కొనసాగిస్తూ 70 సంవత్సరముల చెరనివాసమునకు తరువాత దేవుడు తన ప్రజలను వాగ్దాన దేశమునకు తిరిగి తీసుకొని వచ్చుటను గురించి చెప్పు పుస్తకము. ఇది బబులోను నుండి బయలుదేరి వచ్చు ఈ సంఘటనను రెండవ నిర్గమము అనవచ్చు. అయినప్పటికి ఈ రెండవ నిర్గమము మొదటి నిర్గమము వలె శ్రేష్ఠముగా ఉండలేదు. ఎందుకనగా బబులోనులో జీవించిన యూదులలో కొంత భాగము అంటే కొద్ది మంది మాత్రమే ఆ స్థలము వదలి తిరిగి వచ్చుటకు ముందుకు వచ్చిరి.
బబులోనును వదలి బయలుదేరి వచ్చిన రెండు గుంపులను గూర్చి ఎజ్రా వివరించుచున్నాడు మొదటి గుంపు జెరుబ్బాబేలు నాయకత్వములో దేవాలయమును కట్టుటకు, రెండవ గుంపు ఎజ్రా నాయకత్వములో ప్రజల భక్తి సంబంధమైన కార్యములలో తట్టిలేపుటకు స్వదేశమునకు తిరిగి వచ్చిరి. ఈ రెండు సంఘటనలకు మద్య సుమారు 60 సంవత్సరములు కాలవ్యవధియుండెను. ఈ మధ్య కాలంలో ఎస్తేరు పారసీక దేశ రాణిగా
యుండెను. మూల భాషయమైన హెబ్రీ భాష పరిశుద్ధ గ్రంథములో ఎజ్రా, నెహెమ్యా ఒకే పుస్తకముగా ఉండినవి. ఎందుకనగా ఈ రెండు పుస్తకములలో వరుసగా ఒకే చరిత్ర వ్రాయబడియున్నది. లాటిన్ పరిశుద్ధ గ్రంథములో ఎజ్రా పుస్తకమునకు మొదటి ఎజ్రా అని, నెహెమ్యా పుస్తకమునకు రెండవ ఎజ్రా అని పేరు ఇవ్వబడినది.
ఉద్దేశము : తన ప్రజలను తిరిగి వారి దేశమునకు రప్పింపజేసెదను అనువాగ్దానమును నెరవేర్చుటలో దేవుడు ఎంత యదార్ధవంతుడుగా ఉండెనో చూపించుట.
గ్రంథకర్త : ఎజ్రా
కాలము : సుమారు క్రీ.పూ. 538 - 457. పారసీక రాజైన కోరెషు (సైరస్) క్రీపూ 539లో బబులోనును జయించెను. ప్రతి దేశస్తులకు వారి వారి మతాచారపు అలవాట్లకు అరాధన జరిగించుటకు స్వేచ్చ యివ్వబడవలెననునదే పారశీకుల పద్ధతి. ఇందువలననే క్రీ. పూ. 538లో కోరెషు
యెరూషలేము దేవాలయమును కట్టుటకు అజ్ఞయిచ్చెను. దైవభక్తి, త్యాగము గల యూదులు జెరుబ్బాబేలు నాయకత్వంలో యెరూషలేము దేవాలయము కట్టుటకు బయలుదేరిరి. క్రీ.పూ. 536లో వారు దేవాలయమునకు పునాదులు వేసి పని ప్రారంభించిరి. క్రీపూ 586లో యెరూషలేము నాశనము చేయబడిన తరువాత కేవలం 50 సంవత్సరములు మాత్రమే చెరకొనసాగినది. కాని చెర నివాస కాలము 70 సంవత్సరములుగా లెక్కింపబడుచున్నది. ఎలాగనగా ఈ ప్రజలు బబులోనుకు మొట్టమొదట చెరపట్టబడిన క్రీ.పూ. 605 నుండి లెక్కింపబడినది. దేవాలయపుపని క్రీ.పూ. 534లో ఆటంకపర్చబడిన తరువాత క్రీ. పూ. 520లో పునఃప్రారంభమైనది. క్రీ.పూ. 516లో పని ముగించబడినది. యూదా నుండి ప్రజలను చెరపట్టుకొని పోయినది మొదటిగా క్రీ. పూ. 605 లోను, 2వ సారి క్రీ. పూ. 597 లోను, 3వ సారి క్రీపూ 586లో జరిగినది.
నేపథ్యము: దినవృత్తాంత పుస్తకములవలె ఎజ్రా పుస్తకము కూడా యూదా ప్రజల చరిత్రను చెప్పుచున్నది. చెరనివాసం వచ్చిన తరువాత యూదులు స్వదేశనమునకు తిరిగి వచ్చుట ఈ పుస్తకము యొక్క సారాంశం.
ముఖ్యమైన వ్యక్తులు : కోరెషు, జెరుబ్బాబేలు, హగ్గయి, జెకర్యా, దర్యావేషు, మొదటి అర్తహషస్త, ఎజ్రా.
ముఖ్య స్థలములు : బబులోను, యెరూషలేము.
గ్రంథ విశిష్టత : ఎజ్రా, నెహెమ్యా, హెబ్రీ పరిశుద్ధ గ్రంథములో ఒకే పుస్తకముగా ఉండినవి. ఈ రెండు పుస్తకములలో, ఎస్తేరు పుస్తకమును చేర్చినట్లైతే చెర నివాసము తరువాత కాలపు చరిత్ర పుస్తకములగును.
పుస్తకపు ముఖ్య భాగములు : ముఖ్యమైన వాక్యము, దేవాలయము సారాంశము: - దేవాలయమును తిరిగి కట్టుట, దైవ ప్రజల ఆత్మీయ, సమాజిక క్రమశిక్షణను సంస్కరించుట.
ముఖ్య వచనములు : ఎజ్రా 1:3; ఎజ్రా 7:10
ముఖ్యమైన అధ్యాయము : ఎజ్రా 6 దేవాలయము కట్టి ముగించిన తరువాత దాని ప్రతిష్ఠితను గూర్చి చెప్పు అధ్యాయము. ఇది పస్కా ఆచరించుటకు, అన్యజనుల అపవిత్రతను వదలి దేవునికి లోబడుటకు, లోబడి ఒక పరిశుద్ధ జీవితము జీవించుటకు ప్రజలు ప్రోత్సహింపబడిరి.
గ్రంథ విభజన : ఎజ్రా పుస్తకమును 2 పెద్ద భాగములుగా విభజించవచ్చును. 1 - 6 అధ్యాయముల వరకు ఉన్న మొదటి భాగము దేవాలయమును తిరిగి కట్టబడుటను గురించి, 7 - 10 అధ్యాయములలో ఉన్న రెండవ భాగం ప్రజల ఆత్మీయ సంస్కరణలను గురించి చెప్పుచున్నది.
కొన్ని క్లుప్త వివరణలు : పరిశుద్ధ గ్రంథములోని 15 వ పుస్తకము ; అధ్యాయములు 10; వచనములు 280; ప్రవచనములు లేవు; దేవుని నుండి ప్రత్యేక సందేశములు లేవు; వాగ్దానములు లేవు; ప్రశ్నలు 9; ఆజ్ఞలు 43.
Nehemiah - నెహెమ్యా
బబులోను చెర నివాసమునకు తరువాత యెరూషలేమునకు మూడవ సారిగా అనగా చివరి సారిగా తిరిగి వచ్చిన వారికి నాయకుడు నెహెమ్యా. నెహెమ్యా పారసీకదేశపు రాజైన అర్తహషస్తకు పానదాయకునిగా ఉండిన ఈయనకు యెరూషలేమును గురించి, అక్కడ కష్టపరిస్థితులలో జీవించిన ప్రజల గురించి కలిగిన భారము పరిశుద్ద సాహసాలు చేయునట్లుగా ప్రోత్సాహం ఇచ్చినది. అర్తహషస్త రాజు యొక్క అనుమతి పొంది తనతో బయలుదేరిన కొంత మందితో సైనిక నాయకులతో, గుఱ్ఱపు పరిచారకులతో కలిసి తన్ను వెంబడించువారితో యెరూషలేమునకు వచ్చెను. యెరూషలేము ప్రాకారమును కట్టునట్లుగా స్వజనులకు పిలుపునిచ్చెను.
ఆ కాలములో కోట ప్రాకారములేని పట్టణం ఏదైన దోపిడిదారుల ఆక్రమనమునకు “ఎర" గా మారు పరిస్థితియుండెను. అందువలన కాపుదల అవసరమని యూదులు యెరూషలేములో ఉండకండా చుట్టూ ఉన్న గ్రామములలో జీవించినారు. ఇందువలన అన్యజనులతో కలిసిపోవుటవలన భాషా, ఆచారపు అలవాట్లు, పరిశుద్ధ విశ్వాసము కూడా పోగొట్టుకునే పరిస్థితి వచ్చినది. ప్రాకారము మరమత్తు చేయబడి కట్టబడితే ఒక నిజమైన యూదా నగరమును కట్టినట్లైతే లోపలకి వచ్చువారిని, బయటకు వెళ్ళువారిని అదుపు చేయవచ్చును.
ఆ దేశ ప్రజల భయంకరమైన వ్యతిరేకతను ఎదుర్కొని 52 దినములలో ప్రాకారపు పని ముగించినప్పుడు ఈ అసాధ్యమైన కార్యమును చేయుటకు యెహోవాయే సహాయము చేసినాడని యూదుల యొక్క విరోధులు కూడా ఒప్పుకొనవలసి వచ్చినది. నెహెమ్యా యొక్క గొప్ప దైవ నమ్మిక, సంఘటిత సామర్థ్యం, శ్రేష్ఠమైన నాయకత్వ తలాంతు మరమత్తు చేయబడిన ప్రాకారముతో, అస్తవ్యస్తమైన యూదా ప్రజల జీవితమును సరిచేసి నూతన జీవమునిచ్చు అవకాశము ఏర్పడుటయే ఈ పుస్తకము యొక్క విషయ సూచికగా ఉన్నది.
ఉద్దేశము: పాతనిబంధన చరిత్ర పుస్తకములలో నెహెమ్యా చివరిది. చెరనుండి యెరూషలేముకు 3వ సారి వచ్చిన చరిత్రను చెప్పుచున్నది. దానితో బాటుగా యెరూషలేము యొక్క ప్రాకారము ఏలాగు మరలా కట్టిముగించారు అనేది, విశ్వాస సంస్కరణ ఎలాగు జరిగినది అనేది. ఈ పుస్తకము చెప్పుచున్నది.
గ్రంథకర్త : నెహెమ్యా. (పరిశోదకుడు అన్న స్థితిలో నెహెమ్యాతో పాటు ఎజ్రా కూడా ఈ రచనలో సహాయం చేసి ఉండవచ్చను.)
కాలం : క్రీపూ 445 - 432.
నేపథ్యము : క్రీ.పూ. 537లో జెరుబ్బాబేలు నాయకత్వములో యెరూషలేమునకు మొదటి సారి తిరిగి వచ్చుట జరిగినది. 458లో రెండవ సారి తిరిగి వచ్చుటకు ఎజ్రా నాయకత్వము వహించెను. 445 లో చివరిగా యెరూషలేములో ప్రాకారములను మరమ్మత్తు చేయుటకు చెర నుండి 3వ సారి వచ్చిన వారిలో నెహెమ్యా కూడా చేరినాడు.
ముఖ్యమైన వ్యక్తులు : నెహెమ్యా, ఎజ్రా, సన్బ్ల్లట్టు, టోబియా.
ముఖ్యమైన స్థలము : యెరూషలేము
గ్రంథ విశిష్టత : యెరూషలేము యొక్క ప్రాకారము తిరిగి కట్టబడును. అని జెకర్యా, మరియు దానియేలు యొక్క ప్రవచనములు నెరవేర్పులు ఈ పుస్తకము చూపించుచున్నది.
ముఖ్యమైన మాట : యెరూషలేము యొక్క ప్రాకారపు గోడలు
ముఖ్యవచనములు : నెహెమ్యా 6:15-16; నెహెమ్యా 8:8
ముఖ్య అధ్యాయములు : నెహెమ్యా 9.
పాత నిబంధన బావము. దేవునితో ఉన్న నిబంధన యెరూషలేము ప్రాకారము కట్టబడిన తరువాత ప్రజలు పశ్చాత్తాపపడి పాపములను ఒప్పుకొని దేవునితో నిబంధనచేసిన దానిని వ్రాసి ముద్రించినట్లుగా ఈ అధ్యాయములో వ్రాయబడినది.
పుస్తకము యొక్క వివరణ : నెహెమ్యా మరియు ఆయన సమకాలికుడైన ఎజ్రా సేవలు ఇంచుమించుగా ఒకే కాలములో నిర్వహించబడెను. ఒక యాజకుడుగా ఎజ్రా ఒక ఆత్మీయ ఉజ్జీవమునకు నాయకత్వము వహించుచున్నాడు. నెహెమ్యా ఒక అధికారిగా లోకసంబంధమైన రాజకీయ సంబంధమైన సంస్కరణలను చేయుచున్నాడు. చెరనివాసమునకు తరువాత తిరిగి వచ్చిన దైవ ప్రజలలో మిగిలిన వారిని దైవ దర్శనములో స్థిరపరచి ఇద్దరూ ఏకీభవించి ఒక సంస్కరణలను చేసినారు. పాత నిబంధన ప్రవక్తలలో చివరివాడైన మలాకీ కూడా అదే కాలములో ప్రజలకు క్రమశిక్షణలో ఆత్మీయతతో మార్గమును చూపించెను.
నెహెమ్యా పుస్తకము పాత నిబంధన చరిత్ర చివరి కాలము అనగా క్రీ.పూ. 400 సంవత్సరముల ముందు కాలమునకు మనలను తీసుకొని వెళ్ళుచున్నది. పుస్తకము యొక్క రెండు పెద్ద భాగములు క్రింద ఇవ్వబడెను. (1). ప్రాకారపు మరమ్మత్తు1 - 7 అధ్యాయములు. (2). ప్రజలను సంస్కరించుట 8 - 13 అద్యాయములు.
కోట ప్రాకారపు పనితో యెరూషలేముకు సురక్షిత స్థితి ఏర్పడెను.
దాని తరువాత ప్రజల పునరుద్దారణ కోసం ఎజ్రా, నెహెమ్యా ఏకీభవించి చేసిన భాగమే పుస్తకము యొక్క శ్రేష్ఠమైన భాగమనవచ్చు.
క్రీ.పూ. 433లో పారసీకదేశమునకు తిరిగి వెళ్ళిన నెహెమ్యా క్రీ. పూ. 432 ప్రజలను తట్టి లేపి దేవుని దగ్గరకు వచ్చునట్లుగా మరియొక ప్రమాణమును చేసినాడు ఆయన దేవాలయమును పరిశుద్ధ పరచి విశ్రాంతి దినమును ఆచరించుటను స్థిరపరచి అన్య స్త్రీలైన భార్యలను పరిత్యాగ పత్రిక ఇచ్చి పంపివేయుమని ప్రజలకు ఖచ్చితముగా చెప్పెను.
కొన్నిక్లుప్త వివరణలు : పరిశుద్ధ గ్రంథములోని 16వ పుస్తకము ; అధ్యాయములు 13; వచనములు 406; నెరవేరిన ప్రవచనములు 3; హెచ్చరికలు 3; ఆజ్ఞలు 14; వాగ్దానములు లేవు; దేవుని దగ్గర నుండి ప్రత్యేక సందేశములేవు; ప్రశ్నలు 24.
Esther - ఎస్తేరు
ఎస్తేరు యొక్క హెబ్రీ పేరు హదస్సా అనబడును (ఎస్తేరు 2:7) పారసీక మాటయైన ఎస్తేరు అనగా నక్షత్రము అని అర్థమునిచ్చును స్టారా అను పారసీక మాటలో నుండి ఉద్భవించినది. గ్రీకు భాషలో గ్రంథము యొక్క పేరు ఎస్తేరు అని యుండగా లాటిన్ భాషలో హెష్టర్ అనియున్నది.
ఉద్దేశము : తన ప్రజలను గూర్చిన దేవుని అధికారము, ప్రేమ, బాధ్యత అనునవి బయలుపరచుట.
గ్రంథకర్త : మొర్దెకై గా (ఎస్తేరు 9:29) (రచనా శైలిని తీసికొని యీ పుస్తకమును ఎజ్రాయో, నెహెమ్యానో వ్రాసియుండవచ్చు అని అభిప్రాయపడువారున్నారు.)
కాలము : అహష్వేరోషు యొక్క పరిపాలనా కాలము క్రీపూ 486 నుండి క్రీపూ 464 వరకు. రాజు ఏర్పాటు చేసిన విందు ఆయన పాలన యొక్క మూడవ సంవత్సరము (ఎస్తేరు 1:3) గ్రంథము యొక్క 3 నుండి 10 వరకు గల అధ్యాయములలో వివరించు కార్యక్రమములు జరిగినవి క్రీపూ 483 నుండి 473 వరకు గల 10 సంవత్సరముల కాలపరిమితిలో జరిగినవి. (ఎస్తేరు 3:7-12) అహష్వరోషు చనిపోయిన సంవత్సరమైన క్రీ.పూ. 464 తరువాత దానికి సమీప కాలములో ఎస్తేరు గ్రంథము మొర్దకై ద్వారా వ్రాయబడియుండవచ్చును. తమ స్వదేశమునకు తిరగి వెళ్లక, పారసీక దేశములో జీవించుచున్న యూదుల ఉపయోగము కొరకై వ్రాయబడిన గ్రంథము ఇది. దైవభక్తులైన యూదులందరు పాలస్తీనమునకు తిరిగి వెళ్లలేదు. ఈ రీతిగా చెరనివాసము కొనసాగించ తీర్మానించి జీవించిన వారికొరకు దేవుడు వారియందు దృష్టించియున్నాడు. వారిని కూడా పరామర్శించువానిగా యున్నాడనునది. ఈ గ్రంథము తెలుపుచున్నది.
పూర్వ చరిత్ర : పరిశుద్ధ గ్రంథములో నెహెమ్యా తర్వాత ఎస్తేరు గ్రంధము వచ్చినప్పటికిని నెహెమ్యా కార్య క్రమములకు 30 సంవత్సరములకు ముందే ఎస్తేరు కార్య క్రమములు జరిగినవి. ఈ కార్యములు జరిగిన స్థలము పారసీక సామ్రాజ్యము యొక్క రాజధానియైన షూషనులోను, చక్రవర్తి అంతఃపురములోను జరిగినవి.
ముఖ్య మనుష్యులు : ఎస్తేరు, మొర్దకై, అహష్వరోషురాజు, హామాను.
ముఖ్య స్థలము : పారసీక షూషను అంతఃపురము
విశేషము: స్త్రీల పేర్లలో కనబడు రెండు గ్రంథములలో ఇది యొక్కటి. (రూతు మరియొక గ్రంథము) ఈ గ్రంథములో దేవుడు అనుమాట ఏమాత్రము ఉపయోగించబడలేదు. అయినను వీటి చర్యలన్నిటిలో దేవుని సన్నిధి ఎంతో తేటగా కనబడుచున్నది.
ముఖ్య మాటలు : దేవుని దృష్టి
ముఖ్యవచనములు : ఎస్తేరు 4:14; ఎస్తేరు 8:17
గ్రంథ విభజన : గ్రంథమును రెండు భాగములుగా విభజింపవచ్చును.
అధ్యాయము 1 నుండి 4 వరకు యూదులను భయపెట్టుట.
అధ్యాయము 5 నుండి 10 వరకు యూదులు పొందిన ఆశ్చర్యమైన విజయము.
మొర్దెకై దేశములో రెండవ మానవుడుగా హెచ్చింపబడుటను, ఆయన యూదులు యొక్క సంరక్షకునిగా మార్చబడుట చెప్పుచూనే ఈ గ్రంథము ముగియుచున్నది. తెలియని రీతిగా జరిగినవని భావించు అనేక సంఘటనలు ఒక దండవలె ఐక్యపరచబడిన రీతిగా ఇచ్చుటయే ఈ గ్రంథము యొక్క విశేషిత వష్తి రాణి యొక్క మొండితనము ద్వారా ఆమె పదవి తొలగించబడినది. రాజు యొద్దకు తీసుకొని రాబడిన అనేక కన్యకలలో ఎస్తేరు రాణిగా ఎన్నుకొనబడుట, ఒక రాత్రి రాజు నిద్రలేక బాధపడుట ఆ రాత్రి రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని ఆజ్ఞాపించుట, మొర్దెకై రాజును కాపాడిన సంఘటన చదువుట తటస్థించుట, అదే సమయములో హామాను అచ్చటికి రావడము జరుగుట అను కార్యములన్నియు మానవదృష్టిలో తెలియని రీతిగా జరిగిన సంఘటనలు. దేవుని ప్రజల యొక్క జీవమంతయు దేవుని ఆధీనములోనున్నది. వారి జీవితములో ఏదియు తెలియని రీతిగా జరిగినవి కావు. హామాను నుండి హిట్లర్ వరకు పగ తీర్చుకొను మనస్సు కలిగిన నాయకుల యొక్క ద్వేషమునకు గురియైన యూదుల వలె మరియొక ప్రజలు లోకములో వేరేలేరు. వేరే ఏ జనసమూహము ఆపధలను అతిజీవించుటకు ఇంత గొప్ప శక్తిని పొందలేదు.
కొన్ని ముఖ్య వివరములు : పరిశుద్ధ గ్రంథము యొక్క 17వ గ్రంథము; అధ్యాయములు 10; వచనములు 167; ఆజ్ఞలు 11; ప్రశ్నలు 21; ప్రవచనములు లేవు; వాగ్దానములు లేవు, దేవుని యొద్ద నుండి విశేషమైన వర్తమానము లేదు.
Job - యోబు
ఎస్తేరు గ్రంథముతో పాతనిబంధన గ్రంథము యొక్క చారిత్రిక గ్రంథములు ముగియుచున్నవి. దీనికి ప్రక్కనున్న పద్య భాగములో మనము చూచుచున్న అయిదు కావ్య గ్రంథములలో మొట్టమొదటిది యోబు గ్రంథము. కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు మొదలైనవి ఇతర నాలుగు పద్య గ్రంథములు. అతి ప్రాచీనమో, ఆధునీకమైన సాహిత్య కృతుల సమూహములో అతి శ్రేష్టమైన కావ్య గ్రంథము యోబు గ్రంథమేనని టెన్నిసన్ అనునతడు చెప్పెను. పరిశుద్ధ గ్రంథములోనే ఎంతో పాత గ్రంథము యోబు గ్రంథమే.
ఉద్దేశము : నిజమైన విశ్వాసము యొక్క కర్తవ్యమును దేవుని ఉన్నతమైన అధికారమును ప్రత్యక్ష పరచుట.
గ్రంథకర్త : యోబు
కాలము : 2000 - 1880 క్రీ.పూ
పూర్వ చరిత్ర : ఊజు దేశము (పాలస్తీనాలోని ఉత్తర సరిహద్దులో దమస్కునకు యూప్రటీసు నదికిని మధ్య భాగములో నున్న అరణ్యములోనున్న స్థల మైయుండవచ్చును.)
ముఖ్య మనుష్యులు : యోబు, తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడగు బిల్టదు, నయమాతీయుడైన జోఫరు, రాము వంశస్థుడైన బూజీయుడుగు ఎలీహు.
విశేష కార్యములు : హెబ్రీ పరిశుద్ధ గ్రంథములో పద్య భాగములో మొట్టమొదటిగా యోబు గ్రంథము మొదటిస్థానము వహించినది. పరిశుద్ధ గ్రంథములో అతి ప్రాచీనమైనదిగా ఈ గ్రంథము పరిగణింపబడుచున్నది. సాతాను యొక్క క్రియలను గూర్చి లోతైన దృష్టి ఈ గ్రంథములో మనికివ్వబడుచున్నది. Eze 14:14-20 యాకోబు 5:11 మొదలైన వచనములు యోబు ఒక చారిత్రక మానవునిగా చిత్రించుచున్నవి.
ముఖ్యమైన మాట : దేవుని యొక్క పరిపూర్ణమైన అధికారము: శ్రమలలో కూడా యోబు నేర్చుకొను పాఠము దేవుని పూర్ణమైన అధికారమును గూర్చినదైయున్నది. విశ్వాసుల యొక్క విషయములో అది అలాగే యున్నది.
ముఖ్యమైన వచనములు : యోబు 13:15; యోబు 37:23-24
ముఖ్యమైన అధ్యాయము : యోబు 42. గ్రంథము యొక్క ఈ చివరి అధ్యాయము యోబుకు తనతోను, భార్యతోను, స్నేహితులతోను, దేవునితోను జరిగిన పోరాటము యొక్క ఉన్నత స్థితిని చూపించుచున్నది. దేవుని పరిపూర్ణ మహాత్యమును సర్వ ఆధిపత్యమును అంగీకరించుటతో యోబుకు మానసిక పరివర్తనం సంభవించుచుండెను. ఆయనను కలత జెందించుచుండిన ఎందుకు అను ప్రశ్న తరువాత ఆయనకు సమస్యగా కనిపించలేదు.
విభాగము : గ్రంథమును మూడు భాగములుగా విభజింపవచ్చును. యోబు యొక్క దుఃఖములు, యోబుకు స్నేహితులకు జరిగిన వివాదము. ఆయనకు దొరికిన విడుదల మొదలైనవి ఈ మూడు భాగములు. ఒక్కొక్క దాని అంతర్భావములు ఈ క్రింద ఇవ్వబడియున్నవి.
(1): యోబు దుఃఖములు : Job,1,1-2,13. 1). యోబు యొక్క కుటుంబ చరిత్ర యోబు 1:1-5. 2). సాతాను మొదటి ముట్టడి యోబు 1:6-22. 3). సాతాను రెండవ ముట్టడి యోబు 2:1-10. 4). యోబు స్నేహితుల రాక యోబు 2:11-13
(2). యోబుకును స్నేహితులకు జరిగిన వాదోపవాద క్రమము : Job,3,1-37,24. 1). యోబు యొక్క మొదటి పలుకు Job,3,1-26. 2), ఎలీఫజు యొక్క పలుకులు, యోబు జవాబు Job,4,1-5,27. 3). బిల్దదు పలుకులు, యోబు జవాబును Job,8,1-10,22 4). జోఫరు పలుకులు, యోబు జవాబు Job,11,1-14,32. 5). ఎలీఫజు యొక్క రెండవ పలుకలుక జవాబును Job,15,1-16,17. 6). బిల్టదు పలుకులు యోబు జవాబును Job,18,1-19,29. 7). జోఫరు రెండవ పలుకులు యోబు జవాబు Job,20,1-21,34. 8). ఎలీఫజు మూడవ పలుకులు యోబు జవాబు Job,22,1-24,25. 9). బిల్దదు పలుకులును, జవాబులును Job,25,1-26,14. 10). యోబు చివరి వాదము Job,27,1-31,40. 11). ఎలీహు జవాబు {Job,32,1-37,24.
(3). యోబుకు దొరుకు విడుదల : Job,38,1-42,17 1). యోబుకు దేవుడిచ్చే జవాబు Job,38,1-41,34 2). యోబు తన అమాయత్వమును సమ్మతించుట - స్వనీతి కొరకు పశ్చాత్తాపపడు యోబు యోబు 42:1-6. 3). యోబుకు దొరికిన విడుదల యోబు 42:7-17.
a). తన స్నేహితుల కొరకు యోబు విజ్ఞాపన చేయుచున్నాడు యోబు 42:7-10.
b). యోబు తాను పోగొట్టుకొన్న వాటికన్నిటికి రెండింతలు తిరిగి పొందుచున్నాడు యోబు 42:11-17.
యోబును కలత జెందించిన సమస్యలకు జవాబు యోబు 42:5-6 వచనములలోనున్నది. ప్రతి దుఃఖమునకు ఉద్దేశము అదే. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్తనేను వింటిని అయితే యిప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను, బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను.
కొన్ని ముఖ్య వివరములు : పరిశుద్ధ గ్రంథము యొక్క 18వ గ్రంథము; అధ్యాయములు 42; వచనములు 1070; చరిత్రాత్మిక వచనములు 1066; నెరవేరిన ప్రవచనములు 1; నెరవేరని ప్రవచనములు 3; ప్రశ్నలు 329; ఆజ్ఞలు 13; వాగ్దానములు లేవు; హెచ్చరికలు 4; దేవుని యెద్ద నుండి ప్రత్యేకమైన వర్తమానములు 10.
Psalms - కీర్తనల గ్రంథము
పరిశుద్ధ గ్రంథము యొక్క హృదయాంతరంగములో నుండి లేచు సంగీతమువలె కీర్తనల గ్రంథము దాని మధ్య అమర్చబడియున్నది. పరిశుద్ధ గ్రంథములోనే ఎంతో పెద్దదిగాను, ఎక్కువగా ఉపయోగించబడేదిగాను - ఈ గ్రంథమున్నది. మానవ అనుభవముల యొక్క ప్రత్యేకమైనదియు, అనుదిన జీవితముతో సంబంధము గలిగినదియునైన ప్రతి భాగములను ఇవిముట్టుచున్నవి. వీటిలో ఇమిడియున్న 150 పాటల యొక్క ముఖ్యాంశములో సృష్టి ఆరంభము నుండి ఇశ్రాయేలు చెరకొనిపోబడిన కాలమువరకు విస్తరించబడియున్నది. గోత్ర కర్తల కాలము న్యాయాధిపతులు రాజ్యమేలినకాలము, రాజపరిపాలన కాలము, చెరపట్టబడిన కాలము అను పలు రకములైన కాలములతో నిండియున్న కీర్తనలు ఈ గ్రంథములో నున్నవి. వీటిలో ఇమిడియున్న కర్తవ్యము ఆశ్చర్యము కలిగించేవిగానున్నవి. వాటిలో దైవీక ఆనందము, యుద్ధము, సమాధానము, ఆరాధన, న్యాయ తీర్పు, ప్రవచనము, స్తుతి, విలాపము అను పలు విధములైనవియున్నవి. సంగీత వాయిద్యముల సహాయముతో దేవాలయ ఆరాధనలో ఆలపింపబడేవిగా ఈ గానములు వ్రాయించబడినవి. యూదా ప్రజల పాటల వరుసగాను భక్తి మార్గదర్శిగాను పరిగణించబడుచూయున్నది.
ఉద్దేశము : కవిత్వముతో కూడిన స్తుతిని, ఆరాధనను, ఒప్పుదలను ప్రత్యక్షపరచుట.
ముఖ్యమైన మనుష్యులు : దావీదు
ముఖ్యమైన స్థలము : దేవాలయము
ముఖ్యమైన మాట : ఆరాధన
ముఖ్యమైన వచనములు : Psa 19:14; Psa 145:21
ముఖ్యమైన అధ్యాయము : కీర్తన 100
కొన్ని కీర్తనలలో పరిశుద్ధ గ్రంథము యొక్క చాలచక్కటి సారాంశములు పాడబడినవి కనుక ఏదైన ఒక కీర్తనను ఇది ముఖ్యమైనది అనుచెప్పుట చాలా కఠినము. 1, 22, 23, 24, 27, 72, 100, 101, 119, 121, 150 కీర్తనలు ముఖ్య మైనవే. 100వ కీర్తనలో స్తుతి, ఆరాధన అను రెండు భాగములు సమతల స్థితిలో ఏకమైయున్నవి. కనుక ఈ కీర్తనను ప్రాముఖ్యమైన అధ్యాయము అను స్థలములో ఉంచవచ్చును.
గ్రంథ విభజన : కీర్తనలను 5 స్కంధములుగా విభజించబడియున్నవి. ఒక్కొక్క స్కంధము ఒక స్తుతితో ముగించబడుచున్నది. 150వ కీర్తన 5వ పుస్తకమునకు పూర్తి పుస్తకమునకు ముగింపు స్తుతి. 5 స్కంధములకు వరుసగా క్రింద ఇవ్వబడియున్నవి.
ప్రథమ స్కంధము : 1వ కీర్తన నుండి 41 వరకు వీటి సాధారణ విషయసూచిక మానవుడు అని చెప్పవచ్చును. మానవుని నిజమైన స్థితి ఆశీర్వాదకరమైన స్థితి. పతనము, విమోచన అనునవి ఈ పాటలు చిత్రించుచున్నవి.
ద్వితీయ స్కంధము : 42వ కీర్తన నుండి 72వ కీర్తన వరకు ఇశ్రాయేలీయులు ముఖ్య పాత్రగా యున్నారు. 42 నుండి 49 వరకు గల పాటలు వారి పతనమును 50 నుండి 60 వరకు గల పాటలు వారి విమోచనకుడను, 61 నుండి 72 వరకు వారికి లభించు విమోచనమును గూర్చి చెప్పబడియున్నది.
తృతీయ స్కంధము : కీర్తన 73 నుండి 89 వరకు దేవాలయము అనగా పరిశుద్ధ ఆలయము దీని ముఖ్యాంశము సైన్యముల కధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు అను ప్రారంభించు 84వ కీర్తన చూడండి.
చతుర్ధ స్కంధము : కీర్తన 90 నుండి 108 వరకు. ఇది భూమిని గూర్చియు దానికి దొరకనైయున్న,
దొరకుచున్న దీవెనలను గూర్చియు పాడుచున్న సొగసైన పాటలు.
పంచమ స్కంధము : కీర్తన 107 నుండి 150 వరకు. దేవుని వాక్యమే ఈ పాటల యొక్క ముఖ్యమైన సారాంశమ. దేవుడుreference తన వాక్కును పంపి స్వస్థపరచుటను గూర్చి 107వ కీర్తనలో చెప్పబడియున్నది. 176 వచనములు కలిగిన 119వ కీర్తన యొక్క ప్రతి వచనము కూడ భక్తి గల మానవులకు దేవుని వాక్యము అనుగ్రహించు దీవెనలను పాడి ప్రస్తావించుచున్నది.
ఇక ఒక పాటను పరిశీలించినట్లయితే మొదట దేవునితో మాట్లాడునట్లుగాను, తరువాత తన స్థితి వివరముగాను దానికి తరువాత మరల దేవుని గూర్చి మాట్లాడునట్లు గాను, అమర్చబడియుండుట చూడగలము హెబ్రీ కవిత్వములతో ఈ లాంటివి సాధారణమైనవే.
కొన్ని ముఖ్యమైన వివరములు : పరిశుద్ధ గ్రంథము యొక్క 19వ పుస్తకము ; అధ్యాయములు 150; వచనములు 2,461; చారిత్రాత్మిక వచనములు 2027; నెరవేరిన ప్రవచనములు 160; నెరవేరని ప్రవచనములు 274; ప్రశ్నలు 164; ఆజ్ఞలు 413; దేవుని క్రియలు 338; తీర్మానములు 124; దేవస్తుతులు 174; నిందలు చూపుట (విజ్ఞాపనలు) 118; యూదాను గూర్చినవి 72; దేవుని సత్యములు 865; దేవుని వచనములను గూర్చినవి 235; సాక్ష్యములు ప్రకటనలు 182; వాగ్దానములు 97; మెస్సీయాను గూర్చినవి 128; ఆశీర్వాదములు 281; పాటల గ్రంథకర్తలను గూర్చినవి 190; న్యాయక్రియలు 78; దుష్ట క్రియలు 101; పాపములు 233; విజ్ఞాపనలు 582; విజ్ఞాపనకు కారణములు 187.
Proverbs - సామెతలు
జ్ఞానము అనునదే సామెతల యొక్క ముఖ్య భావార్థము. జీవితము చక్కగాను, చమత్కారముగాను జీవించుటకు సామర్థ్యమునిచ్చునది జ్ఞానమే. అనుదిన జీవితము యొక్క క్రియారూపకమైన సమస్యలను జయకరముగా ఎదుర్కొనుటకు విశాలమైన కర్తవ్యములు ఈ గ్రంథములో ఇమిడియున్నవి. దేవుడు తల్లిదండ్రులు, పిల్లలు, స్నేహితులు, పొరుగువారు, అధికారులు మొదలైన వారితో ఏలాగు మెలగవలయును అని ఇది నేర్పించుచున్నది. జీవిత సమస్యలను ఎదుర్కొనుటకు అవసరమైన ఒక ఆత్మీయ దృష్టిని పాఠకులకు బహుకరించుటకు, కవిత్వము, విప్పుడు కథ, సామెతలు, ఉపమానములు, పొడుపు కథలు మొదలైవాటితో నిండిన ఒక అక్షరానుసారశైలిని దీని గ్రంథకర్తయైన సొలొమోను ఉపయోగించియున్నాడు.
ఉద్దేశము : సకల క్రియలలో, వివేకముగలవారుగాను, నిష్కలంకులుగా నుండుటకుగాను, జనులకు నేర్పించుటకుగాను, యువలకులకు వచ్చు సమస్యలు ఎలాగు అతిజీవించాలి అనుదానిని గూర్చిన నిర్దేశములు. జ్ఞానులకు యోగ్యమైన నాయకత్వ లక్షణములు నిచ్చుటకు సహాయపడుచుండెను. సంక్షిప్తముగా చెప్పినట్లైతే దైవ జ్ఞానం దయనందిన జీవితములోను ఉపయోగపరచుకొనుటకు సత్ మార్గ నిర్దేశములనిచ్చుటకుగాను యీ పుస్తకం రచించబడినది.
ముఖ్య గ్రంథకర్త ఇశ్రాయేలీయుల జ్ఞానులకు జ్ఞానియైన సొలొమోను కాబట్టి సొలొమోను సామెతలు అను నామము హెబ్రీ, గ్రీకు పరిశుద్ధ గ్రంథములు పెట్టుకొన్నవి. తరువాత లాటిన్ భాషలోను, ఇంగ్లీషులోను ఇతర భాషలలోను సామెతలు అని తగ్గించబడినది.
గ్రంథకర్త : సొలొమోను
కాలము : సొలొమోను పరిపాలన ప్రారంభములో వ్రాయబడింది. దాదాపుగా క్రీ.పూ 931 అని ఎంచబడుచున్నది. 25 - 29 అధ్యాయములు క్రీ.పూ 700 హిజ్కియా చేత సేకరించబడి చేర్చబడినవి.
ముఖ్యాంశము : పరిపూర్ణ జ్ఞానము గల ఆలోచనలతో దేవుని యందు భయభక్తులు గలిగి ఏలాగు జీవించాలి అని ప్రజలకు నేర్పించే చక్కటి వచనములతో నిండిన గ్రంథమిది.
గ్రంథ ప్రాముఖ్యత : కవిత్వము, చిన్న ఉపమానములు, ఉద్దేశముతో కూడిన ప్రశ్నలు.
ముఖ్య మాట : జ్ఞానము
ముఖ్య వచనములు : సామెతలు 1:5-7; సామెతలు 35:6.
ముఖ్య అధ్యాయము : సామెతలు 31
ఈ అధ్యాయము పాత రచనలలో ప్రత్యేకమైన ఒక భాగము. దీనిలో స్త్రీలను గూర్చి ఉన్నతమైన, శ్రేష్టమైన ఒక దృష్టిని చూడవచ్చును. సామర్ధ్యము గల స్త్రీ, మాదిరికరమైన భార్య, శ్రేష్టమైన తల్లి, మంచి పొరుగు స్త్రీ అయిన స్థితులలో ఇక్కడ చిత్రించబడియున్న స్త్రీ 7వ అధ్యాయములోని జారస్త్రీ నుండి ఎంతగా ప్రత్యేకించబడుచున్నది.
గ్రంథ విభజన : క్రింది ఇవ్వబడియున్న రీతిగా ఆరు భాగములుగా ఈ గ్రంథమును విభజింపవచ్చు.
గ్రంథము యొక్క ఉద్దేశము Pro,1,1-1,7
యౌవనస్థులకు జ్ఞానోపదేశములు Pro,1,8-8,36
ప్రతి మానవునికి తగిన బోధనలు Pro,9,1-24,34
హిజ్కియా సేకరించిన సామెతలు అధ్యా 25 – 29
ఆగూరుపలికిన మాటలు 30వ అధ్యా
రాజైన లెమూయేలు పలికిన మాటలు 31వ అధ్యా
కొన్ని ముఖ్యాంశములు : పరిశుద్ధ గ్రంథము యొక్క 20వ గ్రంథము; అధ్యాయములు 31; వచనములు 915; ప్రశ్నలు 49; నెరవేరని ప్రవచనాలు 27; పాపములు 67; మూడులను గూర్చినవి 66; సోమరితనములను గూర్చినవి 28; రాజులను గూర్చినవి 22; హేయమైనవి 25; ఆజ్ఞలు 215; వాగ్దానములు 120; ఆశీర్వాదములు 27; జీవిత రహస్యములు 24; మంచి క్రియలు 17; సామెతలు 560.
Ecclesiastes - ప్రసంగి
మాయ (వ్యర్ధము) అనునదే ఈ గ్రంథము యొక్క ముఖ్య సారాంశము. 37 సార్లు మరల, మరలా ఈ మాట ఈ గ్రంథములో వచ్చుచున్నది. దేవుడు లేని జీవితములో తృప్తిని కనుగొనుటకు వ్యర్థముగా ప్రయాసపడుటయే ఈ పదము గుర్తించుచున్నది. ప్రసంగి అనగా సొలొమోను ఇశ్రాయేలీయుల చరిత్రలోనే ఎంతో గొప్ప జ్ఞానము గలవాడును, శ్రీమంతుడును, ప్రఖ్యాతి గాంచిన రాజుగా నుండెను. ఆయ సూర్యుని క్రిందనున్న సమస్తమును మానవ దృష్టితో చూచెను. అప్పుడన్నియు వ్యర్ధమైనవని చూచుచున్నాడు. మానవ హృదయములో దేవుడు ఉంచిన ఒక ఖాళీ స్థలమున్నది. దేవుడు తప్ప వేరే ఏదియు ఆ స్థలమును నింపవీలుపడదు. అధికారముగాని, పేరు ప్రతిష్టలుగాని, ఆస్థిగాని సుఖముగాని, ప్రఖ్యాతిగాని దానిని ఏమాత్రము నింపలేదు. దేవుని దృష్టితో దాని విలువను లెక్కించునపుడు జీవితానికి, లక్ష్యము, అర్థమ ఉన్నది. అప్పుడు తినుట, త్రాగుట, ఆనందించుట, మేలుచేయుట, దేవునికి భయపడుట మొదలైనవన్నియు ఎంతో విలువైనవిగా లెక్కించబడుచున్నవి. ప్రతి దినము మన జీవితమును దేవుడు అనుగ్రహించే ఒక ఈవి అని తలంచునపుడు సూర్యోదయములో మంచు మరుగైనరీతిగా నిరాశలన్నియు మరుగైపోవును. హెబ్రీభాషలో ఈ గ్రంథము యొక్క పేరు “గొహేలేత్ ” అనబడును. ఒక సంఘములో ప్రసంగించువాడు అని దీని అర్ధము. గ్రీకు పదమైన “క్లీసియాస్టెస్" అను మాటకు కూడ ఇదే అర్థము. ఈ విధముగా తెలుగులో ప్రసంగి అను పేరు పెట్టబడియున్నది.
గ్రంథకర్త : సొలొమోను సొలొమోను యొక్క అంత్య దినములలో దాదాపుగా క్రీపూ 935 లో
ముఖ్య మాట : వ్యర్ధము ( 37 సార్లు)
ముఖ్య వచనము : ప్రసంగి 2:24; Ecc,12,13,14
ముఖ్య అధ్యాయములు : ప్రసంగి 12
గ్రంథము యొక్క చివరి భాగమునకు ప్రవేశించబోవుచున్నప్పుడు ప్రసంగి దైవ దృష్టి ద్వారా జీవితమును చూచుచున్నాడు. అయితే అంతకుముందు సూర్యుని క్రిందనున్న సమస్తమును బౌతిక కండ్లతో అతడు చూచెను. అప్పుడు ఆయనకు సమస్తము నిష్ప్రయోజనమైనవిగా అర్థశూన్యముగా నుండినవి. అయితే సూర్యునికి పైగా ఉన్న దేవుని దృష్టితో జీవితమును చూచినపుడు దేవుని ఈవిగా దానిని ఎంచుటకు, అన్నియు యథార్థమైనవిగా, మేలుకరమైనవిగా ఉన్నవని గ్రహించగలిగెను.
జీవితము యొక్క ముఖ్య సంకల్పము ఏమని ఆయన వెదకినపుడు కనుగొన్న జవాబే 12వ అధ్యాయము దేవుని యందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి (ప్రసంగి 12:13) అను గమ్యమునకే ప్రసంగి వచ్చి చేరెను.
గ్రంథవిభజన : మానవ జీవత ఉద్దేశము ఏమి అని కనుగొనుటకు గ్రంథకర్త జరిగించిన ధీర్ఘమైన అన్వేషణయే ఈ గ్రంథము యొక్క సారాంశము. ఈ గ్రంథమును మూడు ముఖ్య భాగములుగా విభజింపవచ్చును.
సమస్తము వ్యర్ధము అనునది Ecc,1,1-1,11 వరకు
వ్యర్ధము అను ఉద్దేశము యొక్క ఆదారములు Ecc,1,12-6,12 వరకు
వ్యర్ధమును జయించి జీవించుటకు బోధన Ecc,7,1-12,14 వరకు
దేవునియందలి భయభక్తులు కలిగి జీవించే మార్గమే శ్రేష్టమైన జీవితమును సంపాదించుకోగలదు అను తీర్మానమునకు ప్రసంగి చేరుకుంటున్నాడు. దేవునిని, దేవుని చిత్తమును, విలువైనదిగా ఎంచని వారి జీవితము అపాయములోను, భయంకరమైన అపజయములోను జారిపడుచున్నది. ప్రతి సమస్యకు పరిష్కారము కనుగొనేంత వరకు జీవితము ఎవరి కొరకును వేచియుండడములేదు. అయితే సూర్యునికి
క్రింద చూచుటకు బదులుగా సూర్యుని పైగా ఒకే కాపరిని తొంగి చూచుట ద్వారా జీవిత రహస్యమునకు జవాబులు దొరుకును. అప్పుడది అర్థవంతమైనదిగాను, సంతోషకరమైనదిగాను పరిగణంచబడుట నిశ్చయమే.
కొన్ని ముఖ్య వివరములు : పరిశుద్ధ గ్రంథము యొక్క 21వ గ్రంథము ; అధ్యాయములు 12; వచనములు 222; ప్రశ్నలు 33; ఆజ్ఞలు 34; ప్రవచనములు లేవు; వాగ్దానములు 1; దేవుని యొద్ద నుండి విశేషమైన వర్తమానము లేదు.
Song of Solomon - పరమగీతము
యొక్క పెండ్లి కుమార్తెగాను చిత్రించే ఒక గ్రంథముగా దీనిని పరిగణించవచ్చును. మానవుని ఆత్మీయ జీవితము యొక్క గొప్ప సమృద్ధి దేవునికిని మానవునికి అనగా క్రీస్తుకును మానవ ఆత్మకును మధ్యనున్న ప్రేమగల సంబంధమే.
అనేక సాక్షులతో నిండిన ఒక నాటకము యొక్క శైలిలో ఈ గ్రంథమున్నది. సొలొమోను రాజు (నాయకుడు) షూలమ్మితీ (నాయకురాలు) యెరూషలేము కుమార్తెలు (పాటల బృందము) వీరే దీని యొక్క ఈ కథా పాత్రలు. హెబ్రీ, గ్రీకు భాషలలో నున్న గ్రంథముల పేర్లు పాటల యొక్క పాటలు అనగా పరమగీతములు అనునదే. సొలొమోను రచించిన 1005 పాటలను గూర్చి 1 రాజులు 4:32 లో చెప్పబడియున్నది. వాటిలో ఎంతో శ్రేష్టమైన పాట అనుబావము ఇచ్చుటచే పరమగీతము అను పేరు అర్థముతో నిండినదిగానున్నది. ముప్పది సంవత్సరములకు లోబడిన వారు చదువుటకు ధర్మశాస్త్రో పదేశకులు, పెద్దలు దీనిని అనుమతించలేదు.
గ్రంథకర్త : సొలొమోను
కాలము : సొలొమోను పరిపాలన కాలము యొక్క ప్రారంభము అనగా దాదాపు 965లో వ్రాయబడినదని ఊహించవచ్చును.
ముఖ్యమైన మాట : ప్రేమ
ముఖ్యవచనములు : పరమగీతము 7:11; పరమగీతము 8:7 నేను నా ప్రియుని దానను. అతడు నా యందు ఆశాబద్దుడు (పరమగీతము 7:11). అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాని ముంచివేయజాలవు ప్రేమకై యొకడు తన స్వాస్థ్యమంతా యిచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. (పరమగీతము 8:7).
ముఖ్యమైన అధ్యాయములు : గ్రంథమంతయు కవిత్వముతో నిండియున్నందున ఏదైన ఒక అధ్యాయమునకు శ్రేష్టతనిచ్చుటకు వీలుపడదు. 8 అధ్యాయములు కుటుంబ ప్రేమను ఎంతో చక్కగా బోధించుచున్నవి.
గ్రంథ విభాగములు : ఈ గ్రంథమునకు మూడు ముఖ్యమైన భాగములున్నవని చెప్పగలము.
(1). ప్రేమ ప్రారంభము Song,1,1-3,5 వరకు
పెండ్లి కమార్తె యొక్క ప్రేమాకాంక్ష పరమగీతము 1:1-8
ఒకరికొకరు తమ ప్రేమను బయలుపరచుట Song,1,9-2,7
రాజు పెండ్లి కుమార్తె యింటిలో పరమగీతము 2:8-17
పెండ్లి కుమార్తె యొక్క ఎడబాటు కల పరమగీతము 3:1-5
(2). ప్రేమ వివాహములో సఫలమయ్యెను Song,3,6-5,1
వివాహ ఊరేగింపు పరమగీతము 3:6-11
పెండ్లికుమార్తె యొక్క విశేషమైన అందము పరమగీతము 4:1-15
వివాహము యొక్క ఆనందం Song,4,16-5,1
(3). ప్రేమాభివృద్ధి Song,5,2-8,14
పెండ్లి కుమార్తె యొక్క రెండవ ఎడబాటు కల పరమగీతము 5:2-7
పెండ్లి కుమారుని విశేషమైన అందము Song,5,8-6,3
పెండ్లికుమార్తె యొక్క అందమును పొగడబడుట Song,6,4-7,10
తన యింటికి వెళ్ళుటకు పెండ్లి కుమార్తె వాంచ Song,7,11-8,4
ప్రయాణమైయింటిని చేరుకొనుట పరమగీతము 8:5-14
కొన్ని ముఖ్య వివరములు : పరిశుద్ధ గ్రంథము యొక్క 22వ గ్రంథము ; అధ్యాయములు 8; వచనములు 117; ప్రశ్నలు 13; ఆజ్ఞలు 14; ప్రవచనములు లేవు; దేవుని యొద్ద నుండి విశేష వర్తమానములు లేవు.
Isaiah - యెషయా
పరిశుద్ధ గ్రంథము యొక్క 17 ప్రవచన గ్రంథములలో అనుక్రమానుసారముగా మాత్రమే కాకుండా శ్రేష్ఠత్వములోను ప్రధమ గ్రంథముగా కనుపించేదే యెషయా ప్రవచన గ్రంథము. యోబు నుండి పరమగీతము వరకున్న కావ్య గ్రంథాలు ఇశ్రాయేలు రాజ్య స్వర్ణయుగములలో వ్రాయబడగా యెషయా నుండి మలాకీ వరకైన గ్రంథాలు ఇశ్రాయేలు రాజ్య అంధకారయుగమునకు సంబంధించినవి. ఇశ్రాయేలు రాజ్యము ఉత్తర ఇశ్రాయేలు దక్షిణ యూదాగా రెండుగా విడిపోయి దైవభక్తి నుండి దిగజారి అక్రమమైన విగ్రాహారాధనలో పడిపోయినపుడు దేవుడు త ప్రవక్తలను పంపి వారితో మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాము. క్రీ.పూ. 9వ శతాబ్దము నుండి 4వ శతాబ్దము వరకు ఈ ప్రవక్తల కాలమగును క్రీ.పూ 4వ శతాబ్దములో ప్రవచించిన మలాకీ తరువాత బాప్తీష్మమిచ్చు యోహాను కాలము వరకు సుమారు మూడు వందల సంవత్సరములపైగా ఏ ప్రవక్త కూడా ఉద్భవించలేదు. 16 మంది ప్రవక్తలలో నలుగురిని పెద్ద ప్రవక్తలని 12 మందిని చిన్న ప్రవక్తలని వారి యొక్క గ్రంథముల ప్రాముఖ్యతను ఆధారము చేసుకుని, ప్రవచన గ్రంథము యొక్క కొలతను ఆధారము చేసుకుని గుర్తించబడినది. వీరిలో యెషయా, యిర్మీయా హోషేయా, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా అను పదకొండు మంది చెర నివాసమునకు ముందు జీవించారు. దానియేలు, యెహెజ్కేలు అనువారు చెరనివాసకాలములోను, హగ్గయి, జెకర్యా, మలాకీ అనువారు చెర విమోచనము తరువాత జీవించారు.
ప్రవక్తలు ద్వితీయోపదేశకాండము 18:18-19 వచనములలో కనబడునట్లుగా దేవుని కొరకు ప్రజలతో మాట్లాడుతూ వచ్చిరి. పరిశుద్ధ గ్రంథములో మూడింటిలో ఒక భాగము ప్రవచనా గ్రంథములు నింపబడుటలో ప్రవక్తల యొక్క సేవ ప్రాధాన్యతను బయలుపరచుచున్నది.
ఉద్దేశము : యూదాను దేవునివైపు త్రిప్పుట, మెస్సియా మార్గమైన దేవుని రక్షణను ప్రస్తావించుట.
గ్రంథకర్త : 1 - 39 వరకు గల అధ్యాయములు క్రీపూ 700 సంవత్సరములోను 40 -66 వరకు గల అధ్యాయములు క్రీపూ 681 సంవత్సరములోను వ్రాయబడినవని ఊహించవచ్చును.
సారాంశము : యెరూషలేము
ముఖ్యమనుష్యులు : యెషయా, ఆయన ఇద్దరు కుమారులు
గ్రంథము యొక్క విశేషం : ఈ గ్రంథములో పద్యములును పాటలును ఉన్నవి. మాదిరికరమైన కార్యములు అనేకమైన వున్నవి. జరుగుచున్న కాలములోను, భవిష్యత్తులోను జరుగవలసిన కార్య క్రమములు వచనా రీతిగా చెప్పబడియున్నది. అజర్యా అని పిలువబడు ఉజ్జీయా చనిపోయిన సంవత్సరములో యెషయాకు కలిగిన దర్శనమును గురించి 6వ అధ్యాయములో వ్రాయబడియున్నందున మొదటి 5 వ్రాయబడియున్నందున మొదటి 5వ అద్యాములు ఉజ్జీయా యొక్క పరిపాలన కాలములో వ్రాయబడినవని చెప్పవచ్చును. యోతాము కుమారుడైన ఆహాజు పరిపాలనా కాల కార్యములు 7వ అధ్యాయములో వ్రాయబడి యుండుటను బట్టి (యెషయా 7:1-5) యెషయా యొక్క ప్రవచనములలో అధిక భాగము ఆహాజు మరియు హిజ్కియాల పాలన కాలములో ప్రవచించబడినవని అనుకొనవచ్చును. ఆష్హూరు తిగ్లత్పిలేసెరు నాయకత్వములో ఒక గొప్ప శక్తివంతమైన రాజ్యముగా అభివృద్ధి చెందిన కాలమది. మధ్యదరా సముద్ర తీరపాంతములలో ఉన్న చిన్న దేశములను హస్తగతం చేసుకున్న అష్హూరు ఇశ్రాయేలుపై దండెత్తి దానిని స్వాధీనం చేసుకుని అక్కడ జీవించిన వారిలో ఎక్కువ మందిని చెర పట్టుకుపోయినది. ఈ విధముగా క్రీ.పూ 722లో ఇశ్రాయేలు సంపూర్ణముగా నాశనము చేయబడినది. ఇశ్రాయేలు పతనమునకు పిదప యూదాకు కూడా తీర్పు వచ్చును అనియు అది ఆష్హూరు నుండి కాదుగాని బబులోను నుండే కలుగునని ప్రవక్త పలుకుటను చూస్తున్నాము. ఇది బబులోను గొప్ప మహాసామ్రాజ్యముగా అవతరించుటకు ముందే చెప్పబడిన ప్రవచనము అని మనస్సులో గుర్తించుకోవాలి.
ముఖ్యమైన మాట : రక్షణ
ముఖ్య మైన వచనములు : యెషయా 9:6-7; యెషయా 5:3-6
ముఖ్యమైన అధ్యాయము : యెషయా 53. ఈ అధ్యాయములోని ఒక్కొక వచనమును దేవుని సత్యగని వలె ప్రాముఖ్యతను పొందినవి. ఇవి హృదయమున చెక్కబడవలసినవి.
గ్రంథ విభజన : వేదపండితుల ద్వారా ప్రవక్తలలో పెద్దవానిగా భావించబడువారు యెషయా మెస్సియాను గూర్చి మిక్కిలి స్పష్టముగాను ప్రాముఖ్యత కలిగిన ప్రవచనములు గల ఈ గ్రంథమును యెషయా సువార్త అని పిలుచుటలో ఆశ్చర్యపడనక్కర లేదు. ఈ గ్రంథము క్రింద ఇవ్వబడిన రీతిగా మూడు పెద్ద భాగములుగా విభజింపవచ్చును.
న్యాయ తీర్పును గూర్చిన ప్రవచనములు అధ్యాయము 1 నుండి 35 వరకు.
చరిత్ర సంబంధమైన ఒక అనుబంధము - అధ్యాయము 36 నుండి 39 వరకు.
అష్హూరు రాజు నుండి హిజ్కియాకు లభించిన విడుదల 36: 1 నుండి 37: 38 వరకు.
మరణకరమైన రోగము నుండి హిజ్కియాకు దొరికిన విడుదల యెషయా 38:1-22 వరకు
హిజ్కియా యొక్క బుద్దిహీనత యెషయా 39:1-8.
మహిమతో నిండిన విశ్వాసము యొక్క ప్రవచనములు - అధ్యాయము 40 నుండి 66 వరకు
కొన్ని సంఖ్యా వివరణలు : పరిశుద్ధ గ్రంథము యొక్క 23వ గ్రంథము; - అధ్యాయములు 66, వచనములు 1292; నెరవేరని ప్రవచనములు 634; నెరవేరిన ప్రవచనములు 395; హెచ్చరికలు 1313; నెరవేరిన హెచ్చరికలు 449; నెరవేరని హెచ్చరికలు 864; చరిత్రాత్మక వచనములు 273; ప్రశ్నలు 190; వాగ్దానములు 120; ఆజ్ఞలు 308; దేవుని యొద్ద నుండి ప్రత్యేక సందేశములు 71.
Jeremiah - యిర్మియా
యూదాకు మిక్కిలి అపాయకరమైన కాల స్థితిలో దేవుని ద్వారా లేపబడిన ఒక యౌవనుడు యిర్మీయా. సామర్థ్యములేని వారిని త్రోసివేయబడిన అనేకులను దేవుడు తన యొక్క ఉద్దేశము కొరకు లేక పని కొరకు ఏర్పరచుకొనుచున్నాడు. సున్నితమైన, లేక మృదువైన మనసు ధైర్యము లేని వాడైన యిర్మీయాను అసాధారణమైన వాక్కులను పలుకుటకు దేవుడు ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు, యూదా అని కనాను విభజించబడియున్నది.
ఇశ్రాయేలు అష్హూరీయుల చేత నిర్మూలమైన తరువాత 136 సంవత్సరం యూదా ప్రభుత్వము నిలిచియున్నది. అలాంటి స్థితిలో ఉన్న యూదులు విగ్రహారాధనకు వారి మార్గములను చెరిపివేసికొని సరియైన మార్గము విడిచిపోవుటకు దాసులగుట చూచిన యిర్మీయా వారి కాలములో వారిని చుట్టియున్న అపాయమును గూర్చి హెచ్చరించెను. యిర్మీయా దేవునివైపు తిరుగుటకు వారిని ఆహ్వానించెను.
వరుసక్రమమునుబట్టి గాని, కాలక్రమమునుబట్టిగాని యిర్మీయా గ్రంథము అమర్చబడలేదు. గ్రంథమంతయు చదివిన యెడల గ్రంథ కర్త యొక్క జీవితమంతయు తెలియబడును. అయితే అంశక్రమమును వరుసక్రమమును మనము కనుగొనవలెను. నాశనమునకు గురైనా యూదా తప్పించుకొనుటకు ఒకే మార్గము దేవునికిలో బడుటయే వారికి బుద్ధిచెప్పుటే ఈ గ్రంథము యొక్క సారాంశము.
ఉద్దేశము : దేవుని యొక్క జనులు తమ పాపములను విడిచి పెట్టి దేవుని యొద్దకు తిరిగి వచ్చుటకు ఆహ్వానము.
గ్రంథకర్త : యిర్మీయా
ఎవరికి : దక్షిణ రాజ్యమైన యూదాకు దానియొక్క రాజధాని అయిన యెరూషలేము ప్రజలకు
కాలము : క్రీ.పూ 627 – 586
గతచరిత్ర : యెషియా, యెహోయహాసు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా అను ఐదుగురు. యూదా చివరి రాజుల కాలములోను యిర్మీయా ప్రవచన సేవను నెరవేర్చెను. క్రీ.పూ 586లో బబులోను రాజు యూదాను నిర్మూలముచే సెను. ( 2 రాజులు 21 - 25 అధ్యాయము ) జెఫన్యా యిర్మీయాకు ముందుటివాడును, హబక్కూకుకు సమకాలీకుడగును.
ముఖ్యమైన వ్యక్తులు : పైన చెప్పబడిన ఐదుగురు యూదా రాజులు బారూకు, ఎబెద్మెలెకు, నెబుకద్నెజరును, రెగాబియురు మొదలగువారు.
గ్రంథము యొక్క ప్రత్యేకత : చరిత్ర కావ్యములు, జీవిత చరిత్ర మొదలగునవి ఇమిడియున్నవి తమ యొక్క మనస్సులోని బయలు పరుచుటకు అనేకమైన గుర్తులను ఉపయోగించుచున్నారు.
ముఖ్యపదము : తిరిగివచ్చుట, యూదాకు తన ధుర్మార్గ మార్గమును విడిచి తిరిగివచ్చుటకు ఆహ్వానము ఇచ్చుచున్నారు. యిర్మీయా అవకాశమును చివరి అవకాశమని వారికి తెలియపరచెను.
ముఖ్యమైన వచనములు : యిర్మియా 7:23-24; యిర్మియా 8:11-12
ముఖ్య అధ్యాయము : 31 అధ్యాయములో యిర్మీయా తన అన్ని హెచ్చరికలకు శిక్ష తీర్పులకును మధ్య దేవుని అద్భుత వాగ్దానములను గూర్చియు యూదా ప్రజలకు జ్ఞాపకము చేయుచుండెను. దేవుడు వారితో కొత్త నిబందన చేయును. నేను నా ధర్మ శాస్త్రమును వారి మనస్సులో ఉంచి దానిని వారి హృదయములో వ్రాసెదను నేను వారికి దేవుడనైయుందును వారు నా ప్రజలై యుందురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యేసుక్రీస్తు తన యొక్క మరణము పునరుద్దానమును వాటి ద్వారా ఈ కొత్త నిబంధనను స్థాపించి అమలులోనికి తెచ్చెను.
గ్రంథ విభజన : యూదా చరిత్రలో చీకటితో నింపబడిన కాల స్థితిలో అతిగొప్ప ప్రవక్త ఒకరు జరిగించిన సేవా ప్రతులే యిర్మీయా ప్రవచన గ్రంథము. చెరసాలలో నుండి 70 సంవత్సరముల తరువాత తిరిగి వచ్చుటను గూర్చియు క్రీస్తు ద్వారా స్థాపించబడు క్రొత్త నిబంధన ద్వారా దేవుని ప్రజలకు సొంతమగు మహిమ కలిగిన నమ్మకమును గూర్చియు యిర్మీయా పలికిన ప్రవచనములు ఎంతో గమనించతగినవి. ఈ గ్రంథములో 4 పాముఖ్యమైన భాగములు ఉన్నవి.
(1). యిర్మీయా పిలువబడుట (1 అధ్యా 1-19).
(2). యూదులకు ప్రవచనము ( 2 అధ్యా నుండి 45 అధ్యా వరకు)
(3). అన్య దేశములకు ప్రవచనము ( 46 అధ్యా నుండి 51 వరకు).
(4). ఇశ్రాయేలు (యూదా యొక్క) నిర్మూలము. బబులోను చెర అధ్యా 52.
కొన్ని క్లుప్త వివరణలు : పరిశుద్ధ గ్రంథములో 24వ పుస్తకము; అధ్యాయములు 52; వచనములు 1364; చరిత్రకు సంబంధించిన వచనములు 680; హెచ్చరికలు 1002; నెరవేరిన ప్రవచనములు 666; నెరవేరని ప్రవచనములు 180; నెరవేరిన హెచ్చరికలు 779; నెరవేరని ముందు హెచ్చరికలు 223; ప్రశ్నలు 194; ఆజ్ఞలు 303; వాగ్దానములు : 16; దేవుని యొద్ద నుండి ప్రత్యేకమైన వర్తమానములు 62.
Lamentations - విలాపవాక్యములు
ఒక మహానగరము యొక్క గోషలాగ విలాపవాక్యములు కనబడుచున్నది. ఒక కాలములో యూదుల యొక్క అతిశయింపదగిన పట్టణముగా కనిపించిన యెరూషలేము బబులోనియులు స్వాధీనపరచుకొనినదానిని బట్టి ఆ పట్టణము ఒక ఇసుక దిబ్బలాగా మార్చబడిన సంగతులను కన్నీరు భాషగా విలాపించుచున్నారు.
గ్రంథకర్త ఐదు విలాప కావ్యముల కూర్పును యిర్మీయా ఈ గ్రంథము ద్వారా తన యొక్క వేదనతో కూడిన ఆలోచనలకు రెక్కలు ఇచ్చుచున్నాడు. యెరూషలేము పట్టణము కూలిపోయినది అది అందరికి అపహాస్యాస్పదముగా మార్చబడినది.
ఈ విలాప వాక్యములను అక్షర వరుసక్రమములో వ్రాసియున్నాడు. గ్రంథర్త 1 నుండి 4 వరకు ఒక్కొక అధ్యాయము ఆలెఫ్ అనబడిన హెబ్రీభాష మొదటి అక్షరముతో ప్రారంభించి తదుపరి వచ్చు ఒక్కొక్క వచనము వరుస క్రమములో మొదటి అక్షరముతో ప్రారంభించి చివరి అక్షరముతో ముగియబడుచున్నది. ఈ గొప్ప బాధకరమైన ప్రత్యక్షత మధ్యలో యెహోవా నీ యొక్క యదార్ధత గొప్పదైయున్నది. అనెడి ప్రకటన ద్వారా ఆధరణను నిరీక్షణను పొందుచున్నారు. ఈ విధముగా మిక్కిలి కీడైన బాధను విశ్వాసము యొక్క జయముగా మార్చుటకు యిర్మియా ప్రయాసపడుచున్నాడు.
గ్రంథకర్త : విలాపవాక్యముల యొక్క గ్రంథకర్త ఎవరని ఈ గ్రంథములో సూటిగా చెప్పబడలేదు. అయినప్పటికినీ అనేకమైన ఆంతర్యసాక్ష్యములు మరియు బాహ్య సాక్ష్యములును దీని యొక్క గ్రంథకర్త యిర్మీయా అని సాక్షమిచ్చుచున్నవి. సెప్టోజెంట్ భాషాంతర పరిచయ వాక్కులలో ఈ విధముగా వ్రాయబడియు యెరూషలేము నిర్మూలన చేయబడినది ఇశ్రాయేలీయులు దాసులుగా చెరపట్టబడిన తదుపరి యెరూషలేమును గూర్చి విలపించుచూ యిర్మీయా ఈ విలాప వాక్యములను విలపించెను. ప్రారంభకాల యూదా క్రైస్తవ పారంపర్యములు కూడా ఏక స్వరముతో ఈ గ్రంథకర్త యిర్మీయా అని అగీకరించుచున్నవి.
గ్రంథములో వివరించు సందర్భములో ముఖాముఖిగా చూచిన దృశ్యములుగా కనిపించుట గమనించదగినవి. (విలాపవాక్యములు 1:13-15; విలాపవాక్యములు 2:6-9; విలాపవాక్యములు 4:1-12 మొదలగు భాగములను చూడుము) యెరూషలేము పతనమైనది ముఖాముఖిగా చూచుట మాత్రమే కాదుగాని అందులోని జనులు దాసులుగా బబులోనుకు కొనిపోబడిన తరువాత కూడా కొంత కాలము అక్కడనే నివశించెను. యిర్మీయా ప్రవచనా భాషాశైలికి భిన్నమైనదిగా ఇది కనిపించుచున్నదని కొందరు విమర్శించుచున్నారు. పద్యభాగమునకు, గధ్య భాగమునకు మధ్యలో భాషాశైలిలో భేదముండుట సహజమే. అయినప్పటికినీ యూదా ప్రజల పతనమును గూర్చిన దుఃఖము అంజలియు ఈ రెండు గ్రంథములలో ఒకే విధముగా ధ్వనించుచున్నవి.
కాలము : యెరూషలేము పతనమైన తరువాత ప్రారంభ సంవత్సరములలో ఈ గ్రంథమును వ్రాసి ఉండవచ్చును క్రీ.పూ 588 నుండి 586 వరకు నెబుకద్నెజరు యొక్క సైన్యము యెరూషలేమును ముట్టడి వేసెను. క్రీ.పూ. 586 సంవత్సరము ఆగస్టు నెలలో పట్టణము పతనమైనది. యూదాలో సంభవమునకును మిగిలిన ప్రజలు యిర్మీయాను వారితో కూడా ఐగుప్తుకు తీసుకువెళ్ళుటకు మధ్యకాలములో ఈ గ్రంథము వ్రాయబడి ఉండవచ్చును.
ముఖ్య పదము : దుఖఃము
ముఖ్య మైన వచనములు : విలాపవాక్యములు 2:5-6; విలాపవాక్యములు 3:22-23
ముఖ్యమైన అధ్యాయము : అధ్యా 3. నాశనము, లేమి, నీరసత్వము అనునవి పొంగిపొర్లే ఈ గ్రంథములో తాను దేవుని వాగ్దానములను, మరియు దేవుని యదార్థతను ప్రాధమికాంశముగా కలిగిన ఒక విశ్వాసములో గ్రంథకర్త ఆశ్రయమును పొందుటను చూచుచున్నాము. మిగతా నాలుగు అధ్యాయములలో వేదనతో కూడిన ఆలోచనలకు మధ్యలో దేవుని యొక్క కనికరములో నిరీక్షణ కలిగిన మహిమతో నిండిన పూర్ణ విశ్వాసమును విలాపవాక్యములు 3:22-25 లో చూడగలము.
గ్రంథ విభజన : 40 సంవత్సరము లకు పైగా యెరూషలేముకు వచ్చు తీర్పును గూర్చి ప్రవచనము పలికి హెచ్చరికలను ఇచ్చిన ప్రవక్తగా యిర్మీయా కనిపించుచున్నాడు. క్రీ.పూ. 586 సంవత్సరములో నెబుకద్నెజరు యెరూషలేమును పతనము చేసిన తరువాత తనయొక్క హెచ్చరికలను అశ్రద్ధ చేసిన యూదులను నిర్లక్ష్యపరచి నేరము మోపుటకు యిర్మీయా ప్రయత్నించలేదు. అదే సమయములో యెరూషలేము యొక్క దుస్థితిని చూచి వేదనతో విలపించెను. ఈ విధముగా తన దేశ ప్రజలతో ఏకీభవించెను. పాపులును కఠిన హృదయము గలవారుగా కనిపించిన తన దేశ ప్రజలతో కఠినమైన దేవుని వాక్కులను ప్రకటించుటకు నియమింపబడిన ప్రవక్త యొక్క కనికరముగల మనసును ఈ గ్రంథము ప్రతిబింబిచుచున్నది. దీని అధ్యాయములకును దాని సారాంశముల మూలానుసారముగా ఇవ్వబడిన పేర్లు క్రింద ఇవ్వబడినవి.
అధ్యాయము 1 : యెరూషలేము నాశనము
అధ్యాయము 2 : దేవుని కోపము
అధ్యాయము 3 : కనికరము కొరకైన విన్నపము
అధ్యాయము 4 : యెరూషలేము ముట్టడి
అధ్యాయము 5 : విమోచనకొరకైన విన్నపము
కొన్ని క్లుప్త వివరములు : పరిశుద్ధ గ్రంథములో 25వ పుస్తకము ; అధ్యాయములు 5; వచనములు 154; ప్రవచన వచనములు 2; ప్రశ్నలు 13; ఆజ్ఞలు 3; వాగ్దానములు లేవు; హెచ్చరికలు 2; దేవుని యొద్ద నుండి ప్రత్యేక వర్తమానములు లేవు.
Ezekiel - యెహెఙ్కేలు
యెహెజ్కేలు ఒక యాజకుడుగాను, ప్రవక్త గాను ఉన్నాడు. ఈయన యూదా చరిత్రలో మిక్కిలి అంధకారకాలమైన 70 సంవత్సరముల బబులోను చెర నివాస కాలములో దేవుని కొరకు శత్రుదేశమైన బబులోనులో తనయొక్క ప్రవచన సేవను నెరవేర్చాడు. యెరూషలేము నాశనమగుటకు ముందు బబులోనుకు కొనిపోబడిన ఈ ప్రవక్త దర్శనములు, ఉపమానములు, రూపములు, ప్రవచనములు వంటి అనేక మార్గములలో చెరలో తనతో ఉన్న ప్రజలకు ప్రవచించాడు. చెదరిన ఎముకలవలె వారి అప్పటి స్థితి కనిపించుచున్నను దేవుడు వారిని మరల తనతో చేర్చుకుంటాడు. వారికి జీవమును పోసి మరల ఒక దేశముగా వారిని నిలుపుతాడు. భూత కాలములో సంభవించిన శిక్ష రాబోవు మహిమకు మార్గమును సిద్ధపరుస్తుంది. ఈ విధముగా నేను యెహోవానని మీరు తెలిసికొనెదరు అనునదే యెహెజ్కేలు యొక్క వర్తమానము.
హెబ్రీ భాషలో యెహెజ్కేలు అనియు గ్రీకు భాషలో యెజేక్కియేలు అనియు స్వల్ప భేదముతో కనపడు ఈ పేరు యొక్క అర్థము దేవుడు బలపరుస్తాడు అనునదే. దేవుడు పిలిచి ఏర్పరచిన ప్రవచనా సేవ నిమిత్తము యెహెజ్కేలును ఆయన బలపరుచుటను మనము చదువగలము (యెహెఙ్కేలు 3:8-9), యెహెజ్కేలు అను ఈ పేరు ఈ గ్రంథములో రెండు చోట్ల తప్ప పాత నిబంధనలో మరెక్కడను చూడలేము.
గ్రంథకర్త : బూజీ కుమారుడైన యెహెజ్కేలు వివాహమైన వాడు. నెబుకద్నెజరు చివరిసారిగా యెరూషలేమును ముట్టడించినపుడు యూదులకు ఒక సాదృశ్యముగా ఆయన భార్య మరణించినది. (యెహెఙ్కేలు 24:16 -24) యిర్మీయా వలె ఒక యాజకుడుగా ఉన్న ఈయనను తన ప్రవచన సేవ చేయుటకు దేవుడు పిలిచాడు. దేవాళయము, యాజకత్వము, బలులు, దేవుని మహిమ అనునవి ఆయన ప్రవచనములలో గట్టిగా చెప్పబడుటను చూడగలము. దేవుని శక్తి, దేవుని ప్రణాళిక అనువాటిని బయలుపరచే అనేక దర్శనములు యెహెజ్కేలుకు కలిగినవి. పొందిన దర్శనములను ఉపయోగకరమైన రీతిలో వివరించి వ్రాయుటకు ఆయన ఇష్టపడ్డాడు.
ఈ గ్రంథములో అక్కడక్కడ నేను అను సర్వనామమును ఉపయోగించి ప్రవక్త తన వర్తమానములను తెలియజేశాడు. ఈ విధముగా చెప్పేవాడు యెహెజ్కేలే అని యెహెఙ్కేలు 1:3; యెహెఙ్కేలు 24:24 అను వచనములు తేటపరచుచున్నవి. కనుక ఈ గ్రంథకర్త యెహెజ్కేలు అనుటలో సందేహము లేదు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నరపుత్రుడా నేను యెహోవానని తెలిసికొనెదరు అను పదజాలము పదేపదే వచ్చుచున్నది. ప్రారంభము నుండి చివరి వరకైన ఒకే వ్రాతశైలి ఈ గ్రంథమంతటిని యెహెజ్కేలే వ్రాశాడు అని సాక్ష్యమిచ్చుచున్నవి.
ఉద్దేశము : ఇశ్రాయేలులోను, అన్యదేశములలోను రాబోవు దేవుని శిక్షను గూర్చి చెప్పుట, దేవుని ప్రజల చివరి రక్షణను ముందుగానే తెలియజేయుట.
గ్రంథకర్త : యెహెజ్కేలు, లేవి గోత్రకుడును, యాజకుడునైన బూజీ కుమారుడు.
ఎవరికి వ్రాశాడు : బబులోను చెరలో ఉన్న యూదులకు, సమస్త దేశములలో ఉన్న దేవుని ప్రజలకు.
కాలము : సుమారు క్రీ.పూ. 571
గత చరిత్ర : యూదాను యెహోయాకీను రాజు పరిపాలించుచున్న క్రీ.పూ. 597 లో బబులోను రాజు యూదాను హస్తగతం చేసుకుని జనులను బబులోను చెరకు తీసుకుని వెళ్ళాడు. ఈ విధముగా చెరగొన్నబడినవారిలో ఒకడు ఈ యెహెజ్కేలు. బబులోను చెరనివాసుల మధ్య తన ప్రవచన సేవను చేసినవాడు యెహెజ్కేలు. యిర్మీయా కంటే వయస్సులో చిన్నవాడైన యెహెజ్కేలు బబులోనులోను, యిర్మీయా యూదాలోను ఒకే సమయములో ప్రవక్తలుగా జీవించారు.
ముఖ్యమైన వచనములు : Eze,36,24,26
ముఖ్యమైన వ్యక్తులు : యెహెజ్కేలు, ఇశ్రాయేలు నాయకులు, యెహెజ్కేలు భార్య, నెబుకద్నెజరు,
ముఖ్యమైన స్థలములు : యెరూషలేము, బబులోను, ఐగుప్తు
ముఖ్యమైన పదజాలము : భవిష్యత్ కాల మహిమ. బబులోను చెరలో జీవించుచున్న దేవుని ప్రజలకు వారికి సంభవించిన కీడునకు కారణము వారి పాపములే కారణమని యెహెజ్కేలు జ్ఞాపకము చేయుచున్నాడు.
దానితో రాబోవు కాలములో మహిమ కరమైన విడుదల వారికి ఉందని బోధించుచున్నాడు. దేవాలయమును విడిచి తొలగిన దేవుని మహిమ మరల దానిని నింపునట్లుగా చిత్రించిన భాగములను చూడుము. (యెహెఙ్కేలు 43:27; యెహెఙ్కేలు 44:4).
ముఖ్య మైన వచనములు : యెహెఙ్కేలు 36:24-26; యెహెఙ్కేలు 36:33-35.
ముఖ్యమైన అధ్యాయము : యెహెజ్కేలు 37. ఇశ్రాయేలీయుల భవిష్యత్ కాల నమ్మకమును రమ్యముగా బయలుపరచే ఒక భాగముగా చెదరిన ఎముకల ప్రవచనము ఉన్నది. ఇశ్రాయేలీయుల భవిష్యత్ కాలము ఎంత మహిమకరముగా ఉంటుందో అనునది ఈ భాగము తేటపరచుచున్నది.
గ్రంథ విభజన : నాలుగు భాగములుగా ఈ ప్రవచన గ్రంథమును విభజింపవచ్చును.
(1). యెహెజ్కేలుకు కలిగిన దేవుని దర్శనము, దేవుని నడిపింపు. అధ్యా 1 -3 వరకు, (2). యూదాపైకి రాబోవు న్యాయ తీర్పు (శిక్ష) అధ్యా 4 - 24 వరకు, (3). చుట్టు ఉన్న అన్యజనులకు న్యాయ తీర్పు (శిక్ష) అధ్యా 25 - 32 వరకు, (4). ఇశ్రాయేలీయుల విమోచన, దేవాలయము యొక్క పునర్వీకరణ ఆధ్యా 33 - 48 వరకు.
వాగ్దాన దేశమైన కనానులో నుండి పెరికి వేయబడిన పిమ్మట స్వంతముగా ఒక దేశమో, రాజు లేకుండా, స్వాతంత్ర్యమైన ఒక జీవితమునకు, కార్యమునకు, ఆరాధనకు అవకాశము లేకుండా పాడైన గుంటలో పడిపోయిన చెరనివాసులకు దేవుని వర్తమానములను తెలియజేయులాగున యెహెజ్కేలు ఏర్పరచబడ్డాడు. మొదటి అధ్యాయములో ఆయన చూచినట్లుగా ఉన్న దేవుని దర్శనము పాతనిబంధనలో మోషేకు, యెషయాకును, కొత్త నిబంధనలో యోహానుకును కలిగిన దర్శనములకు సమానమైనది. యెషయా, యిర్మీయా వలె ఒకే సారి దేవుని న్యాయ తీర్పు శిక్షను గూర్చి మరియు మహిమాయుక్తమైన భవిష్యత్ కాలమును గూర్చి ఆయన మాట్లాడుచున్నాడు. దేవుని మహిమ యెరూషలేము దేవాలయమును విడిచి వెళ్లుచున్నట్లుగా ఆయన పొందిన దర్శనము పదవ అధ్యాయములో వివరించబడియున్నది.
పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచుట ద్వారా క్రైస్తవ సమాజమునకును, వ్యక్తులకును నేడు సంభవించిన స్థితి ఇదే. కోల్పోయిన మహిమను తిరిగి పొందుటకు ఒకే మార్గము పాపములను విడిచి దేవుని వైపుకు తిరుగుట. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్దియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రదుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. (యెహెఙ్కేలు 18:31-32), ఇటువంటి సజీవమైన మానవహృదయములో నుండి సమాజములో నుండి దేవుని జీవజలనదులు బయలుదేరి చుట్టు సశ్యశ్యామలముగా చేయుటను గూర్చి 47వ అధ్యాయములో వివరించుచున్నాడు.
కొన్ని సంఖ్యా వివరములు : దేవుని గ్రంథములో 26వ గ్రంథము; అధ్యాయములు 48; వచనములు 1273; చరిత్రాత్మిక వచనములు 310; నెరవేరిన ప్రవచనములు 530; నెరవేరని ప్రవచనములు 433; హెచ్చరికలు 953; నెరవేరిన హెచ్చరికలు 659; నెరవేరని హెచ్చరికలు 294; ఆజ్ఞలు 345; వాగ్దానములు 25; ప్రశ్నలు 80; దేవుని యొద్ద నుండి ప్రత్యేక సందేశములు 179.
Daniel - దానియేలు
దానియేలు యొక్క జీవితము, సేవయు బబులోను చెరనివాసకాలమైన డెబ్బై సంవత్సరములు విస్తరించియున్నది. 16వ ఏటే చెరపట్టబడిన దానియేలు రాజకార్యము నిమిత్తము ఎన్నుకొనబడ్డాడు. దాని తరువాత దేవుని తాత్కాలిక నిత్య ఉద్దేశమును ఇశ్రాయేలీయులకు అన్యజనులకు బయలుపరచు దేవుని ప్రవక్తగా ఉన్నాడు. దానియేలు గ్రంథములోని 12 అధ్యాయములలో 9 అధ్యాయములు దేవుని దర్శనములు, కలలు, ఉదాహరణముతో నిండిన ప్రవచనములతో నిండి కనిపిస్తున్నవి. ప్రత్యేక జనులు మరియు దేశముల యొక్క జీవిత సంభవములలో దేవుని నడిపింపు, ప్రణాళిక ఏ విధముగా క్రియచేయుచున్నదని దానియేలు గ్రంథము మనకు తెలియజేయుచున్నది. దానియేలు అను పదమునకు దేవుడు నాకు న్యాయాధిపతి అని అర్థము.
గత చరిత్ర : దానియేలును అతని ముగ్గురు స్నేహితులు సమస్త జ్ఞానములోను శ్రేష్ఠులును రాజ కార్యమునకు యోగ్యులైనవారు (దానియేలు 1:4) వారికి బబులోను తర్పీదు శాలలో 3 సంవత్సరములు తర్పీదు లభించింది. (దానియేలు 1:5) వారి స్వదేశ పేరులను మార్చుటకు బెత్తెషాజరు అను క్రొత్త పేరు దానియేలుకు ఇవ్వబడినది. దానియేలు యొక్క జ్ఞానము మరియు కలల భావము చెప్పు సామర్థ్యము వలన ఆయనకు నెబుకద్నెజరు, దర్యావేషుల రాజ్యాంగములలో ప్రవేశము కలిగినది. ఎటువంటి అపవిత్రతకును లోనుకాని దానియేలును నీతితో నిండిన జీవితమునకు మాదిరిగా యెహెజ్కేలు చూపించుచున్నాడు. (యెహె 14 - 20, 28: 13) విశ్వాసము, ప్రార్థన జీవితము, ధైర్యము, నీతి భక్తి, క్రమము అనునవి నిండిన జీవితముగా ఆయన జీవితము ఉన్నది. నీవు బహుప్రియుడవు అని ప్రభువు ఆయనను పిలుచుచున్నాడు. బబులోను సామ్రాజ్యము పతనమయి మాదీయ పారశీక సామ్రాజ్యము వచ్చినప్పటికిని దానియేలు తన శేష్టమైన పదవిలో కొనసాగాడు. నెబుకద్నెజరు, బెల్లసరు, దర్యావేషు,
కోరెసు, అను నలుగురు రాజుల కాలములోను ప్రధానమంత్రి అను శ్రేష్టమైన పదవిని వహించాడు.
గ్రంథకర్త : దానియేలు
దానియేలు కాలము : అష్హూరు సామ్రాజ్యమునకు విరోధముగా బబులోను కలవరము చేసి క్రీ.పూ. 612లో అష్హూరు రాజధాని అయిన నినెవేను పట్టుకున్నది. క్రీ.పూ. 605 ఐగుప్తు సైన్యమును జయించుట ద్వారా మధ్య తూర్పు దేశములపాలన ఆధిక్యము బబులోనుకు లభించింది. అదే సంవత్సరములో నెబుకద్నెజరు యెరూషలేమును జయించినపుడు చెరపట్టబడినవారిలో ఒకడుగా దానియేలు ఉన్నాడు. బబులోను చెరనివాసకాలమంతయు ఒక పాలకుడుగాను, ప్రవక్త గాను దానియేలు జీవించాడు. మాదీయులు పారశీకులు బబులోనును హస్తగతం చేసుకున్నాను. దానియేలు యొక్క పదవిలో మార్పు కలుగలేదు. పారశీక రాజైన కోరెషు యొద్ద పలుకుబడి పొందుటకు నూరు సంవత్సరములకు ముందే యెషయా కోరెషును గూర్చి ప్రవచించిన ప్రవచనమును ఆయన గ్రహింపునకు తెచ్చుటకు దానియేలు ప్రయత్నించియుండవచ్చును. దాని యొక్క ఫలితముగానే కోరెషు తన పాలన మొదటి సంవత్సరములోనే యెరూషలేము దేవాలయము మరల కట్టబడుటకు ఆజ్ఞను జారీ చేసియుండవచ్చును. దానియేలు
ప్రవచించిన విధముగా పారశీకరాజ్యము అలెగ్జాండరు దండెత్తువరకు నిలిచియుండినది. (దానియేలు 11:2-3), దాని తరువాత గ్రీకు సామ్రాజ్యము దాని పతనము తరువాత రోమా సామ్రాజ్యమును ఉద్భవించినవి.
ముఖ్య స్థలములు : నెబుకద్నెజరు యొక్క అంతఃపురము; అగ్నిగుండము, బెల్లసరు యొక్క విందుశాల, సింహముల గుహ.
గ్రంథ విశిష్టత : దానియేలు యొక్క దైవ దర్శనములు, మెస్సియాను గూర్చి సూటియైన ప్రవచనముల వంటివి నిండిన అనేక కాల మట్టములలో దేవుని ప్రణాళికలను గూర్చిన ఒక క్లుప్త వివరణ ఈ గ్రంథములో ఇవ్వబడియున్నది. ( 8 - 12 అధ్యాయములు)
ముఖ్య పదజాలము : మహోన్నతుడైన దేవుడు, మానవుల రాజ్యాంగములను, పదవులను నియంత్రించే ఉన్నతమైన దేవుని ఈ ప్రవచనము మనకు చూపించుచున్నది. దేవుని యొక్క మార్పులేని పాలన ఎల్లప్పుడును ఉండునను దానిని దానియేలు తెలియజేయుచున్నాడు.
ముఖ్య మైన వచనములు : దానియేలు 2:20-22; దానియేలు 2:44
ముఖ్యమైన ఆధ్యాయము : దానియేలు 9; డెబ్బై (70) వారములను గూర్చిన ప్రవచనము Dan,9,24,27 లో కనిపించుచున్నది. వీటిలో మొదటి 69 వారములు క్రీస్తు యొక్క రాకడతో నెరవేరినవననునది స్పష్టము. 69 - 70 వారముల మధ్యలో ఒక విరామము ఉన్నట్లుగా బైబులు పండితులు అభిప్రాయపడుచున్నారు. మనము ఈ వివిరామకాలములో జీవించుచున్నాము. 70వ వారము క్రీస్తు యొక్క రెండవ రాకడకు సంబంధించిన 7 సంవత్సరములను చూపించుచున్నది. ఎప్పుడు ఆ 70వ వారము వస్తుంది? దేవునికి మాత్రమే తెలుసు.
గ్రంథ విభజన : పాతనిబంధన ప్రకటన గ్రంథము అని పిలువతగిన దానియేలు ప్రవచన గ్రంథము దీర్ఘకాల ప్రపంచ చరిత్రను తెలిపే గ్రంథమగును మొదటి అధ్యాయము యొక్క ఉపోద్ఘాతము అర్ధమయిన తరువాత 2 నుంచి 7 వరకున్న అధ్యాయములలో లోకము యొక్క భవిష్యత్తు చెప్పబడియుంటున్నది. 8 నుండి 12 వరకైన అధ్యాయములలో అన్యజనుల పాలన క్రింద యూదా ప్రజల భ విష్యత్తు చెప్పబడియున్నది. ప్రపంచ చరిత్రపై దేవుని పరిపాలన (అధికారము) అను అభిప్రాయము ఈ ప్రవచనముల మూలముగా గ్రాహ్యమగుచున్నది. అది బబులోనీయుల వలన నాశనము చేయబడిన యూదా ప్రజలకును, క్రైస్తవ సంఘములకును ఓదార్పును, ఆధరణను ఇచ్చుచున్నది. బబులోను, పారశీకము, గ్రీకు, రోమా మహాసామ్రాజ్యములు ఉదయించి అస్తమించును. అయినను దేవుని విమోచన జనము ద్వారా ఆయన తన నిత్యరాజ్యమును స్థాపిస్తాడు. దానికి ఎప్పుడును అంతము లేదు. గ్రంథవిభజన క్రింద చూడండి.
దానియేలు యొక్క వ్యక్తిగత జీవితము అధ్యాయము 1.
అన్యజనుల దేశముల భవిష్యత్ కాల స్థితి అధ్యాయము 2 – 7.
(a) నెబుకద్నెజరు కలలు అధ్యా 2 - 4.
(b) బెల్లసరు దర్శనము అధ్యా 5.
(C) దర్యావేషు ఆజ్ఞ అధ్యా 6.
(d) నాలుగు (జంతువుల) దర్శనము అధ్యా 7 (మృగముల)
ఇశ్రాయేలీయుల భవిష్యత్ కాల స్థితి. అధ్యా 8 - 12.
( a) పొట్టేలు మరియు మేకపోతుల దర్శనము. అధ్యా 8.
(b) 70 వారముల గూర్చిన దర్శనము అధ్యా 9.
(C) ఇశ్రాయేలీయుల భవిష్యత్తును గూర్చిన దర్శనము. అద్యా 10 - 12.
కొన్ని క్లుప్త వివరములు : పరిశుద్ధ గ్రంథములో 27వ గ్రంథము, అధ్యాయములు 12, వచనములు 357; ప్రశ్నలు 16; చరిత్రకు సంబంధించిన వచనములు 218; నెరవేరిన ప్రవచనములు 79; నెరవేరని ప్రవచనములు 60; ఆజ్ఞలు 7; వాగ్దానములు 4; దేవుని యొద్ద నుండి ప్రత్యేక వర్తమానములు 16.
Hosea - హోషేయ
సొలొమోను కాలమునకు తరువాత కనాను దేశము యూదా అనియు, ఇశ్రాయేలు అనియు రెండు భాగములుగా విభాగించబడి నిలిచిన రెండు రాజ్యములలో ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలులో ప్రవచనా సేవను నెరవేర్చిన వాడు హోషేయ. ఎప్రాయీము గోత్రీకుడైన యరొబాము విభజించబడిన ఉత్తర ఇశ్రాయేలుకు
మొట్టమొదటి రాజుగా ఉండెను. భూగోళ శాస్త్ర ప్రకారము పాలస్తీనా యొక్క మధ్య భాగములో ఎఫ్రాయీము గోత్రము యొక్క నివాసములుండెను. అనేక పరిస్థితులలో ఇశ్రాయేలీయుల పది గోత్రములలో ఎంతో ముఖ్యమైన గోత్రముగా ఎఫ్రాయీము గోత్రము పరిగణించబడి నందువలన ఉత్తరదేశమును ఎఫ్రాయీము అని హోషేయ పిలిచెను. హోషేయ అంటే రక్షణ అని అర్ధము. ఇశ్రాయేలు యొక్క పతనమైపోయిన ఆత్మీయ స్థితికి ఉదాహరణముగా గోమెరు అను స్త్రీని దేవుని ఆజ్ఞానుసారముగా హోషేయ పెండ్లాడెను. ఇశ్రాయేలీయుల విగ్రహారాధనకును, దేవునితో కలిగియున్న యదార్థత లేని స్థితికిని ప్రవక్త యొక్క కుటుంబము ఒక క్రియారూపకమైన పాఠముగా మార్చబడినది. హోషేయ ప్రవచనములో మూడు ముఖ్య భాగములు ఇమిడియున్నవి. 1. దేవుడు తన ప్రజల పాపములను ద్వేషించుచున్నాడు. 2. దేశము తీర్పు పొందడం నిశ్చయము. 3. తమ ప్రజలతో దేవునికున్న ప్రేమ ఏ మాత్రము మార్పు చెందనిది.
గ్రంథకర్త :
బెయేరి కుమారుడైన హోషేయ ఈ గ్రంథము యొక్క గ్రంథకర్త. అని మొదటి వచనము హక్కుతో మెచ్చుకొనుట ఎవరు కాదనలేరు. ఆయన జన్మించిన ప్రదేశము ఏది అని ఎక్కడా వ్రాయబడలేదు. అయినను ఉత్తర దేశమైన ఇశ్రాయేలుతో నిరంతర సంబంధము కలిగిన వాడుగా నుండినందున ఆయన జన్మించిన స్థలము యూదా కాదుగాని ఇశ్రాయేలుగా ఉండి ఉండవచ్చును. హోషేయ 7:5 లో ఇశ్రాయేలు రాజును గూర్చి మన రాజు అని చెప్పుట ఈ తలంపును నిర్ధారణ చేయుచున్నది. భార్య గోమెరును ఇద్దరు కుమారులును, ఒక కుమార్తెయు కలిగిన కుటుంబముగా కనబడెను. (హోషేయ 1:1-9) పరిశుద్ధ గ్రంథములో ఇతర స్థలములన్నీటిలో ఆయనను గూర్చిన వర్తమానము ఏవియును తెలిసికొనుటకు తరుణము లేదు.
తమ దేశ ప్రజలైన ఇశ్రాయేలు యొక్క మోసము, నరహత్యలు, అబద్ధము, కృతజ్ఞతలేని స్థితి, విగ్రహారాధన, దురాశ అనువాటినన్నింటిని గూర్చి హెచ్చరించుచున్నాడు. అయినను ఆయన వార్త మిక్కిలి కరుణతో కూడినదై నమ్మకముతో నింపబడినదిగానున్నది. హోషేయ తమ స్వంత జీవితములో వ్యభిచార జీవితమును జీవించిన భార్య గోమెరు ద్వారా అనుభవించిన దుఃఖము ఆయన హృదయమును కనికరముతో నిండియుండియుండవచ్చును.
కాలము :- హోషేయ 1:1 లో చూచిన రీతిగా ఉజ్జీయా, యోతాము ఆహాజు హిజ్కియా మొదలైన యూదా రాజులకాలములోను, రెండవ యరొబాము అను ఇశ్రాయేలీయుల రాజు కాలములోనే హోషేయ తన సేవను నెరవేర్చెను. ఇశ్రాయేలీయులలో మరియొక ప్రవక్తగా యుండిన ఆమోసు, యూదా ప్రవక్తగా నుండిన
యెషయా, మీకా, అనువారి యొక్క కాలములో నుండిన ప్రవక్తగా ఈయన ఉంటున్నాడు. హోషేయ యొక్క దీర్ఘకాల ప్రవచనము రెండవ యరొబాము కాలములోను తరువాత ఇశ్రాయేలీయుల రాజు యొక్క చివరి కాలములో పరిపాలించిన జెకర్యా నుండి హో షేయ వరకు గల ఆరుగురు రాజుల కాలములోను
కొనసాగెను. ఆయన సేవాకాలము దాదాపుగా క్రీ.పూ 755 నుండి క్రీ.పూ 710 వరకు అని ఊహించవచ్చును. క్రీ.పూ 710 సంవత్సరముమునకు సమీపించిన హిజ్కియా పరిపాలనా కాలములో హో షేయ తన ప్రవచనా గ్రంథమును వ్రాసినట్లుగా తీసుకోవచ్చును. తన ప్రవచనా సేవ యొక్క నలుబది సంవత్సరముల కాల కార్య క్రమములతో నిండినది హోషేయ గ్రంథము.
హోషేయ సేవ ప్రారంభకాలములో ఇశ్రాయేలు రెండవ యరొబాము యొక్క పరిపాలన క్రింద సమృద్ధికలిగియుండెను. అయినను మూడవ తిగ్లత్పిలెసెరు యొక్క (క్రీ.పూ 745 - 727 ) పరిపాలనలో అష్హూరు ఎంతో ప్రఖ్యాతిగాంచిన వెంటనే ఇశ్రాయేలు పతనము వైపు సాగెను. చివరి ఆరుగురు రాజుల పరిపాలనా కాలములో ఎంతో క్లుప్తమైనవిగా నుండెను. వారిలో నలుగురు చంపబడిరి. 5వ రాజు బానిసగా అష్హూరుకు కొనిపోబడెను. ఉత్తర దేశపు రాజు యొక్క చివరి దినములు కలవరముతోను, వెనుకంజవేయు స్థితితో నిండినదిగా నుండినవి. అధర్మము విగ్రహారాధన ద్వారా ప్రజలు ఆత్మీయ గ్రుడ్డితనములో జీవించిరి.
ముఖ్యమాట : తిరుగుట, అధర్మము, విగ్రహారాధన విడిచి పెట్టి యెహోవా వైపు తిరుగుటకు ఆహ్వానము ఈ ప్రవచనా గ్రంథమంతటిలో మ్రోగడము మనము వినగలము.
ముఖ్య వచనములు : హోషేయ 4:1; హోషేయ 11:7-9
ముఖ్య అధ్యాయము : హోషేయ 4
ఇశ్రాయేలీయులు సత్యమును గూర్చిన జ్ఞానమును విడిచి అన్యులయొక్క విగ్రహారాధనను వెంబడించిరి. నా జనములు జ్ఞానము లేనివారైనశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండ నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేను నీ కుమారులను మరుతును అని హోషేయ 4:6 లో చూచుచున్న మాటలు హోషేయ ప్రవచనా వర్తమానము యొక్క ముఖ్యాంశమైయున్నది.
విభజన : యూదా దేశపు చివరి దినములలో యిర్మీయా చేసిన ప్రవచనా సేవతో ఇశ్రాయేలు యొక్క చివరి దినములలో దేవుని శుభవర్తమానమును ప్రకటించిన హోషేయ సేవను సరిపోల్చివచ్చును. శీలసంబంధముగా, యదార్థతలేని స్థితిని పడిపోవుచున్న ఇశ్రాయేలీయులు తిరిగి తన వైపు తిప్పుకొనుటకు దేవుడు చేసిన చివరి ప్రయాసమని దీనిని మనము ఊహించవచ్చును. భార్య భర్త బాంధవ్యములో ఒక్కరు మాత్రము యదార్థముగా ప్రేమలో నిలిచిన హోషేయ యొక్క స్వంత జీవితమువలె ఇశ్రాయేలుకు దేవుని గల సంబంధము కనబడినది. హోషేయ కుటుంబ జీవితములో కనబడిన దుర్మార్గాస్థితి ఇశ్రాయేలు దేశమునకు ఏర్పడిన దుర్మార్గస్థితికి చిత్రపటముగా పరిగణింపబడుచున్నది. గోమెరు అన్య ప్రజలను వెంబడించినట్లుగా ఇశ్రాయేలు అన్యదేవతలను వెంబడించెను. హోషేయ గ్రంథమును ఈ రెండు గొప్ప భాగములుగా విభజించవచ్చును.
దుర్మార్గముతో నిండిన భార్యయు యధార్థతగల భర్తయు అధ్యా 1 - 3.
విగ్రహారాధనతో నిండిన ఇశ్రాయేలును యదార్ధతగల దేవుడును 4 -14.
మానవులు పాపములో పడి యదార్థత లేనివారుగా మారినపుడు, యదార్థత, ప్రేమ అనువాటిలో మార్పు లేనివాడును. వారి ఉజ్జీవము కొరకు ప్రేమతో కని పెట్టుచున్న దేవుని యొక్క స్వభావము ఈ గ్రంథములో మనము చూచుచున్నాము.
కొన్ని ముఖ్య వివరములు : పరిశుద్ధ గ్రంథము యొక్క 28వ గ్రంథము, అధ్యాయములు 14; వచనములు 197; ప్రశ్నలు 16; ఆజ్ఞలు 26; వాగ్దానము 10; హెచ్చరికలు 298; ప్రవచనా వచనములు 152; నెరవేరని ప్రవచనములు 17; నెరవేరిన ప్రవచనములు 134; దేవుని యొద్ద నుండి ప్రత్యేకమైన వర్తమానములు 10.
దక్షిణ రాజ్యమైన యూదా రాజ్యమును యోవాషు రాజు క్రీ.పూ 835వ సంవత్సరము నుండి 796వ సంవత్సరము వరకు పరిపాలించెను. ఆ రాజు కాలములో గొప్ప మిడుతల దండు ఒకటి ఆదేశములో ప్రవేశించెను. ఆదండు ఆదేశములోని పొలము పంటలను, ఫలవృక్షములను సర్వనాశనము చేయగా దేశ ప్రజలు బహుగా క్షామపీడితులైరి. అట్టితరుణములో దేవుని ప్రవక్త లేక దీర్ఘదర్శిమైన యోవేలు ద్వారా దేవుడు తన సందేశమును ప్రజల యొద్దుకు పంపెను. ఆ సందేశమే యోవేలు గ్రంథము. మిడుతల దండు సృజించిన ఈ భీబత్సము - మానవుని పాప ఫలితముగా దేవుడు పంపిన కఠిన దండనను వర్ణించుచున్నది. అయితే అంత్యదినములలో అనగా ప్రభువు దినమున దేవుడు ప్రజల మీదికి తీసుకొని రాబోవుచున్న ప్రతి దండన మిక్కిలి భయంకరముగా నుండునని యోవేలు హెచ్చరించుచున్నాడు. ప్రభువు దినమున దేశము మీదికి రాబోవు అపాయము బహుకఠినముగా నుండుననియు, దాని ముందు గత కాలపు ప్రతి దండన మిక్కిలి అల్పమైనదిగా నుండుననియు ప్రవక్త వివరించెను. ఆదినమున దేవుడు తన శత్రువులనునిత్య తీర్పునకు లోబరచును. తనకు యధార్ధముగా లోబడువారికి ఆయన శ్రేష్ఠ ఫలముల నిచ్చును.
యోవేలు అను పదమునకు హెబ్రీభాషలో యెహోవాయే దేవుడు అని అర్థము. ఈ అర్థము గ్రంథసారాంశముతో ఏకీభవించుచున్నది. దేవుడు చరిత్రయంతటిపై సర్వాధికారిగా పరిపాలించుచున్నాడని ఈ నామము స్పష్టపరచుచున్నది. సర్వశక్తి సంపన్నుడైన మన దేవుడు, సమస్త ప్రకృతి మీదను, సకల రాజ్యముల మీదను సర్వాధికారము కలిగియున్నాడు.
గ్రంథకర్త : ఈ గ్రంథరచయిత యోవేలు. యోవేలు అను పేరు గల మరి పదుముగ్గురిని పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలము. అయితే ప్రవక్తయైన యోవేలును గూర్చిన సమాచారమును ఈ గ్రంథములో మాత్రమే కనుగొనగలము. ఈ గ్రంథరచయిత పెతూయేలు కుమారుడని విశదమగుచున్నది. పెతూయేలు అనగా దేవుని చేత ప్రేరేపణ పొందినవాడు అని అర్థము. సీయోనును గూర్చియు, దేవాలయమును గూర్చియు మాటి మాటికి ప్రస్తావించుటను బట్టి యోవేలు యెరూషలేమునకు సమీపముగా నివసించెనని మనము తలంచవచ్చును. యాజకత్వమును గూర్చి యోవేలు 1:13-14; యోవేలు 2:17 మున్నగు వచనములలో చెప్పినందున యోవేలు ఏకకాలమున ప్రవక్తగాను, యాజకుడుగాను ఉండియుండెనని కొందరు అభిప్రాయపడుచున్నారు. ఏది ఏమైనను, జనులు మారు మనస్సు పొందవలెనని యోవేలు ప్రవక్త అసందిగ్ధమైన భాషలో క్లుప్తముగా, స్పష్టముగా బోధించెను.
యోవేలు కాలము : యూదయలో పరిచర్య చేసిన ప్రారంభ ప్రవక్తలలో యోవేలు ఒకడు. యోవేలు 3:16ను ఆమోసు 1:2తోను, యోవేలు 3:18ను ఆమోసు 9:13 తోను పోల్చి చూచినప్పుడు ఆయా వాక్యముల సమభావములను బట్టి ఆమోసు ఈయనకు (యోవేలుకు) సమకాలికుడని మనము తలంచుటకు వీలు కలుగుచున్నది. క్రీ.పూ 835 నుండి 796 వరకు యూదా రాజ్యపాలన గావించిన రాజాయెను. ఆయనకు రాజ్యపాలన చేయు వయస్సు వచ్చువరకు - దేశము యాజకుడైన యెహో యాదా సంరక్షణలో నుండెను. అందువలన యోవేలు తన గ్రంథములో ఏ రాజు పేరునైనను ప్రస్తావించి యుండ లేదు అని కొందరు అభిప్రాయపడుచున్నారు. యోవేలు తొలి ప్రవక్తలలో ఒకడైయుండినందున ఈయన ఎలీషా ప్రవక్తకు సమకాలికుడు అయ్యే అవకాశము గలదు.
ముఖ్య సందేశము : మహాభయంకరమైన ప్రభుదినము రాబోవుచున్నది అనునది యోవేలు అందించిన ముఖ్య వర్తమానము.
ప్రాముఖ్య వచనములు : యోవేలు 2:11; యోవేలు 2:28-29
ప్రాముఖ్యమైన అధ్యాయము : 2
ఇప్పుడైనను మీరు ఉపవాసముండి, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి (యోవేలు 2:12-13) అనునదియే యోవేలు పిలుపు. యూదాజనం, ప్రవక్త చెప్పిన ప్రకారము దేవుని వైపు తిరిగిన యెడల, దేవుడు తాను చేయ నుద్దేశించిన కీడును చేయక మానుకొనును అను వాగ్దానమును యోవేలు వారికి ఇచ్చియున్నాడు. హృదయ పూర్వకముగా పశ్చాత్తాపపడు వారి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడునను దేవుని వాగ్దానమును కూడ యోవేలు వారికి తెలియజేసెను. పెంతెకోస్తు దినమున మేడ గదిలోనున్న విశ్వాసుల మీదికి పరిశుద్ధాత్మ దిగివచ్చుట ఈ వాగ్దానమును అనుసరించి జరిగినదే. పశ్చాత్తాప పడని వారి మీదికి యేసు క్రీస్తు రాకడ దినములలో దేవుని న్యాయ తీర్పు వచ్చును.
సారాంశము : యోవేలు గ్రంథము నందు మిడుతల దండువలన సంభవించిన వినాశము, హానికరమైన వ్యాధులు, క్షామములు, అగ్నివలన కలుగు ప్రమాదములు సైన్యములు దండెత్తుట, ఆకాశము నుండి వచ్చు అపాయములు అను అపాయముల పట్టికను చూడగలము. రాబోవు న్యాయ తీర్పు వర్ణింపబడినది. దేవుని కృపను, విశ్వాసమును పుట్టించు దేవుని వాగ్దానములను ఈ గ్రంథములో చూడగలము. ప్రభువు దినమును గూర్చి భూతకాలములో చెప్పబడినను అది భవిష్యత్తులో జరుగనున్నది.
గ్రంథ విభజన : (1) ప్రభువు దినము. భూతకాల దృష్టి యోవేలు 1:1-20
(అ) గతించిన కాలములో జరిగిన మిడుతల దాడి యోవేలు 1:1-12
(ఆ) పైరులు, ఫలములు నశించుట, క్షామము యోవేలు 1:13-20
(2) ప్రభువు దినము : భవిష్యత్ కాల దృష్టి Joel,2,1,21
(అ) సమీపించుచున్న ప్రభువు దినము యోవేలు 2:1-27 అన్యులు దండెత్తుట.
(ఆ) బహుదూరమున నున్న ప్రభువుదినము. యూదులు దేవుని వైపు మరలుట, అంతిమన్యాయ తీర్పు Joel,2,28-3,21
సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో ఇది 29వ పుస్తకము; అధ్యాయములు 3; వచనములు 73; ప్రశ్నలు 7; ఆజ్ఞలు 50; వాగ్దానములు 10; ప్రవచన వాక్యములు 69; నెరవేరినవి 11; నెరవేరబోవునవి 59; దేవుని యొద్ద నుండి వచ్చిన సందేశము 1. (Joel,1,2-3,21)
Amos - ఆమోసు
ఇశ్రాయేలు రాజ్యము బలమైన రాజును కలిగియుండి, శాంతి భద్రతలతో వర్ధిల్లుచున్న కాలములో ఆమోసు తన ప్రవచన పరిచర్య జరిగించెను. అది వ్యాపారాభివృద్ధిని, ధన వృద్ధిని సాధించుకొనిన కాలము. అయితే ప్రజలు అల్ప సంతోషమునిచ్చు పాప భోగములందు ఆనందించుచుండిరి. అన్యాయము అవినీతి ప్రబలెను. (అధికమాయెను) సత్యమైన సరియైన ఆరాధనా స్థానమును కపటాచారములు ఆక్రమించుట ప్రారంభమాయెను. భద్రత విషయముతో గట్టి నమ్మకము, దేవుని శిక్షను అలక్ష్యము చేయు పరిస్థితి హెచ్చగుచుండెను. దేశములో కరువు కాటకములు పెరిగినను అపాయకరమైన వ్యాధులు వ్యాప్తిజెందినను, యుద్ధము నాశనము పైబడినను, ఇవి ఏవియు ప్రజలలో పశ్చాత్తాపమును పుట్టించలేదు. మారుమనస్సు పొందుటకు ప్రజలు సిద్ధముగా లేరు. ఆమోసు పశువుల కాపరియైన ఒక గ్రామీణ యువకుడు. ఈయన దేవుని పిలుపుకు లోబడి దేశము మీదికి దేవుని తీర్పు త్వరగా రాబోవుచున్నదని హెచ్చరించి, మారుమనస్సు పొందవలెనని దేశ ప్రజలుకు పిలుపు నిచ్చెను. వేషధారణతో కూడియున్న వారి భక్తియు, నిర్లక్ష్యముతో కూడిన వారి మతాచారములును వారిని గంపలో కుళ్లిపోవుచున్న పండ్లవలే మార్చెను. క్రమశిక్షణా రాహిత్యము వృద్ధియయ్యెను. వారిలో హింసా ప్రవృత్తి పెరిగినందున దేవుని నీతి న్యాయములు ప్రజలను వీడిపోయెను.
ఆమోసు అను హెబ్రీపదమునకు భారము భరించుట అని అర్థము. ఆమోసు తన పేరుకు తగినట్లుగా కలహకారులైన ఇశ్రాయేలీయుల పాప భారమును భరిస్తూ, వారికి దేవుని సందేశమును అందించెను. దేవుడు తనకు అప్పగించిన పనిని ఆమోసు నెరవేర్చి, తన సేవను సంపూర్తి గావించుకొనెను.
గ్రంథకర్త : ఆమోసు
ఆమోసు కాలము : యూదా రాజైన ఉజ్జియా దినములలోను, ఇశ్రాయేలు రాజైన యోవాసు కుమారుడైన యరొబాము దిసములలోను, భూకంపము కలుగుటకు రెండు సంవత్సరములకు ముందు, ఆమోసు ప్రవచనము చెప్పుట ప్రారంభమాయెను (ఆమోసు 1:1). ఉజ్జియా యూదాను యేలిన కాలము క్రీ.పూ 792 నుండి 749 వరకు. రెండవ యరొబాము ఇశ్రాయేలును పాలించిన కాలము క్రీ.పూ 793 నుండి 753 వరకు పరిపాలన చేసెను. ఉజ్జియా కాలములో సంభవించిన ఈ భూకంపమును గూర్చి సుమారు 200 సంవత్సరములకు ముందే జెకర్యా ప్రవక్త ప్రవచించియుండెను. జెకర్యా 14:5). ఆమోసు 7:11 లో ఇశ్రాయేలీయులు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురని ప్రవచించెను. ఇది క్రీ.పూ 722లో నెరవేరెను. ఆ సంవత్సరములో అష్హూరు రాజు ఇశ్రాయేలీయులను అష్హూరు దేశములోనికి చెరకొని పోయెను. ఆమోసు ఈ ప్రవచనము చెప్పియున్నప్పుడు యరొబాము చనిపోలేదు అనునది స్పష్టము. ఆమోసు దక్షిణ రాజ్యమైన యూదాలో జన్మించినప్పటికి ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు రాజ్యములోని బేతేలులో తన ప్రవచన కార్యమును క్రీ.పూ 760 నుండి 750 వరకు జరిగెను.
ఓబద్యా, యోవేలు, యోనా మున్నగు ప్రవక్తల తరువాతను, హోషేయ, మీకా, యెషయా మున్నగు ప్రవక్తల కంటే కొంచెము ముందుగాను ఆమోసు ప్రవచించెను. ఆ కాలములో ఉజ్జీయా యూదా దేశమును చక్కగా పరిపాలించెను. ఆయన అమ్మోనీయులను, ఫిలిప్తీయులను, ఎదోమీయులను జయించెను. ఉత్తర దేశమును బలవంతుడైన రెండవ యరొబాము పాలించుచుండెను. దేశము ధనవృద్ధిని, సైనిక బలమును, అభివృద్ధిని కలిగియుండెను. లోకాశ, భక్తిహీనత, అవినీతి ప్రజల జీవితములో అధికమాయెను. (ఆమోసు 2:6-8; ఆమోసు 3:10; ఆమోసు 4:1; ఆమోసు 5:10-12; ఆమోసు 8:4-6) చెప్పబడలేదు. ఈ కాలములో అష్హూరియా, బబులోను, సిరియ, ఐగుప్తుయను రాజ్యములు ఇశ్రాయేలుతో పోల్చినపుడు బలహీనముగాయున్నవని చెప్పవచ్చును. ఈ స్థితిలో ఆమోసు పలికిన అపాయమేదనగా అష్హూరియా చెరవాసము జరుగ అవకాశము లేదని ప్రజలకు తోచినది. అయినప్పటికి 30 సంవత్సరములు జరిగిన తరువాత ప్రవచన నెరవేర్పుగా ఇశ్రాయేలీయుల పతనము జరిగినది.
గ్రంథ విభజన : ఆమోసు యూదయలో తాను జన్మించిన గ్రామమును విడిచి, ఇశ్రాయేలు దేశమునకు వెళ్లెను. తాను ఎన్నడును ఎదురుచూడని ఊహించని ఒక వర్తమానమును ఇశ్రాయేలీయులకు ప్రకటింవవలెనని దేవుడు ఆయనను పిలిచెను. సుఖ భోగములలో జీవిస్తున్న ఇశ్రాయేలీయులకు న్యాయ తీర్పును గూర్చిన ఆమోసు ప్రవచనములు తమ జీవిత కాలములోనే సంభవించుటకు ఆస్కారము లేదని తలంచిరి. ప్రవక్త అందించిన ఆ వర్తమానము అంగీకరించుటకు అయోగ్యముగానున్నట్లు వారు తలంచిరి.
ముఖ్య పదజాలము : ఇశ్రాయేలీయుల మీదనున్న న్యాయతీర్పు
ముఖ్యవచనములు : ఆమోసు 3:1-2; ఆమోసు 4:11-12
ముఖ్య ఆధ్యాయము : అధ్యాయము 9, ఆమోసు మిక్కిలి ఖచ్చితముగా భయంకర న్యాయ తీర్పును గూర్చి ఇచ్చు వర్తమానములకు మధ్యలో పరిశుద్ధ గ్రంథములోని ఇతర భాగముల కంటే, మిక్కిలి విశదముగా ఇశ్రాయేలీయుల రక్షణను గూర్చి ఈ అధ్యాయములో చెప్పుట చూడగలము. అబ్రహాముతోను దావీదుతో కూడ దేవుడు ఇశ్రాయేలీయులలో చేసిన నిబంధన “మెస్సియా” రాకడలో నెరవేరుటను గూర్చి, ఐదు వచనములలో మాత్రమే ప్రవక్త స్పష్టముగా వివరిస్తున్నాడు.
గ్రంథమును ఐదు భాగములుగా విభజింపవచ్చును.
ఆమోసు 1:1-2 వచనములలో ముందున్నవి మినహాయించి నాలుగు ముఖ్య భాగములు ఈ గ్రంథములో కనిపించుచున్నవి. గ్రంథములోని ముఖ్య భాగములు క్రింద ఇవ్వబడినవి.
ఉపోద్ఘాతము : ఆమోసు 1:1- 2. 2. ఎనిమిది న్యాయ తీర్పులు : (దయస్కు, గాజా తూరు, ఎదోము, అమ్మోనీయులు, మోయాబు యూదా, ఇశ్రాయేలులపై) న్యాయ తీర్పు ఆమోసు 1:3; ఆమోసు 2:16. 3. న్యాయ తీర్పును గూర్చిన మూడు ప్రసంగములు : Amos,3,1-6,14. 4. న్యాయ తీర్పును గూర్చిన ఐదు దర్శనములు : Amos,7,1-9,10 (మిడుతలు, అగ్ని, మట్టపుగుండు , వేసవి కాలపు పండ్ల గంప, పైకమ్ములు). 5. విమోచనను గూర్చిన ఐదు వచనములు ఆమోసు 9:11-15.
సంఖ్యా వివరములు : దేవుని పరిశుద్ధ గ్రంథములో ఇది 30వ పుస్తకము; అద్యాయములు 9 ; వచనములు 146; ఆజ్ఞలు 28; ప్రశ్నలు 31; వాగ్దానములు 2; హెచ్చరికలు 117, ప్రవచనములు 121; నెరవేరని ప్రవచనములు 8; నెరవేరిన ప్రవచనములు 113; దేవుని నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 35.
Obadiah - ఓబద్యా
యాకోబు ఏశావులు కవల సోదరులు. ఏశావును ఎదోము అనియు పిలిచెడివారు. ఏశావు అనగా ఎఱ్ఱనివాడు అని అర్థము. ఏశావుకు ఎరుపు రంగుతో పలు సంబంధములు గలవు. అతని శరీరఛాయ ఎరువు. అతని బలహీనత ఎఱ్ఱని చిక్కుడు కాయల వంటకము కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్ముకొనుట. అతడు ఎఱ్ఱని బండలు గల దేశమును తన నివాస స్థలముగా చేసికొనెను. (ఆదికాండము 25:25; ఆదికాండము 25:30; ఆదికాండము 36:1) యాకోబు హారానులో 20 సంవత్సరములు నివసించినపుడు ఏశావు శేయీరు మన్యము ఎతైన కొండ శిఖరముల పైనున్న పీఠభూమలో ఈ సెలానగరము, ఎఱ్ఱనిబండలతో నిండియున్నందునను, అతని పేరును బట్టి ఆదేశమును ఎదోము దేశమని పిలువబడెను. (ఆదికాండము 32:3) అది ఇంచుమించు 100 చదరపు మైళ్ల విస్తీర్ణము గల కొండ ప్రాంతము. ఎదోము దేశము (శేయీరు మన్యము) అరాబాకు తూర్పునను, మృతసముద్రమునకు దక్షిణమునను ఉన్నది.
ఎదోమీయుల మీదికి రాబోవుచున్న సంపూర్ణ నాశనమును గూర్చి ప్రవచించుటయే ఈ గ్రంథములోని విషయము. ఓబద్యా అనగా “యెహోవాను ఆరాధించువాడు”. లేక యెహోవాను సేవించువాడు అని అర్ధము.
గ్రంథకర్త : ఓబద్యా
కాలము : గ్రంథరచన జరిగిన కాలము వ్రాయబడలేదు.
గత చరిత్ర : ఎదోము దేశమునకు సెలా రాజదాని. సెలాను పెట్రా అనియు పిలుతురు. పెట్రా అనగా బండ అని అర్థము. చరిత్రలోని అద్భుతములలో పెట్రా నగరము ఒకటి. కొండల సందులలో ఈ అద్భుత నగరము నిర్మించిరి. దీనిని జయించుట శత్రువులకు సులభము కాదు. ఎత్తైన కొండ శిఖరముల పైనున్న పీఠభూమిలో ఈ సెలానగరము, యుండెను. కొండల మధ్య నుండు సందుల మార్గమున మాత్రమే ఈ సెలా నగరమున ప్రవేశించుట సాధ్యమగును. గొప్ప సైన్యముతో ఈ సందుల మార్గమున పయనించి ఈ నగరమును పట్టుకొనుట ఎవరికినీ సాధ్యము కాదు. చిన్న చిన్న గుంపులుగా ఎక్కి వచ్చి శత్రువులను ఓడించుట ఈ నగర వాసులకు సులభము.
నగరము బద్రముగా ఉన్నప్పటికి, దేవునితీర్పు నుండి తప్పించుటకు ఆ కొండలవలన కాలేదు. యెరూషలేము పతనమునకు ఐదు సంవత్సరములకు తరువాత బబులోను సైన్యము ఈ నగరమును జయించినట్టు చరిత్ర తెలుపుచున్నది. అయినప్పటికి మక్కబీయుల కాలములో ఎదోమీయులు తిరిగి శక్తి పొందినట్లు చూడగలము. యేసుక్రీస్తు పుట్టుక సమయములో యూదాలో పరిపాలించుచుండిన హేరోదు ఒక ఎదోమీయుడు క్రీ.శ. 70వ సంవత్సరములో టైటస్ రాజు యొక్క నాయకత్వములో వచ్చిన రోమా సైన్యము ఎదోమును సమూలనాశనము చేసిరి. ఆయన వీరిని కాల్చి ఏశావు యొక్క వంశములో శేషము లేకుండ భక్షించిరి అని 18వ వచనములో చెప్పబడిన ప్రవచనము ప్రకారము నెరవేరినది.
ముఖ్య పదజాలము : ఎదోము యొక్క న్యాయ తీర్పు.
ముఖ్య వచనములు : ఓబద్యా 1:10-21
నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు, ఒక నెన్నటికిని లేకుండ మీరు నిర్మూలమగుదువు. (వచ 10) మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుట సీయోను కొండమీద రక్షకులు పుట్టుదురు అప్పుడు రాజ్యము యెహోవాదియగును (వచ 21)
గ్రంథ విభజన : 21 వచనములను కలిగియున్న ఈ గ్రంథము పాతనిబంధనలో మిక్కిలి చిన్న గ్రంథము. అయినను న్యాయ తీర్పుతో నిండియున్న శక్తివంతమైన వర్తమానమును దీనిలో చూడగలము. విమోచింపబడు అవకాశమే లేనివిధముగా , ఎదోము దేశ నాశనమును ముద్రింనబడియున్నది. దేవుడు ఎదోమీయుల అహంకామునకు ప్రతీకారము చేసి యాకోబు వంశీయులను విమోచించు ననునదియే ఓబద్యా ప్రవచించిన సందేశము. ఓబద్యా గ్రంథమును రెండు భాగములుగా విభజింపవచ్చును.
ఎదోము మీదికి రాబోవు న్యాయ తీర్పు (ఓబద్యా 1:1-16)
ఇశ్రాయేలీయుల విమోచన (ఓబద్యా 1:17-21)
సంఖ్యా వివరములు : ఓబద్యా గ్రంథము పరిశుద్ధ గ్రంథములోని 31వ పుస్తకము. అధ్యాయములు 1; వచనములు 21; ఆజ్ఞలు 1; ప్రశ్నలు 4; వాగ్దానములు లేవు; హెచ్చరికలు 30; ఆ ప్రవచనములు మొత్తము 12; నెరవేరిన ప్రవచనములు 5; నెరవేరనున్న ప్రవచనములు 7; దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 3 (ఓబద్యా 1:1; ఓబద్యా 1:7; ఓబద్యా 1:15)
Jonah - యోనా
యోనా అను హెబ్రీపదమునకు పావురము అని అర్ధము. లాటిన్, గ్రీక్ భాషలలో క్రమముగా జోన్స్ జోనా అను పదములు వినియోగింపబడినవి. తెలుగు అనువాదకులు వాటిని అంగీకరింపక యోనా అను హెబ్రీ పదమునే నేరుగా తెలుగు పరిశుద్ధ గ్రంథములో ఉపయోగించి యున్నారు.
ఉద్దేశము : దేవుని దయ మిక్కిలి శ్రేష్ఠమైనదని చూపుట. ఇందలి రక్షణ సందేశము అందరికి వర్తించును. అన్ని కాలముల వారికి వర్తించును.
గ్రంథకర్త : అమిత్తయి కుమారుడైన యోనా.
కాలము : క్రీపూ 793 – 753
ఎవరికి వ్రాయబడెను? ఇశ్రాయేలీయులకు లోకమంతటనున్న దేవుని ప్రజలకు.
గత చరిత్ర : నీనెవె పట్టణము అష్హూరు మహా సామ్రాజ్యమునకు రాజధాని. అష్హూరు ఇశ్రాయేలీయులకు గొప్ప శత్రువు. క్రీ.పూ. 722లో అష్హూరు ఇశ్రాయేలు దేశము మీద దండెత్తి జయము గాంచినది. యోనా ఆమోసు కంటే ముందు ప్రవచించినవాడు. ఇశ్రాయేలు రాజులలో మిక్కిలి బలవంతుడైన రెండవ యరొబాము పాలనా కాలములో యోనా ప్రవచించెను. (క్రీ.పూ 793 - 753; 2 రాజులు 14:23-25)
ముఖ్య వచనము : యోనా 4:11
ముఖ్య వ్యక్తులు : యోనా, ఓడ నావికుడు, ఓడలోని పనివారు, ప్రయాణికులు.
ముఖ్య స్థలములు : యెప్పే, నీనెవె
గ్రంథ విశిష్టత : నీనెవె ప్రజలకు యోనా చెప్పవలసిన ప్రవచనము ఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగును అనునదే (యోనా 3:4) ఈ పుస్తకములో మరియొక ప్రవచనము ఏదియు లేదు. యోనా జీవితమే ఇందలి ముఖ్య విషయము. యోనా జీవిత సంఘటనను తన మరణ పునరుత్థానములు సాదృశ్యమైన దానినిగా యేసు చూపుచున్నాడు. (మత్తయి 12:38-42)
సారాంశము : నీనెవె ప్రజలు మారు మనస్సు పొందుట
ముఖ్య వచనములు: యోనా 2:8-9; యోనా 4:27
ముఖ్య ఆధ్యాయము : 3
ప్రపంచ చరిత్రలో ఇంత గొప్ప ఉజ్జీవము మరి ఎన్నడును, ఎక్కడను జరుగలేదు. నీనెవె ప్రజలందరు మారు మనస్సు పొందుట ఇందు వర్ణింపబడెను.
గ్రంథ విభజన : నాలుగు అధ్యాయములు గల ఈ గ్రంథమును రెండేసి అధ్యాయములు గల రెండు ముఖ్య విభాగములుగా విభజింపవచ్చును. ఒక్కొక్క విభాగమును మరల స్పష్టమైన భాగములుగా విభజింపవచ్చును.
(1). యోనాకు దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ 1, 2 అధ్యాయములు.
దేవుని ఆజ్ఞను యోనా పాటించలేదు యోనా 1:1-3
దేవుని దండన యోనా మీదికి వచ్చెను యోనా 1:4-17
మహా మత్స్యము కడుపులో నుండి యోనా ప్రార్ధించగా విడుదల అనుగ్రహింపబడుట యోనా 2:1-10 (2). యోనాకు దేవుడిచ్చిన రెండవ ఆజ్ఞ 3, 4 అధ్యాయములు.
దేవుని ఆజ్ఞ, యోనా విధేయుడగుట యోనా 3:1-4
నీనెవె మారు మనస్సు పొందుట. శిక్ష తప్పింపబడుట యోనా 3:5-10
యోనా ప్రార్థన యోనా 4:1-3
యోనాను దేవుడు సరిదిద్దుట యోనా 4:4-10
దేవుడు యోనాకు నేర్పిన మిక్కిలి గొప్ప పాఠము యోనా 4:11
సంఖ్యా వివరములు : యోనా గ్రంథము పరిశుద్ధ గ్రంథములో 32వ పుస్తకము.
దీనిలోని - అధ్యాయము 4; వచనములు 48; ఆజ్ఞలు 8; ప్రశ్నలు 12; వాగ్దానములు లేవు; మొత్తము ప్రవచనములు 1; నెరవేరిన ప్రవచనములు: ప్రజలు మారు మనస్సు పొందగా అప్పటికి శిక్ష తప్పించబడినది. తరువాత చాలా కాలమునకు ఈ ప్రవచనము నెరవేరినది. దేవుని నుండి వచ్చిన పత్యేక వర్తమానములు : 6. (యోనా 1:2; యోనా 2:10; యోనా 3:2; యోనా 4:4; యోనా 4:9; యోనా 4:10)
Micah - మీకా
మీకా ఒక గ్రామీణ కుటుంబము నుండి దేవుని చేత పిలువబడిన యొక ప్రవక్త. ఇతడు యెరూషలేము రాజకుటుంబమునకును, యూదా ప్రజలకును, షోమ్రోను రాజకుటుంబమునకును, ఇశ్రాయేలు ప్రజలకును దేవుని న్యాయ తీర్పులను గూర్చిన వర్తమానములను ప్రవచనములుగా ప్రకటించి యున్నాడు. ధనవంతులును, అధికారులును పేద ప్రజలను బాధించుచు, క్రూరముగా హింసించుటను సహించలేక మీకా గొప్ప హృదయ భారముతో తన ప్రవచన వాక్యములను ప్రకటించెను. సామాజిక, రాజకీయ అధికారములను స్వార్ధలాభము కొరకు ఉపయోగించుచున్న వారిని ఆయన గద్దించుచున్నాడు. మీకా గ్రంథములో ముఖ్యములగు మూడు అభిప్రాయములను చూడగలము.
మొదటిది : తన ప్రజల పాపము, క్రూరత్వము. రెండవది : వాటికి ప్రతిగా దేవుడు పంపబోవుచున్న కఠిన న్యాయ తీర్పు. మూడవది : శిక్ష విధింపబడిన యనంతరము మిగిలిన ప్రజలను తనకు మహిమ కరముగా పునరుద్ధ రించుట. ఈ మూడు ఉద్దేశముల ద్వారా దేవుడు తన ప్రజల నుండి ఆశించినది ఏమనగా ---- న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు మాత్రమే.
మికాయా అను హెబ్రీ పదమునకు సంక్షిప్త రూపమే మికా. మీకాయా అను పదమునకు “యెహోవా వంటి వాడు ఎవడు” అని అర్థము. మీకా 7:18లో అడిగిన ప్రశ్న ద్వారా మీకా తన నామమును ప్రత్యేకముగా లిఖించుచున్నాడు.
గ్రంథకర్త : మీకా జన్మ స్థలమైన మోరె మోరేషేత్గతు (మీకా 1:14) యెరూషలేమునకు 40 కి. మీ దూరమున నైరుతి దిక్కుననున్నది. ఇది యూదయకును ఫీలిష్టియులకు సరిహద్దున, గాతునకు సమీపముననున్నది. ఆమోసువలె మీకా కూడా గ్రామీణుడే, ఆయన వృత్తిని గూర్చిన స్పష్ట సమాచారము లేదు. మోరెషెత్గతు గ్రామము వ్యవసాయ గ్రామము. అతడు వ్యవసాయదారుడై యుండవచ్చును. యెషయా దానియేలులవలె ఇతడు రాజకీయములను ఎరుగడు. అయినను ఆయన తన ప్రజల యొక్క శ్రమలను గూర్చి గాఢమైన హృదయ భారమును వ్యక్తపరచియున్నాడు. దేవుడు ఆయనను స్వయముగా పిలిచి ప్రవక్తగా ప్రత్యేకించెనను విషయము మీకా 3:8 ద్వారా స్పష్టమగుచున్నది. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడియున్నాను.
కాలము : ఈ గ్రంథములోని మొదటి వచనములో చెప్పబడిన ప్రకారము మికా ప్రవచించినది యోతాము (క్రీ.పూ 750 - 735), ఆహాజు (క్రీ.పూ 735 - 715 ), హిజ్కి యా (క్రీ పూ 715 - 686) అను యూదా రాజుల
కాలము అని గ్రహించగలము. ( 2 రాజులు 16 అధ్యాయము) ఈయన ప్రవచించినది ముఖ్యముగా యూదాను గూర్చియే అయినను, ఈయన ఇశ్రాయేలీయులను గూర్చి కూడ ప్రవచించి షోమ్రోను పతనమును ప్రవచించెను. ఈయన ప్రవచించిన కాలములో అధిక భాగము క్రీ.పూ 722లో సంభవించిన అష్హూరు చెరకు ముందే జరిగి యుండెనని ఊహింపవచ్చును. దేవుని ప్రజలలో విస్తరించియున్న విగ్రహారాధనను, క్రమ శిక్షణా రాహిత్యమును ఈ ప్రవక్త మిక్కిలి కఠినముగా ఎదిరించి తీర్పును ప్రకటించుట వలననే హిజ్కియా కాలములో గొప్ప ఉజ్జీవము కలిగినదనియు - అందువలన ఈ ఉజ్జీవమునకు ముందే మీకా క్రీ.పూ 742 నుండి క్రీ.పూ 687 వరకు గల కాలములో జరిగినదని నిర్ణయించుకొనవచ్చును. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు రాజ్యములో జీవించిన హోషేయకును, యెరూషలేములోని రాజ భవనములో జీవించిన యెషయాకును ఈయన సమకాలికుడు. మహోజ్వలమైన ఉజ్జియా పరిపాలనానంతరము యోతాము యూదా రాజాయెను. అతడు తన తండ్రియైన ఉజ్జియా వలె దేవుని దృష్టికి నీతిగా ప్రవర్తించెను. అయినను అతడు ఉన్నత స్థలములను నాశనము చేయలేదు. యోతాము తరువాత అతని కుమారుడైన ఆహాజు యూదా రాజాయెను. ఆహాజు దుష్టుడై ఇశ్రాయేలు రాజులవలె ప్రవర్తించెను. అతని కాలములో అష్హూరు సైన్యము వలనను సిరియా సైన్యముల వలనను యూదా మీదికి భయోత్పాతములు వచ్చెను. అతని తరువాత అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజాయెను. హిజ్కియా కాలములో అష్హూరు సైన్యము యెరూషలేమును ముట్టడించెను. దేవుడు అద్భుత రీతిగా హిజ్కియాను, అతని రాజ్యమును రక్షించెను. ఆయన దేవుని దృష్టికి నీతిమంతుడుగా జీవించెను. అతడు ఉన్నత స్థలములను పడగొట్టి, విగ్రహములను ధ్వంసము చేసెను. ప్రజలను పరిశుద్ధ జీవితములోనికి నడిపెను. మీకా ప్రవచించిన కాలములో 3వ తిగ్లేత్పిలేసరు, ఐదవ సల్మనేసరు, రెండవ షార్గోను, సేన్హరీబు అను రాజులు అష్హూరును పాలించిరి. ఆ కాలములో అష్హూరు పతాక స్థాయినందుకొనెను. ఆది యూదాకు బీతిని పుట్టించుచుండెను. ఆ దినములలో బబులోను కూడా అషూషరుకు లోబడియుండెను. మీకా - యూదులు బబులోనుకు చెరగొని పోదురని మీకా 4:10 లో ప్రవచించెను. అందువలన బబులోను రాజ్యము బలపడక పూర్వమే ఈ ప్రవచించెను.
ముఖ్య వర్తమానము : యూదా, న్యాయ తీర్పు – విమోచనము
ముఖ్య వచనములు : మీకా 6:8; మీకా 7:18
ముఖ్య అధ్యాయములు : 6, 7 అధ్యాయములు.
గ్రంథ విభజన : ముందుగా ప్రస్తావింపబడినట్లుగానే ఈ గ్రంథమును మూడు ముఖ్య విభాగములుగా చేసి వాటిని మరికొన్ని భాగములుగా వివరింపవచ్చును.
(1). న్యాయ తీర్పును, గూర్చిన ప్రవచనము : 1 - 3 అధ్యా.
జనుల మీదికి వచ్చు న్యాయ తీర్పు మీకా 1:1; మీకా 2:13.
నాయకుల మీదికి వచ్చ న్యాయ తీర్పు మీకా 3:1-12
(2). విమోచనను గూర్చిన ప్రవచనము : 4, 5 అధ్యాయాలు
రాబోవు రాజ్యమును గూర్చిన ప్రవచనము : మీకా 4:1-5.
చెర నుండి తిరిగి వచ్చుటను గూర్చిన వాగ్దానము : Mic,4,6-5,1.
రాబోవు రాజును గూర్చి వాగ్దానము మీకా 5:2-15.
(3). మారు మనస్సు పొందుటకైన పిలుపు : 6, 7 అధ్యాయములు.
దేవుని మొదటి పిలుపు : మీకా 6:1-9.
దేవుని రెండవ పిలుపు : మీకా 6:10; మీకా 7:6.
సంపూర్ణ రక్షణను గూర్చిన ప్రవచనము : మీకా 7:7-20
సంఖ్యా వివరములు : ఇది పరిశుద్ధ గ్రంథములో 33వ పుస్తకము. అధ్యాయములు 7; వచనములు 105; ఆజ్ఞలు 20; ప్రశ్నలు 23; వాగ్దానములు 2; హెచ్చరికలు 123; ప్రవచనములు మొత్తము 123; నెరవేరిన ప్రవచనములు 91; నెరవేరవలసిన ప్రవచనములు 32; దేవుని నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 7.
Nahum - నహూము
ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయ జూతురు; మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. లూకా 12:48. ఏకైక సత్యదేవుని తెలిసికొనే మంచి అవకాశము నీనెవెకు లభించినది. యోనా సందేశమును వినిన ఈ మహా పట్టణము మారు మనస్సు పొందినది. అందువలన దేవుడు తన అత్యంత కృపచేత దాని మీదికి రావలసిన శిక్షను నిలిపివేసెను. అయితే 100 సంవత్సరముల తరువాత ప్రవక్తయైన నహూము అదే పట్టణమునకు కలుగబోవు దుర్గతిని గూర్చి తన గ్రంథములో ప్రవచించుట చూడగలము. అష్హూరీయులు తమ ఆత్మీయ ఔన్నత్యము నుండి దిగజారిన తరువాత, వారు మరల తమ అక్రమములను, విగ్రహారాధనలను, దుష్టకర్మములను అనుసరించి. ఆ హేతువు చేతనే ఈ పట్టణమును బబులోను సర్వనాశనము చేయునని భూమిపై దీని పేరు చెరిపివేయబడునని నహూము ప్రవచించెను. ఈ ప్రవచనము మిక్కిలి భయంకరముగా అక్షరాలా నెరవేరెను. హెబ్రీ నామమైన నహూము నెహెమ్యా అను పేరుకు సంక్షిప్త రూపము. నహూము అనగా యెహోవా యొక్క ఆదరణ అని అర్ధము. అష్హూరు రాజధానియైన నీనెవె పతనమును గూర్చిన ప్రవచన వర్తమానము, నీనెవె చేతిలో శ్రమలు అనుభవించిన యూదాకును, ఇతర ప్రజలందరికిని మిక్కిలి ఆదరణ కరముగా నుండెను.
గ్రంథకర్త : నహూము, పాతనిబంధనలో నహూము 1:1 లో మాత్రమే ప్రవక్తయైన నహూమును గూర్చి లిఖింపబడియున్నది. అందు ఆయన ఎల్కోషు వాడు అని పిలువబడుచున్నాడు. ఎల్కోషు అను పేరుగల స్థలము ఎక్కడ ఉన్నది? దీనిని గూర్చి నాలుగు అభిప్రాయములు గలవు. (1). 16వ శతాబ్దములో నున్న ఒక సంప్రదాయమును బటి ఇరాక్ లోని అల్ కూస్ పటణమే ఈ ఎల్కొషు. ఈ పట్టణము ఇరాక్ లో, నేనెవేకు ఉతరమున టెగ్రీస్ నదీతీరమున గలదు. (2). గలలీయలోని రామా పట్టణమునకు సమీపమున నున్నట్టియు, ఎల్కెషి అని పిలువబడుచున్నట్టియు పట్టణమే ఎల్కోషు అని ఆది సంఘ పితరులలో ఒకరైన జరోము తలంచెను. (3). కప్నెహూము అనగా నహూము యొక్క నగరము అని అర్ధము. పూర్వము ఎల్కోషు అని పిలువబడిన పట్టణమే, నహూము జ్ఞాపకార్థముగా కపెర్నహూముగా మార్చబడినది అని కొందరు నమ్ముచున్నారు. (4). ఎల్కోషు అనునది దక్షిణ యూదాలో యెరూషలేమునకును, గాజాకును మధ్యలో ఉన్నదనియు, కాలక్రమములో ఎల్కేషేయి అని పిలువబడినదనియు బైబిలు పండితులలో అధిక సంఖ్యాకులు అభిప్రాయపడుచున్నారు. ఆఖరున చెప్పబడిన అభిప్రాయము ననుసరించి నహూము ప్రవక్త దక్షిణ దేశమైన యూదాకు జెందినవాడు. ఆయన యూదా విజయమును సంతోషముగా ప్రవచించుటను బట్టి ఆయన యూదా ప్రాంతమునకు జెందిన వాడని విశదమగుచున్నది (నహూము 1:15; నహూము 2:2)
నహూము కాలము : బబులోను దండయాత్ర ఫలితముగా నీనెవె క్రీ.పూ 612లో నాశనము చేయబడినది. నహూము 3:8-10 వచనములలో వ్రాయబడిన దానిని బట్టి నైలు నదీతీరమున నున్న తేబేసు (నో అమ్మోను) నాశనము నగరము యొక్క నాశనము సమీపకాల సంభవము తెలుపుచున్నది. తేబేసు నగరము
క్రీ.పూ. 663వ సంవత్సరములలో పతనమాయెను. కావున నహూము కాలము క్రీ.పూ. 663 కును, క్రీ.పూ. 612కును మధ్య కాలమనునది స్పష్టము. తేబేసు పట్టణము పతనమైన తరువాత పది సంవత్సరములకు, క్రీ.పూ. 693లో మరల నిర్మింపబడినదని చరిత్ర పుటలు వివరించుచున్నవి. నహూము తన గ్రంథమును
క్రీపూ 663కును, క్రీ.పూ. 654 కును మధ్య కాలములో వ్రాసియుండవచ్చునని తలంచవచ్చును. గ్రంథ ప్రారంభములో రాజులలో ఎవరి పేరైనను ప్రస్తావింపబడక పోవుటను బట్టి రాజైన మనష్హే (క్రీ.పూ. 697 – 642) దేవుని దృష్టికి చెడ్డవాడైయుండుటయే కారణమని తలంచవచ్చును.
యోనా ప్రవచన వర్తమానము విని నీనెవె ప్రజలు పశ్చాత్తాపబడిన సంఘటన క్రీ.పూ. 759లో జరిగినది. ఈ పశ్చాత్తాపము, మారుమనస్సు తాత్కాలికమైనదిగా నుండెను. అష్హూరీయులు అనతి కాలములోనే తిరిగి తమ క్రూరత్వమునకు మరలిరి. క్రీ.పూ 722 లో అష్హూరు రాజైన రెండవ షార్గోను ఉత్తర రాజ్య ( ఇశ్రాయేలు) రాజదానియైన షోమ్రోనును నాశనము చేసి, పది గోత్రముల వారిని చెదరగొట్టి వారిని బానిసలుగా అష్హూరునకు తీసికొని పోయెను. క్రీపూ 701లో అష్హూరు రాజైన సేన్హరీబు మహా గొప్ప సైన్యము యూదాను జయించుటకు విఫలయత్నము చేసెను. క్రీ.పూ 669 - 633 వరకు రాజ్యమేలిన అషూర్ పాని పాల్ కాలములో కీర్తి ఔన్నత్యము నొందియున్నది. నీనెవె పట్టణము దానికి రాజధాని.
భూమి మీద మిక్కిలి ప్రఖ్యాతిగాంచిన ఈ నీనెవె పట్టణము చుట్టూ 100 అడుగుల ఎత్తును, ఏక కాలములో మూడు రథములను ఒకదాని ప్రక్క మరొకదానిని ఉంచి నడుపుటకు తగినంత వెడల్పును గల కోటయున్నవి. కోటలోపల పలు ప్రాంతములలో కనబడు మేడమిద్దెలు ఇంకను 100 అడుగుల ఎక్కువ ఎత్తుగలవై యుండెను. వీటి అన్నింటి కంటె మిన్నగా కోట చుట్టూ 150 అడుగుల వెడల్పును 60 అడుగుల లోతును గల కందకము గలదు. ఇంత గొప్ప నీనెవె పట్టణము సర్వనాశనము చేయబడునని నహూము ప్రవచనము చెప్పుచుండెను. ఆ కాలములో ఈ ప్రవచనము నమ్మశక్యము కానిదిగా నుండెను.
క్రీ.పూ 663 తరువాత అషూరును పాలించిన రాజులకాలములో ఆమహా సామ్రాజ్యపు కీర్తి పతనమగుట ప్రారంభించెను. నహూము 1:8 లో నీనెవె పట్టణము ఒక మహా నది ప్రవాహము ద్వారా నాశనమగునని చెప్పబడియున్నది. అది అక్షరాలా నెరవేరెను. టైగ్రీస్ నది పొర్లి ప్రవహించి నీనెవె కోటగోడలో కొంత భాగమును పడగొట్టెను. కోట పడిపోయిన భాగము ద్వారా బబులోను సైన్యందండెత్తి క్రీ.పూ 612లో నగరమును స్వాధీనం చేసికొనిన పిదప దానిని అగ్నికి ఆహుతిచేసెను. నహూము 3:11 లో నీవును మత్తురాలవై దాగుకొందువు, శత్రువు వచ్చుట చూచి ఆశ్రయ దుర్గము వెదకుదువు అని వ్రాయబడిన ప్రకారముగానే క్రీ.పూ. 612లో నశించిపోయిన నీనెవె స్థానం మరువబడెను. 2500 సంవత్సరముల కాలము వరకు లోకములో అజ్ఞాతముగా నుండెను. అలెగ్జాండరు, నెపోలియనులు సమీపమున స్థావరమేరుపరచుకొని విశ్రమించెను. కాని వీరికి ఇక్కడ ఒక కాలమున ప్రసిద్ధి చెందిన పట్టణమున్నదను సూచన ఎలాంటిది లభించలేదు. అస్థలము మొత్తం గొర్రెల మేపు ప్రదేశమని పిలువబడెను. నీనెవె సర్వనాశనమాయెను. క్రీ.శ. 1542లో భూశాస్త్ర పరిశోధనలో ఇప్పుడున్న ఇరాక్ లో నున్న టైగ్రీసు నది తీరమున ఇది ఉన్నదని కనుగొనిరి.
ముఖ్య వర్తమానము : నీనెవె న్యాయతీర్పు.
ముఖ్యవచనములు : నహూము 1:7-8 నహూము 3:5-7
ముఖ్య అధ్యాయము : నహూము 1. ఈ అధ్యాయము ఒక ప్రక్క దేవుని ప్రతిదండనయు, కోపమును వర్ణించుటయు, మరో ప్రక్క తమ భక్తులకు శ్రమలకాములో యిచ్చు ఆశ్రయమైన దేవకారుణ్యమును హెచ్చించి చూపుచున్నది. “ఇదిగో సమాధానమును చాటించు సువార్తకుని పాదములు పర్వతముల మీద వచ్చుచున్నవి” అని ప్రారంభించు 15వ వచనము దేవుని బిడ్డలకు దేవుడిచ్చు బద్రతయు, సమాధానమును చెప్పుచున్నది.
గ్రంథ విభజన : మూడు అధ్యాయములు గల ఈ గ్రంథము నీనెవె మీదికి రాబోవు న్యాయ తీర్పును గూర్చి మూడు ముఖ్య కార్యములను రమ్యముగా తెలియ జేయుచున్నది.
నీనెవె నాశనమును చెప్పుచున్నవి : 1 అధ్యాయము (a). న్యాయ తీర్పు జరుగు విధము : నహూము 1:1-8 (b). నీనెవె నాశనము , యూదా విడుదల : నహూము 1:9-15. 2. నీనెవె నాశనము - వివరణ : 2 అధ్యాయములు. (a). యుద్ధమునకు ఆహ్వానము నహూము 2:1-2 (b). నీనెవె నాశనమగుచున్నది నహూము 2:3-13. 3. నీనెవె నాశనము కాబోవుచున్నది. 3 అధ్యాయము (a). నాశనమునకు కారణములు నహూము 3:1-11 (b). నీనెవె నాశనము - ఆగదు నహూము 3:16-19
సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో ఇది 34వ గ్రంథము. అధ్యాయములు 3; వచనములు 47; ప్రశ్నలు 8; ఆజ్ఞలు 5; వాగ్దానములు లేవు; హెచ్చరికలు 72; ప్రవచనములు 46; నెరవేరినవి 40; నెరవేరనివి 6; దేవుని నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 2; (నహూము 1:2; నహూము 2:1)
Habakkuk - హబక్కూకు
యూదామరల మృత్యుముఖమును సమీపించుచున్న కాలములో హబక్కూకు ప్రవక్త ప్రవచించెను. మారుమనస్సు పొందుడని పలుమారు ఆహ్వానింపబడినను జనులు గర్విష్టులై వంగని మెడ గలవారై పాప మార్గములను విడువక వెంబడించుచుండిరి. తన దేశమున నెలకొనియున్న ఈ భయంకర దుస్థితిని చూచి ప్రవక్త యెహోవా ఇది ఎంత కాలము కొనసాగును అను ప్రశ్నను లేపుచున్నాడు. (హబక్కూకు 1:2; హబక్కూకు 1:13-14) తమ మీదికి రానున్న శిక్షను నెరవేర్చు ఆయుధములుగా బబులోనీయులు తన చేతిలో నుందురని దేవుడు జవాబివ్వగా - ప్రవక్త భయపడి వణకుచు తనకు తెలియకుండానే మోకాళ్లూని ప్రార్థన ప్రారంభించెను. అంతట ఏతరమునకు చెందిన వారైనను - నీతిమంతుడు చూపుద్వారా కాక విశ్వాసమూలముగా బ్రదుకును అను సత్యమును దేవుడాయనకు బయలుపరచెను. దేవుని మార్గములు తనకు సంపూర్ణముగా తెలియబడనప్పటికి హబక్కూకు సాటిలేని దేవుని జ్ఞానమును కీర్తించి స్తుతిగానము చేయుచున్నాడు. హబక్కూకు అను అసాధారణమైన హెబ్రీనామధేయము - కౌగలించుకొనుట అను అర్థమిచ్చు హబక్ అను హెబ్రీ క్రియా పదము నుండి ఉద్భవించినది. కౌగలించుకొనువాడు లేక గట్టిగా పట్టుకొనువాడు అని ఈ నామమునకు అర్ధము. దేవునిని గట్టిగా పట్టుకొనిన ఈ ప్రవక్త ఇదే భావమును హబక్కూకు 3:16-19 వాక్యముల ద్వారా వివరించుచున్నాడు.
గ్రంథకర్త : హబక్కూకు 1:1; హబక్కూకు 3:1 లను బట్టి దీని గ్రంథ కర్త హబక్కూకు అని స్పష్టమగుచున్నది. హబక్కూకు వృత్తి ప్రవచించుటయని ఈ వాక్యములు తెలియజేయుచున్నవి. 3వ అధ్యాయము ఒక ప్రార్థనా గీతము. దీని చివరి భాగములో ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది అని వ్రాయబడుటను బట్టి హబక్కూకు యెరూషలేములో జరుగు ఆరాధనలతో సంబంధము గలిగియున్న ఒక యాజకుడైయుండవచ్చునని మనము తలంచవచ్చును. ఆయన తనకుటుంబమును గూర్చియైనను తన దేశనమును గూర్చియైనను ఏమియు చెప్పలేదు. ఈయనకు దానియేలుతో సంబంధముగలదని కొందరు అభిప్రాయపడుచున్నారు.
హబక్కూకు కాలము : హబక్కూకు కాలము యొక్క గుర్తింపులను, జరుగనైయున్న బబులోను దండయాత్రను గూర్చి ఈ గ్రంథములో వ్రాయబడిన వర్తమానముల నుండి మాత్రమే గ్రహించగలము. (హబక్కూకు 1:6; హబక్కూకు 2:1; హబక్కూకు 3:16) హబక్కూకు గ్రంథము వ్రాయబడిన కాలము మనష్హే పాలనా కాలము ( క్రీపూ 697 - 642 ) అని కొందరు బైబిలు పండితులును, ఆమోను పాలనా కాలము (క్రీ. పూ. 642 - 640 ) అని మరికొందరు బైబిలు పండితులు అభిప్రాయపడుచున్నారు. అయితే ఈ ఇరువురు రాజుల కాలములో బబులోను అషూరు రాజులు పాలించిన భాగములలో ఒకటిగా ఉన్నందున ఈ ఊహలు పునాదులు లేనివిగా నున్నవి. క్రీ.పూ. 640 - 609 పాలించిన ఉత్తమ రాజైన యోషియా కాల పరిస్థితులు హబక్కూకు ప్రవచనములకు సరిపడలేదు. క్రీపూ 609 - 598 కాలములో యూదాను పరిపాలించిన భక్తి హీనుడైన రాజైన యెహోయాకీము కాలము మాత్రమే హబక్కూకు ప్రవచనమునకు సరిపోవుచున్నది. ఈ రాజే యూదాను నాశనపుటంచుల వరకు దుష్టత్వములో నడిపించాడు. (2 రాజులు 23:34; 2 రాజులు 24:5 యిర్మియా 22:17) నా బోసాలాసర్ (నెబూజరదాను)? అను రాజు కాలములో (క్రీ.పూ. 626 - 605) బబులోను బలపడనారంభించెను. అతడు క్రీ.పూ 612లో అషూరు రాజధానియైన నీనెవేను నాశనము గావించెను. నాబా సాలాసర్ తరువాత రాజైన నెబుకద్నెజరు క్రీ.పూ 605లో సింహాసన మెక్కెను. ఆయన తన పరిపాలన ప్రారంభమైన మొదటి సంవత్సరములోనే యూదాపై దండెత్తాడు. దానిని స్వాధీనము చేసుకొని రాజకుటుంబీకులలో 10,000 మంది అధిపతులను చెరపట్టి బబులోనుకు తీసికొని వెళ్లాడు. పేదలను వంఛించిన అధిపతులే మొదటిగా ఖైదీలుగా పట్టబడ్డారు. హబక్కూకు బబులోను దండయాత్రకు ముందే ప్రవచించెను. గనుక క్రీ.పూ 607 కు సమీపములో ఈ గ్రంథము వ్రాయబడియుండవలెను.
ముఖ్య వచనము : “నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రదుకును"
ముఖ్య వచనములు : హబక్కూకు 2:4; హబక్కూకు 3:17-19
ముఖ్య అధ్యాయము : 3 అధ్యాయము.
హబక్కూకు గ్రంథములోని చివరి మూడు వచనములు (హబక్కూకు 3:17-19) ఈ గ్రంథమును మిక్కిలి ఔన్నత్య స్థానమునకు హెచ్చించుచున్నది. ఫిర్యాదులతోను, సందేహములతో, ప్రశ్నలతోను ప్రారంభమైన హబక్కూకు ప్రవచన గ్రంథము ముగింపులో ధృఢ నిశ్చయతతోను, విశ్వాసముతోను అంతమగుచున్నది. విశ్వాస విజయ విఖ్యాతమైన ఈ మూడవ అధ్యాయము పరిశుద్ధ గ్రంథము అంతటిలో విశిష్ట స్థానము పొందుచున్నది.
గ్రంథ విభజన : ఈ గ్రంథములో రెండు భాగములు మిక్కిలి తేటగా కనబడుచున్నవి. హబుక్కూకు దేవుని యెదుట లేవనెత్తుచున్న సంశయాత్మక ప్రశ్నలును దానికి దేవుడు అనుగ్రహించిన జవాబులును మొదటి రెండు అధ్యాయములలోను, హబక్కూకు కృతజ్ఞతతో దేవునికి చేయు స్తోత్ర గీతము మూడవ అధ్యాయములోను వివరింపబడినవి.
(1) హబక్కూకు సంశయములు, ప్రశ్నలు, దేవుని జవాబులు: 1 , 2 అధ్యాయములు (a). హబక్కూకు మొదటి ప్రశ్న హబక్కూకు 1:1-4. (b). దేవుని జవాబులు హబక్కూకు 1:5-11 (c). హబక్కూకు రెండవ ప్రశ్న హబక్కూకు 1:12; హబక్కూకు 2:1 (d). దేవుని రెండవ జవాబు హబక్కూకు 2:2-20
(2) హబక్కూకు స్తోత్రగీతము : 3వ అధ్యాయము
(a). దేవుని కృప కొరకు ప్రవక్త ప్రార్ధన హబక్కూకు 3:1-2 (b). దేవుని కనికరము స్మరించుట హబక్కూకు 3:3-15 (c). దేవుని రక్షణపై విశ్వాసముతో ఆనుకొనుట హబక్కూకు 3:16-19
సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో ఇది 35వ పుస్తకము. అధ్యాయములు 3; వచనములు 56; ప్రశ్నలు 12; ఆజ్ఞలు 1; వాగ్దానములు లేవు; హెచ్చరికలు 20; ప్రవచన వాక్యములు 11; దేవుని నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 2 (Hab,1,5-2,2).
Zephaniah - జెఫన్యా
ఇశ్రాయేలు దేశము రెండు ముక్కలుగా చీలగా, యెరూషలేము రాజధానిగానున్న దక్షిణ రాజ్యమే, యూదా దేశము. దీని ఆత్మీయ, రాజకీయ చరిత్రలలో పునరుద్ధీకరణలు, పరిశుద్ధ పరచబడుట పలుమారు జరిగియున్నవి. ఆమోను కుమారుడైన యోషీయా పరిపాలనా కాలములో ఇట్టి సంఘటన యొకటి సంభవించెను. అనగా దేవుని వైపు మళ్లుకొనుట జరిగెను. శుద్ధీకరణ పొందుటకై జెఫన్యా ప్రజలకిచ్చిన
ఆహ్వానము యోషీయా కాలములో జరిగిన ఉజ్జీవమునకు ప్రోత్సాహములను ఇచ్చియుండును. ఈ కాలములో యూదా ప్రజల జీవితములో బాహ్యముగా పలుమార్పులు కలిగినవి. అయినను ప్రజల అంతరంగములలో తగినంత మార్పు రాలేదు. శుద్ధీకరణ కొంతవరకే ప్రయోజన కరముగా నుండెను. కావున అప్పటి పరిస్థితులకు అనుగుణంగా జెఫన్యా - మహాభయంకరమైన యెహోవా దినము రాబోవుచున్నది. అప్పుడు ప్రతిపాపము ప్రతి దుష్టత్వము మిక్కిలి కఠినముగా దండింపబడును అని ఉచ్చై స్వరముతో ప్రవచించెను. దేవుని కోపాగ్నికి యూదాదేశముతో బాటు దాని చుట్టునున్న దేశములు కూడ కాలిపోవునని జెఫన్యా ప్రవచించెను. ప్రవచనము ప్రకారము వినాశము సంభవించిన తరువాత మిగిలిన
ప్రజలు మెస్సీయ పరిపాలనా కాలముతో మహిమకరమైన ఆశీర్వాదములను స్వతంత్రించుకొందురు. అప్పుడు స్తోత్రమును సంతోషమును కలుగును అని జెఫన్యా ప్రవచించాడు. జెఫన్యా అనగా యెహోవాదాచును అని అర్థము. మిక్కిలి దుష్టుడైన రాజైన మనష్హే పరిపాలన ఉత్తరార్థములో జెఫన్యా జన్మించాడు. మనష్హె క్రూరత్వము నుండి యెహోవా అతనని మరుగుచేశాడు అను విషయమును ఈ నామము సూచిస్తుంది.
గ్రంథకర్త : గ్రంథములో వ్రాయబడిన ప్రథమ వచనము, దానిని వ్రాసిన జెఫన్యాను కొంచెము భిన్నమైన రీతిలో పరిచయము చేస్తున్నది. జెఫన్యా తన వంశమునకు చెందిన నలుగురు రాజుల నామములను ఈవచనములో వ్రాస్తున్నాడు. దీనిని బట్టి జెఫన్యా యూదా రాజుల వంశస్థుడనియు, అతడు ప్రవక్త ఆయెననియు తెలియుచున్నది. ఈ బంధుత్వము బట్టి రాజు సన్నిధిలో మంచి పదవిని, దేవుని వర్తమానమును ప్రకటించు స్వాతంత్ర్యమును కలిగియుండును. జెఫన్యా 1:6 లో యెరూషలేమును గూర్చి ఈ స్థలములో అని చెప్పుచున్నాడు. అంతమాత్రమే కాకుండా యెరూషలేమునకు గల ప్రత్యేకత అనేక వచనములలో చెప్పబడినది జెఫన్యా 1:9-10; జెఫన్యా 3:1-7. దీనిని బట్టియు జెఫన్యా యెరూషలేము నివాసీ అని తెలియుచున్నది.
కాలము : ఆమోను కుమారుడైన యోషీయా దినములలో అని గ్రంథము ప్రారంభమగుచున్నది. కావున యోషీయా కాలమును బట్టి జెఫన్యా కాలమును నిర్ణయింపగలుగుచున్నాము. యోషీయా క్రీ.పూ 640 నుండి 609 వరకు పాలించెను. జెఫన్యా 2:13 లో నీనెవె పతనము క్రీ.పూ . 612లో జరిగినది. కావున జెఫన్యా క్రీ.పూ 612 కంటె ముందే ప్రవచించెనని తెలియుచున్నది. కావున జెఫన్యా ప్రవచించిన కొలతలు క్రీ. పూ 640 - 621 మధ్య కాలమని భావింపవచ్చును. ఈ కాలమును నిర్ణయించుటకు గల ఆధారములను ఇంకను స్పష్టముగా పరిశీలింతుము. జెఫన్యా 1:3-13; జెఫన్యా 3:1-7 మున్నగు వాక్య భాగములలో వివరింపబడియున్న పాపముల పట్టికను పరిశీలించినచో ఈ వాక్యములు యోషీయా చేపట్టిన పునరుద్ధరణకు ముందుగా వ్రాయబడెననుట సుష్పష్టము. ఆయన ప్రవచించిన కాలములో మనషె కాలములో ఆమోను కాలములో బలపడిన పాపస్థితి కొనసాగుచునేయున్నది.
యోషీయా 8 సంవత్సరములవయస్సులో రాజాయెను. 16 సంవత్సరముల వయస్సులో ఆయన హృదయము దేవుని వైపు తిరుగసాగెను. అతడు తన పునరుద్ధీకరణ కార్యక్రమమును తన 12వ సంవత్సరమున ప్రారంభించెను. (క్రీ.పూ 628 లో 2 దినవృత్తాంతములు 24:3-7) బయలు దేవతాబలి
పీఠమును పడగొట్టెను; ఉన్నత స్థలములను కూల్చివేసెను. విగ్రహములను ధ్వంసముచేసెను. అతడు యూదాదేశమును యెరూషలేమును శుద్ధీకరించెను. మరల 6 సంవత్సరములకు పిమ్మట క్రీ.పూ. 622 లో యాజకుడైన హిల్కియా, దేవాలయములో కనుగొనిన ధర్మశాస్త్ర గ్రంథమును చదివిన తరువాత మరియొక మారు, శుద్ధీకరణను చేపట్టుటకు పూనుకొనియుండెను. (2 దినవృత్తాంతములు 34:8; 2 దినవృత్తాంతములు 34:35-19) ఈ ఆధారముల ద్వారా జెఫన్యా కాలము క్రీ.పూ 640 - 621 అని స్థిరపరచబడినది.
మనషే ఆమోనుల దుష్టపరిపాలన 57 సంవత్సరములు కొనసాగెను. అది యూదా ప్రజలపై బలమైన యొక దుష్టముద్రను వేసెను. యూదా అట్టి దుష్ట ప్రభావముల నుండి బయటపడుట ఎన్నటికిని సాధ్యపడలేదు. యోషీయా చేపట్టిన పునరుద్ధరణ కార్యములు చాలా ఆలస్యమగుట వలన పునరుద్దరణ తగినంత ప్రభావముతో వ్యాప్తిజెందలేదు. ఆయన మృతిజెందిన తరువాత ప్రజలు ఎప్పటివలే తమ పాత దుర్మార్గములకు, విగ్రహారాధనలకు మరలుకొన్నారు. యిర్మీయా, హబక్కూకు అనువారికి సమకాలికుడైన జెఫన్యా యూదా నాశనమునకు కొంచెము చివరి కాలములో జీవించెనని మనము ఒప్పుకొనవచ్చును.
ముఖ్య పదజాలము : ప్రభువుదినము.
ముఖ్య వచనములు : జెఫన్యా 1:14-15; జెఫన్యా 2:3
ముఖ్య అధ్యాయము : జెఫన్యా 3. జెఫన్యా యొక్క ఈ చివరి అధ్యాయములో ప్రభువు దినమును గూర్చి రెండు గుణ లక్షణములను గురించి న్యాయ తీర్పును, విమోచన గూర్చి వ్రాయబడినది మిక్కిలి గమనించవలసినది.
గ్రంథ విభజన : ఈ గ్రంథమును రెండు ముఖ్య కార్యములు మనము చూడగలము. తీర్పు, రక్షణ.
(1) ప్రభువుదినము న్యాయ తీర్పు, శిక్ష Zep,1,1 -3,8.
(a). లోకమంతటి మీదికి వచ్చు శిక్ష జెఫన్యా 1:1-3. (b). యూదా మీదికి వచ్చు శిక్ష Zep,1,4-2,3. (C). యూదా చుట్టునున్న దేశముల మీదికి వచ్చు న్యాయ తీర్పు జెఫన్యా 2:4-15. (d). యెరూషలేమునకు విరోధమైన న్యాయతీర్పు జెఫన్యా 3:1-7. (e). లోకమంతటి మీదికి వచ్చు న్యాయతీర్పు జెఫన్యా 3:8.
(2). ప్రభువు దినమున కలుగు రక్షణ జెఫన్యా 3:9-20.
(a). మారుమనస్సును గూర్చిన వాగ్దానము జెఫన్యా 3:9-13. (b). విమోచనను గూర్చిన వాగ్దానము జెఫన్యా 3:14-20.
సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో ఇది 36వ పుస్తకము. దీనిలోని అధ్యాయములు 3; వచనములు 53; ప్రశ్నలు లేవు; ఆజ్ఞలు 14; వాగ్దానములు 4; హెచ్చరికలు 86; ప్రవచనవాక్యములు 45; నెరవేరిన ప్రవచనములు 5; నెరవేరనున్న ప్రవచనములు 40; దేవుని నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 4. (జెఫన్యా 1:2; జెఫన్యా 2:1; జెఫన్యా 3:1-8).
గ్రంథకర్త : హగ్గయి
హగ్గయి కాలము : క్రీ.పూ 538లో పారశీక రాజైన కోరెషు - యూదులు తమ స్వదేశమునకు తిరిగి వెళ్ల వలెననియు, యెరూషలేములోని దేవాలయమును పునర్నిర్మాణము గావించవలెననియు ఆజ్ఞాపించెను. స్వదేశమునకు వచ్చిన మొదటి గుంపు ప్రజలకు జెరుబ్బాబెలు నాయకుడుగా నుండెను. క్రీ.పూ 536లో దేవాలయ నిర్మాణము ప్రారంభమాయెను. ఎజ్రా 4 నుండి 6 అధ్యాయములు - హగ్గయి ప్రవచన కాలమును వివరించుచున్నవి. అక్కడ జీవించుచుండిన సమరయులు దేవాలయ నిర్మాణమును నిలిపివేయవలెనని కోరుచు పారసీక రాజ్యమునకు లేఖ వ్రాసియుండిరి.
ఈ ఆటంకములను చూచి యూదులు అధికముగా నిరుత్సాహపడిరి. స్వదేశమునకు తిరిగి వచ్చుచు వారికి ఉన్న మంచి విశ్వాసము సడలెను. దేశములోనున్న శిథిలస్థితి, పంటలు లేకపోవుట, పునర్నిర్మాణమునకు జెందిన కఠినమైన పని, సమరయుల ఆటంకములు వారి మనస్సులను బహుగా నిరుత్సాహపరచెను. విదేశీయులతో పోరాడుట కంటే, దేవాలయ నిర్మాణమును నిలిపి వేయుటయే మంచిదని వారికి తోచెను. ఈ విధముగా రెండు సంవత్సరములు జరిగిన తరువాత క్రీ.పూ 534లో వారు దేవాలయ నిర్మాణమును నిలిపివేసిరి. జనులలోని మానసిక నిరుత్సాహము వారిని ఆత్మీయముగా వెనుకంజ వేయించుకొనుటలోను నిమగ్నులైరి. వారి అవసరములకు ఇండ్లు కట్టుటకు మొదటి స్థానమిచ్చిరి. దేవాలయ విషయములో అశ్రద్ధచూపుటకు వారు పలు సాకులు వెదకసాగిరి. రాజకీయముగా ఎదురైన ఆటంకము, యెరూషలేము ప్రాకారమును కట్టకముందు దేవాలయమును నిర్మించకూడదను ఆలోచన మున్నగునవి వారు చూపుచున్న కొన్ని సాకులు.
ఇట్టి సమయములో దేవాలయ నిర్మాణమును పూర్తి చేయవలెనని ప్రజలను ప్రోత్సహించుటకును, వారిలో నూతనోత్సాహమును పుట్టింపవలెననియు, దేవుడు ప్రవక్తలైన హగ్గయిని, జెకర్యాను లేపాడు. ఈ రెండు గ్రంథములు వ్రాయబడిన కాలములను ఆ గ్రంథముల పుటల నుండియే తెలిసికొనగలము. హగ్గయి గ్రంథము క్రీ.పూ 520లోను, జెకర్యా గ్రంథము క్రీ.పూ 519 - 518 లో వ్రాయబడి యుండును. ఈ ప్రవచనముల ఫలితముగా - 14 సంవత్సర కాలము నిర్లక్ష్యము చేయబడిన దేవాలయ నిర్మాణము క్రీ.పూ 520లో మరల ప్రారంభింపబడి క్రీ.పూ 516లో ముగింపబడినది.
హగ్గయి జెకర్యాలు ప్రవచించిన కాలములో క్రీ. పూ521 - 486 మొదటి దర్యావేషు రాజు పారశీక రాజ్యమును పాలించుచుండెను. ఈతని పై విరోధముగా లేచిన అనేక దేశములను జయించి యూదా దేశమును బలపరచి రాజ్యపాలన గావించెను.
ముఖ్య పదజాలము : దేవాలయమును నూతనముగా నిర్మించుట
ముఖ్యవచనములు: హగ్గయి 1:7-8; హగ్గయి 2:7-9.
ముఖ్య అధ్యాయము- 2
పరిశుద్ధ గ్రంథములోనున్న వాగ్దానములలోని మనలను బలముగా ఆకర్షించి, నిలువబెట్టి యోచింపజేయగల కొన్ని వాగ్దానములను హగ్గయి 2:6-9 లో చూడగలము.
గ్రంథ విభజన : ఉపదేశ పూర్వకమైన హగ్గయి ప్రవచన గ్రంథమును నాలుగు ముఖ్య భాగములుగా విభజింప వచ్చును.
దేవాలయ నిర్మాణమును పూర్తి చేయుట కొరకు ఉపదేశము : హగ్గయి 1:1-15.
2.దేవాలయము - దాని పూర్వ వైభవము హగ్గయి 2:1-9.
3.లోబడిన వెంటనే కలుగు ఆశీర్వాదములు హగ్గయి 2:10-19
4.భవిష్యత్తులో ఆశీర్వాదముల నిత్తునను వాగ్దానము హగ్గయి 2:20-23.
సంఖ్యా వివరములు: పరిశుద్ధ బైబిలులో ఇది 37వ పుస్తకము ; అధ్యాయములు 2; వచనములు 38; ప్రశ్నలు 8; ఆజ్ఞలు 9; వాగ్దానములు 3; ముందు జాగ్రత్తలుగా హెచ్చరికలు 14; ప్రవచన వాక్యములు 9; నెరవేరినవి 6; నెరవేరనున్నవి 3; దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 5.
Zechariah - జెకర్యా
బబులోను చెర తరువాత కాలమునకు చెందిన ప్రవక్త జెకర్యా. ఈయన బబులోనులో పుట్టిన లేవీయుడు, (నెహెమ్యా 12:16) చెరసాల చరిత్రను తరచిచూచిన యెడల ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు క్రీ.పూ. 722లో అషూరు సైన్యమునకు లొంగిపోయి దీనావస్థలో పడెను. దక్షిణ దేశమైన యూదాకు ఇట్టి దుస్థితి క్రీ.పూ. 586లో బబులోను రాజైన నెబుకద్నెజరు దండయాత్ర ఫలితముగా తటస్థించెను. యూదులలో అనేకులు సుమారు 70 సంవత్సరములు బబులోను దాస్యములో నుండిరి. క్రీ.పూ. 539లో పారశీక మహా సామ్రాజ్యము బబులోను మహాసామ్రాజ్యమును జయించెను. పారశీక సామ్రాజ్యపు నూతన విదేశీ విధానము మూలమున యూదులు స్వదేశమునకు మరల వలెననియు, నెబుకద్నెజరు దండెత్తి కొల్లగొట్టి నాశనము గావించిన వారి దేవాలయమును పునర్నిర్మాణముగావించవలెననియు కోరేషు ఆజ్ఞ వెలువడెను. ఈ ఆజ్ఞననుసరించి జెరుబ్బాబెలు (ఇతడు తరువాత గవర్నరుగా నియమింపబడెను) యొక్కయు యాజకుడైన యెహోషువ యొక్క నాయకత్వమున సుమారు 50,000 మంది యూదాకు తిరిగివచ్చిరి. ఇట్లు వచ్చిన వారిలో ప్రవక్తయైన జెకర్యా ఒకడు. యెరూషలేమునకు రాగానే వారు పూర్వ ప్రకారంగా ఒక బలిపీఠమును కట్టి దేవునికి బలి అర్పించారు. (ఎజ్రా 3:1-6) వారు తమ స్వదేశమునకు వచ్చిన తరువాత రెండవ సంవత్సరములోనే దేవాలయమును కట్టుటకు పునాది వేసిరి. (ఎజ్రా 3:8-13; ఎజ్రా 5:16) కాని వెలుపటి ఆటంకముల మూలమునను, లోపటి సమస్యల మూలమునను దేవాలయ నిర్మాణము 16 సంవత్సరముల ఆటంకపరచబడినది. అటు తరువాత పారశీకరాజైన దర్యావేషు కాలమున (క్రీ.పూ. 522 - 486) మరల దేవాలయ నిర్మాణము ప్రారంభింపబడియున్నది. దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరమున (క్రీ.పూ. 520లో) యెహోవా హగ్గయిను దేవాళయ నిర్మాణపు పనికి ప్రోత్సాహమిచ్చుటకు లేపెను. హగ్గయి నాలుగు నెలల వ్యవధిలో నాలుగు వర్తమానములను అందించి తన పరిచర్యను పూర్తిచేసికొనెను. హగ్గయి తరువాత జెకర్యా అదే పరిచర్యను చేపట్టెను. (హగ్గయి 1:1; జెకర్యా 1:1) జెకర్యా ఖండించి బుద్ధి చెప్పు ఉపదేశ మార్గమును పాటించలేదు. తమ ఉజ్జ్వల భవిష్యత్తు కొరకును దేశాభివృద్ధి కొరకును దేవాలయ నిర్మాణము చేపట్టుట ఎంత ప్రాముఖ్యమో ప్రజలకు వివరించెను. ప్రజలు గొప్ప స్ఫూర్తితో దేవాలయ నిర్మాణములో ముమ్మరముగా పాల్గొనిరి. క్రీ.పూ. 516లో దేవాలయ నిర్మాణ పని పూర్తియైనది నిర్మాణమునకు సహాయపడిన దర్యావేషు తరువాత అహష్వేరోషు. (క్రీ.పూ 486 - 464) ఈ అహష్వేరోషే వస్తిని రాణి పదవి నుండి తొలగించి ఎస్తేరును పారశీక దేశపు రాణిగా చేసికొనెను. జెకర్యా అను నామమునకు “యెహోవా జ్ఞాపకము చేసికొనును” అని అర్థము. ఇదే భావము గల సందేశము ఈ గ్రంథములో అధికముగా వ్యాపించియున్నది. ఇశ్రాయేలీయుల మూల పితరులతో తాను చేసిన నిబంధనలను యెహోవా ఇప్పుడు జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. దీనిని బట్టి వారు ఆశీర్వదింపబడిన వారుగా నుందురు.
గ్రంథకర్త : జెకర్యా. పరిశుద్ధ గ్రంథములో జెకర్యా అను పేరుగలవారిని సుమారు ముప్పది మందిని చూడగలము. మగ సంతానము కలిగినందుకు దేవునికి కృతజ్ఞత తెలుపుకొనుటకు గుర్తుగా వారికి ఈ పేరు పెట్టబడియుండును. తన పితరులైన యిర్మీయా, యెహెజ్కేలు వంటి వారివలె ఈయనయు యాజక కుటుంబములో జన్మించిన ఒక యాజకుడు. ఈయన బెరక్యా కుమారుడు. ఇదోకు మనుమడు. (జెకర్యా 1:1-7; ఎజ్రా 5:1; ఎజ్రా 6:14; నెహెమ్యా 12:4-16) దేవుడు ఈయనను బాల్యములోనే పిలిచి ప్రవక్తగా ప్రత్యేకించుకొనెను. బెరక్యా కుమారుడైన ఈ జెకర్యా - యూదా పారంపర్య ప్రకారము లేఖనములను సమకూర్చు దేవాలయ సంఘ సభ్యులలో ఒకడుగా నుండెను. ఈయన దేవాలయమునకు బలిపీఠమునకు మధ్య మిక్కిలి దారుణముగా చంపబడెను. (మత్తయి 23:35) మరియొక జెకర్యాయును ఇదే విధముగా హత్య గావింపబడెను. (2 దినవృత్తాంతములు 24:20-21) జెకర్యా గ్రంథమును సంపూర్ణముగా వ్రాసినవాడు బెరక్యా కుమారుడైన జెకర్యాయేనని యూదా పారంపర్యము, క్రైస్తవ పారంపర్యము సాక్ష్యమిచ్చుచున్నది.
కాలము : క్రీ.పూ. 480 - 470 మధ్య కాలమని భావింపబడుచున్నది.
ముఖ్య పదసముదాయము : మెస్సీయ కొరకు సిద్ధపడుడి.
ముఖ్య వచనములు : జెకర్యా 8:3; జెకర్యా 9:9.
ముఖ్య అధ్యాయము : 14. జెకర్యా ప్రవచనము ఈ 14వ అధ్యాయము శ్రేష్ఠమైన ఒక అంశమును చెప్పుచున్నది. యెరూషలేము ముట్టడింపబడుట, ఇశ్రాయేలీయుల విరోధులు మొదటిగా విజయము పొందుటను వివరించిన తరువాత ఒలీవల కొండ రెండుగా విడిపోవుటయు, యెరూషలేము యెహోవా చేత రక్షింపబడుటయు జరుగును. యెహోవా దర్శనము జరుగును. అన్యజనులు దేవుని తీర్పుననుసరించి శిక్షింపబడుదురు. ఇశ్రాయేలు దేశము పూర్వ ఔన్నత్యమును పొందును. యూదా పునరుద్ధరింపడును. దేవుడేర్పరచిన పర్ణశాలల పండుగ ఆచరింపబడును. యెరూషలేము ప్రతిష్టిత పట్టణమగును. మున్నగు అంశములన్నియు ఈ అధ్యాయమునందు వర్ణింపబడెను.
గ్రంథవిభజన : ఈ గ్రంథములోని మొదటి 8 అధ్యాయములు దేవాలయమును నిర్మించుటకు యూదులకు ఇవ్వబడిన ప్రోత్సాహములు. తరువాత వచ్చు 6 అధ్యాయములు - దేవాలయ నిర్మాణము పూర్తియైన పిమ్మట మెస్సీయ రాకడ కొరకు ప్రజలు ఎదురు చూచుటకు తోడ్పడు హితోపదేశములు. అన్యజనుల పాలనలో నుండి మెస్సీయ పరిపాలనలోనికిని, శ్రమలలో నుండి సమాధానము లోనికిని, అపవిత్రతలో నుండి పవిత్రతలోనికిని యూదులను తెచ్చుగొప్ప మార్పులు ఈ చివరి భాగములో చెప్పబడినవి. గ్రంథములో వ్యక్తపరచబడిన మూడు భాగములు ఈ క్రింది విధముగానున్నవి.
ఎనిమిది దర్శనములు : 1 - 6 అధ్యాయములు 2. నాలుగు వర్తమానములు : 7, 8 అధ్యాయములు 3. రెండు హృదయ భారములు : 9 - 14 అధ్యాయములు
సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో ఇది 38వ పుస్తకము. అధ్యాయములు 14; వచనములు 211; ప్రశ్నలు 27; ఆజ్ఞలు 35; వాగ్దానములు 4; హెచ్చరికలు 226; ప్రవచన వాక్యములు మొత్తము 122; నెరవేరిన ప్రవచనములు 31; నెరవేరనున్న ప్రవచనములు 91; దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 59.
Malachi - మలాకీ
నెహెమ్యా కాలములలో జీవించియుండిన ప్రవక్తయైన మలాకీ ఇశ్రాయేలీయుల ఆత్మీయ పతనమునకు విరోధముగా దేవుని సందేశములను ప్రవచించుటకు ఏర్పరచుకొనబడినవాడు. మోసాలు చేయు యాజక సమూహములకును, క్రూర హింసలతో కూడిన జీవిత విధానముగల ప్రజలకును మలాకీ దేవుని వర్తమానములను ప్రకటించెను, ప్రజలు మేము దేవుని ప్రజల మనియు మాకు విశేష వాగ్దానములు గలవనియు మేము మిక్కిలి క్షేమముగా నున్నామనియు గర్వపడుచుండిరి. వారు మిక్కిలి హేయమైన ప్రవర్తన గల దుష్టతరము వారైయుండిరి. అట్టివారికి మలాకీ దేవుని సందేశములను అందించుచున్నాడు. మలాకీ ప్రశ్నలు వేయుట, జవాబులు చెప్పుట అను పద్ధతి అనుసరించెను. వారి వేషధారణను, మిశ్రమ వివాహ పద్ధతిని, విడాకుల ద్వారా వివాహములను రద్దుచేసికొను విధానమును, భక్తి లేని కేవలము ఆచారములతో కూడిన ఆరాధనను, అసూయతో నిండిన వినాశకరమైన జీవన విధానమును నిశితముగా పరిశీలించిన మలాకీ తీవ్రపద జాలముతో యూదులను గద్దించెను. అటు తరువాత దేవుడు 400 సంవత్సరము పర్యంతము మౌనముగా నుండెను. అనగా ఆ 400 సంవత్సరములలో ఒక్క ప్రవక్త కూడ ప్రవచించలేదు. తరువాత (మలాకీ 3:1)లో చెప్పబడిన ప్రకారము బాప్తీస్మమిచ్చు యోహాను ద్వారా దేవుడు తన ప్రవచన స్వరమును వినిపింపజేసెను. మలాకీ అనగా నా దూత అని అర్థము. బహుశ ఇది యెహోవా దూత అను అర్థమిచ్చు మలాకాయహా అను నామమునకు సంక్షిప్త రూపమై యుండవచ్చును. క్రొత్త నిబంధన దూతయైన బాప్తీస్మమిచ్చు యోహానును గూర్చి తెలియజేయుచున్న ఈ గ్రంథమునకు ఈ పేరు తగియున్నది. మలాకీ 2:7; మలాకీ 3:1 మున్నగు వచనములలో వివాదములు లేవు. గ్రంథమంతా ఒకరి చేతనే వ్రాయబడియున్నది అను విషయములో భిన్నాభిప్రాయములు లేవు. సంభాషణా ధోరణి గ్రంథమంతటా వ్యాప్తి చెంది యున్నది. ఈయనను గూర్చి తెలిసికొనుట ఇతర ఆధారములు ఏవియు లేవు. ఈయన తండ్రి పేరు అయినను మనకు లభించుట లేదు. అయినను ఈయన ఒక సమాజమందిర సభ్యుడు అని యుదా పారంపర్యము నమ్ముచున్నది.
మలాకీ కాలము : మలాకీ గ్రంథ కాలమును నిర్ణయించుటకు తగిన ఆధారములు లేనప్పటికిని, ఈ గ్రంథములోనే ఇవ్వబడిన కొంత సమాచారమును బట్టి ఈయన కాలమును గుర్తించుచున్నాము. మలాకీ 1:8 లో వ్రాయబడిన అధికారి అను పదము హగ్గయి 1:1; హగ్గయి 1:14; హగ్గయి 2:21 లలో కనిపించుటను బట్టి ఇశ్రాయేలీయులు పారశీకపాలకులకు లోబడియున్న కాలములో క్రీ.పూ 539 - 333 ఈ గ్రంథము వ్రాయబడి యుండునని తలంచవచ్చును. క్రీ.పూ 516లో పునర్నిర్మింపబడిన యెరూషలేము దేవాలయములో ఆ గ్రంథ రచనా కాలములో బలులు అర్పింపబడుచున్నవి (మలాకీ 1:7-15; మలాకీ 3:8) ఈ విధముగా బలులు అలవాటు మరల ప్రారంభింపబడిన తరువాత కొన్ని సంవత్సరములకు ఈ గ్రంథ రచన జరిగియుండును. బలియర్పణ పురాతన ఆచారము. చాలనియమములు పాటించవలసి యుండగా మలాకీ కాలములో నియమ పాలన జరుగలేదు. లోపము గల వాటిని బలి అర్పించుట హేయముగా నుండెను. మరియు నెహెమ్యా కనుగొనిన లోపమునే మలాకీ కూడ చూచెను. వారు కనుగొన్న సమస్యలు ఈ క్రింద విధముగా నున్నవి.
నీచులైన యాజకులు (మలాకీ 1:6; మలాకీ 2:9; నెహెమ్యా 13:1-9). 2. దశము భాగములను, కానుకలను నిర్లక్ష్యము చేయుట (మలాకీ 3:7-12; నెహెమ్యా 13:10-13). 3. అన్యజనులతో వివాహ బంధము మలాకీ 2:10-16; నెహెమ్యా 13:23-28.
నెహెమ్యా యెరూషలేము పట్టణ ప్రాకరములను కట్టుటకు క్రీ.పూ. 444లో యెరూషలేముకు వచ్చెను. ఎజ్రా దేవాలయ నిర్మాణమును ప్రారంభించి అప్పటికి 13 సంవత్సరములు గతించినవి. క్రీ.పూ 432లో నెహెమ్యా మరల పారశీక దేశమునకు వెళ్లెను. తరువాత క్రీ.పూ 425లో అతను మరల యెరూషలేమునకు వచ్చెను. అప్పడతడు ఇశ్రాయేలీయులలోనున్న వివిధ పాపపు అలవాటులను మార్చి వేసెను. కావున నెహెమ్యా యెరూషలేములో లేని కాలములో అనగా క్రీ. పూ. 432, 425ల మధ్య కాలములో మలాకీ ప్రవచించెనని అభిప్రాయపడుట మిక్కిలి తగినదైయున్నది. గ్రంథము హగ్గయి, జెకర్యా ప్రవక్తల కాలమునకు (క్రీ.పూ. 420) నూరు సంవత్సరముల తరువాత వ్రాయబడి యుండవచ్చు.
ముఖ్య పద సముదాయము : వెనుకంజ వేసిన వారికి ఆహ్వానము.
ముఖ్య వచనములు: మలాకీ 2:17; మలాకీ 3:1; మలాకీ 4:5-6
ముఖ్య అధ్యాయము : 3
పాతనిబంధనలోని ఈ చివరి గ్రంథము యేసు క్రీస్తును గూర్చియు, ఆయనకు ముందుగా పంపబడిన బాప్తీస్మమిచ్చు యోహానును గూర్చియు ప్రవచించుటతో ముగింపబడుచున్నది. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మలాకీ 3:1 నాలుగు వందల సంవత్సరముల దీర్ఘకాల ప్రవచన లేమిని తొలగించి ఇదిగో అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము. ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడి అను పలుకులతో యెహాను బయలుపరచబడెను. అప్పుడు యోర్దాను నదీ తీరమున ఉన్న యోహాను వద్దకు ఇశ్రాయేలు ప్రజలు కూడి వచ్చిరి. మలాకీ 3 , 4 అధ్యాయములు మెస్సీయా రాకడను, ఆయనకు ముందుగా రానున్న దూత రాకడను గూర్చియు ప్రవచించుట ద్వారా పాత నిబంధనకును, క్రొత్తని బంధనకును నడమ ఒక వంతెనగా నిలువబడుచున్నవి.
గ్రంథవిభజన : ప్రశ్నలు – జవాబులతో కూడియుండి సంభాషణా రూపమును మలాకీ దేవుని సందేశమును ప్రజల ముందు క్లుప్తముగా బోధించెను. ఈ సందేశముతో పాతనిబంధన ముగియుచున్నది. మలాకీ ఇశ్రాయేలీయులకు సంబంధించిన మూడు ముఖ్య విషయములను ప్రవచించుచున్నాడు.
1.యూదా ప్రజల ఆత్మీయ స్థితి మలాకీ 1:1-5 2.యూదుల అప విత్రత Mal,1,6-3,15 3.యూదుల కొరకు వాగ్దానములు. Mal,3,16-4,6
(a). జ్ఞాపకార్ధ గ్రంథములో వ్రాయబడియున్నవారి ఫలితములు మలాకీ 3:16-18 (b). క్రీస్తు రాకడవలన సంభవించు ఫలితములు మలాకీ 4:1-3 (c). ఏలీయా రాకడను గూర్చిన ప్రవచనములు మలాకీ 4:4-6
సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో ఇది 39వ పుస్తకము; చివరి పుస్తకము . అధ్యాయములు 4; వచనములు 55; ప్రశ్నలు 27; ఇశ్రాయేలీయులు పాపములు తెలుపు వాక్యములు 32; ఆజ్ఞలు 5; వాగ్దానములు 5; హెచ్చరికలు 30; ప్రవచన వాక్యములు 19; నెరవేరిన ప్రవచనములు 6; నెరవేరనున్న ప్రవచనములు 13; దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 28.
యూదుడు యూదుని గూర్చి యూదులకు వ్రాసిన సువార్తయే మత్తయి సువార్త. ఇందు మత్తయి రచీత, యూదులు చదవరులు, యేసుక్రీస్తును గూర్చిన ప్రస్తావన. యేసును యూదుల రాజుగా, దీర్ఘకాలము నుండి ఎదురు చూస్తున్న మెస్సీయగా తెలియజేయుటయే మత్తయి యొక్క ఉద్దేశం. ఆయన వంశావళి, బాప్తిస్మము, అద్భుత కార్యములు మొదలగునవన్నియు యేసు రాజని మార్పులేని ఒకే ఉద్దేశములోనికి చదవరుల దృష్టిని నడిపించుచున్నవి. ఈ రాజు మరణము చెందుట వలన మొదట తన దృష్టికి ఓటమిగా అనిపించినప్పటికీ ఆయన పునరుత్థానము చెందుట ద్వారా విజయకరముగా మారెనని భావించెను. యూదుల రాజు జీవించుచుండెను అను సందేశము పదే, పదే ప్రతిధ్వనించుచుండెను.
మత్తయి అనే పేరుకు దేవుని దానం అనే అర్థం కలదు. మత్తయికి లేవీ అనే మరొక పేరు కూడా కలదు. (మార్కు 2:14; లూకా 5:27)
ఉద్దేశము : నిత్యుడైన రాజు, మెస్సీయ అని యేసును నిరూపించుట.
గ్రంథకర్త : మత్తయి (లేవీ)
కాలము : క్రీ.శ 60 - 65కు మధ్యలో
గత చరిత్ర : రోమా గౌరవ్నమెంటు కోసం సుంకమును వసూలు చేయు ఒక ఉద్యోగస్తుడైన మత్తయి. ఇతడు యేసు ప్రభువు యొక్క శిష్యుడుగా మారెను. ప్రవచనముల నెరవేర్పుకు దృఢత చేకూర్చుట ద్వారా యీ సువార్తను పాత, క్రొత్త నిబంధనలను కలిపె గొలుసువలె నుండెను.
ముఖ్య వచనములు : ధర్మశాస్త్రమునైనను, ప్రవక్తల వచనముల నైనను కొట్టివేయు వచ్చితినని తలంచవద్దు నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు మత్తయి 5:17
ప్రముఖ వ్యక్తులు : యేసు, మరియ, యోసేపు, బాప్తీస్మమిచ్చు యోహాను, యూద మత గురువులు పెద్దలు, కయప, ఫిలాతు, మగ్దలేనే మరియ, యేసు శిష్యులు.
ముఖ్య స్థలములు : బెత్లెహేము, యెరూషలేము, కపెర్నహూము, గలలియ, యూదయ.
గ్రంథ విశిష్టత : ఈ సువార్త ఒక మెస్సీయ శైలిలో రచింపబడెను. (ఉదాహరణకు దావీదు సంతతివాడు అని పలుమారు ఉపయోగించెను. పాత నిబంధన వాక్యములు యాభైమూడు, స్పష్టముగా లేని డెభైరు హెచ్చరికలు ఇందులో కలవు, సంభవములు కాలక్రమమును అనుసరించి ఇవ్వబడలేదు. యేసును మెస్సీయగాను రాజుగా నిరూపించుటయే ముఖ్య ఉద్దేశం.
ముఖ్య పద సముదాయము : యేసు అను రాజు.
ముఖ్య వచనములు : మత్తయి 16:16-19; 28,19-20}
ముఖ్య అధ్యాయము : 12
పండ్రెండ అధ్యాయములో పరిసయ్యులు యేసును ఇశ్రాయేలు జనులకు నాయకత్వం వహించు స్థానము నుండి బహిరంగముగా ఆయనను తృణీకరించెను. యేసు ప్రభువు యొక్క శక్తి దేవునిని నుండి కాక సాతాను నుండి వచ్చుచున్నదని వారు చెప్పుటతో మత్తయి సువార్త ఒక మలుపు తిరుగుచున్నది. సాధారణ ప్రజలకు యేసు ప్రభువు బోధించునపుడు ఉపమానములతో బోధించుచు ఆయన శ్రద్ధ ముఖ్యంగా తన శిష్యులకు తర్ఫీదునిచ్చునట్లు త్రిపచుండెను. ఈ సందర్భములోనే తన సిలువ మరణము సమీపించుచున్నదని పలుమార్లు చెప్పుచుండెను.
గ్రంథ విభజన : మత్తయి సువార్తను క్రొత్త నిబంధనలో మొదటి గ్రంథముగా చేర్చుటతో కొన్ని కారణములు లేకపోలేదు. 1వ అధ్యాయము, 1వ వాక్యము గమనించినచో అబ్రాహాము కుమారుడగు దావీదు. కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. ఈ ప్రారంభములోని సత్యమును పలుమారు మారులు చెప్పుట ద్వారా ఈ సువార్త పాత, క్రొత్త నంబంధనలను కలిపే వంతెన వలె ఉండెను. యేసుక్రీస్తు యొక్క ప్రాముఖ్య మైన ఐదు ప్రసంగము యీ సువార్తలో నుండెను. కొండ మీద ప్రసంగము (Mat,5,3-7,27) శిష్యులకు కావలసిన బోధ (మత్తయి 10:5-42) పరలోక రాజ్యమును గూర్చిన ఉపమానములు (మత్తయి 13:3-52) శిష్యత్వమునకు కావలసిన విధులు (మత్తయి 9:3-38) ఒలీవ కొండ పై ప్రసంగం (Mat,24,3-25,46) మొదలగునవన్ని యేసు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తుగా చూపుచున్న ఈ సువార్త గ్రంథ విభజన ఈ క్రింది విధముగా నున్నది.
రాజు వంశావళి, రాకడ Mat,1,1-4,11. • రాజు కట్టడలు Mat,4,12-7,29. రాజు అధికారము Mat,8,1-11,1. • రాజు తృణీకరింపబడుట Mat,11,2-16,12. • రాజు రాయబారుల సిద్ధపాటు Mat,16,13-20,28. • రాజుగా నగర ప్రవేశము, నిరాకరింపబడుట Mat,20,29-27,66. • రాజు అధికార నిరూపణ మత్తయి 28:1-20.
సంఖ్యా వివరములు : - పరిశుద్ధ గ్రంథములో ఇది 40వ పుస్తకము; అధ్యాయములు 28; వచనములు 1071; ప్రశ్నలు 177; నెరవేరిన పాతనిబంధన ప్రవచనములు 25; క్రొత్త నిబంధన ప్రవచన వాక్యములు 47; చరిత్రాత్మక వచనములు 815; ప్రవచన వాక్యములు 256; నెరవేరిన ప్రవచనములు 164; నెరవేరని ప్రవచనములు 92.
Mark - మార్కు వ్రాసిన సువార్త
మార్కు సువార్తలోని వర్తమానమును ఒకే యొక వచనములో క్లుప్తపరచిన యెడల అది ఈ విధముగా చెప్పవచ్చును. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను. (మార్కు 10:45), ఈ పుస్తకం యొక్క ఒక్కొక్క అధ్యాయములో మెస్సీయ శ్రేష్ఠ జీవితమునకు కేంద్రబిందువుగా తెలియజేయునది త్యాగపూరితమైన ఆయన సేవయే.
తండ్రి చిత్తమునకు ఎల్లవేళల విధేయుడగుచు సేవలో నిమగ్నుడై ముందుకు కొనసాగుచున్న దాసునిగా మార్కు ప్రభువును చిత్రీకరించెను. వాక్యమును ప్రసంగించుచు రోగులను స్వస్థపరచుచు మరణము వరకు ఇతరుల అవసరములను నెరవేర్చు సేవలో యేసు నిమగ్నుడాయెను. పునరుత్థానుడైన తరువాత ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణ దాసులుగా ఆయన అడుగు జాడలలో నడిచే శిష్య బృందముగా ప్రభువు నియమించెను.
మార్కు అని పిలువబడుచున్న ఈ గ్రంథకర్తకు యోహాను అను మరొక పేరు కూడ ఉన్నది. (అపో. కార్యములు 12:12-15; అపో. కార్యములు 15:37
ఉద్దేశము : యేసు బోధనలను, క్రియలను తెలుపుట.
గ్రంథకర్త : మార్కు ప్రభువు శిష్యుడు కాడు. కాని పౌలు చేసిన మొదటి సువార్త దండయాత్రలో మార్కు ఆయనతోపాటు పాల్గొనెను. (అపో. కార్యములు 13:13)
ఎవరికి వ్రాయబడెను : రోమాలో నివసించుచున్న క్రైస్తవుల కొరకు రోములోనే ఈ గ్రంథము వ్రాయబడెను.
రచించిన కాలము : క్రీ. శ 55 - 65 కు మధ్య కాలము
గత చరిత్ర : తిబెరకైసరు క్రింద రోమా సామ్రాజ్యం ఉండినప్పుడు మహా సామ్రాజ్యమంతటను ఒకే భాషయు, పుష్కలమైన ప్రయాణ సౌకర్యములు, వార్తలు సమాచారములు అందించు సౌకర్యములు, బాగుగా నుండుట వలన అందరూ సువార్త విని అర్ధము చేసికొనవలెననియు సమస్త దేశములకును వేగముగా ఈ సువార్తను అందించు అవకాశములు ఏర్పడెను.
ప్రముఖ వ్యక్తులు : యేసు, ఆయన శిష్యులు (పండ్రెండుగురు) పిలాతు యూదమత నాయకులు
ముఖ్య స్థలములు : కప్నెహూము, నజరేతు, కైసరియ, యెరికో, బేతనియ, ఒలీవ కొండ, యెరూషలేము, గొల్గొతా.
గ్రంథ విశిష్టత : ఇది మొట్టమొదట వ్రాయబడిన సువార్త పుస్తకము. ఇతర సువార్తల కంటే ఎక్కువ అద్భుతములను మార్కు వ్రాసియున్నాడు. ( 18 అద్భుతములు, 4 ఉపమానములు)
మార్కు కాలము : నాలుగు సువార్తలలో మొదటిగా వ్రాయబడిన సువార్త మార్కు సువార్తయేనని పలువురు బైబిలు పండితులు అభిప్రాయబడుచున్నారు. అయినను దీని కాలమును నిర్దుష్టముగా తెలుప జాలము. దేవాలయ నాశనమును గూర్చిన ప్రవచనము ఇందులో వ్రాయబడియుండుటను బట్టి ఈ సువార్త క్రీ.శ 70కి ముందే వ్రాయబడియుండవచ్చును. అయితే క్రీ.శ. 64లో పేతురు హత సాక్షి మరణమునకు ముందో వెనుకో ఇది వ్రాయబడినదని చెప్పుటకు సాధ్యంకాదు. క్రీ.శ. 55కు 65 కు మధ్యలో సువార్త రచన కాలమని భావించుచున్నారు.
మార్కు రోమీయులను ఉద్దేశించి దీనిని వ్రాసెననుట సుస్పష్టము. అది కాలములోనున్న యూదా పారంపర్యమును బట్టి మార్కు రోములో ఉండిన కాలములో దీనిని వ్రాసెనని నమ్మవచ్చును. యూదులు గౌరవింపజాలని పలు ప్రాముఖ్య విషయములను మార్కు వ్రాయకపోవుటకు కారణము ఇది రోమీయులకు వ్రాయబడుటయే. క్రీస్తు వంశావళి, ఆయన జీవితములో నెరవేరిన ప్రవచనములు ధర్మశాస్త్ర సంబంధమైన వివాదములు, ఇతర సువార్తలో ప్రాముఖ్యముగా కనిపించు యూదుల సంప్రదాయములు మున్నగునవి విడువబడినవి.
ముఖ్య పద సముదాయము : దాసుడైన యేసు.
ముఖ్య వచనములు : మార్కు 10:43-45; మార్కు 8:34-37.
ముఖ్య అధ్యాయము : 8వ అధ్యాయము. పేతురు - నీవు క్రీస్తువని ఆయనతో చెప్పిన విశ్వాస వాక్యమే అధ్యాయములో ప్రధాన సంఘటన. విశ్వాసముతో కూడిన ఈ ఒప్పుకోలు యేసు సేవలో ఒక నూతన పద్ధతి ప్రారంభమగుటకు కారణమైనది. అప్పటి నుండియు ప్రధానయాజకులు మున్నగు వారి వలన తాను పొందబోవు శ్రమలను తన మరణమును తన శిష్యులు ఎదుర్కొనవలెనని వారిని సంసిద్ధులుగా చేసెను. అక్కడ సంపూర్ణ బానిసగా సిలువ మరణము పొందుట ద్వారా దేవుని మహిమను వెల్లడించెను.
గ్రంథ విభజన : ఇది సువార్తలన్నింటిలో క్లుప్తమైనది. సులభ గ్రాహ్యమైనది. ఈ పుస్తకము యేసు జీవిత సంఘటనలు వేగముగా చూచుటకు చదువరులకు సహాయపడుచున్నది. యేసు చేసిన బోధలకంటె ఆయన సేవకు అధికముగా ప్రాముఖ్యతనిస్తున్న దీనిలో రెండు ముఖ్య భాగములు గలవు. మొదటి భాగము 1 - 11 అధ్యాయములు - యేసు పరిచర్యను, రెండవ భాగము 12 - 16 అధ్యాయములు, యేసు త్యాగమును తెలుపుచున్నవి. గ్రంథ విభజన వివరముగా ఈ క్రింద నీయబడినది.
1.సేవకుని పరిచర్య 1 - 10 అధ్యాయములు. (a). సేవకుని ఆగమనము Mark,1,1-2,12. (b). సేవకుడు ఎదుర్కొని ఆటంకములు Mark,2,13-8,26. (c). సేవకుడిచ్చిన ఉపదేశములు Mark,8,27-10,52.
సేవకుని త్యాగము : 11 - 16 అధ్యాయములు. (a). సేవకుడు నిరాకరింపబడుటకు, Mark,11,1-15,47. (b). సేవకుని పునరుత్థానము మార్కు 16:1-20
సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో 41 వ పుస్తకము. - అధ్యాయములు 16; వచనములు 678; ప్రశ్నలు 121; నెరవేరిన పాత నిబంధన ప్రవచనములు 11; క్రొత్త నిబంధన ప్రవచనములు 30; చారిత్రాత్మక వచనములు 582; నెరవేరిన ప్రవచన వాక్యములు 43; నెరవేరనున్న ప్రవచన వాక్యములు 53.
Luke - లూకా వ్రాసిన సువార్త
ప్రేమపూరిత పదములతో, వైద్యుడైన లూకా, మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ మానవత్వమును కడుజాగరూకతతో వర్ణించుచున్నాడు. ప్రారంభములో యేసు వంశావళిని, జననమును, బాల్యమును వివరించి వాటికి తగిన ప్రాధాన్యతను వివరించిన తరువాత కాల సంభవములను సూక్ష్మబుద్దితో తెలిపిన తదుపరి ప్రభుని బహిరంగ పరిచర్యను వర్ణింపబూనుకొన్నాడు. ఆ బహిరంగ పరిచర్య సామాన్య ప్రజలలో యేసునందు విశ్వాసము పెరుగుచుండగా మరొకవైపు ఆయన శత్రువులలో విరోధ భావములు పెరుగుచుండెను. ఇట్టి పరిస్థితులలో విశ్వసించిన వారికి శిష్యత్వపు విలువలు తరిచి తెలిసికొనుట సవాలుగా మారినది. విరోధులు మనుష్య కుమారుడు సిలువపై ఒక మృతదేహముగా వ్రేలాడుట చూచువరకు మనశ్శాంతి పొందలేదు. కాని ఆయన పురుత్థానుడైన తరువాత స్థితిగతులకు మార్పు వచ్చెను. తుదకు మనుష్య కుమారుడైన క్రీస్తులో దేవుని చిత్తము సంపూర్ణముగా నెరవేరెను.
లూకా అను నామము క్రొత్త నిబంధనలో ముమ్మారు మాత్రమే చెప్పబడినది. కొలొస్సయులకు 4:14; 2 తిమోతికి 4:11; ఫిలేమోనుకు 1:24. ఉద్దేశము : యేసు క్రీస్తు జీవితమును గూర్చి అధిక వివరముల నిచ్చుట యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడు నిజ రక్షకుడు అని చూపుట.
గ్రంథకర్త : గ్రీకు దేశస్థుడును వైద్యుడైన లూకా (కొలొస్సయులకు 4:14) కొత్త నిబంధన రచయితలలో అన్యుడైన ఒకే యొక వ్యక్తి. ఇతడు అపొస్తులుడైన పౌలుతో బాటు ప్రయాణములు చేసినవాడు. అపోస్తులుల కార్యములు అను గ్రంథరచయిత, ఈ రెండు పుస్తకములు ఒకదానికొకటి సంపూర్ణములుగా నున్నవి.
ఎవరికి వ్రాయబడెను : ఘనత వహించిన థెయొఫిలాకును, అన్యజనులకును వ్రాయబడెను.
కాలము : సుమారు క్రీ.శ 60.
గత చరిత్ర : లూకా కైసరియాలో ఉంటున్నప్పుడుగాని రోమాలో ఉంటున్నప్పుడుగాని దీనిని వ్రాసి యుండవచ్చును.
ప్రముఖ వ్యక్తులు : యేసు, ఎలీసబెతు, జెకర్యా, బాప్తీస్మమిచ్చు యోహాను, మరియ, శిష్యులు, మహా హేరోదు, పిలాతు, మగ్దలేనే మరియ
ముఖ్య స్థలములు : బెత్లెహేము, గలిలయ, యూదయ, యెరూషలేము.
గ్రంథ విశిష్టత : అత్యధిక సమాచారములు కలిగిన సువార్త పుస్తకము ఇది. సాధారణ బాషా రీతి పదసముదాయముతో రచయిత గొప్ప విద్వాంసుడని తెలియుచున్నది. పలు విధములగు వ్యాధులను గూర్చి తరచుగా వివరించుచున్నాడు. బహుజనసమూహములతో యేసుకు గల సంబంధమును, ఆయన ప్రార్ధనా జీవితమును, ఆయన చేసిన అద్భుతములను, దూతలను గూర్చి స్పష్టముగా చెప్పి యుండెను.
ముఖ్య పదము : మనుష్య కుమారుడైన యేసు.
ముఖ్య వాక్యములు : లూకా 1:3-4; లూకా 19:10
ముఖ్య అధ్యాయము : 15. ఈ పదునైదవ అధ్యాయములో చెప్పబడిన తప్పిపోయిన గొట్టె, పోగొట్టుకొనబడిన వెండి నాణెము, తప్పిపోయిన కుమారుడు అను ఉపమానముల ద్వారా రక్షణ సువార్త సారాంశమును ప్రభువు తెలియజేసెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. వాక్యమే సువార్త సారం.
గ్రంథ విభజన : చరిత్ర సంభంధమైన ఆధారములతో లూకా తన సువార్తను వ్రాశాడు. కాలక్రమమునకు చరిత్ర ఆధారములు ఎంత ప్రాముఖ్యమైనవో లూకా ఎరిగియుండెను. కావుననే ఈ సువార్త గ్రంథము మాత్రమే నాలుగు సువార్తలలో కంటే లోకమంతట అత్యధికముగా ప్రసిద్ధి గాంచుటకు అర్హముగా నున్నది. నాలుగు సువార్తలలో ఇది దీర్ఘమైనది. సాహిత్య రూపములో ఇది అగ్రభాగమున నిలుచున్నది. ఈ గ్రంథము పాపమానవులను వెదకి రక్షించుటకై వచ్చిన సంపూర్ణమానవునిగా యేసును చిత్రించుచున్నది. దీనిని నాలుగు ప్రధాన భాగములుగా విభజింపవచ్చును.
మనుష్యకుమారుని ఆగమనము Luke,1,1-4,13. 2. మనుష్యకుమారుని పరచర్య Luke,4,14-9,50. 3. మనుష్యకుమారుని తృణీకరించుట Luke,9,51-19,27. 4. మనుష్య కుమారుని సిలువ మరణము పునరుత్థానము Luke,19,28-24,53.
సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో 42వ పుస్తకము, అధ్యాయములు 24; వచనములు 1,151; ప్రశ్నలు 165; నెరవేరిన పాతనిబంధన ప్రవచనములు 9; క్రొత్త నిబంధన ప్రవచనములు 54; చరిత్రాత్మక వాక్యములు 930; నెరవేరిన ప్రవచన వాక్యములు 118; నెరవేరనున్న ప్రవచన వాక్యములు 103.
John - యోహాను సువార్త
నాణెమునకు రెండు భాగములు కలవు. రెండింటికిని సమాన ప్రాధాన్యత ఉండెను. ఈ ప్రకారముగానే యేసుక్రీస్తుకు తుల్యప్రధానమైన స్వభావములు రెండు గలవు అవి ఏవనగా దైవత్వం మానవత్వం, అపొస్తులుడైన యోహాను క్రీస్తు జీవితములో నున్న దైవత్వ స్వభావమునకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చుచు ఆయన దేవుని కుమారుడని తన సువార్తలో వ్రాసియుండెను. లూకా యేసుక్రీస్తు జీవితములోనున్న మానవత్వమునకు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చుచు ఆయన మనిషి కుమారుడని తన సువార్తలో వ్రాసియుండెను. కాలమునకు సంబంధించిన ఆధారములు వీటికి భిన్నమైన ప్రాముఖ్యాంశములను ఆధారము చేసికొని ఈ సువార్త రచింపబడెను. క్రీస్తు చేసిన ఏడు అద్భుతములను నేనే అని ఆయన దృఢముగా చెప్పిన ఏడు సత్యములను కేంద్రంగా చేసికొని సువార్త రచన ముందుకు సాగుచుండెను. మేడ గదిలో సిద్ధపరచబడిన చివరి రాత్రి భోజన వృత్తాంతములో తన శిష్యులకు చివరిగా ప్రసంగించెను. ప్రత్యక్ష సాక్ష్యముల వివరములతో ప్రారంభమై క్రీస్తు పునరుత్థాన సంభవములు తెలుపుచు, క్రీస్తు దేవుని కుమారుని యోహాను స్పష్టపరిచెను.
అధ్యాయములు: 21, వచనములు: 879
గ్రంథకర్త : జెబెదయి కుమారుడును, యాకోబు సహోదరుడును అపొస్తలుడైన యోహాను. జెబెదయి కుమారులు “ఉరిమెడి "వారు అని పిలువబడియుండిరి.
రచించిన తేది: క్రీ.శ 85-90వ సం.
మూల వాక్యాలు:
1:1,14 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము శరీర -ధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మన మధ్య నివసించెను.
1:29 ఇదిగో లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.
3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
6:29 యేసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాస ముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను.
10:10 గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితిని.
10:27,28 నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను
11:25-26 అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకును;బ్రదికి నాయందు విశ్వాస ముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు
13:35 మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను .
14:6 యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ద్దకు రాడు.
19:30 సమాప్తమైనది
ఉద్దేశము : యేసు నిజముగా దేవుని కుమారుడని ఆయనయందు విశ్వాసముంచిన వారు నిత్య జీవము పొందుదురు అని నిరూపించుట.
ఎవరికి వ్రాయబడెను : నూతన విశ్వాసులకు, సత్యాన్వేషకులైన అవిశ్వాసులకు
గత చరిత్ర : క్రీ.శ. 70 సంవత్సరములో యెరూషలేము నాశనం చేయబడిన తరువాత యోహాను పత్మాసు ద్వీపమునకు పరవాసిగా వెళ్ళకముందు యోహాను ఈ సువార్తను వ్రాసియుండెను.
ముఖ్య వ్యక్తులు : యేసు, బాప్తీస్మమిచ్చు యోహాను, యేసు శిష్యులు, మార్త, మరియ, లాజరు, యేసు తల్లి, పిలాతు, మగ్దలేనే మరియ.
ముఖ్య స్థలములు : యూదయ, సమరయ, గలిలయ, బేతనియ, యెరూషలేము.
గ్రంథ విశిష్టత : వ్రాయబడిన 7 అద్భుతములలో 6 అద్భుతములు దీనిలో మాత్రమే వ్రాయబడెను. అనగా మిగిలిన మూడింటిలో దేనిలోను ఇవి లేవు. అలాగే 14 - 17 అధ్యాయములలో వ్రాయబడిన, మేడ గదిలో ప్రభువు శిష్యులనుద్దేశించి చేసిన ప్రసంగములు కూడ ఈ పుస్తకములోని ప్రత్యేకత. ఈ సువార్తలోని విషయములు 90 శాతము వివరములు ఇతర సువార్తలలో లేవు. అయితే ఇతర సువార్తలలో చెప్పబడిన యేసు వంశావళి, జననము, బాల్యకాల విశేషములు, శోధనలు, రూపాంతరము, శిష్యుల నియామకము, ఉపమానములు, చివరి ఆజ్ఞ, ఆరోహణము అనువాటిని గూర్చి ఈ సువార్తలో ఏమియు వ్రాయబడలేదు.
ముఖ్య పద సముదాయము : యేసు దేవుని కుమారుడని నమ్ముట.
ముఖ్య వచనములు :యోహాను 1:11-13; యోహాను 20:30-31
ముఖ్య ఆధ్యాయము : 3వ అధ్యాయము యోహాను 3:16 అధికముగా చదువబడునది; ప్రసంగింపబడుచునున్న సువార్త వాక్యమిది. రక్షణ దేవుని వరమనియు, అది విశ్వసించిన వారికి మాత్రమే ఇవ్వబడుననియు ఈ వచనము చెప్పుచున్నది. నీకొదేముతో జరిగిన సంభాషణ, బాప్తీస్మమిచ్చు యోహాను సాక్ష్యము - మున్నగు వాటి మూలమున, దేవుని రాజ్యములో ప్రవేశించుటకు నూతన జన్మ పొందుటయే ఏకైక మార్గమని ఈ అధ్యాయము మనకు తెలియజెప్పుచున్నది.
కొని ప్రత్యేక సందర్భములలో యేసు పాత నిబంధనలో నేనే అని చెప్పినది. దేవునితో సమానుడని స్పష్టపరిచెను. ఆయన దైవత్వమును చాటి చెప్పు ముఖ్యాంశములను యోహాను 1:1; యోహాను 8:58; యోహాను 10:30; యోహాను 14:9; యోహాను 20:28 అను వచనములలో చూడగలము. నేనే అని యేసు తనను గూర్చి దృఢముగా చెప్పిన ఏడు మాటలను ఈ క్రింద చూతము.
జీవాహారమును నేనే (యోహాను 6:35-48) 2. నేను లోకమునకు వెలుగైయున్నాను. (యోహాను 8:12; యోహాను 9:5). 3. నేనే ద్వా రమును (యోహాను 10:7-9). 4. నేను మంచి కాపరిని (యోహాను 10:11-14). 5. పునరుత్థానమును, జీవమును నేనే (యోహాను 11:25). 6. నేనే మార్గమును, సత్యమును, జీవమును (యోహాను 14:6). 7. నేనే నిజమైన ద్రాక్షావల్లిని (యోహాను 15:1-5).
గ్రంథ విభజన : ఇతర మూడు సువార్తలలో లేని ప్రత్యేకమైన యొక సారాంశమును శైలిని కలిగియున్న ఈ సువార్త - స్థూల పరిశీలనా సువార్తలు మత్తయి, మార్కు, లూకా విడిచి పెట్టిన కొన్ని ముఖ్యాంశములను వ్రాయుట ద్వారా క్రీస్తు చరిత్ర సంగ్రహమును సంపూర్ణము చేయుచున్నది. మిక్కిలి సులభశైలితో, అతి శ్రేష్ఠమైన వర్తమానములతో నిండియున్నది. ఈ గ్రంథము, పరిశుద్ధ గ్రంథములోని పుస్తకములన్నింటిలో మిక్కిలి శ్రేష్టమైనది ఆత్మీయ సత్యములతో పరిపుష్టమైనది. యేసునందు విశ్వాసముంచుట ద్వారా మనుష్యులు ఆత్మ జీవులుగా మారగలరు అను సుస్పష్టమైన లక్ష్యముతో యోహాను ఈ సువార్తను వ్రాయుచున్నాడు. దీనిని ఐదు ముఖ్య భాగములుగా విభజింపవచ్చును.
ఉపోద్ఘాతము: దేవుని కుమారుని అవతారం (యోహాను 1:1-18). 2. దేవుని కుమారుని బహిరంగ సువార్త సేవ (Joh,1,19-4,54). 3. దేవుని కుమారుడు ఎదుర్కొనిన ఎదిరింపులు అధ్యాయము 5 మొదలు 12 వరకు. 4. దేవుని కుమారుని శిష్యులను సేవకులుగా చేయుట అధ్యాయము 13 మొదలు 17 వరకు. 5. దేవుని కుమారుని సిలువ మరణము పునరుత్థానము అధ్యాయము 18 మొదలు 21 వరకు.
సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో 43వ పుస్తకము; అధ్యాయములు 21; వచనములు 876; ప్రశ్నలు 167; నెరవేరిన పాత నిబంధన ప్రవచనములు 15; నెరవేరిన క్రొత్త నిబంధన ప్రవచనములు 85; నెరవేరని ప్రవచనములు 7.
ఉపోద్ఘాతం: యోహాను సువార్త యేసు క్రీస్తు ప్రభువును ఉద్దేశించి రచించబడింది. ఆయన క్రీస్తు అనియు, దేవుని కుమారుడనియు, ఆయన నామమందు విశ్వాసము కలిగిన వారికి నిత్య జీవమనియు మరి ముఖ్యంగా తెలియజేస్తుంది. రెండవ తరం క్రైస్తవుల విశ్వాసాన్ని బలపరచడమే కాకుండా తప్పుడు బోధలను సరి చేస్తూ వారికి సత్య సువార్తను నిక్షిప్తం చేస్తుంది ఈ గ్రంథం. యోహాను యేసు క్రీస్తు-ప్రభువు అనియు, మనుష్యకుమారుడు మరియు దేవుని కుమారుడు అని మరి ముఖ్యంగా తెలియజేస్తూ, క్రీస్తు ఆత్మ ప్రతీ వ్యక్తి పై ప్రభావితం చేస్తుంది అని వివరిస్తాడు.యేసు క్రీస్తు యొక్క బాప్తీస్మము మొదలుకొని మరణ పునరుత్థానము వరకు జరిగిన అన్ని సన్నివేశాలు ఈ గ్రంథం లో లిఖితం చేయబడినవి. ఈ సువార్త లో సువార్తికుడు కేవలం ఏడు అద్భుతాలను తెలియజేస్తూ ఆ ఏడు అద్భుతములు నేనే అని ఆయన ధృడంగా చెప్పిన ఏడు సత్యాలైన క్రీస్తు ప్రరిచర్యను విశ్లేషిస్తాడు. ఈ సువార్తికుని యొక్క గ్రంథం మిగతా సువార్తల కంటే ప్రత్యేకమైనది. కీస్తు ఆరోహణమైన తరువాత ఆదరణ కర్తయును సత్య స్వరూపియైన ఆత్మ ఏ విధంగా సర్వ సత్యమైన పరిచర్యలోనికి నడిపించిందో గమనించగలం. నమ్ముట, సాక్షి, ఆదరణ, జీవం – మరణం, వెలుగు – చీకటి, ప్రేమ అనే పదాలు అనేక మారులు ఈ సువార్తలో కనబడుతుంటాయి.
యేసు క్రీస్తును కేవలం తన జననం నుండే పరిచయం చేయడు కాని ఆది నుండి ఏమై ఉన్నదో ఆ వాక్యం నుండి వివరిస్తాడు. ఆదియందు వాక్యముగా, ఆ వాక్యమే శరీరధారియై, లోక పాపములను మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్లగా, మెస్సియగా, ప్రతీవాడు నశించకుండా ఆయన ద్వారా నిత్యజీవం పొందునట్లు యేసు క్రీస్తును పరిచయం చేసింది ఈ సువార్త. యేసు క్రీస్తు జీవితములో ఉన్న దైవ స్వభావమును మానవత్వాన్ని వివరించి కాలమునకు సంబంధించిన భిన్నమైన ప్రాముఖ్యాంశములను ఆధారము చేసుకొని ఈ సువార్త రచించెను. యోహాను 3:16 అధికముగా చదవబడినది, అనేకులకు ప్రసంగించబడిన సువార్త వాక్యం ఇది. రక్షణ దేవుని వరమనియు, అది విశ్వసించిన వారికి మాత్రమే ఇవ్వబడుననియు ఈ వచనము చెప్పుచున్నది. అంతేకాదు నీకొదేముతో జరిగిన సంభాషణ, బాప్తీస్మమిచ్చు యోహాను సాక్ష్యము మొదలగు వాటి మూలమున, దేవుని రాజ్యములో ప్రవేశించుటకు నూతన జన్మ పొందుట ఒక్కటే మార్గమని తెలియజేశాడు. యేసు క్రీస్తు ప్రభువు తన శిష్యులతో తాను పొందబోయే ఆ సిలువ మరణము గూర్చి మరియు తాను ఆరోహణమైన తరువాత వారు చేయబోయే పరిచర్య విషయమై వారిని సిద్దపరిచాడు.
యేసు క్రీస్తు తనను గూర్చి దృఢంగా చెప్తూ, జీవాహారము నేనే (6:35,48), నేను లోకమునకు వెలుగై ఉన్నాను(8:12,9:5), నేనే ద్వారమును (10:7,9), నేను మంచి కాపరిని (10:11,14), పునరుత్థానమును జీవమును నేనే (11:25), నేనే మార్గమును సత్యమును జీవమును (14:6), నేనే నిజమైన ద్రాక్షావల్లిని (15:1-5) అను ఏడు సంగతులు ప్రత్యేకముగా వివరించాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను అనే ప్రాముఖ్యమైన సంగతి 4:24 లో గమనించగలం.
సారాంశం: నిజ జీవితంలో పరిపూర్ణమైన పరిచర్య ఏ విధంగా చేయాలి అని ప్రత్యేకంగా 3:16 తెలియజేస్తుంది. యేసు క్రీస్తు వలే మానవత్వంలో మాదిరికరమై, ఇతరుల పట్ల కూడా అదే జీవితం మనమందరం కలిగి యుండాలి, జీవించాలి. ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించి, నిత్యజీవమునకు వారసులమై ఆశీర్వాదములు పొందడమే కాకుండా ఇతరులకు కూడా ఆశీర్వాదకారకులమయ్యే ధన్యత కలిగి యుండాలి. అట్లు ప్రభువు మీకు సహాయం చేయును గాక. ఆమేన్.
Acts - అపొ. కార్యములు
యసుక్రీస్తు చిట్టచివరిగా తన శిష్యులకు ఇచ్చినవి ఆజ్ఞలుగా వ్రాయబడిన వాక్యములను గొప్ప ఆజ్ఞలు అని పిలుచుచున్నాడు. యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను, భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు (అపో. కార్యములు 1:8) అనునవే ఆ పలుకులు. ఈ గొప్ప ఆజ్ఞను శిరసావహించి ఆయన శిష్యులు విశ్వాసులు - పునరుత్థానుడైన రక్షకుని గూర్చిన సువార్తను భూదిగంతముల వరకు ప్రకటించిన చివరి స్త్రీ పురుషుల వృత్తాంతమే లూకా వ్రాసిన అపొస్తలుల కార్యములు. రెండు భాగములుగా లూకా వ్రాసిన ఒక గ్రంథములో రెండవ భాగముగా చెప్పబడుచున్న గ్రంథమునకు ప్రత్యేక నామమేదియు లేదు. కాని ఇప్పటి వరకు దొరికిన గ్రీకు - చేవ్రాత ప్రతులలోను “ప్రాక్సెయిస్” అనగా “కార్యములు” లేక అపొస్తలుల కార్యములు అను నామమును చూడగలము. గ్రీకు సాహిత్యములో "ప్రాక్సెయిస్" అనే పదం ప్రసిద్ధిగాంచిన పురుషుల యొక్క సాధనలను క్రోడీకరించి ఇచ్చిన గ్రంథమని పిలిచెదరు. ఈ పుస్తకములో అపొస్తలులు అని సమూహ అర్ధముగా పిలువబడుతున్నప్పటికి మనకు కన్పించువారు ఇరువురు మాత్రమే 1 అపొస్తలుడైన పౌలు 2 అపొస్తలుడైన పేతురు వారి సేవ, త్యాగము, అద్భుతములు ముఖ్యముగా గుర్తించబడుచున్నవి.
ఉద్దేశము : క్రీస్తు సంఘ పుట్టుకను, సంఘవృద్ధిని తేట తెల్లముగా తెలుపుట.
గ్రంథకర్త : వైద్యుడైన లూకా
ఎవరికి వ్రాయడెబను : థెయొఫిలాకు
వ్రాయబడిన కాలము : క్రీ.శ. సుమారు 61 సంవత్సరము
గత చరిత్ర : క్రీస్తు జీవితమును క్రీస్తు సంఘాభివృద్ధిని కలుపు ఒక గొలుసుగా ఇది ఉన్నది. సువార్త పుస్తకములను పత్రికలను కలుపుగొలుసుగా కూడ ఇది ఉన్నది.
ముఖ్య వచనము : అయినను పరిశుద్ధాత్మ మీమీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు. అపో. కార్యములు :8.
ప్రముఖ వ్యక్తులు : పేతురు, యోహాను, యాకోబు, సైఫను, ఫిలిప్పు, పౌలు, బర్నబా, కొర్నేలి, యేసు సహోదరుడైన యాకోబు, తిమోతి, లూదియ, సీల, తీతు, అపొల్లో, ఫేస్తు, అగ్రిప్ప, లూకా, మార్కు, అననీయ, ఫెలిక్సు
ముఖ్య స్థలములు : యెరూషలేము, సమరయ, యొప్పె, అంతియొకయ, ఈ కొనియ, పెసిదియ, లుస్త్ర, దెర్బె, ఫిలిప్పీ, థెస్సలోనికయ, బెరయ, ఎఫెసు, కైసరియ, మెలితే, రోము, ఏథెన్సు, లుద్ద, పిసిదియలోనున్న అంతియొకయ, కొరింధీ.
గ్రంథ విశిష్టత : లూకా సువార్తకు పొడిగింపు గ్రంథముగా ఇది ఉన్నది.
ముఖ్య పదము : సంఘ అభివృద్ధి.
ముఖ్య వచనములు : అపో. కార్యములు 1:8; అపో. కార్యములు 2:42-47.
ముఖ్య ఆధ్యాయము : అపొ. 2
యేసుక్రీస్తు తన శిష్యులకు పై నుండి శక్తి వచ్చువరకు యెరూషలేములో నిలిచి యుండుడని ఆజ్ఞాపించెను. ఈ వాగ్దానము ననుసరించి పరిశుద్ధాత్మ (దేవుడు) పెంతెకోస్తు దినమున మేడ గదిలో నున్న వారి మీదికి దిగి వచ్చెను. లోకమంతటా సువార్త ప్రకటించు పని ప్రారంభమాయెను. శిష్యుల బాధ్యత లోకమంతట సువార్త ప్రకటించి ఎవరును జయించలేనంత బలమైన సంఘముగా క్రీస్తు సంఘమును విస్తరింప చేయుటయే. ప్రభువు యొక్క అనాధి నిర్ణయం నెరవేర్చబడి, వారు సువార్త పనిలో ముందుకు కొనసాగుటకు శక్తివంతులుగా చేసెను.
గ్రంథ విభజన : లూకా సువార్త ముగిసిన చోటనే అపొస్తలుల కార్యములు గ్రంథము ప్రారంభమగుచున్నది. మత్తయి 28:19-20 వచనములలో యేసు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ నెరవేర్పు క్రమములో ప్రారంభ సంఘ చరిత్రాంశముల నింపియున్న గ్రంథమే ఈ అపోస్తలుల కార్యములు అను గ్రంథము. కొత్త నిబంధన సంఘపు ప్రారంభ చరిత్రను ఈ పుస్తకములో చూస్తున్నాము. యేసుక్రీస్తు ఆరోహణము, పెంతెకోస్తు దినమున పరిశుద్దాత్మ దిగి వచ్చుట మున్నగు వాటితో ప్రారంభమగుచున్న ఈ గ్రంథము - సువార్త ప్రకటన యెరూషలేములో ప్రారంభింపబడి రోమా మహాసామ్రాజ్య సరిహద్దులన్నింటిలోనికి వ్యాపించుటను వివరించుచున్నది.
అపొస్తలుల కార్యములు గ్రంథము పలు మలుపులను వివరించుచున్నది. సువార్త పుస్తకముల నుండి ప్రతికలలోనికి మార్చబడుట, యూదా మతము నుండి క్రైస్తవ మార్గములోనికి మార్చబడుట ధర్మశాస్త్రములో నుండి కృపలోనికి మార్చబడుట యూదులు మాత్రమే దేవుని ప్రజలు అను భావము నుండి సమస్త జాతి ప్రజలు దేవుని ప్రజలగుదురను మార్పు ఈ గ్రంథము ద్వారా పొందగలము. పలు మలుపుల ప్రారంభములను లూకా వ్రాసిన ఈ గ్రంథములో మాత్రమే చూడగలము. ఈ గ్రంథములోని ముఖ్య వచనమైన అపో. కార్యములు 1:8లో లిఖితమైనట్టుగా సువార్త వ్యాప్తిని సూచించు మూడు భాగములుగా దీనిని విభజింపవచ్చును.
యెరూషలేములో క్రీస్తును గూర్చిన సాక్ష్యము Acts,1,1-8,4
యూదయ సమరయ దేశములలో క్రీస్తు సాక్ష్యం ప్రకటన Acts,8,5-12,25
భూది గంతముల వరకు, క్రీస్తును గూర్చిన సాక్ష్యము 13 - 28 అధ్యాయములు.
సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో 44వ పుస్తకము. అధ్యాయములు 28; వచనములు 1007; ప్రశ్నలు 75; పాతనిబంధన ప్రవచనములు 21; క్రొత్త నిబంధన ప్రవచనములు 20; చరిత్రాత్మక వాక్యములు 949; నెరవేరిన ప్రవచనములు 49; నెరవేరనున్న ప్రవచనములు 14.
Romans - రోమీయులకు
పౌలు యొక్క అతి శ్రేష్ఠమైన ఒక సృష్టి రోమీయులకు వ్రాసిన పత్రిక. క్రొత్త నిబంధన యందు చేర్చబడిన అతని 13 పత్రికలును యేసుక్రీస్తు యొక్క కార్యములను, ఉపదేశములను గూర్చి పలుకగా, రోమా పత్రిక క్రీస్తు యొక్క బలి మరణము యొక్క ముఖ్యత్వమును గూర్చి చెప్పుచున్నది. ఒక ప్రశ్న- జవాబు అను విధానము గలిగి పరిశుద్ధ గ్రంథము యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశ్యపూర్వమైన ఉపదేశముల సమూహమును అపొస్తలుడైన పౌలు ఈ పత్రిక యందు వ్రాసి యున్నాడు. ఈ గ్రంథము ఒక దైవత్వము గల గ్రంథమనుటకు పూర్వమే అనుచరణ విధానపు బోధనలు గల ఒక సమూహముగా నున్నది.
గ్రంథ రచయిత:- బోధనల పునాదికి ముఖ్యత్వము వహించిన ఈ పత్రికను పౌలు వ్రాసెను. (రోమీయులకు 1:1) పదజాలము, ప్రవర్తన ఉద్దేశముల సమూహము, దైవత్వము యొక్క అనుకరణ విధానము మొదలగు వాటిలో ఇది పౌలు యొక్క ఇతర పత్రికలకు సంబంధించియున్నది. పౌలు చెప్పుచుండగా తెరియు అనునతనిని వ్రాయమని చెప్పి (రోమీయులకు 16:22) వ్రాసిన వాని అభినందనలను దీనితో కలుపుటకు అనుమతిని ఇచ్చియున్నాడు.
ఉద్దేశము:- రోమా ప్రజలకు పౌలును పరిచయం చేయుటయును, అతను రోమాకు వెళ్ళుటకు ముందు అతడు చెప్పు వర్తమానపు మాదిరిని వారికి ఇచ్చుటయును.
ఎవరికి వ్రాసెను?:- రోమా యందు గల క్రైస్తవులకును, అన్ని చోట్ల గల విశ్వాసులు యావన్మందికిని.
వ్రాసిన కాలము:- దాదాపు క్రీ.శ. 57లో కొరింథు నుండి యెరూషలేమునకు వెళ్ళుటకు పౌలు సిద్ధపడుచుండినపుడు.
ఆంతర్యము:- తూర్పు దేశములందు యించుమించు తన పరిచర్యను నెరవేర్చిన తరువాత స్పెయినుకు వెళ్ళు మార్గమందు రోమాను సంధించుటకు పౌలు ఇష్టపడెను. అయితే అంతకు ముందు యెరూషలేము లోని బీదలైన విశ్వాసుల కొరకు సహాయనిధిని చేర్చుటకు ప్రారంభించెను. (రోమీయులకు 15:22-28) రోమా సంఘము యొక్క అధిక పక్షపు వారు యూదులైనప్పటికిని అన్యజనులు అనేకులుండిరి.
ముఖ్య పాత్రలు: - పౌలు, ఫీబే
ముఖ్య స్థలము:- రోమా
గ్రంథ విశిష్టత:- పౌలు తన విశ్వాసమును బట్టబయలుగా ఒప్పుకొని అప్పగించు రీతిలో రోమా పత్రికను వ్రాసెను. ఇది ప్రతినిధిత్వ బహువచనము గల ఒక మాదిరి పత్రిక కాదు. అయితే పత్రిక చివరి భాగమును రోమీయులకు అభినందనలు తెలుపుటకు అధిక సమయమును తీసికొనెను.
పత్రికను ఎందుకు వ్రాసెను?:- “దేవుని చిత్తము యొక్క ముగింపు మాటలే మోషే యొక్క చట్టములు. అన్య జనులు క్రైస్తవులుగా మారుటలో ఆక్షేపణ లేదు. అయితే మొదట వారు సున్నతి పొంది మోషే ధర్మ శాస్త్రమును నెరవేర్చిన తరువాత మాత్రమే క్రైస్తవులు కాగలరు.” ఇది రోమా సమాజపు ఒక పక్షపు విశ్వాసులు మూర్ఖ వివాదము. మరియొక పద్ధతిలో దీనిని చెప్పినచో యూదా మతమును అంగీకరించని ఒకడు క్రీస్తునందు విశ్వాసముంచి రక్షణ పొందగలడా అనునదే వారి సమస్య. క్రైస్తవ్యము యొక్క ప్రారంభము యూదా మతము నందుండియున్నచో ఆ రీతిగా ఎట్లయిననూ కొనసాగించవలెననునదే వారి మధ్య గల యూదా మత నాయకుల స్థిరమైన తీర్మానము. ఒక అన్యునుకి యూదా మతమునంగీకరించుటకు సున్నతి అనునది ఒక ప్రాముఖ్యముగా నెరవేర్చవలసిన ఒక మత సంస్కారముగా నుండెను.
నీతిమంతులుగా తీర్చబడుటను గూర్చి-పౌలు యొక్క వివరణ: - నీతిమంతులగు వారి విషయము క్రీస్తు ద్వారానే తప్ప మోషే యొక్క ధర్మ శాస్త్రము ద్వారా దేవుని యెదుట మనుష్యుని నీతిమంతునిగా తీర్చలేము అని ఈ పత్రిక ద్వారా బయలుపడుచున్నది. దేవుని పరిశుద్ధతను బయలుపరచి చూపునది ధర్మశాస్త్రము. స్వభావ సిద్ధముగా పాపియైన మానవుడు పరిపూర్ణముగా ధర్మశాస్త్రము ప్రకారం జీవించలేడు. అయితే పాపి ఎట్లు ధర్మశాస్త్రము ప్రకారము నీతిమంతుడిగా తీర్చబడగలడు? క్రీస్తు ద్వారా లభించు పాపక్షమాపణ ద్వారా మాత్రమే పాపియైన మనుష్యుడు దేవుని యెదుట నీతిమంతుడిగా మార్చబడును. అనగా మనుష్యునికి యేసుక్రీస్తు అనుగ్రహించు పాప పరిహారము మూలముననే తప్ప స్వంత క్రియలచే ఎవరునూ నీతిమంతుడైన దేవుని యెదుట నీతిమంతులుగా తీర్చబడలేరు. కనుక నీతిమంతులుగా తీర్చబడుట అనునది క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా మాత్రమే లభించును. అంతేకానీ ధర్మశాస్త్రము వలనైన ఆచారముతో లభించదని పౌలు నిర్బంధముగా నిరూపించుచున్నాడు.
ముఖ్య పదజాలము:- దేవుని నీతి.
ముఖ్య వచనములు:- రోమీయులకు 1:6; రోమీయులకు 1:17; రోమీయులకు 3:21-25.
ముఖ్య అధ్యాయములు:- రోమా 6-8 వరకు క్రైస్తవ జీవిత పునాది బోధనలు యీ పత్రిక మధ్య భాగమైన 6-8 వరకు గల అధ్యాయములలో కనిపించుచున్నవి. పాపము నుండి ఎట్లు విడుదల లభించును? కృప ద్వారా శిరస్సావహించిన ఒక జీవితము మనకెట్లు లభించును? పరిశుద్ధాత్మతో నిండిన ఒక విజయ జీవితమును ఎట్లు స్వంతము చేసుకొనగలము? ఈ ప్రశ్నల యొక్క సమాధానమును యీ భాగమందు చూడగలము. యేసుక్రీస్తు యొక్క పోలికలో రూపాంతరము పొందుటను గూర్చిన అతి ముఖ్యమైన లేఖన భాగము ఇదేనని అనేకులు తలంచుచున్నారు.
గ్రంథ విభజన:- దేవుని నీతియనునదే ఈ గ్రంథము యొక్క ముఖ్య అంశము. ఈ నీతిని గూర్చిన మూడు కార్యములు వరుస క్రమమున యీ గ్రంథము నందు వివరించబడియున్నవి. (1) దేవుని నీతి ప్రత్యక్షత. ఆధ్యా1-8 వరకు. (2) దేవుని నీతి నిరూపించబడుట. ఆధ్యా 9-11 వరకు. (3) దేవుని నీతి యొక్క అనుచరణ అభ్యాసము 12-16 వరకు.
కొన్ని ముఖ్య వివరణలు :- పరిశుద్ధ గ్రంథము యొక్క 45వ పుస్తకము: అధ్యాయములు 16; వచనములు 433; ప్రశ్నలు 87; పాత నిబంధన ప్రవచనములు 19; క్రొత్త నిబంధన ప్రవచనములు 4; చారిత్రక వచనములు 388; నెరవేర్చబడిన ప్రవచనములు 29; నెరవేర్చబడని ప్రవచనములు 16.
కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక
పాలు కాలములో గ్రీసుకు ఒక ముఖ్య పట్టణముగానున్న కొరింథు ప్రపంచమంతటను వ్యాపారము, అక్రమపద్ధతులు, విగ్రహారాధన మొదలైన వాటితో నిండిన ఒక స్థలముగానుండెను. ఇక్కడ పౌలు ఒక సంఘమును ఏర్పరచెను(అపో. కార్యములు 18:1-17). అతని పత్రికలలో రెండవ కొరింధు దేవుని సంఘము అని పేరుకు మాత్రమే వ్రాయబడినవిగా నుండెను.
ఒక అన్య సముదాయము నుండి పిలిచి ప్రత్యేకపరచబడిన సంఘము ఎదుర్కొనవలసిన సమస్యలు, పురికొల్పులు, పోరాటములు, మొదలైనవి ఈ మొదటి పత్రిక బయలు పరచుచున్నది. కొరింథీయ సంఘ జీవితములో ఒకభాగముగా మారిన విభజనలు, నేరములు, దుర్మార్గము, దుష్ట ప్రవర్తన, ప్రభువు బల్ల మరియు కృపావరములను తప్పుగా నుపయోగించుట మొదలైన వాటిని గూర్చి ఈ పత్రికలో పౌలు మాట్లాడుచున్నాడు. శిక్షకార్యములను గూర్చిన నిరాకరింపులు తప్ప కొరింథు విశ్వాసులు వ్రాసి అడిగిన కొన్ని సమస్యలను గూర్చిన తన అభిప్రాయములనుకూడ ఈ పత్రికలో చూడవచ్చును.
ఉద్దేశము:- కొరింథు సంఘము యొక్క సమస్యలను తెలిసికొని వాటికి పరిహారము చెప్పుట, అక్రమ పద్ధతులు నిండిన సముదాయములో విశ్వాసులు ఎట్లు జీవించవలెనని బోధించుట.
వ్రాసిన వారు: - పౌలు.
వ్రాసిన కాలము:- సుమారు క్రీ.శ. 55. పౌలు యొక్క మూడవసువార్త దండయాత్రలో ఎఫెసులో మూడేండ్ల సేవ యొక్క ముగింపులో.
ముఖ్య వ్యక్తులు:- పౌలు, తిమోతి, క్లోయె యింటివారికి.
ముఖ్య స్థలములు:- కొరింథులో సంఘముగా కూడివచ్చు స్థలములు.
గ్రంధ శ్రేష్టత:- నిర్మలత్వమును పటుత్వముగల ఒక బహిరంగమైన పత్రిక.
ముఖ్య పదజాలము:- శరీరానుసారమైన బ్రతుకు అను తప్పును దిద్దుకొనుడి.
ముఖ్య వచనములు:- 1 కోరింథీయులకు 6:19-20; 1 కోరింథీయులకు 10:12-13
ముఖ్య అధ్యాయము:- 1కొరి.13 వివాహ ఆచార వ్యవహారములలో పఠించుట ద్వారాను, ప్రసంగములకు మూలాధార వచనములుగ ఎత్తి చూపుటద్వారాను ఈ అధ్యాయము ప్రేమను గూర్చి మిక్కిలి శ్రేష్ఠమైన పరిమాణముగా కీర్తిగాంచెను. ప్రేమయనునది ఒక ఉద్రేకము. ప్రజలు దానిని కౌగిలించుకొనుటయో, దానిని విడిచి పెట్టి పారిపోవుటయో చేయవచ్చునను అభిప్రాయములను విడచి పెట్టి ప్రేమ ఒక ముఖ్యమైన ఆచరణ కార్యము అను సత్యమును ఈ అధ్యాయము తెలియజేయుచున్నది. అందుకనే దేవుడు అంత మిక్కుటముగా ప్రేమించుట ద్వారా తన కుమారునినే మనకనుగ్రహించెను. (యోహాను 3:16).
గ్రంథ విభజన:- పౌలు మరియు కొందరు దైవ సేవకుల యొక్క ప్రయత్న ఫలితముగా ఒక సంఘమేర్పడెను. అయితే ఆ సంమము నుండి “ కొరింథు” ను దూరముగా పెట్టుట అనునది మిక్కిలి కఠినమైన ఒక కార్యముగా భావింపబడుచున్నది. ఈ కార్యము యొక్క ఆరంభమందలి కార్యమైన ఈ పత్రికను మూడు ముఖ్య భాగములను విశధముగా వివరించవచ్చును.
(1) విభజనలను గూర్చి క్లోయె యింటి వారి యొద్ద నుండి వచ్చిన వార్తలకైన సమాధానము అధ్యాయము 1-4 వరకు.
(2) దుర్మార్గమును గూర్చి వచ్చిన సందేశమునకు జవాబు. అధ్యాయము 5-6 వరకు.
(3) కొరింథీయులు వ్రాసిన ఉత్తరములో కనిపించిన సమస్యలకు సమాధానము. అధ్యాయము 1-16 వరకు.
కొన్ని వివరముల గుర్తింపు:- పరిశుద్ధ గ్రంధములో 46వ పుస్తకము; అధ్యాయములు 16; వచనములు 437; ప్రశ్నలు 113; పాత నిబంధన ప్రవచనములు 5; క్రొత్త నిబంధన ప్రవచనములు 13; చారిత్రక వచనము 377; నెరవేరిన ప్రవచనములు 5; నెరవేరని ప్రవచనములు 55.
పౌలు కొరింథుకు వ్రాసిన మొదటి పత్రికకు తరువాత అబద్ధ బోధకులు అక్కడకు పోయి పౌలుకు వ్యతిరేకముగా ప్రజలను పురికొల్పిలేపిరి. పౌలు అస్థిరుడును, అధిక స్వార్థప్రియుడును, హెచ్చింపుకు, పొగడ్తకు, గౌరవమునకు తగిన వాడును, వేషదారియు, యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడుగా పేర్కొన అనర్హుడును అని అతనిపై నేరము మోపిరి. ఇట్టి స్థితిని సంధించుటకు తీతును పౌలు కొరింథునకు పంపెను. తీతు తిరిగి వచ్చినప్పుడు కొరింథీయులకు ఏర్పడిన మారు మనస్సును పౌలు విని సంతోషించెను. మారుమనస్సు పొందిన అనేకులకు కృతజ్ఞత చెప్పుటకును మారు మనస్సులేని కొంతమందితో వాదించుటకును ఈ రెండవ పత్రికను వ్రాసెను. పత్రికారంభము మొదలుకొని చివరి వరకు అతను తన గుణమును, ప్రవర్తనను, యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడను స్థితిలో నున్న అతని యొక్క పిలుపును గూర్చి వారితో వాదించుచున్నాడు.
ఉద్దేశము:- తన అపొస్తలుల అధికారమును, సేవను, దృఢపరచుట, కొరింథీయ అబద్ధ బోధకులను కనపరచుట.
వ్రాసినవారు:- పౌలు
ఎవరికి వ్రాసెను?:- కొరింధి సంఘమునకు, అంతటనుగల క్రైస్తవ విశ్వాసులకు.
వ్రాసిన కాలము:- సుమారు క్రీ.శ. 56లో మాసిదోనియాలో నుండి.
ముఖ్య వ్యక్తులు:- పౌలు, తిమోతి, తీతు, అబద్ధ బోధకులు.
ముఖ్య స్థలములు:- కొరింధు, యెరూషలేము.
గ్రంధ శ్రేష్ఠత:- వ్యక్తిగతమైనదియును, స్వీయచరిత్ర స్థితిలో నున్న ఒక పత్రిక.
ముఖ్య వార్త:- పౌలు యొక్క సేవనుగూర్చిన వివాదము.
ముఖ్య వచనములు:- 2 కోరింథీయులకు 4:5-6; 2 కోరింథీయులకు 5:17-19.
ముఖ్య అధ్యాయము:- 8, 9 అధ్యాయములు ఒకే భాగముగా నిలిచి ఇతర గ్రంథ భాగములలో ఎక్కడను కనిపించని రీతిని పూర్ణమైన స్థితిలో క్రైస్తవ సహాయ స్వభావమును బయలుపరచుచున్న విస్సహాయము యొక్క మూలాధారమైన ప్రమాణము (2 కోరింథీయులకు 8:1-6) ఆసక్తి (2Chor,8,16-9,5) ప్రతిఫలము వాగ్దానము (2 కోరింథీయులకు 9:5-15) మొదలగునవి ఈ అధ్యాయములు వివరించుచున్నవి.
క్రీస్తు 2 కొరింథీ : - పత్రికలో క్రీస్తు విశ్వాసుల యొక్క ఆదరణ (2 కోరింథీయులకు 1:5) విజయమునిచ్చుట (2 కోరింథీయులకు 2:14), ప్రభువు (2 కోరింథీయులకు 4:5), వెలుగు (2 కోరింథీయులకు 4:6), న్యాయాధిపతి (2 కోరింథీయులకు 5:10), సమాధానములు (2 కోరింథీయులకు 5:19), పరిహారకుడు (2 కోరింథీయులకు 5:21), ఈవి (2 కోరింథీయులకు 9:15), స్వంతదారుడు (2 కోరింథీయులకు 10:7), శక్తి (2 కోరింథీయులకు 12:9) మొదలగు స్థితులలో చెప్పబడుచున్నాడు.
గ్రంధ విభజన:- ఒక అపొస్తలుని యొక్క రుజువును నిరూపించు పత్రికయని 2 కొరింథీని చెప్పవచ్చును. కొరింధీ ప్రజలను పౌలుకు విరోధముగా రేపిన అబద్ధ బోధకులను హెచ్చరించుటలో గొప్ప ప్రఖ్యాతి గడించి యుండిరి. అట్టి పరిస్థితిలో అపొస్తలులు అను భావనతో అతని గుణము, ప్రవర్తన, దేవుని పిలుపు మొదలగు వాటి నిజత్వమును విశధపరుచ పౌలు ఈ పత్రికను ఉపయోగించుచున్నాడు. పత్రిక యొక్క మూడు ముఖ్య విభజనలు క్రింద చూడుడి.
(1) తన సేవలను గూర్చిన పౌలు యొక్క వివరణ అధ్యాయము 1-7 వరకు
(2) పరిశుద్ధుల కొరకు పౌలు చేసిన సహాయనిధి పని. అధ్యాయము 8-9 వరకు
(3) తన అపొస్తలత్వమును పౌలు నిలుపుకొనుట. అధ్యా 10-13
కొన్నిగుర్తింపు వివరములు:- పరిశుద్ధ గ్రంథములో 47వ పుస్తకము; అధ్యాయములు 13; వచనములు 257; ప్రశ్నలు 29; పాత నిబంధన ప్రవచనములు 4; క్రొత్త నిబంధన ప్రవచనములు 4; చారిత్రక వచనములు 249; నెరవేరిన ప్రవచనములు 4; నెరవేరని ప్రవచనములు 4.
గలతీయ ప్రజలు యేసుక్రీస్తు నందుగల విశ్వాసముచే రక్షించబడిన తరువాత తమ విశ్వాస ప్రయాణమును త్వరలో నిలిపివేసి క్రియలతో కూడిన ఒక నూతన ప్రయాణమును ప్రారంభించుటను చూడగలము. ఇది పౌలు హృదయమును బాధించెను. విశ్వాసమును ప్రక్కన నిలిపిన క్రియల యొక్క యీ విశేషమునకు విరోధముగా ఒక కఠినమైన సాధనము, విశ్వాస సువార్త కొరకైన నిరూపణముగా గలతీ పత్రిక చిగురించుచున్నది.
ఒక అపొస్తలుడను రీతిలో దేవుని యొద్ద నుండి తనకు లభించిన ఒక అధికారమును తన వర్తమానము యొక్క దైవీకతత్త్వమును గూర్చి ధర్మశాస్త్రము మూలమున కాదు, విశ్వాసము మూలముననే లభించుచున్నది. ధర్మశాస్త్రము మానవుని నేరస్థుడు అని తీర్పు తీర్చి బంధించుచున్నది. విశ్వాసమైతే క్రీస్తునందు గల ఆశీర్వాదములను అనుభవించుటకు వారిని స్వతంత్రులనుగా చేయుచున్నది. అయిననూ స్వతంత్రమనునది అవిధేయత గల జీవితపు ఒక అధికార యోగ్యతా పత్రము కాదు. పరిశుద్దాత్మచే నింపబడిన ఒక జీవితవిధానము ద్వారా హద్దులో జీవించి నీతిఫలములనిచ్చునదైన స్వతంత్రము.
గలతీయ దేశమందుగల కొన్ని సంఘములకు పౌలు యీ పత్రికను వ్రాయుచున్నాడు. (గలతియులకు 1:2) కనుకనే అనేక సంఘములను ఒకటిగా ఆహ్వానించి వ్రాయబడిన ఒక ఉత్తరము ఇది.
ఉద్దేశము:- అన్య జనులలో నుండి క్రైస్తవ విశ్వాసమునకు వచ్చువారు రక్షింపబడవలెనన్నచో ధర్మశాస్త్రవు ఆజ్ఞలకు లోబడవలెనను యూదా మతభక్తి గలవారిని ఖండించుటయు, క్రైస్తవులను విశ్వాసమునకు, క్రీస్తు చెంతకును, స్వతంత్రమునకును ఆహ్వానమునిచ్చుట.
గ్రంథ రచయిత:- పౌలు
ఎవరికి వ్రాసెను?: - దక్షిణ గలతీయ సంఘములకు (పౌలు యొక్క మొదటి సువార్త ప్రయాణమందు నెలకొల్పబడిన సంమములు ఇవి.)
ఆంతర్యము:- ప్రారంభకాల సంఘము ఎదుర్కొనిన ప్రాముఖ్యమైన సమస్య అన్యజనులలో నుండి రక్షించబడుచున్న క్రైస్తవ విశ్వాసుల ధర్మశాస్త్రపు ఆజ్ఞలకు లోబడవలెనా, లేదా అనునదే. పౌలు యొక్క మొదటి సువార్త సేవ ప్రయాణమందు నెలకొల్పబడిన సంఘములన్నిటి యందును యీ సమస్య కలిగెను. దీని పరిష్కారమును చూచుటకే పౌలు యీ పత్రికను వ్రాసెను. ఏ విధము చేతనైనను యీ సమస్యకు సంఘనాయకులు ఏకముగా కూడి పరిష్కారము చేసిరి. (అపొ.15)
ముఖ్య పాత్రలు: - పౌలు, పేతురు, బర్నబా, తీతు, అబ్రాహాము, అబద్ధ బోధకులు.
ముఖ్య స్థలములు:- గలతీయ, యెరూషలేము.
గ్రంథ విశిష్టత:- గుర్తించబడిన ఒక సంఘము కొరకు వ్రాయబడిన పత్రిక కాదు. గలతీయ ప్రాంతమందుగల పలు సంమముల కొరకు వ్రాయబడినది.
ముఖ్య వాక్య పదజాలము:- sధర్మశాస్త్రము నుండి విమోచన.
ముఖ్య వచనములు:- గలతియులకు 2:20-21; గలతియులకు 5:1
ముఖ్య ఆధ్యాయము:- అధ్యా.5 “మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసికొనక, ప్రేమగలిగినవారై యొకనికొకడు దాసులై యుండుడి” (గలతియులకు 5:13). "ఆత్మానుసారముగా నడచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చరు” (గలతియులకు 5:16) “ అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు”. (గలతియులకు 5:22-23).
గ్రంథ విభజన:- క్రైస్తవ స్వాతంత్ర్య హక్కు గల పత్రముగా యీ పత్రిక పిలువబడుచున్నది. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట అను పౌలు యొక్క ప్రకటన పత్రము అనియు దీనిని చెప్పవచ్చును. క్రీస్తునందు గల స్వాతంత్ర్యమును విక్రయించుటకు జంకని ఒక సమూహము యొక్క పేరుననే పౌలు యీ పత్రికను వ్రాసెను. యూదులైన కొందరు ధర్మశాస్రోపదేశకుల దాసత్వము విత్తు ఉపదేశమును విని యేసు ద్వారా లభించు స్వాతంత్ర్యమును వారి పాదముల చెంత అర్పించుటకు యీ ప్రజలు సిద్ధపడిరి.
వీరి బుద్ది హీనతను కఠినమైన మాటలచే ఖండించియు, దేవుని సత్యమును పట్టుకొని ఆత్మ యొక్క స్వాతంత్ర్యమును స్థిరపరచుటకు ఆహ్వానమునిచ్చుచు పౌలు వ్రాసిన యీ పత్రికయందు దేవుని కృపా సువార్తను మూడు విధములుగా అనుచరణలోనికి తెచ్చుటను చూడగలము.
(1) కృపా సువార్తను స్థిరపరచుట. అధ్యా.1,2.
(2) కృపా సువార్తను వివరించుట. అధ్యా.3,4.
(3) కృపా సువార్త యొక్క అనుచరణ విధానము. అధ్యా. 5,6.
కొన్ని ముఖ్య వివరణలు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 48వ పుస్తకము, అధ్యాయములు 6; వచనములు 149; చారిత్రక వచనములు 144; నెరవేర్చబడిన ప్రవచనములు 1; నెరవేర్చబడని ప్రవచనములు 4; ప్రశ్నలు 19.
ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక
గ్రంథ రచయిత:- పౌలు
ఎవరికి వ్రాసెను?:- ఎఫెసు మరియు ఇతర స్థలములందుగల విశ్వాసులకు.
వ్రాసిన కాలము:- దాదాపు క్రీ.శ. 60లో పౌలు రోమా చెరయందున్నప్పుడు.
ఆంతర్యము:- సంఘ సమస్యలను పరిష్కరించుటకు యిది వ్రాయబడలేదు. దానికి మారుగా సంఘములను బలము పొందునట్లు చేసి, ప్రోత్సాహావరచుటకు వ్రాయబడెను. తుకికు చేతికిచ్చి పంపెను. ఎఫెసీయులకు 1:1 లో ‘ఎఫెసులో అనుపదము కుండలీకరణములో వచ్చుటచే ప్రాచీన చేవ్రాత ప్రతులలో ఆ పదము లేదని తెలిసికొనవచ్చును. ఇది ఎఫెసునందున్న వారి కొరకు మాత్రము వ్రాయబడిన పత్రిక కాదనియు, అనేక సంఘములను మనస్సునందుంచుకొని వ్రాయబడినదనియు దీని ద్వారా ఊహించగలము. కొలొస్సయులకు 4:16 లో చెప్పబడు “ లవొదికయకు వ్రాయబడిన పత్రిక " యీ పత్రికయేనని పలువురు నమ్ముచున్నారు.
ముఖ్యపాత్రలు:- పౌలు, తుకికు.
గ్రంథ విశిష్టత:- సంఘమును శరీరముగను, దేవుని మందిరముగను, మర్మముగను, నూతన పురుషునిగను, కన్యకగను, సైన్యవీరుడుగను యీ పత్రికయందు పోల్చబడియున్నది.
ముఖ్య వచనములు:- ఎఫెసీయులకు 2:8-10; ఎఫెసీయులకు 4:1-3
ముఖ్య అధ్యాయములు: - ఎఫెసీ 6. క్రైస్తవుడు పరలోకపు ప్రతి ఆశీర్వాదము చేతను ఆశీర్వదించబడినవాడైనను (ఎఫెసీయులకు 1:3) యీ లోకమందు జీవించునంత వరకు ఆత్మీయ పోరాటమనునది అతని ప్రతిదిన అనుభవమగును. ప్రభువునందును ఆయన మహాశక్తి యందును బలపడుట ఎట్లు అను దానిని గూర్చిన అతి స్పష్టమైన ఉపదేశమును గూర్చి 6వ అధ్యాయమందు చదువగలము.
గ్రంథ విభజన:- క్రీస్తునందు గల తమ స్థానమును గూర్చి క్రైస్తవులను స్మరింపజేసి ప్రతిదిన జీవితమందు శక్తితో నిండిన జీవితమును జీవించుటకు ప్రోత్సాహమునిచ్చుటకే యీ పత్రిక వ్రాయబడెను. గ్రంథము యొక్క రెండు గొప్ప విభజనలును, వాటిలోని విభజనలును క్రింద ఇవ్వబడెను.
(1) క్రైస్తవుని పదవి అధ్యా. 1-3 వరకు. (అ) విమోచన కొరకై స్తోత్రము ఎఫెసీయులకు 1:1-14. (ఆ) ప్రత్యక్షత కొరకైన ప్రార్థన ఎఫెసీయులకు 1:15-23; (ఇ) క్రైస్తవుని స్థితి Eph,1,24-3,13; (ఈ) స్థిరపరచుటకైన ప్రార్థన ఎఫెసీయులకు 3:14-21.
(2) క్రైస్తవుని అనుచరణ జీవితము అధ్యా.3-6 వరకు (అ) సంమమందు ఐకమత్యము ఎఫెసీయులకు 4:1-16; (ఆ) జీవితమందు పరిశుద్ధత. Eph,4,17-5,21 ; (ఇ) గృహమందును ఉద్యోగ స్థలమందును గల బాధ్యతలు. Eph,5,22-6,9; (ఈ) యుద్ధమందు స్థిరముగా నిలచియుండుట. ఎఫెసీయులకు 6:10-24.
సమకాలిక చరిత్ర:- ఆసియా మైనరులోనే అందమైనదియు, సమృద్ధికరమైనదియునైన భూభాగమే ఈ ఈయోనియా భాగము మిక్కిలి ప్రఖ్యాతి గాంచిన పట్టణముగా ఎఫెసు పేరు గాంచెను. స్ముర్నకు 40 మైళ్ళు దక్షిణముననున్నదే ఎఫెసు మిక్కిలి సౌఖ్యమైన శీతోష్ణస్థితి గలది. సంగీతము, నాట్యము వంటి వాటిలో ఆపేక్ష గల ప్రజలు, ఐశ్వర్య మనతలు గల ప్రజలును, అలంకరించుకొని బారులు తీరు స్త్రీలును ఎఫెసు యొక్క గర్వమునకు ఉదాహరణగా నుండెను.
డయానా అను అర్తెమి దేవి యొక్క దేవాలయము ఎఫెసునందుండెను. ప్రాచీన కాల ప్రపంచ ఏడు వింతలలో ఇది ఒకటి. దేవాలయము 425 అడుగుల పొడవును 82 అడుగుల వెడల్పును గలది. దీనికి 60 అడుగుల ఎత్తు గల 120 స్తంభములు ఉండెను. ఒక్కొక్క స్తంభమును ఒక్కొక్క రాజు యొక్క బహుమానమగును. వాటిలో 36 స్తంభములు బంగారపు రేకులచే మూయబడియుండెను. ప్రాచీన కాల దేవాలయములు మధ్య భాగము మాత్రము పైన గుడిసె ఆకారముగను మిగిలిన భాగములు తెరువబడినట్లును వుండును. ఈ దేవాలయపు పైన గల గుడిసె కుప్ర దీవి నుండి తేబడిన మ్రానులచే కట్టబడినది. అర్జెమి యొక్క ఆరాధానను గూర్చి మాత్రము కాదు గాని రోమా రాజుల ఆరాధన కొరకై కట్టబడిన దేవాలయములను గూర్చియు ఎఫెసు ప్రఖ్యాతి గాంచెను. నీరో, క్లవుదియ, జేవియరు మొదలగు రాజుల పేరున పలు దేవాలయములు కనిపించెను. విగ్రహారాధన ఇచ్చట బహు బలముగనుండెను.
మూఢ నమ్మకములందును ఎఫెసు దుష్కీర్తి పొందెను. రేకులు, తాయతులు అను రీతిలో మంత్రములును, మాయా జాల ప్రార్థనలును గల అర్తెమి దేవి యొక్క పేరుగల “ఎఫెసు అక్షరములు " ప్రఖ్యాతి గాంచినవి. వ్యాధి స్వస్థపడుట, సంతాన భాగ్యము, వృత్తి విజయము వంటి వాటికి శుభములని నమ్మి వాటిని కొనుటకు భూదిగంతముల నుండి ప్రజలు పోగైవచ్చిరి. .
ఒక రకమైన కలయిక ప్రజలు అచ్చట జీవించిరి. వారిలో ఆరు విధములైన వ్యత్యాస ప్రజల సమూహములు వుండెను. వాటిలో ఒకటి గ్రీకుల రాకడకు ముందు అచ్చట జీవించిన ప్రాచీన ప్రజల వెనుకటి తరమువారు. మరియొక సమూహము ఏథెన్సు నుండి వలస వచ్చిన వారు. మూడవ సమూహము గ్రీకులు. యూదుల నుండి విభజింపబడి వచ్చిన వారు అని అభిప్రాయపడు నాల్గవ ఒక సమూహమును అచ్చట కనిపించెను. అర్తెమి దేవాలయము మతమునకు ప్రఖ్యాతిగాంచినట్లు, నేరక్రియలకును, హీన ప్రవర్తనలకును కేంద్రముగా బయలుపడెను. ఎటువంటి నేరస్థుడును అర్తెమి దేవాలయపు ఎదుటికి చేరగనే తప్పించబడును. అచ్చట నుండి అతనిని నిర్బంధముగ బంధించి తీసికొని వెళ్ళుటగాని, అచ్చట శిక్షించుట కాని కుదరదు. దేవాలయమందు నివశించిన వెయ్యి మంది దేవాలయపు నాట్యకత్తెలు చేయు హీనమైన సేవయే దేవాలయపు పవిత్రతయని వారు స్తుతించునది విచిత్రమైన కార్యముగ నుండెను. కలయిక ప్రజలు, నేరస్థుల ఆశ్రయము, దేవాలయపు దుష్టత్వము మొదలగునవన్నియు ఏకముగ ఎఫెసును చెడిపోయిన ఒక పట్టణముగా మార్చెను.
అటువంటి ఒక స్థలమందే సువార్త విత్తనము విత్తుటకు మహా గొప్ప విజయమును పొందగలిగిరి. పౌలు ఇతర పట్టణముల యందు వున్న దాని కంటెను అధిక కాలము ఎఫెసు నందుండెను. (అపో. కార్యములు 20:31) ఆ సంఘము యొక్క మొదటి అధ్యక్షుడు తిమోతి అగును. (1 తిమోతికి 1:3) ఆకుల, ప్రిస్కిల్లలు పౌలుతో కూడ యీ పట్టణమునకు వెళ్ళిరి. (అపో. కార్యములు 18:19; అపో. కార్యములు 18:24-26). పౌలు అత్యధికముగా ప్రేమించిన సంఘముగా యిది పేరుగాంచెను. (అపో. కార్యములు 20:17-38) తరువాత యెహోను యిచ్చట మిగుల యిష్టుడుగ బయలుపడెను.
ఎఫెసు నేడు:- ఈ ప్రాచీన పట్టణమున్న స్థలమున నేడు “ఐసాలుక్ " అను పేరుగల ఒక చిన్న పరిశుభ్రత లేని ఒక గ్రామము కనిపించుచున్నది. ప్రాచీన కాల శ్రేష్ఠత యొక్క పాడు పడిన స్మారక చిహ్నములను నేటికిని అచ్చట చూడగలము. వ్యవసాయ వృత్తి చేసి జీవించు అచ్చటి ప్రజలు యిప్పుడు మిగుల క్లిష్ట పరిస్థితిలో జీవించుచున్నారు.
కొన్ని ముఖ్య వివరణలు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 49వ పుస్తకము: అధ్యాయములు 6; వచనములు 155; ప్రశ్నలు 1; చారిత్రక వచనములు 146; నెరవేర్చబడిన ప్రవచనములు 1; నెరవేర్చబడని ప్రవచనములు 8.
ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక
అగిన సమయమందు ధారాళముగ సహాయము చేసిన ఫిలిప్పీయ విశ్వాసులకు అపొస్తలుడైన పౌలు వ్రాసి పంపిన కృతజ్ఞతా వచనమే ఫిలిప్పీ వత్రిక అనవచ్చును. ఈ విధముగా లభించిన సందర్భమున క్రైస్తవ ఐక్యమత్యమును గూర్చి బోధించుటకు ఉపయోగించుకొనుచున్నాడు. దీని మూలభావము దీనమైనది. క్రీస్తునందు మాత్రమే నిజమైన ఐక్యమత్యము ఏర్పడగలదు. తగ్గింపు మనస్సునకును, పరిచర్యకును క్రీస్తును మన మాదిరిగా అంగీకరించినచో ఆలోచనయందును, మాటయందును, క్రియలయందును ఐక్యమత్యమును మనము చేకూర్చగలము. పౌలు తన అనుభవమునే దీనికి ఆధారముగ చూపుచున్నాడు. ఇది ఫిలిప్పీ విశ్వాసులకు చాలా ప్రాముఖ్యమైన వర్తమానముగనుండెను. ఫిలిప్పీ సఘమందు ఏకమై శ్రమించినవారు ఒకరికొకరు జగడములతో ఏసుక్రీస్తు సువర్తకు శత్రువులుగా జీవించిన కాలముగనుండెను. అందుకే పౌలు వారికిట్లు బోధించుచున్నాడు. కావున నా ఆనందమును నా కిరీటమునైయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులైయుండుడి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడి. ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి. దేనిని గూర్చియు చింతపడకుడిగాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకము మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును”. (ఫిలిప్పీయులకు 4:1-7).
గ్రంథ రచయిత:- దీని రచయిత పౌలు అనుటకైన లోపలి, వెలుపలి ఆధారములు మిక్కిలి శక్తివంతమైనవి. కనుకనే దీనిని గూర్చి ఎవరును సందేహించలేదు.
వ్రాయబడిన కాలము:- క్రీ. పూ. 353లో మాసిదోనియా యొక్క ఫిలిప్పు రాజు (మహా అలెగ్జాండరు యొక్క తండ్రి) యీ పట్టణమును పట్టుకొని పెద్దదిగా చేసి దీనికి ఫిలిప్పీ అని పేరు పెట్టెను. క్రీ.పూ. 168లో రోమా అధికారులు దీనిని స్వాధీనపరచుకొనిరి. వెనుకటి కాలమును ఔగుస్తురాయుడు దీనిని ఒక సైన్యమును నిలుపు కేంద్రముగ మార్చెను. ఫిలిప్పీ ఒక వాణిజ్య పట్టణముగ లేక ఒక రాణువ కేంద్రముగ నుండుటచేతనే పౌలు యిచ్చటికి వచ్చునపుడు ఒక యూదా ప్రార్థనా మందిరము కూడా కట్టుటకు వీలు లేనట్లు యూదులు సంఖ్య యందు తక్కువగా నుండిరి.
పౌలు యొక్క రెండవ సువార్త సేవా ప్రయాణమందు త్రోయయందు దొరికిన మాసిదోనియా ఆహ్వానము ప్రకారము అతడు యీ పట్టణమునకు వచ్చి సువార్తను ప్రసంగించెను. అప్పుడు లూదియయు మరి కొందరును మారుమనస్సు పొంది క్రైస్తవులైరి. పౌలు, సీలలు అచ్చట కొట్టబడి చెరసాలయందుంచబడిన సంభవము చెరసాల అధిపతియు అతని కుటుంబమును మారుమనస్సు పొందుటకు హేతువాయెను. రోమా పౌరసత్వము గల పౌలు, సీలలను విచారణ చేయకయే కొట్టి చెరసాలయందుంచుట, అచ్చట ఉద్యోగము చేసిన న్యాయస్థాన అధిపతులను సమస్యలకు యీడ్చెను. (అపో. కార్యములు 16:37-40) ఇది నూతనముగ క్రైస్తవులైన ఆదేశ ప్రజలు అధిక శ్రమల నుండి తప్పించుటకు సహాయపడియండవచ్చును. తన మూడవ సువార్త సేవా ప్రయాణమందు పౌలు మరల యీ పట్టణమునకు వచ్చెను. (అపో. కార్యములు 20:1) పౌలు రోమాయందు బంధించబడుటను వినినప్పుడు ఫిలిప్పీ సంఘస్థులు సహాయనిధితో ఎపఫ్రోదితును రోమాకు పంపిరి. (ఫిలిప్పీయులకు 4:18) మరి రెండుసార్లు యీ విధముగ వారు పౌలుకు సహాయపడిరి. (ఫిలిప్పీయులకు 4:16) రోమా యందు ఎపఫ్రోదితు వ్యాధిగ్రస్తుడై మరణ ద్వారమునకు వెళ్ళెను. అతడు స్వస్థత పొందిన వెంటనే పౌలు యీ పత్రికను వ్రాసి అతని చేతికిచ్చి అతనిని మరల ఫిలిప్పీకి పంపెను. (ఫిలిప్పీయులకు 2:25-30).
పౌలు, సీల, తిమోతి, లూకా మొదలగు వారు మొదట క్రీ.శ. 51లో ఫిలిప్పీకి వచ్చిరి. దాని తరువాత 10 సంవత్సరములకు క్రీ.శ 61లో పౌలు యీ పత్రికను వ్రాసెను. ఫిలిప్పీయులకు 1:13; ఫిలిప్పీయులకు 4:32 మొదలగు వచనములు యీ పత్రిక రోమా నుండి వ్రాయబడుటను చూపుచున్నవి. రోమా చెరలో పౌలు బంధించబడి యున్నప్పుడు, ఆ సామ్రాజ్యపు అధిపతులు అతనికి ఎట్టి తీర్పు నిచ్చెదరని ఎదురు చూచుచు దినములను గడుపుచుండిరి.
ముఖ్య పదము:- జీవించుచున్న క్రీస్తు.
ముఖ్య వచనములు:- ఫిలిప్పీయులకు 1:21’; ఫిలిప్పీయులకు 4:12.
ముఖ్య అధ్యాయము:- ఫిలి: 2
యేసుక్రీస్తు యొక్క తగ్గింపు మనస్సును గూర్చి గల ప్రత్యక్షతలోనే క్రొత్త నిబంధన సత్యము యొక్క వున్నత మహిమ సంక్షేపమైయున్నది. ఈ అధ్యాయమందు ఆ తగ్గింపు యొక్క అద్భుత మహిమను పౌలు చూపుచున్నాడు. కొనసా గండి “క్రీస్తు యేసునకు కలిగిన యీ మనస్సును మీరును కలిగియుండుడి” అని ఉపదేశమును ఇచ్చుచున్నాడు.
గ్రంథ విభజన:- అసాధారణ పరిస్థితుల మధ్య మ్రోగు సంతోష ప్రవాహము యొక్క ధ్వనియే ఫిలిప్పీ పత్రిక. ఫిలిప్పీ క్రైస్తవుల పట్ల గల తమ ప్రేమను ప్రతిఫలింపజేయుటతో బాటు వారి స్థిరమైన సాక్ష్యమును, ధారాళమైన సహాయమును పొగడి, పోటీలు, ఐక్యమత్యము లేకపోవుటను విడిచి పెట్టి క్రీస్తు యేసునకు గల మనస్సుతో ముందుకు సాగివెళ్ళునట్లు అపొస్తలుడైన పౌలు వారికి బోధించెను పత్రిక యొక్క నాల్గు ముఖ్య అభిప్రాయములు క్రిందయివ్వబడెను: -
పరిస్థితుల వివరణ అధ్యా 1. • క్రీస్తు యేసుకు గల మనస్సు అధ్యా 2. • క్రీస్తును ఎరుగు జ్ఞానము అధ్యా 3. • క్రీస్తు యొక్క సమాధానము అధ్యా 4.
కొన్ని ముఖ్య వివరణలు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 50వ పుస్తకము; అధ్యాయములు 4; వచనములు 104; ప్రశ్నలు 1; చారిత్రక వచనములు 96; నెరవేర్చబడని ప్రవచనములు 5.
కొలొస్సయులకు వ్రాసిన పత్రిక
యేసుక్రీస్తు సంఘమును చిత్రించు పత్రికగా ఎఫెసీ కనిపించగా సంఘమునకు శిరస్సైన క్రీస్తును కొలొస్సయి వత్రిక బయలుపరచుచున్నది. ఎఫెసీ శరీరమును గూర్చి జాగ్రత్త వహించగా కొలొస్సయి శిరస్సు మీద దృష్టియుంచుచున్నది. చిన్న పుస్తకమైన కొలొస్సయుల ప్రారంభభాగము (అధ్యాయము1,2) బోధనను గూర్చినదియు, చివరి భాగము (అధ్యాయము 3,4) అనుచరణ - జీవితమునకు చెందినదగును. క్రీస్తును సమస్తమునకు ముందున్నవారిగా చూపుటయే దీని ద్వారా పౌలు ఉద్దేశమై యున్నది. క్రైస్తవుని జీవితము కూడ ఆ సత్యమును బయలుపరచి చూపవలెను. విశ్వాసులు క్రీస్తునందు వేరు పారి జీవించువారిగను, క్రీస్తునందు మరుగై ప్రభువు యొక్క సంపూర్ణతను పొందువారగుటచే ఆయన లేని జీవితము నిరుపయోగము.
కొలొస్సై విశ్వాసులకు యీ పత్రికను వ్రాయుచున్నట్లు కొలొస్సయులకు 1:1-2 వచనములలో పౌలు పలికెను. దీనికి సమీప పట్టణమైన లవొదికయలో నున్న వారికిని యీ పత్రికను చదువవలెనని ఆయన పలికెను. (కొలొస్సయులకు 4:16)
గ్రంథ రచయిత:- కొలొస్సై పత్రిక రచయిత పౌలని పారంపర్యముల వివరణలును దానితో కలియుచున్నవి. వ్యక్తిగత సూచనలు, ఎఫెసీ పత్రికతో గల పోలికలు మొదలగునవి దీనిని మరల దృఢపరచుచున్నవి. దీని నాల్గు అధ్యాయములలో పౌలు యొక్క యితర వత్రికలలో చూడలేని 55 గ్రీకుపదములు కనిపించుచున్నవి. పౌలుకు గ్రీకు భాషను ఉపయోగించుట కొరకైన విడుదల అతడు గైకొను విషయముతో ప్రకాశించుటయు, కొలొస్సై సంఘము యొక్క తప్పుడు బోధలను గూర్చిన సూచనలును, యీ అత్యధిక పదములకు చాలినంత వివరణనిచ్చుచున్నది. కొలొస్సైలో వచ్చు క్రీస్తును గూర్చిన అభిప్రాయమును (కొలొస్సయులకు 1:15-23), యోహాను 1:18 వరకు గల లోగోస్ ను గూర్చిన అభిప్రాయముతో పోల్చవచ్చును. క్రీస్తును లోకసృష్టికర్తగ చూపు భావము యొక్క ప్రారంభము ఫిలిప్పీయులకు 2:5-11 వరకు గల భాగమునందు బయలుపడుచున్నది.
వ్రాయబడిన కాలము:- ఎఫెసుకు దాదాపు 100 మైళ్ళు తూర్పున సమృద్ధియైన లైకస్ లోయలో అమరియున్న ఒక పట్టణమే కొలొస్సయి.
శ్రేష్ఠమైన నల్లగొఱ్ఱ రోమమునకు ప్రఖ్యాతి గాంచిన సంతగానుండెను. కొలొస్సయులకు 1:4-8; కొలొస్సయులకు 2:4 మొదలగు భాగములందు వచ్చు సూచనల ద్వారా పౌలు ఎన్నటికి కొలొస్సైకి వెళ్ళనప్పటికిని పౌలు యొక్క ఒక శిష్యుడును, తోటి సేవకుడునైన ఎపఫ్రా చేత అచ్చట సంఘము స్థాపించబడెనని ఊహించవచ్చును. తరువాత పౌలు యొక్క చెరసాల దినములలో ఎపఫ్రా అతనిని కలసి కొలొస్సైయుల వర్తమానములను అతనికి తెలియజేసెను. (కొలొస్సయులకు 4:12-13; ఫిలేమోనుకు 1:23).
కొలొస్సయులు, ఎఫెసీయులు, ఫిలేమోను మొదలగు మూడు పత్రికలందు కనిపించు ఏకత్వము గల అభిప్రాయములను, ప్రకటనలను, వ్యక్తి గత పేర్లను బట్టి యీ మూడు పత్రికలను ఒకే కాలమందు, ఒకే పరిస్థితి యందు వ్రాయబడెనని తీర్మానించగలము. (కొలొస్సయులకు 4:9-17; ఫిలేమోనుకు 1:2, ఫిలేమోనుకు 1:10, ఫిలేమోనుకు 1:23-24). చెరసాల పత్రికలు నాలుగును పౌలు యొక్క మొదటి చెరసాల నివాసకాలమందు వ్రాయబడి యుండవచ్చును. ( ఎఫెసీ, ఫిలిప్పీ వీటి కాలమును చూడుము) అట్లైనచో క్రీ.శ.60లో లేక 61లో యీ పత్రికను వ్రాసి తుకికు దగ్గర ఇచ్చి కొలొస్సైకి పంపెను. కొలొస్సయులకు 4:7-9; ఎఫెసీయులకు 6:21; ఫిలేమోనుకు 1:10-12 మొదలగు భాగములను చూడుమ
ఎపఫ్రా పౌలును సంధించి కొలొస్పై సంఘ పరిస్థితులను చెప్పుట ద్వారా యీ పత్రికను వ్రాయుటకు ప్రోత్సహించి యుండవచ్చును. ఇంచుమించు అన్యజనులు జీవించిన కొలొస్సై సంమమునకు తప్పుడు బోధ యొక్క శక్తి వంతమైన బెదరింపులను ఎదుర్కొనవలసి యుండెను. వారు దానికి ఓడిపోనప్పటికిని యేసు క్రీస్తు యొక్క సువార్తకు దుర్బోధలు అధిక హానికరముగ నుండెను. దానిని నిరాకరించు పత్రిక భాగమే కొలొస్సయులకు 2:8-23. ఈ భాగము నుంచి ఆ దుర్బోధల స్వభావము ఏమిటని కొంత వరకు ఊహించగలము. ఇది గ్రీకు తత్త్వజ్ఞానము. (కొలొస్సయులకు 2:4; కొలొస్సయులకు 2:8-10). యూదుల ధర్మశాస్త్రము (కొలొస్సయులకు 2:11-17). తూర్పు దేశముల దైవత్వము పొందుట యొక్క సిద్ధాంతము (కొలొస్సయులకు 2:18-23) మొదలగునవి కలిసిన ఒక సమయ విధానముగ నుండెను. శరీరమును అలక్ష్యము చేయుట, సున్నతి, ఆహార కొలతలు, సంస్కారములకు ముఖ్యత్వమునిచ్చుట, శరీరమును హింసించుకొనుట, దేవదూతారాధన, యోగాసనములకు స్థలమునిచ్చుట వంటివి దాని భాగములుగా నుండెను.
ముఖ్య పదజాలము:- సమస్తమునకు ముందుగా నున్న వాడైన క్రీస్తు.
ముఖ్య వచనములు:- కొలొస్సయులకు 2:9-10; కొలొస్సయులకు 3:1-2.
ముఖ్య అధ్యాయము:- కొలొస్సై 3. క్రీస్తు యొక్క మహా ఉన్నతత్వము. క్రీస్తునందుగల స్వాతంత్ర్యము, క్రీస్తునందు విధేయత యీ విధముగ కొలొస్సైనందు వచ్చు మూడు ముఖ్య అభిప్రాయములును మూడవ అధ్యాయమునందు ఏకమగుచున్నవి. విశ్వాసి క్రీస్తుతో కూడ లేపబడిన వాడగుటచేత అతడు ప్రాచీన పురుషుని పరిత్యజించి నవీన పురుషుని ధరించుకొనవలెను. జీవితపు అన్ని పరిస్థితుల యందును పరిశుద్ధతయే దాని ఫలము.
అందం గ్రంథ విభజన: - పరిశుద్ధ గ్రంథమునందు అత్యధికముగ క్రీస్తును కేంద్రీకరించి మాట్లాడు పుస్తకము ఇది. ఇందు కొలొస్సై సంఘమును బెదరించిన దుర్బోధనలను ఆటంకపరచుటకు క్రీస్తు యొక్క మహా ఉన్నతత్వమును, ఆయన అనుగ్రహించిన రక్షణ యొక్క పరిపూర్ణతను దృఢముగ చెప్పుచున్నాడు. ఈ ఆజ్ఞలకు అనుదిన జీవితమందు కలుగవలసిన ఫలమును గూర్చి గ్రంథపు చివరి భాగమున చెప్పుచున్నాడు. అనగా బోధన యొక్క వాస్తవ అనుచరణ విధానము జీవితములో ఆ ఫలమును చూపవలెను. పత్రిక యొక్క రెండు ముఖ్య విషయములు క్రింద యివ్వబడెను.
(1) క్రీస్తు యొక్క మహా ఉన్నతత్వము. అధ్యా. 1,2.
(2) క్రీస్తుకు సమస్తమును లోబడి యుండవలెను. అధ్యా 3,4.
కొన్ని ముఖ్య వివరణలు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 51వ పుస్తకము, అధ్యాయములు 4; వచనములు 95; ప్రశ్న 1; చరిత్రక వచనములు 92; నెరవేర్చబడని ప్రవచనములు 3.
థెస్సలొనీకయులకు వ్రాసిన మొదటి పత్రిక
బాల ప్రాయమున నున్న థెస్సలొనీక సంమములో పౌలు గడిపిన దినములను సంతోషముతో స్మరించుచున్నాడు. వారి విశ్వాసము, నమ్మిక, ప్రేమ వంటివి, శ్రమల మధ్యను వారు చూపిన సహనమును మాదిరిగ నుండెను. రెక్కలు వచ్చి ఎగురుటకు ప్రయత్నించుచున్న పక్షి పిల్లవలె, క్రైస్తవ్యమందు వృద్ధి పొందుచున్న సంఘము కొరకు పౌలు భరించిన శ్రమలు, త్యాగమును మంచి ఫలితము నిచ్చుటచే పౌలు వారి యెడల గలిగిన ప్రేమ పత్రిక యొక్క ఒక్కొక్క భాగమందును ప్రకాశించుచున్నది.
నూతనముగ పొందిన విశ్వాసములో వారు బలపడుటకును, ప్రేమలో ఒకరికొకరు వృద్ధి చెందుటయు, ఎల్లప్పుడును సంతోషముగా నుండుటకును, ఎడతెగక ప్రార్థించుటకును, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును పౌలు వారికి బోధించెను. ప్రభువు యొక్క రెండవ రాకడను గూర్చిన ప్రకటనతో అతడు పత్రికను ముగించెను. మృతులును, సజీవులమునైయున్న విశ్వాసులందరికిని నమ్మికను, ఆదరణను యిచ్చునదే క్రీస్తు యొక్క రెండవ రాకడ.
ఉద్దేశము:- థెస్సలొనీకయ విశ్వాసుల క్రైస్తవ విశ్వాసమును బలపరచుటకును, క్రీస్తు మరల వచ్చునని నిశ్చయతనిచ్చుటకును.
గ్రంథ రచయిత:- పౌలు
ఎవరికి వ్రాసెను?:- థెస్సలొనీకయ సంఘమునకు, విశ్వాసులు యావన్మందికిని.
వ్రాయబడిన కాలము:- దాదాపు క్రీ.శ 51లో పౌలు యొక్క మొదటి పత్రికలలో యిది ఒకటి. పౌలు దినముల యందు థెస్సలొనీక ఒక రేవు పట్టణమును, మాసిదోనియ అను రోమా దేశము యొక్క రాజధానిగనుండెను.
రోమా నుండి తూర్పు దేశముల కొరకైన ముఖ్య రాజమార్గమునకు ప్రక్కన గల యీ స్థలము రాజకీయ, వాణిజ్య ముఖ్యత్వములచే మిగుల సస్యశ్యామలముగనుండెను. క్రీ.శ. మొదటి శతాబ్దములో యిచ్చట దాదాపు రెండు లక్షలమంది ప్రజలు జీవించినట్లు చెప్పబడుచున్నది.
థెస్సలొనీకయనందు యూదులు గొప్ప సంఖ్యలో జీవించిరి. సన్మార్గమును ఆధారముగా గల వారి ఒకే దేవుని ఆరాధించుట, గ్రీకుల పలు దేవతారాధనలలో అలసిపోయి దాని నుండి విడిపించు కొనుటకు ప్రయత్నించువారిని ఆకర్షించెను. ఇందుచే పౌలు యొక్క రెండవ సువార్త సేవా ప్రయాణమందు అతడు థెస్సలొనీకయ యూదా దేవాలయములో ప్రకటించిన సువార్త వర్తమానము త్వరలో ప్రజలు ఒప్పుకొనునదిగనుండెను. (అపో. కార్యములు 17:4).
ఆంతర్యము:- ఈ పత్రికను పౌలు వ్రాయునప్పుడు థెస్సలొనీక సంఘము స్థాపించబడి రెండు లేక మూడు సంవత్సరములు మాత్రమే అయ్యెను. వారు విశ్వాసమందు పరిపక్వతను పొందవలసిన వారుగా నుండిరి. క్రీస్తు యొక్క రెండవ రాకడను గూర్చి వారికి ఒక తప్పుడు తలంపు ఉండెను. క్రీస్తు త్వరగా వచ్చునని ఎదురు చూచుచుండిన కొందరిలో ప్రియమైన వారు మరణించినప్పుడు ఆ మృతి చెందిన వారి భవిష్యత్ కాలము ఎటువంటిదని వారికి సంశయమేర్పడెను. వారిక సంశయములను తీర్చుటకును, శ్రమలనుభవించుచున్న విశ్వాసులను ఆదరించుటకును ఈ పత్రిక వ్రాసెను.
ముఖ్య పదజాలము:- క్రీస్తు రాకడ యందు లభించు పరిశుద్ధ పరచబడుట.
ముఖ్య వచనములు:- 1 థెస్సలొనీకయులకు 3:12-13; 1 థెస్సలొనీకయులకు 4:16-18.
ముఖ్య అధ్యాయము:- అధ్యాయము 4. పత్రిక యొక్క మధ్య భాగము యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి చెప్పు నాలుగవ అధ్యాయ భాగమగును. ఆయన వచ్చు దినమున క్రీస్తునందు మృతులగువారు మొదట లేతురు. ఆ మీదట సజీవులై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము అని ఈ అధ్యాయము చెప్పుచున్నది.
గ్రంథ విభజన:- బలవంతపరచబడుటచే థెస్సలొనీకయను విడిచి వెళ్ళిన పిదప థెస్సలొనీకయను గూర్చి పౌలుకు గల అక్కర పెరిగి వారి విశ్వాసపు ఎదుగుదల కొరకు మేల్కొలుపు గలిగియుండెను. తిమోతి తెచ్చిన ఆదరణ వర్తమానముచే సంతృప్తి చెంది పౌలు వారిని పొగడి, బోధించి ఆదరించి వ్రాసిన ఈ పత్రికలో రెండు ముఖ్య భాగములను చూడగలము.
(1) థెస్సలొనీకయులను గూర్చిన పౌలు యొక్క వ్యక్తిగత స్మరణ అధ్యాయము 1-3.
(2) పౌలు వారికిచ్చిన బోధనలు అధ్యాయము 4,5
కొన్ని ముఖ్య వివరణలు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 52వ పుస్తకము, అధ్యాయములు 5; వచనములు 89; ప్రశ్నలు 3; చారిత్రక వచనములు 69; నెరవేర్చబడిన ప్రవచనములు 20.
థెస్సలొనీకయులకు వ్రాసిన రెండవ పత్రిక
పౌలు యొక్క మొదటి పత్రికకు తరువాత థెస్సలొనీకయుల మధ్య తప్పుడు బోధనల యొక్క గురుగులు అభివృద్ధి చెందుటకు ప్రారంభించి వారు విశ్వాసమందు ఊగిసలాడుటలు ఏర్పడుటకు అది కారణమాయెను. ఈ నాశనపు గురుగులను తీసివేసిన తరువాత పౌలు మరలా ఈ పత్రిక ద్వారా మంచి విత్తనములు విత్తెను. అచ్చట గల విశ్వాసుల శ్రమల మధ్య చూపిన యధార్థతను ఘనపరిచియు ప్రస్తుత కాల శ్రమలు రాబోవు కాల మహిమ యొక్క నిరీక్షణ అని జ్ఞాపకము చేసి ధైర్యపరచి పత్రికను వ్రాయుటకు ప్రారంభించెను. శ్రమల మధ్య పరమ నమ్మకము కలిగియుండుటకు ఉత్సాహపరిచెను.
తరువాత పత్రిక యొక్క ముఖ్య స్థానమునకు నేరుగా పౌలు వచ్చుచున్నాడు. రాబోవు ప్రభువు దినమును గూర్చి అబద్ద బోధకులు చెప్పినటువంటి తప్పుడు భావములను గూర్చి మాట్లాడుచున్నాడు. ఆ దినము నేటికినీ రాలేదు; ఆ దినమునందు సంభవించవలసినవి ఏవని అతడు బయలుపరచెను. కనుక అజాగ్రత్త గల సోమరితనము విడిచిపెట్టి లేచి సువార్తకొరకు కఠినముగా సేవ చేయుటయే వారు చేయవలసినది.
ఉద్దేశము:- క్రీస్తు యొక్క రెండవ రాకడను గూర్చిన సందేహములకు జవాబును చెప్పుట.
గ్రంథ రచయిత:- పౌలు
ఎవరికి వ్రాసెను?:- థెస్సలొనీకయ సంఘమునకు, విశ్వాసులు యావన్మందికిని
వ్రాయబడిన కాలము:- దాదాపు క్రీ.శ. 51లో థెస్సలొనీకయులకు వ్రాసిన కొన్ని నెలలకు తరువాత కొరింథు నుండి వ్రాసెను.
ఆంతర్యము:- క్రీస్తు తిరిగి వచ్చు రాకడ సమయమును గూర్చి సంఘమందు పలువురికి ఈ అసత్య అభిప్రాయములుండెను. క్రైస్తవ విశ్వాసుల శ్రమలు అధికరించుటచే ప్రభువు యొక్క దినము త్వరగా వచ్చునని వారు ఎదురుచూచిరి. మరియు మొదటి థెస్సలొనీకయ పత్రిక యొక్క ఆంతర్యమున ప్రభువు రాకడ యే ఘడియ యందైనను సంభవించవచ్చునని అభిప్రాయ పడిరి. ఈ వివరణ యొక్క ఆంతర్యమున పలువురు సోమరులుగా మారి ఏ పనియూ చేయక క్రీస్తు రాకడ కొరకు కనిపెట్టియుండిరి.
ముఖ్య పాత్రలు:- పౌలు, సీల, తిమోతి.
ముఖ్య పదజాలము:- ప్రభువు దినమును ఎరుగుట.
ముఖ్య వచనములు:- 2 థెస్సలొనీకయులకు 2:3; 2 థెస్సలొనీకయులకు 3:5-6.
ముఖ్య స్థలము:- థెస్సలొనీకయ
గ్రంథ విశిష్టత:- మొదటి థెస్సలొనీకయుల పత్రిక యొక్క కొనసాగింపుగా వ్రాయబడిన పత్రిక. క్రీస్తు రెండవ రాకడ యందు సంభవించవలసిన పలు కార్యములను పౌలు ఇచ్చట గుర్తించుచున్నాడు.
ముఖ్య అధ్యాయము:- అధ్యాయము 2. ప్రభువు దినము వచ్చి ముగించెనను ఒక తప్పుడు బోధనను ఎదురించుటకే ఈ పత్రికను పౌలు వ్రాసెను. అతడు సహించిన శ్రమల మధ్య ఈ బోధ వారిని కలత పరచి, ఎప్పుడు ప్రభువు యొద్ద చేర్చబడుదుము అనుటలో తారుమారు చేసెను. ప్రభువు ప్రత్యక్షతకు ముందు కొన్ని తేటయైన సంభవములు జరుగుననియు, ఆ ప్రసన్నమగుట అంతవరకు జరుగలేదనియు బయలుపరచుచున్నాడు.
గ్రంథ విభజన:- రాబోవు ప్రభువు దినమును గూర్చి వారికి బోధించిన మొదటి పత్రిక యొక్క కొనసాగింపే ఇది. (1 థెస్సలొనీకయులకు 5:1-11) ఇది కలత చెందిన థెస్సలొనీక విశ్వాసులను ధైర్యపరచి పని చేయుటకు సిగ్గుపడిన వారిని ఆ సోమరితనము నుండి విడిపించెను. మూడు ముఖ్య భాగములుగా ఈ పత్రికను చూడగలము.
(1) శ్రమల మధ్యను ధైర్యముగా నుండుటకై పిలువబడుట అధ్యా.1.
(2) ప్రభువు దినమును గూర్చిన వివరణ అధ్యా.2.
(3) సంఘమునకు ఉపదేశమును చెప్పుట అధ్యా.3.
కొన్ని ముఖ్య వివరణలు: - పరిశుద్ధ గ్రంథములోని 53వ పుస్తకము; అధ్యాములు 3; వచనములు 47; ప్రశ్నలు 1; చారిత్రక వచనముల 31; నెరవేర్చబడని ప్రవచనములు 16.
తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక
వృద్ధుడును, అనుభవజ్ఞుడును అయిన అపొస్తలుడైన పౌలు, యౌవనస్తుడును, ఎఫెసు సంఘ సేవకుడనైన తిమోతికి వ్రాయు పత్రిక ఇది. తిమోతికి వున్న బాధ్యత ఒక పెద్ద సవాలుగనుండెను. సంఘముయందుగల అబద్ధ బోధనలను దూరపరచవలెను, సామాన్య ఆరాధన ఫలించదగినదిగా యుండవలెను. సంఘము పరిపక్వమైన అధ్యక్షతను పొందినదిగా చేయవలెను. సంఘ స్వభావమును కాపాడుట కంటెను పరిచారకుని స్వభావమును భద్రముగా కాపాడవలెను. తిమోతి యొక్క యౌవ్వనము సువార్త సేవకు గొప్ప స్వాస్థ్యముగానుండవలెనే గాని సంఘమును బాధించునట్టిదిగా ఉండకూడదు. అదే సమయమందు ఒక ఆత్మీయ మనుష్యునికి అవసరమైన నీతి, దైవ భక్తి, విశ్వాసము, ప్రేమ, దీర్ఘశాంతము, ఓర్పు మొదలగు వాటిని విడువక అనుసరింపవలెను.
ఉద్దేశము:- యౌవ్వనుడైన తిమోతికి సలహానిచ్చి అతనిని ప్రోత్సాహపరచుట.
గ్రంథ కర్త:- పౌలు
ఎవరికి వ్రాసెను?:- తిమోతికి, యౌవ్వనులైన సంఘ అధ్యక్షులకును ఇతర విశ్వాసులకును.
వ్రాయబడిన కాలము:- దాదాపు క్రీ.శ.64లో రోమా నుండి లేక మాసిదోనియా నుండి (ఇంచుమించు ఫిలిప్పీ). పౌలు యొక్క చివరి రోమా చెరసాల వాసమునకు కొంచెము ముందు.
ఆంతర్యము:- పౌలుకు మిక్కిలి సమీపమైన తోటి సేవకుడిగా తిమోతి ఉండెను. ఎఫెసు సంఘములో ఏర్పడిన తప్పుడు బోధనలను ఎదురించుటకు అతనిని అచ్చటకి పంపెను. (1 తిమోతికి 1:3-4) ఎఫెసు సంఘ సేవకునిగ తిమోతి కొన్ని దినములు పరిచర్య చేసి ఉండవచ్చును. పౌలు అతనిని చూచుటకు ఆశించెను (1 తిమోతికి 3:14-15; 1 తిమోతికి 4:13) అంతకు ముందు పరిచర్య యందు ఎరిగి యుండవలసిన అనుచరణ యందున్న కార్యములను గూర్చి ఈ పత్రిక వ్రాసెను.
ముఖ్య పాత్రలు:- పౌలు, తిమోతి
ముఖ్య పదజాలము: - సంఘము ఏర్పాటు యొక్క అధ్యక్షత
ముఖ్య వచనములు:- 1 తిమోతికి 3:15-16; 1 తిమోతికి 6:11-12.
ముఖ్య స్థలము:- ఎఫెసు
గ్రంథ విశిష్టత:- ఈ పత్రిక సంఘ పరిపాలనను గూర్చియు శిక్షా విధానములను గూర్చిన ఒక వ్యక్తికి సంబంధించిన ఒక పత్రికయగును.
ముఖ్య అధ్యాయము:- అధ్యాయము 3. దేవుని సంఘపు బాధ్యతను వహించి పరిచర్య చేయు వారి అర్హతలను ఈ అధ్యాయమందు పౌలు వివరించుచున్నాడు. మనమిచ్చట చూచునది లోక జీవిత విజయము కొరకైన అర్హతలను కాదు. యధార్ధమైన సంఘ అధ్యక్షత కొరకైన అర్హతలను దేవునితో నడచుట ద్వారా మాత్రమే పొందవచ్చును.
గ్రంథ విభజన:- తమ జీవితపు అంతమున క్రీస్తు సువార్త సేవయందు తోటి పరిచర్య చేసిన వానికి పౌలు వ్రాసిన పత్రికలే “ కాపరి పత్రికలు”. (1తిమోతి, 2తిమోతి, తీతు) అపొస్తలుడైన పౌలు ఒక వ్యక్తికి వ్రాయు పత్రికలు ఇవి మూడు మాత్రమే. ఫిలేమోనుకు వ్రాసిన పత్రిక మాత్రమే ఒకనికి వ్రాసినట్లు వున్నది. వాస్తవమునకు అది పలువురికి వ్రాసిన ఒక పత్రికయే. ఎఫెసునందు క్రేతునందున్న సంఘములన్నిటి దృఢవిశ్వాసమును గురియందుంచుకొని వ్రాయబడినవే ఇవి. 1తిమోతి యందు పౌలు యొక్క ఐదు ప్రమాణములిమిడియున్నవని చెప్పగలము.
(1) బోధనను గూర్చిన ఆజ్ఞ - అధ్యా.1
(2) సామాన్య ఆరాధనను గూర్చిన ఆజ్ఞ - అధ్యా.2,3
(3) అబద్ధపు బోధకులను గూర్చిన ఆజ్ఞ - అధ్యా.4
(4) సంఘ క్రమశిక్షణను గూర్చిన ఆజ్ఞ - అధ్యా.5
(5) కాపరుల లక్ష్యములను గూర్చిన ఆజ్ఞ - అధ్యా.6
కొన్ని ముఖ్య వివరణలు:- పరిశుద్ధ గ్రంథములోని 54వ పుస్తకము; అధ్యాయములు 6; వచనములు 114; ప్రశ్నలు 1; చారిత్రక వచనములు 106; నెరవేర్చబడిన ప్రవచనములు 5; నెరవేర్చబడని ప్రవచనములు 2.
తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక
చెరలో నుండి ధైర్యమును, ఉత్సాహము నిచ్చు ఒక పత్రికను వ్రాయునదియనుట ఒక అరుదైన కార్యము. అయితే అటువంటి ఒక పత్రికగా తిమోతి రెండవ పత్రిక కనబడుచున్నది. ఈ పత్రికలో పౌలు తిమోతి పైనున్న తన ప్రేమను, అతని కొరకు ప్రార్ధించుటయును గూర్చి ధృడపరచిన పిదప తాను తన యొక్క ఆత్మీయ తండ్రి అనియు, బాధ్యతలను గూర్చి అతనికి జ్ఞప్తి చేయుచున్నాడు. ఒక సైనికుడైనను మల్లయుద్ధము చేయువాడైనను, వ్యవసాయి యైనను, యేసుక్రీస్తు యొక్క సేవకుడైనను, విడువక పోరాడినట్లయితేనే ప్రతిఫలమును పొందగలడు. అంత్య దినములలో ప్రజలు సత్య మార్గమును విడిచి చెవులకు యింపైన ప్రసంగములను విను కాలములో క్రైస్తవ జీవితము కూడ మాని బలమును కోల్పోయి భక్తి వేషములో మునిగిపోవునని పౌలు హెచ్చరించుచున్నాడు. అయితే అటువంటి పడిన స్థితిలో కూడ పౌలు యొక్క సాదృశ్యము తిమోతికి మార్గదర్శిగాను, దేవుని వాక్యము అతనిని బలపరచుటకును ఎంతైనను చాలినంతవిగా నుండెను.
ఉద్దేశము:- ఎఫెసు సంఘ సేవకుడైన తిమోతికి చివరి బుద్ధి మాటలను ప్రోత్సాహమును కలుగజేయుట.
గ్రంథకర్త:- పౌలు
ఎవరికి వ్రాసెను:- తిమోతికి.
వ్రాసిన కాలము: - రోమా చెరలోనుండి క్రీ.శ. 66 లేక క్రీ.శ.67 లో వ్రాయబడినది. మొదట సారి ఖైదు చేయబడిన పౌలు తదుపరి విడుదల చేయబడెను. రెండు సంవత్సరముల తరువాత తిరిగి ఆయన ఖైదు చేయబడి నీరో చక్రవర్తిచే శిరచ్ఛేదనము చేయబడెను.
ఆంతర్యము:- తనకు చెరలో సహాయము చేయుటకు లూకా ఉండినప్పటికిని కార్యరూపములో ఎప్పుడును; పౌలు ఒంటరిగానేయుండెను. క్రొత్త తరము యొక్క సంఘ అధ్యక్షతకు తనను పానార్పణముగా అప్పగించుట కొరకై అతడు ఈ పత్రికను వ్రాయుచున్నాడు. స్నేహితులు తన్ను సంధించవలయుననియు అంగీని, పుస్తకములను చర్మపు కాగితములను కావలెననియు పౌలు తన అభిలాషను వెలిబుచ్చెను.
ముఖ్య మనుష్యులు:- పౌలు, తిమోతి, లూకా, మార్కు.
ముఖ్య పదజాలము:- అపకారమును ఓర్చుకొనుట
ముఖ్య వచనములు:- 2 తిమోతికి 2:3-4; 2 తిమోతికి 3:14-17.
ముఖ్య స్థలము: - రోమా, ఎఫెసు
గ్రంథ విశిష్టత:- ఇది పౌలు యొక్క చివరి పత్రిక. ఇందులో ఆయనయొక్క హృదయ వాంఛలను జీవితములో ప్రాధాన్యమైన, ఆరోగ్యమైన ఉపదేశము, దృఢము, విశ్వాసము, ప్రేమ మొదలైనవాటిని ప్రకటించుచున్నాడు.
ముఖ్య అధ్యాయము:- అధ్యాయము 2. సంపూర్ణ సేవలో నిమగ్నులైయున్న క్రైస్తవ సేవకులందరును, ప్రతిదినము చదివి, ధ్యానించవలసిన ఒక భాగము. ఇది స్థిరముగా నిలుచుటయు విజయవంతమైన ఒక క్రైస్తవ సేవ యొక్క తాళపుచెవిని పౌలు ఇందులో చూపించుచున్నాడు.
ప్రతిఫలమునిచ్చు సేవ, వచనము 1,2
సహనముతో చేయు సేవ. వచనము 3-13
వాక్యము చదువుచుచేయు సేవ- వచనము 14-18
పరిశుద్ధతతో నిండిన సేవ. వచనము 19-26
గ్రంథ విభజన:- ఈ చివరి పత్రికను వ్రాయుచుండినపుడు అతని యొక్క ఇహలోక జీవితదినములు త్వరగా దాని అంతము సమీపించియుండునదని పౌలు గ్రహించెను. భారము తొలగి సేద తీర్చుకొననిష్టపడువాడుగా నుండినను దైవ భక్తి కలిగిన అపొస్తలుడు, కొంచెం భయస్తుడును, అయితే మిక్కిలి యధార్ధమైనవాడును, తన సహ సేవకుడునైన తిమోతిని ఎఫెసు సంఘము యొక్క కష్టతరమైన పరిచర్యకు సిద్ధపరచుటకే ఈ పత్రికను వ్రాసెను. పత్రికలోని రెండు ముఖ్య విషయములు క్రిందచూడుడి.
తాత్కాలిక శోధనలో దృఢముగా నిలిచియుండుము. అధ్యాయము 1,2
భవిష్యత్ కాల శోధనలలో సహనము వహించుము. అధ్యాయము 3,4
కొన్ని వివరముల గుర్తింపులు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 55వ పుస్తకము; అధ్యాయము 4; వచనములు 83; ప్రశ్నలు లేవు; చారిత్రక వచనములు 68; నెరవేరిన ప్రవచనములు 10; నెరవేరని ప్రవచనములు 5.
తీతుకు వ్రాసిన పత్రిక
క్రేతు సంఘము యొక్క బాధ్యతల కొరకు నియమింపబడినవాడైన తీతుకు ఆ సంఘమును పరామర్శించి జరిగించుటకైన బాధ్యత మిక్కిలి భారమైనదిగా నుండెను. అచ్చటనున్న ఒక్కొక్క పట్టణము యొక్క సంమములకును, పెద్దలుగా నుండుటకు నిష్కళంక గుణము పరిశుద్ధతయుగల మనుష్యులను నిర్ణయించవలెనని పౌలు అతనికి ఆజ్ఞాపించుచున్నాడు. సంఘ సేవకులు మాత్రమేగాక సంమములోని వారందరును ఆడ మగ యను బేధము లేక వయపరిమాణము చూడక వారు విశ్వసించు సత్యములను జీవితములో అనుసరించుచూ వచ్చినట్లయితేనేగాని సంఘము జీవముగలదిగా నుండును. పత్రిక ద్వారా రక్షణ యొక్క ఈ అనుభవపూర్వకముగా చేయుటను గూర్చియే పౌలు చెప్పుచున్నాడు.
ఉద్దేశము:- క్రేతు సంఘ బాధ్యతను తీతుకు యివ్వవలసిన బాధ్యతను బోధించుట
గ్రంథకర్త:- పౌలు
ఎవరికి వ్రాసెను?: - తీతుకు, గ్రీకు వాడైన తీతు పౌలు యొక్క సేవా ఫలితముగా విశ్వాసములోనికి వచ్చినవాడుగా నుండవలెను. క్రేతు దీవి సంమములకు పౌలు యొక్క ప్రతినిధిగా తీతు పంపబడెను.
వ్రాసిన కాలము: - క్రీ.శ.64-లో ఈ కాల సందర్భములోనే పౌలు 1తిమోతి పత్రికను కూడ వ్రాసెను. రెండుసార్లు చెరనివాసముకు మధ్య మాసిదోనియాలో నుండి పౌలు ఈ పత్రికను వ్రాసియుండవచ్చును.
ఆంతర్యము: - మధ్యధరా సముద్రపు దీవియైన క్రేతు సుమారు 156 మైళ్ళ పొడవును, 30 మైళ్ళ వెడల్పును గలది. మొదటి శతాబ్దములో ఇక్కడ జీవించిన ప్రజలు అవాచ్యమైన కార్యములకును, దుర్నీతికిని, దుష్కీర్తి పొందినట్టి వారిగా నుండిరి. “క్రేతువానివలె ప్రవర్తించు” అనుమాటకు దొంగ ప్రవర్తన యని అర్ధము. పౌలు క్రేతు దీవి సంఘములను చూచుకొనుటకును అక్కడి కార్యములను క్రమపరచుటకును, తీతును అక్కడకు పంపెను. ఈ కార్యములు ఎట్లు నెరవేరవలెనని పౌలు చెప్పుచున్నాడు.
ముఖ్య మనుష్యులు:- పౌలు, తీతు.
ముఖ్య పదజాలము:- సంఘ క్రమ విధులు.
ముఖ్య వచనములు:- తీతుకు 1:5; తీతుకు 3:8.
ముఖ్య స్థలములు:- కేతు, నికొపోలి.
గ్రంథ విశిష్టత:- తీతు, 1తిమోతి మొదలగునవి ఒకే స్వభావమును వెలువరచు పత్రికలై యున్నవి. రెండింటిలోను పెద్దలకైన బుద్ధిమాటలు చెప్పుచున్నాడు.
ముఖ్య అధ్యాయము:- తీతు 2. సంఘములోని విశ్వాసులు దేవుని చిత్తానుసారముగా బ్రదుక ఈ అధ్యాయములో పౌలు ముఖ్యమైన ఆజ్ఞలు బోధించుచున్నాడు. దేవుని ప్రజలందరు ఈ ఉపదేశములకు సంపూర్ణమైన విధేయతను చూపవలెననునది పౌలు యొక్క వాంఛయైయున్నది.
గ్రంథ విభజన:- పౌలు తీతును లోపముగా ఉన్నవాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే క్రేతులో విడిచి వచ్చెను(తీతుకు 1:5) ఈ పత్రికలో సరియైన బోధను నొక్కి వక్కాణించి, సత్యమును మార్చి చెప్పువారికి వ్యతిరేకముగా హెచ్చరిక నిచ్చుచున్నాడు. అయితే సంఘ ప్రజలు సత్క్రియలందాసక్తి గలవారుగా జీవించుటకైన ఆజ్ఞలే దీని యొక్క ముఖ్యద్దేశము అని చెప్పవచ్చును. రెండు ముఖ్య భాగములుగా ఈ పత్రికను విభజింపవచ్చును.
పట్టణమంతయు పెద్దలను ఏర్పరచుట. అధ్యాయము 1. (2.) ఇతర కార్యములను సరిదిద్దుట. అధ్యాయము 2, 3.
ఈ పత్రిక కు తిమోతితోనున్న ఏకత్వము:- తీతును తిమోతియు ఒకే కాలములో సుమారు క్రీ.శ.64లో వ్రాయబడినవైయున్నవి. పెద్దలను నియమించుటయను ఒకే కార్యమునే రెండు పత్రికలును చెప్పుచున్నవి. తీతు క్రేతులోను, తిమోతి ఎఫెసులోను ఎదుర్కొన్న సంభవములు ఇంచుమించు ఒకే విధమైనవైయున్నవి. రెండు ముఖ్య భాగములుగా ఈ పత్రికను విభజించవచ్చును.
కొన్ని గుర్తింపు వివరములు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 56వ పుస్తకము; అధ్యాయములు 3; వచనములు 46; ప్రశ్నలు లేవు; చారిత్రక వచనములు 45; నెరవేరిన ప్రవచనములు 1.
ఫిలేమోనుకు వ్రాసిన పత్రిక
అశక్యము కాని సమస్యలతో నిండిన జీవిత పరిస్థితులలో క్రైస్తవ ప్రేమ క్రియా రూపము పొందునా? ఉదాహరణకు ధనవంతుడైన ఒక యజమానియు, అతని యొద్దనుండి పారిపోయిన అతని బానిసయు తమలో ప్రేమించుకొనగలరా? గలరు అనుటలో పౌలునకెట్టి సందేహమును లేదు. ఒకదినము ఫిలేమోను చెంత నుండి పారిపోయిన దొంగయు, దుష్టుడునైన ఒనేసిము అను దాసుని కొరకు పౌలు ఆ యజమానునికి వ్రాయు ఒక లేఖయే ఈ పత్రిక. మునుపు అతడు నిష్ప్రయోజకుడును, సమస్యలకు కారకుడునైన ఒక దాసుడిగా నుండెను. ఇప్పుడైతే అతడు క్రీస్తునందు ప్రియమైన సహోదరునిగా నుండెను. పౌలును ఎంత మిక్కుటమైన ప్రేమతో ఫిలేమోను ఆహ్వానించునో అదే ప్రేమతో ఒనేసిమును అంగీకరించుమని మిక్కిలి తేటగా ఫిలేమోనుకు వ్రాయుచున్నాడు. ఒనేసిము ఫిలేమోను గృహము నుండి దేనినైననూ ఆకర్షించి తీసుకొనినను, పోగొట్టుటకు కారణముగానున్నను దానిని తిరిగి ఇచ్చెదనని పౌలు వాగ్దానము చేసెను. సహోదర ప్రేమ, క్షమాపణను, కనికరమును ఈ పరిస్థితి యందు విజయము పొందునని పౌలుకు పరిపూర్ణ విశ్వాసముండెను.
ఉద్దేశము: - ఫిలేమోను యొద్దనుండి పారిపోయిన దాసుడైన ఒనేసమును క్షమించుటకును విశ్వాస సహోదరునిగా అతనిని గౌరవించుటకును వేడుకొనుట.
గ్రంథ కర్త:- పౌలు
ఎవరికి వ్రాసెను?:- ఫిలేమోనుకు. ఇతడు కొలొస్సైయ సంఘమందు గల ధనవంతుడైన ఒక సభ్యుడిగా నుండి యుండవచ్చును.
వ్రాయబడిన కాలము: - క్రీ.శ. 61 నుండి రోమా చెరసాల కాలమందు దీనిని వ్రాసెను. ఈ కాలమందే ఎఫెసీ, కొలొస్సై మొదలగు పత్రికలను వ్రాసెను.
గ్రంథ కర్త:- ఫిలేమోనుకు 1:1; ఫిలేమోనుకు 1:9; ఫిలేమోనుకు 1:19 మొదలగు మూడు వచనములను పౌలు ఈ పత్రికను వ్రాసెననుటకైన ఆధారములగును. కొలొస్సయులకు 4-14 మొదలగు వచనములను ఫిలేమోనుకు 1:10; ఫిలేమోనుకు 1:23-24 మొదలగు వచనములను పోల్చి చూచినచో యీ రెండు పత్రికలందును గుర్తించబడు మనుష్యుడు ఒకే వ్యక్తియని తెలియుచున్నది.
వ్రాయబడిన కాలము:- ఈ పత్రిక మరియు కొలొస్సై పత్రిక యొక్క ముఖ్య భాగములను పోల్చి చూచినచో పత్రికకు ఆధారమైన చారిత్రిక సంభవములను క్రిందనున్నట్లు పోల్చి చూడవచ్చును.
ఫిలేమోను కొలొస్సైయందు నివసించిన ఒక ధనవంతుడు. అతని భార్య పేరు అప్పియ. అతని కుమారుని పేరు ఆరిప్పు. (కొలొస్సయులకు 4:9; కొలొస్సయులకు 4:17; ఫిలేమోనుకు 1:1) అచ్చట గల సంఘము అతని యింటనే కూడుచుండెను. ఫిలేమోను కుమారుడైన అర్ఖిప్పు సంఘమందు ముఖ్యమైన ఒక పరిచారకుడుగా నుండెను. (కొలొస్సయులకు 4:17). ఫిలేమోను దగ్గర పని చేయుచున్న అనేకులలో ఒనేసిము ఒకడుగానుండెను. యజమానుని వస్తువులను అపహరించిగాని లేక ఏదైనను నేరమును యజమానునికి విరోధముగ చేసిగాని అతడు తన యజమానుని విడిచి దూరముగ పారిపోయెను. భద్రత కొరకై ప్రజలతో క్రిక్కిరిసియున్న రోమును చేరెను. తన యజమానుని మారు మనస్సునకు ముఖ్య కారకుడును, అలవాటు పడిన వాడునైన పౌలును అచ్చట కనుగొనెను. అచ్చట అతడు మారు మనస్సు పొంది క్రీస్తునందు ఒక నూతన వ్యక్తిగ మారెను. పౌలుకు మిక్కిలి ఉపయోగకరమైన ఒక సహోదరునిగ కొంత కాలము సహాయము చేయుచు రోమాలో నివసించెను. యజమానుని యొద్దకు మరల వచ్చుట అవశ్యకమని పౌలును ఒనేసిమును గ్రహించిరి. అప్పుడు కొలొస్సై పత్రికను వ్రాసి తుకికు దగ్గర యిచ్చి పంపుటకు పౌలు తీర్మానించెను. వెంటనే ఒనేసిమును తుకికుతో కలసి కొలస్సైకి పంపుటకు తీర్మానించి అతని చేతికి ఫిలేమోనుకు వ్రాసిన పత్రికనప్పగించెను.
ఒనేసిమును ఒంటరిగ పంపక తుకికుతో కలిసి పంపు కారణము, ఇటువంటి దాసులను పట్టుకొను అధికారుల యొద్ద నుండి కాపాడుట కొరకైన ఉద్దేశముగా నుండవచ్చును. ఆ కాలమందు పారిపోయిన దాసులు కనుగొనబడినట్లయినచో వారికి కఠిన శిక్ష విధించబడును. కొన్ని సమయములందు కనికరము లేక మరణ శిక్ష నిచ్చుట అలవాటుగా నుండెను. ఒనేసిము ఒక క్రైస్తవునిగా మారినట్లైనచో పౌలు యిటువంటి ఒక పత్రికను వ్రాసి చేతికిచ్చినను అతడు తిరిగి వెళ్ళి యుండడు.
పౌలు యొక్క చెరసాల పత్రికలలో ఒకటైన యీ పత్రిక క్రీ.శ.61లో వ్రాసియుండవచ్చును. (ఎఫెసి, ఫిలిప్పీ, ముఖ్యముగా కొలస్పై వంటి పత్రికల ప్రారంభమందు చూడుము.)
ఆంతర్యము:- బానిసత్వము రోమా సామ్రాజ్యమందు సామాన్యమైన ఒకటిగా నుండెను. సంఘ విశ్వాసులలో పలువురికిని బానిసలుండిరి. తన పత్రికలందు బానిసత్వ సంబంధమైన ఆజ్ఞలు ఏవియు గుర్తించబడలేదు. అయితే యీ బానిసను ఫిలేమోను యొక్క క్రీస్తునందలి సహోదరుడని పౌలు చెప్పునప్పుడు ఆ బానిసత్వ స్థితి నుండి ఒక మూలాధారమైన మార్పును ఏర్పరచుచున్నాడు.
ముఖ్య పాత్రలు:- పౌలు, ఫిలేమోను, ఒనేసిము.
ముఖ్య పదము:- క్షమించు
ముఖ్య వచనములు:- ఫిలేమోనుకు 1:16-17.
ముఖ్య స్థలములు:- కొలొస్పై, రోమా
గ్రంథ విశిష్టత:- ఇది ఒక స్నేహితునికి పంపిన ఒకనికి సంబంధించినవియు వ్యక్తిగతమైనదియునైన ఒక పత్రిక.
గ్రంథ విభజన: - పౌలు పత్రికలలో బహు చిన్నది. గ్రీకు భాషలో 334 పదములు మాత్రము ఉన్న పత్రిక యిది. మరియొక రీతిలో చూచినట్లైనచో మరణ శిక్షకు పాత్రుడైన ఒక వ్యక్తి దగ్గర పౌలు చూపు ప్రేమ, ఆపేక్ష, క్షమాపణ, దేవుని ప్రేమకు ఒక విశేషమాదిరి అగును. మూడు భాగములుగా యీ పత్రికను విభజించవచ్చును.
(1) ఫిలేమోను కొరకు కృతజ్ఞత తెలుపు ప్రార్ధన. 1-7.వచ.
(2) ఒనేసిము కొరకు ప్రార్థించుట. వచన.8-16.
(3) ఫిలేమోనుకు పౌలు యొక్క వాగానము. వచ.17-25.
కొన్ని ముఖ్య వివరణలు: - పరిశుద్ధ గ్రంథము యొక్క 57వ పుస్తకము ; అధ్యాయము 1; వచనములు 25; ప్రశ్న 1; ప్రవచనములు లేవు.
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక
పాలస్తీనాలోని అధికమైన యూదులు క్రైస్తవ విశ్వాసమునకు వచ్చిన పిదప క్రైస్తవులకు ఆ రోజులలో అధికముగా వచ్చిన ఉపద్రవము నుండి తప్పించుకొను నిమిత్తము యూదమతమునకు తిరిగి వెళ్ళుటకైన అభిప్రాయమును విలువరచిరి. ఈ విధముగా దిగజారిపోక ముందుకు సాగుటకును, పూర్ణజ్నామును పొందుటకయును ఈ గ్రంథ రచయిత వారికి బోధించెను. యూద మతముకన్నను క్రీస్తు ఎంతో నిజమైన వాడను సత్యమే అతడు చెప్పునట్టి బోధ యొక్క అంతర్భావము. క్రీస్తు ఆరాధనకు పాత్రుడైనందున దూతలకన్నను ప్రభావము గలవాడు. సమస్తమును సృజించినవాడగుటచే మోషే కన్నను శ్రేష్టుడు. అహరోను యొక్క యాజకత్వము కన్నను క్రీస్తు యొక్క యాజకత్వము శ్రేష్ఠమైనది. ఎందుకనగా క్రీస్తు నిత్యమైన ఒకే బలిని చెల్లించెను. ఆయన మిక్కిలి మహిమకరమైన ఒక నిబంధనకు మధ్యవర్తియైనందున ధర్మశాస్త్రము కన్నను శ్రేష్టమైనవాడు. క్లుప్తముగా చెప్పవలయునంటే యూదమతములో వారికేర్పడిన నష్టము కంటెను అనేకరెట్లు క్రీస్తు మూలముగా ఈ విశ్వాసుల ద్వారా పొందగలము. క్రీస్తులో ముందుకు సాగునపుడు శోధింపబడిన ఒక విశ్వాసమును, ఆత్మీయబోధనలు సత్క్రియలకైన పట్టుదల వారికి ప్రతిఫలములగుచున్నవి. ఇదే హెబ్రీ పత్రిక యొక్క వాదము.
ఉద్దేశము: - ప్రభువు యొక్క పరిపూర్ణత్వమును, ఔన్నత్యమును బయలుపరచుట.
రచయిత:- పౌలు
ఎవరికి వ్రాసెను?: - పాలస్తీనాలోని హెబ్రీ (యూద) క్రైస్తవులకు.
వ్రాసిన కాలము:- సామాన్యముగా యేరుశలేము దేవాలయము ధ్వంసము చేసిన క్రీ. పూ. 70కు ముందుగా నుండవచ్చును. ఎందుకనగా దేవాలయ పరిచర్యలను, బలులను మత ఆచారములను గూర్చి ఇందు చెప్పబడుచున్నది. దేవాలయము నాశనము చేయబడిన దానిని గూర్చిన సందర్భములిందు లేవు. సుమారు క్రీ.పూ. 67 లో ఇది వ్రాయబడినట్లుగా భావింపబడుచున్నది.
అంతర్యము: - యూదుల చేతను, రోమా సామ్రాజ్యము చేతను ఈ యూద క్రైస్తవులు సముదాయ స్థితిలోను, శరీర స్థితిలోను, ఎక్కువ శ్రమననుభవించుచుండిరి. ప్రభువు యొక్క రెండవ రాకడను క్రైస్తవులు ఆపేక్షతో ఎదురు చూచుచుండిరి. వారి రాజ్యము స్థాపించుకాలము ఇంకను రాలేదు. క్రైస్తవ విశ్వాసము నిజమైనదనియు, క్రీస్తే మెస్సీయ యనియు క్రైస్తవులకు మరల దృఢత్వము కలుగవలసినదిగా నుండెను.
ముఖ్య వ్యక్తులు: - పాత నిబంధన యొక్క విశ్వాసవీరులు.
ముఖ్యమైన పలుకులు:- క్రీస్తు యొక్క ఔన్నత్యము
ముఖ్య వచనములు:- హెబ్రీయులకు 1:3.
ముఖ్య వచనములు: హెబ్రీయులకు 4:14-16; హెబ్రీయులకు 12:1-2.
గ్రంథ శ్రేష్టత:- ఇది ఒక పత్రికగా పిలువబడినప్పటికిని (హెబ్రీయులకు 13:22) శ్రద్ధగా వడియ కట్టబడిన ఒక ప్రసంగము యొక్క రీతిలో అమరియున్నది.
ముఖ్య అధ్యాయము: - అధ్యాయము 11. గ్రంథవచనముల యొక్క ముఖ్యత్వమును శాశ్వతముగా స్థిరపరచబడిన అధ్యాయములలో ఇది ఒకటి. దేవుని వాగ్దానము కాక మరేమియు లేకుండ ఉండినపుడు దేవునిని ఆయన వచనము యొక్క శక్తి ద్వారా మాత్రమేనని అనుకొను వారి యొక్క జాబితా ఇదియైయున్నది. “విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడై యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా” ఇవియే ఈ విశబ్వూసవీరుని జీవితమార్గగా బయలుపరుచబడినట్టి సత్యములు.
గ్రంథ విభజన:- క్రైస్తవ యూద మతము కన్నను ఔన్నత్యముగల వాడు అని నిరూపించుటయే ఈ పత్రికను ఏర్పరచిన ఉద్దేశము. ఈ గురిని చేరుటకు గ్రంథకర్త వ్రాసిన కార్యములను మూడు భాగములుగా విభజింపవచ్చును.
క్రీస్తు యొక్క పరిపాలనలోనున్న గొప్పతనము. Heb,1,1-4,13.
క్రీస్తు చేసిన క్రియలలోని గొప్పతనము Heb,4,14-10,18.
క్రీస్తు నందున విశ్వాసము, జీవితము మొదలగు వాటి గొప్పతనము. Heb,10,19-13,25.
కొన్ని గుర్తింపు వివరములు:- గ్రంథములోని 58వ పుస్తకము. అధ్యాయములు 13, వచనములు 303, ప్రశ్నలు 17, చారిత్రక వచనములు 270, నెరవేరిన ప్రవచనములు 9, నెరవేరని ప్రవచనములు 24.
యాకోబు వ్రాసిన పత్రిక
క్రియలేని విశ్వాసమును విశ్వాసమనుట తగదు. ఎందుకనగా క్రియలేని విశ్వాసము మృతము. జీవము లేని విశ్వాసము బొత్తిగా లేని దానికన్నను చెడ్డది. విశ్వాసమనునది క్రియా పూర్వకముగానే బయలుపరచబడవలెను. యూదా విశ్వాసులకు యాకోబు వ్రాసిన ఈ పత్రిక యొక్క ఆంతర్యమే నిజమైన విశ్వాసమును అనుదిన జీవితముతో సంప్రదింపజేసి చూపించుచున్నాడు.
విశ్వాసమనునది శోధనలలో ఔన్నత్యతను అధిష్ఠించుచున్నది. విశ్వాసము శోధనలకు లోబడక చెడు దురాశలకు స్థానమివ్వక దీర్ఘశాంతము, దృఢత్వము మొదలగు వాటిని బయలుపరచుచున్నది. యాకోబు యొక్క అభిప్రాయానుసారముగా విశ్వాసము, పక్షపాతము ఒకటిగా ఏకీభవించవు. విశ్వాసము నాలుకను స్వాధీనపరచుకొను శక్తిని యిచ్చుచున్నది. చిన్నదైనను గొప్ప శక్తి గల ఈ ఒకే కళ్లెముతో స్వాధీనపరచుకొనుట అవశ్యకము. విశ్వాసమునకు అట్టి సామర్థ్యమున్నది. పరలోక జ్ఞానమును సంపాదించుకొని ఇహలోక జ్ఞానమును విడిచి పెట్టుటకును విశ్వాసము సహాయపడుచున్నది. విశ్వాసము ద్వారా మనము లోకమును విడిచి ప్రత్యేకింపబడి దేవునికి లోబడుచున్నాము. సాతానును ఎదిరించి నిలిచి దేవునికి సమీపించుచున్నాము. చివరిగా విశ్వాసము ప్రభువు యొక్క రాకడ నిమిత్తమై దీర్ఘశాంతముతో ఎదురు చూచుచున్నది. ఇబ్బందులందును, శ్రమలలోను సణుగుగొణుగు అలవాటును అనిశ్చయముగా వదలి పెట్టుచున్నది.
ఉద్దేశము: - యధార్ధమునకు విరుద్ధమైన అలవాట్లను బహిరంగపరచి చూపించుటయు నిజమైన నియమములను నేర్పించుటయు.
గ్రంథకర్త:- క్రొత్త నిబంధనలో యాకోబను పేరుగల నలుగురు వ్యక్తులను చూడగలము. ఇస్కరియోతు యూదాకాని యూదాయను శిష్యుని తండ్రియైన యాకోబు అల్ఫయి కుమారుడును పండ్రెండు శిష్యులలో ఒకడునైన యాకోబు, జెఫన్యా యొక్క కుమారుడును యోహాను యొక్క సహోదరుడును నైన యాకోబు, యేసుక్రీస్తు యొక్క సహోదరుడైన యాకోబు మొదలగువారే ఆ నలుగురైయున్నారు. వీరిలో నాల్గవదిగా చెప్పబడిన వాడు (మత్తయి 13:55; మార్కు 6:3; గల మార్కు 1:19). గడచిన దినములలో యెరూషలేము యొక్క సంఘపు స్థంభములలో ఒకడుగా ఎంచబడినట్లుగా పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. (అపో. కార్యములు 12:17; Acts,15,13-21-21,8 గల అపో. కార్యములు 2:9; అపో. కార్యములు 2:12). ఈ యాకోబే వంశపారంపర్య నమ్మకస్తుడైన ఈ పత్రిక గ్రంథకర్త. పరిశుద్ధ వాక్యములో నుండి లభించు సాక్ష్యార్ధములు ఈ నమ్మకమునకు ఆధారములైయున్నవి. నీతిమంతుడైన ఈ యాకోబును గూర్చి పరిశుద్ధ గ్రంథమునందుండియు వంశపారంపర్యం నుండియు మనమెరిగిన వివరములను దృఢపరచుటయే ఈ పత్రిక యొక్క ఆంతర్యం.
ఎవరికి వ్రాసెను?:- పాలస్తీనాకు వెలుపలనున్న అన్యుల మధ్యలో నివసించిన మొదటి శతాబ్ద యూదా క్రైస్తవులకు వ్రాసెను.
వ్రాయబడిన కాలము:- క్రీ.శ.49 (యెరూషలేము కార్య నిర్వహణ సమావేశము జరిగిన క్రీ.శ.50నకు పూర్వము.
ఆంతర్యము: - యెరూషలేము సంఘ కార్య నిర్వాహకులును శ్రమలకు గురియైన క్రైస్తవులపై యాకోబుకున్న చింత ఈ పత్రికయందు ప్రతిఫలించుచున్నది.
ముఖ్య పదజాలము: - క్రియా పూర్వకమైన విశ్వాసము.
ముఖ్య వచనములు: - యాకోబు 1:19-22; యాకోబు 2:14-17.
గ్రంథ విశిష్టత:- ఈ పత్రిక క్రొత్త నిబంధన పుస్తకములలో మొదటి పుస్తకముగా పరిగణింపబడుచున్నది. యాకోబు క్రీ.శ. 62లో హతసాక్షిగా మరణమాయెనని జోసిఫస్ అను చరిత్ర గ్రంథకర్త చెప్పుచున్నాడు.
ముఖ్య ఆధ్యాయము:- యాకోబు 1. క్రైస్తవ జీవితములో చాల యీక్కట్లైనన ఒక భాగము. శ్రమలు మరియు శోధనలకు సంబంధించినవిగానున్నవి. వీటి రెండింటికిని మనయొక్క సరియైన అనుసరణము ఏదై యుండవలెననునది ఈ అధ్యాయమునందు యాకోబు వెలిబుచ్చుచున్నాడు. శ్రమలు సంభవించునపుడు దానిని సంతోషముగా భావించుడి. శోధనలు కలుగజేయువాడు దేవుడు కాదు అనునదియు మనము విజ్ఞప్తినుంచుకొనవలెను.
గ్రంథ విభజన:- జ్ఞానము గల పుస్తకముల యొక్క సాహిత్య శైలిలో మంచి భాషలో ఈ పత్రిక క్రొత్త నిబంధన యొక్క “ నీతియుక్తమైన పలుకు ”లుగా పరిశుద్ధ గ్రంథ పారాయణులు భావించుచున్నారు. పాతనిబంధనలోని జ్ఞాన పుస్తకముల ద్వారా యాకోబు లోతైన ఆకర్షతోణ ఈ పుస్తకము వ్రాసెను. అదే ప్రకారముగా కొండ మీది ప్రసంగము ఆయనను ఆకర్షించినది. అన్యాయమునకును, అధర్మమునకును ఎదిరించు అతని యొక్క పరిస్థితి “క్రొత్త నిబంధన యొక్క ఆమోసు ” అను పేరు అతనికి చెందియున్నది. మూడు ముఖ్య భాగములుగా ఈ పుస్తకమును విభజింపవచ్చును.
విశ్వాసము యొక్క శోధన. – యాకోబు 1:1-18.
విశ్వాసము యొక్క ప్రత్యేక లక్షణములు. - James,1,19-5,6.
విశ్వాసము యొక్క విజయము. -యాకోబు 5:7-20.
కొన్ని గుర్తింపు వివరములు: - పరిశుద్ధ గ్రంథము యొక్క 59వ పుస్తకము; అధ్యాయములు 5; వచనములు 108; ప్రశ్నలు 24; చారిత్రక వచనములు 100; నెరవేరిన ప్రవచనములు 8.
పేతురు వ్రాసిన మొదటి పత్రిక
ఉద్దేశము:- శ్రమలనుభవించు క్రైస్తవులను విశ్వాసములో దృఢపరచి ఉత్సాహపరచుట.
గ్రంథకర్త:- పేతురు.
ఎవరికి వ్రాసెను?:- యెరూషలేము నుండి తరమబడినవారును చిన్న ఆసియలో ఇక్కడ అక్కడ చెద రిపోయి జీవించుచున్న క్రైస్తవులకును, అన్ని చోట్లనున్న విశ్వాసుల కొరకును.
వ్రాసిన కాలము:- సుమారు క్రీ.శ.64.
ఉద్దేశము:- నీరో చక్రవర్తి కాలమునందు జరిగిన గొప్ప ఉపద్రవకాలములో పేతురు రోమాలో ఉండియుండ వచ్చును. (ఈ ఉపద్రవములో పేతురు కూడ హతసాక్షియైనట్లు నమ్మబడుచున్నది). రోమా సామ్రాజ్యమంతటను క్రైస్తవులు తమ విశ్వాసనిమిత్తమై ఉపద్రవపరచబడియు, హత్య చేయబడి యుండియున్నందున యెరూషలేము సంమము యొక్క విశ్వాసులు మధ్యధరా సముద్ర
ప్రాంతములలో చెల్లాచెదురై జీవించవలసిన సంభవము ఏర్పడెను. శ్రమల మధ్యలో వాటితో పోరాడుచూ ముందుకు సాగివెళ్లుచుండిన విశ్వాసులకు వ్రాయునపుడు వారు వీరులవలె పేరుగాంచవలెననియు క్రీస్తు రాకడకొరకును ఆయన చిత్తము నెరవేర్చుటకును వేచియుండవలెననియు పేతురు బోధించుచుండెను. వారి యొక్క గుణమును, క్రియలును నిష్కళంకముగా ఉండవలెను. ఒక జీవముగల నమ్మకము నిమిత్తము తిరిగి జన్మించినవారై, వారిని పిలిచిన పరిశుద్ధతకు తగినట్లుగా పరిశుద్ధులుగా జీవించవలయును. అటువంటి సేవా ఫలితము విధేయతద్వారా మూలాధారముగా కలిగిన ఒక ప్రవర్తనగా పరిమళించును. అన్యజనులు ప్రభుత్వమునకును బానిసలు వారి యజమానులకును భార్యలు భర్తలుగా నున్న వారికిని క్రైస్తవులు ఒకరి కొకరును లోబడియుండవలెను. ఇటువంటి విధేయత గలిగిన ఒక జీవితమును గూర్చి దృఢముగా చెప్పిన తరువాత మాత్రమే పేతురు శ్రమలు అనునట్టి కఠినమైన భాగమును గూర్చి మాటలాడుచున్నాడు. తనకు సంభవింపనైయున్న అగ్నిపరీక్ష ఒక నూతనమైనదని క్రైస్తవులు భావించకూడదు (1 పేతురు 4:12). క్రీస్తు యొక్క శ్రమలలో క్రైస్తవులు పాలి భాగస్తులగునప్పుడు వారు సంతోషించవలయును. శ్రమలలో సంతోషించు స్వభావమే ఆత్మీయ జీవము యొక్క నిజమైన సూచన. దేవుని యొక్క ప్రియమైన హస్తము క్రింద తగ్గించుకొనియుండునట్టి జీవితము యొక్క మిక్కిలి ఉన్నతమైన మహిమ అదియే.
ముఖ్య వ్యక్తులు:- పేతురు, సిల్వాను, మార్కు.
ముఖ్య స్థలములు:- యెరూషలేము. రోము, పొంతు, గలతీయ, కదొకియ, చిన్న ఆసియ, బితూనియ. ముఖ్య పదజాలము:- క్రీస్తు కొరకు శ్రమననుభవించుడి.
ముఖ్య వచనములు:- 1 పేతురు 1:10-12; 1 పేతురు 4:12-13.
గ్రంథ విశిష్ఠత:- తనకు చెందిన కొన్ని శ్రేష్టమైన పోలికలను పేతురు ఉపయోగించుచున్నాడు. జీవము గల రాళ్ల చేత కట్టబడిన ఆత్మ సంబంధమైన కట్టడమే సంఘము. అనుగ్రహించు కార్యమును ప్రభువు యొద్ద నుండి అతనికి దొరికెను (1 పేతురు 2:5-9). సంఘమును గురించి చెప్పునపుడు జీవముగల రాళ్లనియు, కాపరి గొర్రెలు అనియు ఉపయోగించునది పేతురుయొక్క శ్రేష్ట ప్రవర్తనయైయున్నది.
ముఖ్య అధ్యాయము:- 1 పేతురు 4. ఒక క్రైస్తవ సాక్షికి సంభవించు హింసలును, ఉపద్రవములను, ఏ విధముగా ఎదుర్కొనవలెననునదే దానిని గ్రహించుకొనుట క్రొత్త నిబంధన వివరణలో ప్రధానస్థానమును అధిష్టించినది ఈ అధ్యాయమే. క్రీస్తు యొక్క శ్రమలు మనకొక మాదిరి మాత్రమే గాక ఆయన శ్రమలతో పాలి భాగస్తులనుగా మారునపుడు ఉత్సహించు అర్హతయును కలదు.
గ్రంథ విభజన:- క్రైస్తవులకు శ్రమలు అధికమగుచుండిన ఒక లోకములో జీవించు పరదేశులకే పేతురు తన పత్రికను వ్రాయుచున్నాడు. క్రీస్తు కొరకు జీవించుట వలన శ్రమలు సహించు పరిస్థితిలో యేసుక్రీస్తు నందు వారికున్న జీవముగల నమ్మకము యొక్క నిజత్వము జ్ఞాపకము చేసికొను ఆదరణయు, ఉత్సాహమును ఇచ్చుచున్నాడు. దేవుని యొక్క సత్యవంతమైన కృపలో స్థిరపడి యుండుట ద్వారా ఆ అగ్ని పరీక్షను సహించు భాగమును వారు పొందెదరు (1 పేతురు 5:12; 1 పేతురు 4:12). వారు అనుభవించుచున్నట్టి వేదనల తరువాత దేవునికి ఒక ఉద్దేశమున్నది. ఈ పత్రిక వరుసక్రమములో మూడు కారణములను తెలుపుచున్నది.
విశ్వాసి యొక్క రక్షణానుభవము. 1Pet,1,1-2,12.
విశ్వాసిలో బడి యుండుటకు కావలసిన అవసరత. 1Pet,2,13-3,12.
విశ్వాసి సహించవలసిన ఉపద్రవము. 1Pet,3,13-5,14.
కొన్ని గుర్తింపు వివరములు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 60వ పుస్తకము; అధ్యాయములు 5; వచనములు 105; ప్రశ్నలు 4; చారిత్రకవచనములు 92; నెరవేరిన ప్రవచనములు 3; నెరవేరని ప్రవచనములు 10.
పేతురు వ్రాసిన రెండవ పత్రిక
పేతురు యొక్క మొదటి పత్రిక సంఘపు వెలుపలి వారి సమస్యలను సరిదిద్దునపుడు రెండవ పత్రిక సంఘపు లోపలి సమస్యలను సంధించవలసినదిగా నుండెను. అపాయకరమైన అబద్ధ బోధనలను బోధించు బోధకులను ఖండించి మాటలాడుచున్నాడు. వారి వ్యక్తిగత జీవితాలను పరిశుద్ధముగా కాపాడుకొనునట్లు బుద్ధి చెప్పుచూ అతడు ఈ పత్రికను వ్రాసెను. యథార్ధమైన మహిమ, జ్ఞానము, ఆశనిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదరప్రేమ, నిష్కపటమైన ప్రేమ మొదలగు వాటిననుసరించి వెంబడించుటయే క్రైస్తవ్యము యొక్క గురి. ఇందుకు వ్యతిరేకముగా అబద్ధ బోధకుల జీవితములో కనిపించునది చూడగా శరీరాశ, స్వార్ధము, దురాశ, స్వలాభాపేక్ష మొదలగునవి. రాబోవు కాలములో జరుగనైయున్న న్యాయ తీర్పును వారు హేళన చేయుచు నిరాకరించి ఇప్పుడు కనిపించునదే భవిష్యత్కాలపు మాదిరి అను మనస్సుతో జీవించుచున్నారు. దేవుని న్యాయ తీర్పును జ్ఞాపకము చేసికొని దాని వెలుగులో పరిశుద్ధతను, నిష్కల్మషమైన జీవితము గడుపుటకు అతడు విశ్వాసులను పిలుచుచున్నాడు.
“యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడునైన సీమోను పేతురు” అని 2 పేతురు 1:1 లో పత్రిక లేఖికుని గూర్చి విశదముగా చెప్పబడుచున్నది.
ఉద్దేశము:- అబద్ధ బోధకులను గూర్చిన హెచ్చరిక నిచ్చుట, వీరు విశ్వాసమునందును జ్ఞానమునందును ఎదుగుటకు పిలుచుట.
గ్రంథకర్త:- పేతురు.
ఎవరికి వ్రాయుచున్నాడు?:- సంఘములకు
వ్రాసిన కాలము:- ప్రియులారా ఈ రెండవ వత్రిక మీకిప్పుడు వ్రాయుచున్నాను అని 2 పేతురు 3:1లో సూచించి చిన్న ఆసియలోని అదే విశ్వాసులను మనస్సునందుంచుకొని ఈ పత్రిక వ్రాయబడినది. అయినను 2 పేతురు 1:1 లో చెప్పుచున్న “మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందినవారికి” అను పదజాలము మిక్కిలి చదువ ప్రోత్సాహపరుప సూచించునట్టిదిగాను భావింపవచ్చును. సంమములో నుండి వెలువడినవియును, అందు మూలముగా మిక్కిలి ఆపదను పెంపొందించునట్టివిగానున్న అబద్ధ బోధకులకు బుద్ధి చెప్పుటకు పేతురు ఈ పత్రికను వ్రాసెను. ఇట్టి అబద్ధ బోధకులు యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట అను ఉపదేశమును నిర్మూలము చేయు వ్యతిరేక స్వభావమును క్రమమునకు విరుద్ధమైన బ్రతుకును పురికొల్పిరి (2 పేతురు 3:1-7).
ఈ పత్రిక అపొస్తలుల మరణమునకు కొంచెము ముందుగా రోమాలో నుండి వ్రాయబడినదిగా యుండియుండవచ్చును (2 పేతురు 1:14). పేతురు క్రీ.శ 64 నుండి 66 వరకు మధ్య కాలములో హతసాక్షియాయెను. తిమోతి రోమాలో నున్నప్పుడు పేతురు ఉండి యుండినట్లయితే అతనిని గూర్చిన సూచనలు ఇందులో కనబడియుండవలెను.
ఆంతర్యము:- తన ఆఖరి రోజులు సమీపించెనని పేతురు గుర్తించెను (2 పేతురు 1:13-14). గనుకనే తన హృదయాంతరంగము నుండి తన తరువాత ఏమి సంభవించునది వ్రాయుచున్నాడు. ముఖ్యముగా అబద్ధ బోధకులను గూర్చియు సువార్త యొక్క నిశ్చలమైన నిజత్వస్థితిని గురించియు జ్ఞాపకము చేయుచున్నాడు. ముఖ్య పదజాలము:- అబద్ధ బోధకులను గూర్చి హెచ్చరికగా నుండుడి.
ముఖ్య వచనములు:- 2 పేతురు 1:20-21; 2 పేతురు 3:9-11.
ముఖ్య అధ్యాయము:- 2 పేతురు 1.
గ్రంథ విభజన: - మొదటి పత్రిక జీవవాక్యము ద్వారా రానైయున్న నూతన జన్మను గూర్చి దృఢముగా చెప్పునపుడు రెండవ పత్రిక కృప ద్వారాను క్రీస్తునందలి జ్ఞానముగల ఎదుగుదలకు ప్రధానత్వమును యిచ్చుచున్నది. మూడు ముఖ్య భాగములు ఈ వత్రికనందున్నవి.
క్రైస్తవ ధర్మమును ఏర్పరచుట.- అధ్యాయము 1.
అబద్ధ బోధకులకు శిక్షా తీర్పు. - అధ్యాయము 2.
క్రీస్తు యొక్క రాకడ పట్ల గల విశ్వాసము. - అధ్యాయము 3.
కొన్ని వివరముల గుర్తింపులు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 61వ పుస్తకము; అధ్యాయములు 3; వచనములు 61; ప్రశ్నలు 2; చారిత్రక వచనములు 51; నెరవేరిన ప్రవచనములు 2; నెరవేరని ప్రవచనములు 8.
యోహాను వ్రాసిన మొదటి పత్రిక
దేవుడు వెలుగైయున్నాడు. దేవుడు ప్రేమయైయున్నాడు. దేవుడు జీవమైయున్నాడు. వెలుగును ప్రేమయు జీవమునైన ఆ దేవునితో బహు ఆనందకరమైన ఒక సహవాసము యోహాను అనుభవించి యుండెను. అందుచేతనే యోహాను యీ పత్రికను వ్రాయుచున్నాడు. “యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును” యోహాను తన సువార్త పుస్తకమును వ్రాసెను. (1 యోహాను 20:31) అయితే మొదట పత్రిక వ్రాసిన ఉద్దేశము ఏమిటను దానిని 1 యోహాను 5:13 లో చూపుచున్నాడు. “మీరు నిత్య జీవము గలవారని తెలిసికొనునట్లు దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు తెలిసికొనునట్లు నేను యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను" అనునదే అది. విశ్వసించుడి అను పదమునకు యీ పత్రికయందు ముఖ్యత్వమివ్వబడియున్నది. ఈ చిన్న పత్రికయందు 30 కంటే ఎక్కువసార్లు “తెలిసికొనుడి " అను పదము మరల మరల వచ్చుచున్నది. ఒక్కొక్కమారు ఆపదము దేని కొరకు వచ్చుచున్నదని పరిశోధించి నేర్చుకొనుట ప్రయోజనకరమైన విద్యగా నుండును.
దేవుడు వెలుగైయున్నాడు. కనుక ఆ దేవునితో ఐక్యముగల వారము కావలెనన్నచో మనము చీకటియందు నడువక వెలుగులో నడచువారముగనుండవలెను. అట్లు వెలుగులో నడచినచో మనలను మనమే తీర్పు తీర్చుకొని మన పాపములను ఒప్పుకొందుము. ఆ విధముగా యేసుక్రీస్తు యొక్క రక్తము సకలపాపముల నుండి మనలను పవిత్రులనుగా చేయును. అప్పుడు క్రీస్తు తండ్రి యెదుట మన కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగా క్రియ జరిగించును. ఈ విధముగా ఐక్యమందు నడచుట యొక్క ఫలమే ప్రేమ. దేవుడు ప్రేమలేని వాడని ఎవడైన తలంచినట్లయితే వాడు దేవునిని ఎరిగి యుండలేదు. ప్రేమ అనునది వట్టి మాట కాదు; అది క్రియ. ప్రేమ పొందవలసినది కాదు. ఇచ్చునది. ఎట్టి నిబంధనయు లేని ప్రేమయే దేవుని ప్రేమ. సత్య దేవుడును నిత్య జీవము గల క్రీస్తుతో గల సహవాసమందు జీవించు ఒకనికి ఆయన యొక్క జీవము గల అనగా స్వభావము యొక్క శ్రేష్ఠత వుండి తీరవలెను. యోహాను యొక్క పేరు యీ పత్రికలలో ఎచ్చటను కనిపించనప్పటికిని యోహాను వ్రాసిన మొదటి పత్రికలని శీర్షిక దీనికివ్వబడెను.
ఉద్దేశము:- క్రైస్తవులను విశ్వాసమందు స్థిరపరచుట: అబద్ధ బోధనలను ఖండించుట.
గ్రంథ కర్త:- అపొస్తలుడైన యోహాను.
ఎవరికి వ్రాసెను?:- ఏదైనను ఒక గుర్తించబడిన సంమమునకు వ్రాసినది కాదు. అన్యజనుల సంఘముల కొరకైన ఒక కాపరి పత్రికగా యిది వ్రాయబడెను. సర్వమునందుగల విశ్వాసులకందరికిని వ్రాయబడినది.
వ్రాయబడిన కాలము:- క్రీ.శ.90లో ఎఫెసునందుండి వ్రాయబడెను.
ఆంతర్యము:- పత్రికను వ్రాయునపుడు యోహాను వృద్ధుడును ఆనాడు జీవముతో నున్న ఒకే అపొస్తలుడగును. అప్పుడతడు పత్మాసు దీవికి కొనిపోబడలేదు. క్రీస్తును నేరుగ చూచినవాడను రీతిలో ఆనాటి నూతన తరము వారైన విశ్వాసులకు దేవుని పై గల స్థిరమైన విశ్వాసమును, ధైర్యమును భాగించుటకు మిక్కిలి అధికారముతో వ్రాయబడిన పత్రిక.
ముఖ్య పదజాలము:- దేవునితో గల సహవాసము.
ముఖ్య వచనములు:- 1 యోహాను 1:3-4; 1 యోహాను 5:11-13.
ముఖ్య అధ్యాయము:- 1యోహా:1. యోహాను 15, 1 యోహాను 1 మొదలగునవి దేవునితో గల సహవాసమును ముఖ్య పరచు ఒక ముఖ్యమైన లేఖన భాగములగును. యోహాను 15 క్రీస్తునందు జీవించవలసిన ముఖ్యత్వమును గూర్చి వివరించుచున్నది. దాని మరియొక్క భాగమును 1యోహాను 1లో చూడగలము. క్రీస్తుతో గల సహవాసమునకు నాశనము వచ్చునప్పుడు మనము దేవుని చెంత నుండి పాప క్షమాపణను, పరిశుద్ధతను పొందుకొని తిరిగి ఆ సహవాసమునకు మరలి రావలెనని యీ అధ్యాయము బోధించుచున్నది.
గ్రంథ విభజన:- అబద్ధ బోధనల తుఫాను వంటి ప్రచారము అపొస్తలుల ఉపదేశమును సవాలునకు పిలుచు పరిస్థితిలో దానిని ఎదిరించి పరిశుద్ద క్రైస్తవ జీవితమును స్థిరపరచుకొనుటకై విశ్వాసులను ప్రోత్సహించుట కొరకు యీ పత్రిక వ్రాయబడెను. 2 పేతురు, యూదా వంటి పత్రికలవలె ఎదిరించుటయును, నెలకొల్పుటయునైన రెండు వైపులు యీ పత్రికకు గలవు. ఒక వైపు అబద్ద బోధనలను విసర్జించగా మరియొక వైపు సత్యము యొక్క జ్ఞానము ప్రకారము జీవించుటకు చదువరులకు సలహానిచ్చు చున్నది. దేవునితో గల సహవాసమే యీ పత్రిక యొక్క మూలభావము. రెండు ముఖ్య భాగములుగా యీ పత్రికను విభజించవచ్చును.
(1) దేవుని సహవాసము యొక్క మూలము. – 1Joh,1,1-2,27.
(2) సహవాసము యొక్క అనుచరణ విధానము - 1Joh,2,28-5,21.
కొన్ని ముఖ్య వివరణలు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 62వ పుస్తకము; అధ్యాయములు 5; వచనములు 105; ప్రశ్నలు 5; చారిత్రక వచనములు 100; నెరవేర్చబడని ప్రవచనములు 5.
యోహాను వాసిన రెండవ పతిక
తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడిపోకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.” (1 కోరింథీయులకు 10:12) పౌలు యొక్క ఈ బోధన యోహానుని యీ చిన్న పత్రిక యొక్క సారాంశముగా అనుకొనవచ్చును. ఏర్పరచబడిన అమ్మగారికిని ఆమె పిల్లలకును యీ పత్రిక వ్రాయబడెను. వారు క్రీస్తునందు స్థిరులైయున్నారని తెలియబడుచున్నది. వారు సత్యముననుసరించి నడచువారును వారికప్పగింపబడిన దేవుని ఆజ్ఞలను గైకొనువారుగా నుండిరి. ఈ కార్యమందు పత్రిక రచయిత సంతృప్తి గలవాడుగా నున్నాడు. అయినను నిలుచుట అనునది పడుటకు ఒక మెట్టు దూరముననున్న స్థితియగును. అందుచే వారు జాగ్రత్తగా నుండవలసిన బాధ్యత గలవారుగానుండి.
ఒకనినొకరు ప్రేమించుట అనునది క్రొత్త ఆజ్ఞ కాదు. దేవుని ఆజ్ఞలన్నిటి సారమే. అయినను యీ ప్రేమ కళంకము లేని, పరిశోధించక ఒకనికి తలుపు తెరచియిచ్చినటువంటిదిగ ఉండకూడదు. ముఖ్యముగ క్రీస్తును శరీరముతో వచ్చిన వాడని అంగీకరించని చదువరులు దేశమంతయు కనిపించు సమయమున వారితో సహవాసము నుండి దూరముగా నిలువవలసిన ఆవశ్యకతను రచయిత దృఢముగ చెప్పుచున్నాడు.
ఉద్దేశము:- క్రీస్తును వెంబడించుటకు ఆధార పాఠములైన సత్యమునకును ప్రేమకును దృఢత్వమునిచ్చుట, అబద్ధ బోధకులను గూర్చి హెచ్చరించుట.
గ్రంథ కర్త:- యోహాను రెండవ మూడవ పత్రికలకు వాటి ఆంతర్యమునను, లోపలను ఇమిడియున్న పోలికలు వాటి రచయితను గూర్చి ఒకటిగ ఆలోచించుటకు తగును. వీటియందు గుర్తించబడిన మనుష్యుల తక్కువ సంఖ్య, పత్రికల క్లుప్తీకరణ, మొదటి పత్రికయందు చెప్పబడియున్నట్లు భిన్నమైన నూతన వర్తమానముల కొరతవంటి కారణములచే ప్రారంభకాల సంమము పితరుల అక్షరములందు యివి తక్కువగానే ఉదహరించబడెను. అయినను అపొస్తలుడైన యోహాను కాలమునకు సమీప కాలమున జీవించిన సంఘ పితరులు ముఖ్యముగా ఐరేనియస్, అలెగ్జాండ్రియా క్లెమెంతు మొదలగువారు సందేహము లేక వీటిని అపొస్తలుడైన యోహాను పత్రికలుగ అంగీకరించి యున్నారు. అపొస్తలుడు తన పేరును పత్రికయందు గుర్తించలేదు. “పెద్దనైన నేను” అని మాత్రమే సూచించెను. అపొస్తలుడైన పేతురు కూడ తన్ను ఒక పెద్దగ సూచించుచున్నాడు. (1 పేతురు 5:1) శైలి ప్రయోగము, సంక్షేపము, అనుచరణ విధానము మొదలగు వాటిని రెండు పత్రికలును సమముగా పొందియున్నవి. యోహాను సువార్తతోను, మొదటి పత్రికతోను దగ్గర సంబంధము కలిగియున్నది. కనుక వెలుపటి, లోపలి ఆధారముల మూలముగ యివి అపొస్తలుడైన యోహాను పత్రికలని ముగించి చెప్పవచ్చును.
ఎవరికి వ్రాసెను:- ఒక సన్మానింపదగిన అమ్మగారికిని, వారి కుటుంబ సభ్యులకును, ఒకవేళ స్వస్థలపు సంఘమునకును వ్రాసియుండవచ్చును.
వ్రాయబడిన కాలము:- 1 యోహాను వ్రాయబడినపుడే. క్రీ.శ.90లో ఎఫెసులో నుండి.
ఆంతర్యము:- యోహాను సేవ చేయుచుండిన ఒక స్వగ్రామ సంఘ సభ్యులైన యీ పెద్ద అమ్మగారు, ఆమె కుటుంబస్థులు వుండి యుండవచ్చును. వారి మధ్య మంచి బంధముండెను. కొన్ని సంఘములందు పలుకుబడిగల అబద్ధ బోధకులను గూర్చి యోహాను హెచ్చరించెను.
ముఖ్య వచనము:- వచ.6. మనమాయన ఆజ్ఞల ప్రకారము నడచుటయే ప్రేమ: మీరు మొదట నుండి వినిన ప్రకారము ప్రేమలో నడచుకొనవలెను అనునదియే ఆ ఆజ్ఞ.”
ముఖ్య పాత్రలు: యోహాను. అమ్మ గారు, ఆమె పిలలు.
ముఖ్య పదజాలము:- అబద్ద బోధకుల సహవాసమును విడచి దూరమగుడి.
ముఖ్య వచనములు:- 2 యోహాను 1:9-10.
గ్రంథ విభజన:- ఈ చిన్న పత్రికకు మొదటి పత్రికతో దగ్గర భావపోలిక కలదు. తన చదువరులకు ప్రేమ యొక్క సలహానిచ్చుటతో బాటు ప్రేమతో జ్ఞానముతో నడచుకొనవలెననియు చెప్పెను. పత్రికకు తేటయైన రెండు భాగములు గలవు:-
(1) దేవుని ఆజ్ఞలను గైకొనుట :- 2 యోహాను 1:1-6.
(2) అబద్ధ బోధకులను విడచి దూరమగుట.:- 2 యోహాను 1:7-13.
కొన్ని ముఖ్య వివరణలు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 63వ పుస్తకము; అధ్యాయము 1; వచనములు 13; ప్రశ్నలు లేవు; ప్రవచనములు లేవు.
యోహాను వ్రాసిన మూడవ పత్రిక
యోహాను తనకు అతి ప్రియమైన గాయుకు ఈ పత్రికను వ్రాసెను. 1 కోరింథీయులకు 1:14; రోమీయులకు 16:23 మొదలగు వచనములలో గాయు అని గుర్తింపబడియున్నాడు. ఇతడు ముందు కాలములో అపొస్తలుడైన యోహానుకు వ్రాయుటకు సహాయపడు సహాయకుడుగా మారినట్లుగా ఒక శాస్త్రము తెలుపుచున్నది. నాల్గవ వచనములో గాయు యోహాను యొక్క ప్రియమైన పిల్లలలో ఒకడుగా అనగా అతని ద్వారా విశ్వాసములోనికి నడిపింపబడిన ఒకడుగా చిత్రించబడుచున్నాడు. ఇతడు ఎవరైనప్పటికిని, మిక్కిలి నమ్మకమైన ఒక క్రైస్తవ సేవకుడుగా ఉండి యుండవలెను. అపొస్తలుడు నాలుగుసార్లు ప్రియమైనవాడు అని పిలుచుచున్నాడు.
యోహాను మొదటి పత్రికలో అపొస్తలులు దేవునితో కలిగియున్న ఐక్యతను గూర్చి చెప్పుచున్నాడు. రెండవ పత్రికలో అబద్ధ బోధకులతో కూడిన ఐక్యతను గూర్చి వివరించుచున్నాడు. మూడవపత్రికలోనైతే క్రైస్తవ సహోదరులతో కూడిన ఐక్యతకు ఊతనిచ్చుచున్నాడు.
సత్యములో నడచుట యనునదే దీనియొక్క ప్రధాన సందేశమని చెప్పవచ్చును. గాయు సువార్త సేవకులను ఆహ్వానించి పరిచర్య చేసి వారికి ఉపకారములను చేసెను. అతనికి కలిగినదంతయు సువార్త సేవ కొరకే సమర్పించిన అతడు సత్యములో నడచుట అనునది ఒక శ్రేష్టమైన మాదిరియే. దీనికి మారుగా అపొస్తలులు వ్రాసిన పత్రికను నిరాకరించి అతనిపై నేరము మోపి సువార్త సేవకులను అవమానపరచి వారిని చేర్చుకొన్న వారిని సంఘము నుండి వెలుపలికి త్రోసిన దిమిత్రఫే దీనికి వ్యతిరేకమైన సాక్ష్యముగానున్నాడు. అందరి యెడలను మంచి సాక్ష్యము పొందిన దేమేత్రియు కూడ దియొత్రఫే చేత వెలివేయబడిన ఒకడుగానున్నాడు.
ఉద్దేశము:- తన యొక్క ఆతిథ్యము కొరకుగాయును పొగడుట, క్రైస్తవ జీవితములో అతనిని ప్రోద్బలపరచుట.
గ్రంథకర్త:- అపొస్తలుడైన యోహాను.
ఎవరికి వ్రాసెను?:- యోహానుకు సన్నిహితుడైన ఒక సంఘములో మనతవహిచిన గాయునకు.
వ్రాసిన కాలము:- క్రీ.శ.90 ఎఫెసులో నుండి
ఆంతర్యము:- క్రొత్త సంఘములను స్థాపించుట కొరకై బోధకులు పట్టణముయందు సంచరించిరి. వారు సహవిశ్వాసుల యొక్క అతిథులుగా ఒక్కొక్కచోటను నివసించిరి. ఇటువంటి ప్రయాణము చేయు బోధకులను ఇంట చేర్చుకొను వారిలో ఒకడుగా కీర్తి చెందినవాడు గాయు.
ముఖ్య పదజాలము:- సహోదర ప్రేమ.
ముఖ్య వచనములు:- వచనము 11.
గ్రంథ విభజన:- పరిశుద్ధ గ్రంథములో నున్న అతి చిన్న పుస్తకము. అయితే అది మిక్కిలి ప్రత్యేకమైనదియు తేటయైన స్వభావము గలది. అపొస్తలులు పంపిన సువార్తికులు ఒకరికొకరు విరోధముగా నున్న స్థితిలో అట్లు జరిగి తన ఇద్దరు సహోదరులను మధ్యస్తము చేసినట్లు పత్రిక వ్రాయబడియున్నది. యదార్థమైన గాయు విశాల హృదయముతో ఆతిథ్యమును, మంచి గుణముతో నడచుకొనునపుడు యదార్థత లేని దియెత్రిఫే గర్వముతోను, ఎదిరించుటను నడుచుకొన్నట్లు చూచుచున్నాము.
కనుకనే పత్రికలోని రెండు ముఖ్య భాగములు ఇవియైయున్నవి.
గాయును గూర్చిన పొగడ్త. 3 యోహాను 1:1-8.
దియెత్రిఫేను గూర్చిన కొరతలు. 3 యోహాను 1:9-14.
కొన్ని ముఖ్య గుర్తింపులు: - పరిశుద్ధ గ్రంథములోని 64వ పుస్తకము. వచనములు 15. ప్రశ్నలు లేవు. ప్రవచనములు లేవు.
యూదా వ్రాసిన పత్రిక
దేవుని కృపను జీవితమునకు సంరక్షణ కేడెముగా అమర్చుకొన్న విశ్వాసుల సంఘమును నాశనము చేయుటకు ప్రేరేపిస్తున్న అబద్ధ బోధనలు వ్యాపించినప్పుడు దానిని ఎదిరించు విశ్వాస వీరులనుగా వారిని సిద్ధపరచుట కొరకై వ్రాయబడినదే యీ యూదా పత్రిక. ఇట్టి అబద్ధ బోధనలను వ్యాపింపజేయు మనుష్యులకు దేవుని యొద్ద నుండి గల ఒక హెచ్చరిక యీ పత్రికలో యున్నది. అవిశ్వాసులుగా మారిన ఇశ్రాయేలీయులకును, అవిధేయత వలన పడిపోయిన దేవదూతగణమునకును, సొదొమ గోమోర్రా పట్టణ వాసులకును జరిగిన ఆపదలను స్మరించుకొని వీరికి రాబోవు న్యాయ తీర్పును గూర్చి పత్రిక రచయిత వారికి ప్రకటించుచున్నాడు. ఇటువంటి ఆపదలకు ముందుగా క్రైస్తవులు జాగ్రత్తగా ఉండవలెను. ఎదుర్కొన్న సవాలులు పెద్దవిగానున్నను దేవుడు యధార్థమైన తన బిడ్డలను పడిపోకుండ కాపాడుటకు శక్తిమంతుడైయున్నాడు.
గ్రంథ కర్త:- ఆంతర్యము చిన్నదైనను యూదా పత్రికను ముఖ్యమైనదొకటిగ ప్రారంభకాల సంఘము కలిగియుండెను. ప్రారంభ కాల సంఘ పితరులు దీని భాగములను ఉదహరించుట అలవాటుగా నుండెను. క్రీ.శ.171-లో ఏర్పడిన మురాట్రోరియన్ కానోనిల్ దీని భాగములు చేర్చబడెను. టెర్టలియాన్, ఒరిగెన్ వంటి సంఘ పితరులు దీనిని దేవుని వాక్యములో ఒక భాగముగా అంగీకరించిరి. “యేసుక్రీస్తు - దాసుడును. యాకోబు సహోదరుడును” అని రచయిత తన్ను గూర్చి సూచించుచున్నాడు. (యూదా 1:1) ఈ ఒప్పుకోలు 17వ వచనమందు వచ్చు అపొస్తలులను గూర్చిన సూచనలతో చేర్చి చూచినపుడు యీయన పదకొండుమంది అపొస్తలులలోని ఒకడైన యాకోబు సహోదరుడైన యూదా కాదు అని ఆలోచించుటకు మార్గము చూపుచున్నది. మత్తయి 13:55 నందును, మార్కు 6:3 లో యీ యూదాను గూర్చి గుర్తించబడుచున్నది. ఇతని జ్యేష్ఠ సహోదరుడైన యాకోబు యెరూషలేము సంఘ పెద్దయు (అపో. కార్యములు 15:13-21) అతను పేరు మోసిన పత్రిక యొక్క రచయిత అగును. యేసు యొక్క యితర సహోదరుల వలె యూదా కూడ ప్రభువు యొక్క పునరుత్థానము వరకు ఆయనను విశ్వసించలేదు. (యోహాను 7:1-9; అపో. కార్యములు 1:14) వీటి తరువాత ఇతని గూర్చి ఒకే సూచన 1 కోరింథీయులకు 9:5 లో వచ్చుచున్నది. అందులో ప్రభువు సహోదరులు తమ సువార్త సేవా ప్రయాణమందు స్వంత భార్యలను తీసుకొని వెళ్ళినట్లు తెలియుచున్నది. అపో. కార్యములు 15:22 నందును అపో. కార్యములు 15:32 నందును చెప్పబడు యూదా ఒక వేళ యితడైయుండవచ్చును. పరిశుద్ధ గ్రంథమునకు బయట చెప్పబడు పారంపర్య కథలును యీ యూదాను గూర్చి ఇతర వివరములను చెప్పలేదు.
ఉద్దేశము:- సంఘములు విశ్వాసమందు. స్థిరముగా నిలుచుటకును అబద్ధ బోధనలకు విరోధముగా నిలచి విశ్వాసమును కాపాడుటకును స్మరింపజేయుట.
ఎవరికి వ్రాసెను? యూదా క్రైస్తవులకును విశ్వాసులు యావన్మందికిని.
వ్రాయబడిన కాలము:- దాదాపు క్రీ.శ.65.
ఆంతర్యము:- మొదటి శతాబ్దము ప్రారంభమై కట్టు కథలచేతను, అబద్ధ బోధనల చేతను సంఘము బెదరించబడుచుండెను.
ముఖ్య వచనము:- "ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణనుగూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తి గల వాడనై ప్రయత్నించుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధనిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను”. (యూదా 1:3).
ముఖ్య పాత్రలు: - యూదా, యాకోబు, యేసు.
ముఖ్య పదము:- విశ్వాసముకొరకుపోరాడుడి.
ముఖ్య వచనము:- యూదా 1:3.
గ్రంథ విభజన:- క్రొత్త నిబంధనయందు పౌలు మరియు ఇతర రచయితల పత్రికలలో ఒక పెద్ద భాగము అబద్ద ప్రవక్తలచే కలుగు ఆపదను ఎత్తిచూపుచున్నది. అయినను యీ విశ్వాస త్యాగులు కఠినముగ ఖండించుచు యీ ఆపదకు వ్యతిరేకముగ విశ్వాసము కొరకు పోరాడుటలో క్రైస్తవులను ప్రోత్సాహపరచు కార్యమందు యూదా ముందు నిలుచుచున్నాడు. పత్రిక యొక్క ప్రారంభమును చివరి స్తుతి గీతమును తప్ప మిగిలిన వచనములన్నియు యీ భయంకరమైన ఆపదను గూర్చి మాట్లాడునవగును. క్లుప్తముగనున్నను తీవ్రమైన వర్తమానము గలది. నాల్గు భాగములుగా యీ పత్రికను విభజించవచ్చును.
(1) పత్రిక వ్రాయబడిన ఉద్దేశము. యూదా 1:1-40.
(2) అబద్ధ బోధకులను గూర్చిన వివరణ. యూదా 1:5-16.
(3) అబద్ధ బోధకులను ఎదుర్కొ నవలసిన విధము. యూదా 1:17-23.
(4) స్తుతి గీతము. యూదా 1:24 – 25.
కొన్ని ముఖ్య వివరణలు:- పరిశుద్ధ గ్రంథములోని 65వ పుస్తకము; అధ్యాయము 1: వచనములు 25; ప్రశ్నలు లేవు; చారిత్రక వచనములు 22; నెరవేర్చబడిన ప్రవచనము 1; నెరవేర్చబడనివి 2.
ప్రకటన గ్రంథము
ఆదికాండము ప్రారంభ గ్రంథముగానున్నట్లు ప్రకటన గ్రంథము చివరి గ్రంథముగానున్నది. ఇందులో దేవుని యొక్క విమోచనా ఉద్దేశము సంపూర్తిస్థానము నధిష్టించుచున్నది. సువార్త పుస్తకములును, పత్రికలును అనేక ప్రవచనములతో యిమిడియున్నప్పటికిని ప్రవచన సందర్భములను కేంద్రము చేసికొని వ్రాయబడిన ఒకే క్రొత్త నిబంధన గ్రంథము, ప్రకటన గ్రంథమే. దాని శీర్షిక “తెరను వివరించి చూపుట” (బయలుపరచి చూపుట) అనునది దీని భావము. ఆ విధముగా ఈ గ్రంథము దేవుని గుణగణమును, సూచక క్రియలను, ఆధారము చేసికొని ఇది వ్రాయబడినది. ఇహలోక న్యాయమునకు న్యాయము తీర్చుటకును, దానిని నూతనపరచుటకును, నీతితో పరిపాలించుటకును ఆ క్రీస్తుకు మాత్రమే అధికారము గలదు.
గ్రీకు పరిశుద్ధ గ్రంథములో దీని శీర్షిక “యోహానుకు కలిగిన ప్రత్యక్షత " అనునదైయున్నది. ప్రత్యక్షత అని మాత్రమే ఒక పేరు దీనికి ఉన్నది. మరుగైయున్న ఒక దానిని ప్రత్యక్ష పరచి చూపునది ఈ గ్రంధమైయున్నది. ఈ పుస్తకమును కొంచెము అధిక శ్రేష్టమైన ఒక శీర్షిక ప్రకటన గ్రంథం 1:1లో కనిపించుచున్నది. “యేసుక్రీస్తు... ప్రత్యక్షత ” అనునదే ఆ శీర్షిక. క్రీస్తులో నుండి ఉద్భవించిన ప్రత్యక్షత అనియో, క్రీస్తును గూర్చిన ప్రత్యేకత అనియో దీని భావముగా చెప్పవచ్చును. రెండును సరియైనవే.
ఉద్దేశము:- క్రీస్తు యొక్క పరిపాలనను సంపూర్ణముగా ప్రత్యక్షపరచబడుట, విశ్వాసులకు హెచ్చరికయు నమ్మకత్వమును ఇచ్చుట.
గ్రంథకర్త:- అపొస్తలుడైన యోహాను.
ఎవరికి వ్రాసెను?:- ఆసియలోని ఏడు సంఘములకును ప్రపంచమంతటిలో నున్న విశ్వాసులకును.
వ్రాయబడిన కాలము:- సుమారు క్రీ.శ.95. పత్మాసు దీవిలో నుండి.
ఆంతర్యము:- డొమీషియన్ చక్రవర్తి క్రింద (క్రీ.శ. 90-95) ఉపద్రవములననుభవించుచుండిన ఆసియలోని ఏడు సంఘములకును ఈ పుస్తకమును యోహాను వ్రాసెను. ఆసియలో నుండి చాలా దూరముగానున్న పత్మాసు దీవికి రోమా అధికారులు యోహానును దేశదిమ్మరిగా కొనిపోయిరి. క్రీస్తు యొక్క మానవావతారమునకు సూటియైన సాక్షిగా నున్న యోహాను ఇప్పుడు, మహిమపరచబడిన క్రీస్తును దర్శించుచున్నాడు. రాబోవు కాలములలో దుష్టత్వమునకు వచ్చు న్యాయ తీర్పును దేవుని యొక్క పరిపూర్ణమైన విజయమును యోహానుకు దేవుడు ప్రత్యక్ష పరచెను.
ముఖ్య వ్యక్తులు:- యేసు, యోహాను.
ముఖ్య స్థలములు:- పత్మాసు, ఆసియలోని ఏడు సంఘములు, నూతన యెరూషలేము.
ముఖ్య పదజాలము:- క్రీస్తు యొక్క రాకడను గూర్చిన ప్రత్యక్షత.
ముఖ్య వచనములు:- ప్రకటన గ్రంథం 1:19; ప్రకటన గ్రంథం 11:15.
గ్రంధ విశిష్టత:- ఈ పుస్తకము ఒక స్వరూపములోనున్న ఒక ప్రవచన గ్రంథము. శ్రమల మార్గమున వెళ్లువారికి నమ్మకమునిచ్చు పోలికలు ఇందులో వర్ణించబడుచున్నవి.
ముఖ్య అధ్యాయములు:- అధ్యాయము 19-22 వరకు.
ఈ అధ్యాయములలో ప్రపంచపు చివరిదినములను, నిత్యత్వమును గూర్చిన దేవుని తీర్మానమును అర్ధసహితమైన భాషలో వ్రాయబడియున్నది. దీనిని జాగ్రత్తగా నేర్చుకొని లోబడువారికి దేవుడు వాగ్దానము చేసిన ఆశీర్వాదములు లభించును (ప్రకటన గ్రంథం 1:13) ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అను యేసు యొక్క వాక్కులు మన హృదయాంతరంగములో భద్రముగా వదిలపరచుకొనవలసినవి.
గ్రంథ విభజన:- దానియేలు, జెకర్యాలాంటివారి ప్రవచనములవలె ప్రత్యక్ష భాష క్రియాపూర్వకముగా ఒక ప్రవక్త ద్వారా వ్రాయబడిన ఒక పుస్తకము ఇదియే. (ప్రకటన గ్రంథం 10:11; ప్రకటన గ్రంథం 22:9). ఇది ఒక ప్రవచన గ్రంథమని వ్రాయబడియున్నది. (ప్రకటన గ్రంథం 1:3; ప్రకటన గ్రంథం 22:7; ప్రకటన గ్రంథం 22:10; ప్రకటన గ్రంథం 22:18-19). దీనియొక్క మహాత్మ్యమైన ప్రత్యక్ష సంభవములో మూడు గొప్ప సంఘటనలు యిమిడియున్నట్లు ప్రకటన గ్రంథం 1:19 లో చెప్పబడుచున్నది. అవియే ఈ గ్రంథము యొక్క మూడు భాగములు.
యోహాను చూచినవి - అధ్యాయము 1
ఇప్పుడు ఉన్నవి - అధ్యాయము 2, 3
రానైయున్న సంభవములు - అధ్యాయములు 4-22 వరకు.
కొన్ని గుర్తింపు వివరములు:- పరిశుద్ధ గ్రంథమందలి 66వ గ్రంథము; అధ్యాయములు 22; వచనములు 404; ప్రశ్నలు 9; చారి|తక వచనములు 53; నెరవేరిన ప్రవచనములు 10; నెరవేరని ప్రవచనములు 341.
⇔ ప్రార్థన
Psalms - 69:13 కీర్తనల గ్రంథము - 69:13
13 యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపాబాహుళ్యమునుబట్టి నీ రక్షణ సత్యమునుబట్టి నాకుత్తరమిమ్ము.
⇒ 1. ప్రార్థన ఎట్లా చేయవలెను? ( వైద్యుడైన లూకా వ్రాసిన సువార్త )
Luke - 18:1 లూకా సువార్త - 18:1
1 వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలె ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను.
⇒ 2.ఎడతెగక ప్రార్ధన చేయడం . ( పౌలు వ్రాసిన థెస్సలొనీకయులకు వ్రాసిన మొదటి పత్రిక )
1 థెస్సలొనీకయులకు 5:15-17
15 ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి;మీరు ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి.
16 ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి;
17 యెడతెగక ప్రార్థనచేయుడి;
⇒3. కృతజ్ఞతా పూర్వకంగా ప్రార్ధన చేయడం. ( ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక )
ఫిలిప్పీయులకు 3:6
6 ఆసక్తివిషయము సంఘమును హింసించువాడనై, ధర్మ శాస్త్రమువలని నీతివిషయము అనింద్యుడనై యుంటిని.
⇒ 4.దేవుని చిత్తానుసారముగా ప్రార్ధన చేయడం. (యోహాను వ్రాసిన మొదటి పత్రిక)
1 యోహాను సువార్త 5:12
13 దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవముగలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను.
14 ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మన మేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే.
15 మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలంకించునని మన మెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగిన వని యెరుగుదుము.
⇒ 5.సిద్ధ పరచుకొన్మ ప్రార్థనతో కనిపెట్టియుండుడి.
Psalms - 5 కీర్తనల గ్రంథము - 5
3 యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడునుఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసికాచియుందును.
⇒ 6. మనః పూర్వకముగా ప్రార్ధన చేయడం. (యాకోబు వ్రాసిన పత్రిక)
James - యాకోబు 5:16-18
16 మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును.
17 ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే; వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములవరకు భూమిమీద వర్షింపలేదు.
18 అతడు మరల ప్రార్థనచేయగా ఆకాశము వర్ష మిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను.
⇒ 7.సందేహింపక విశ్వాసముతో ప్రార్ధన చేయడం. ( యాకోబు వ్రాసిన పత్రిక )
James - యాకోబు 1:5-6
5 మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్ర హింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.
6 అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును.
⇒ 8.శత్రువుల కొరకు ( మత్తయి వ్రాసిన సువార్త )
Matthew - మత్తయి సువార్త 5:43-46
43 నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు మని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా;
44 నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.
45 ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.
46 మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా.
ఆదికాండము (6)
4:26 మరియు షేతునకు కూడ కుమారుడు పుట్టెను; అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.
13:4 తాను మొదట బలిపీఠమును కట్టినచోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను.
20:7 కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతని కప్పగించుము; అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థనచేయును, నీవు బ్రదుకుదువు. నీవు ఆమెను అతని కప్పగించని యెడల నీవును నీవారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలిసికొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను.
21:33 అబ్రాహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షమునాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను.
25:21 ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్యయైన రిబ్కా గర్భవతి ఆయెను.
26:25 అక్కడ అతడొక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థనచేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి.
సంఖ్యాకాండము (1)
21:8 మోషే ప్రజలకొరకు ప్రార్థన చేయగా యెహోవానీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభముమీద పెట్టుము; అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపుచూచి బ్రదుకునని మోషేకు సెలవిచ్చెను.
యెహోషువ (1)
10:12 యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయు లను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడియున్నది గదా.
న్యాయాధిపతులు (2)
1:1 యెహోషువ మృతినొందిన తరువాత ఇశ్రాయేలీ యులుకనానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయునట్లు ప్రార్థనచేయగా
13:9 దేవుడు మానోహ ప్రార్థన నాలకించెను గనుక, ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవునిదూత ఆమెను దర్శించెను.
1 సమూయేలు (8)
1:10 బహుదుఃఖా క్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థనచేయుచు బహుగా ఏడ్చుచు
1:11 సైన్యములకధి పతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసికొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను,
1:26 నా యేలినవాడా, నాయేలిన వాని ప్రాణముతోడు, నీయొద్దనిలిచి, యెహో వాను ప్రార్థనచేసిన స్త్రీని నేనే.
7:5 అంతట సమూయేలుఇశ్రాయేలీయులందరిని మిస్పాకు పిలువనంపుడి; నేను మీపక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా
7:8 మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించునట్లుగా మాకొరకు ఆయనను ప్రార్థనచేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి
7:9 సమూయేలు పాలు విడువని ఒక గొఱ్ఱపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి, ఇశ్రా యేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థనచేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను.
8:6 మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థనచేసెను.
12:23 నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుటవలన యెహోవాకు విరోధముగ పాపము చేసినవాడ నగుదును. అది నాకు దూరమగునుగాక. కాని శ్రేష్ఠమైన చక్కని మార్గమును మీకు బోధింతును.
2 సమూయేలు (2)
15:31 అంతలో ఒకడు వచ్చి, అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా దావీదుయెహోవా అహీతోపెలుయొక్క ఆలోచనను చెడ గొట్టుమని ప్రార్థన చేసెను.
22:7 నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱ పెట్టితిని నా దేవుని ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెనునా మొఱ్ఱ ఆయన చెవులలో చొచ్చెను.
1 రాజులు (20)
8:28 అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి, యీ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొఱ్ఱను ఆలకించుము.
8:29 నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీ కరించునట్లునా నామము అక్కడ ఉండునని యే స్థలమునుగూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన యీ మందిరముతట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి యుండునుగాక.
8:30 మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులును ఈ స్థలముతట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్ల, నీ నివాసస్థానమైన ఆకాశమందు విని మా విన్న పము అంగీకరించుము; వినునప్పుడెల్ల మమ్మును క్షమించుము.
8:33 మరియు ఇశ్రాయేలీయులగు నీ జనులు నీకు విరోధముగా పాపముచేయుటచేత తమ శత్రువులయెదుట మొత్తబడి నప్పుడు, వారు నీతట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని యీ మందిరమందు నిన్నుగూర్చి ప్రార్థన విన్నపములు చేయునప్పుడెల్ల
8:35 మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేక పోగా, నీవు వారిని ఈలాగున శ్రమపెట్టుటవలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి యీ స్థలముతట్టు తిరిగి ప్రార్థనచేసిన యెడల
8:38 ఇశ్రాయేలీయులగు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలిసికొనును గదా; ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసినయెడల
8:42 నీ ఘనమైన నామమును గూర్చియు, నీ బాహుబలమునుగూర్చియు, నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి యీ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసినయెడల
8:44 మరియు నీ జనులు తమ శత్రువు లతో యుద్ధము చేయుటకై నీవు వారిని పంపించు ఏ స్థలమునకైనను బయలుదేరునప్పుడు, నీవు కోరుకొనిన పట్టణముతట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మంది రముతట్టును యెహోవావగు నీకు వారు ప్రార్థన చేసిన యెడల
8:45 ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని, వారి కార్యమును నిర్వహించుము.
8:48 తమ్మును చెరగా కొని పోయిన వారియొక్క దేశమందు పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను వారు నీ తట్టు తిరిగి, నీవు వారి పితరులకు దయచేసిన దేశముతట్టును నీవు కోరుకొనిన పట్టణము తట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మందిరముతట్టును నిన్నుగూర్చి ప్రార్థనచేసిన యెడల
8:49 ఆకాశమను నీ నివాసస్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించి
9:3 అతనితో ఈలాగు సెలవిచ్చెను-నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని, నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన యీ మందిరమును పరిశుద్ధపరచియున్నాను; నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడు అక్కడ ఉండును.
17:22 యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రదికెను.
18:24 తరువాత మీరు మీ దేవత పేరునుబట్టి ప్రార్థన చేయుడి; నేనైతే యెహోవా నామమునుబట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుటచేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలీయా మరల జనులతో చెప్పగా జనులందరునుఆ మాట మంచిదని ప్రత్యుత్తర మిచ్చిరి.
18:25 అప్పుడు ఏలీయా బయలు ప్రవక్తలను పిలిచిమీరు అనేకులైయున్నారు గనుక మీరే మొదట ఒక యెద్దును కోరుకొని సిద్ధముచేసి మీ దేవత పేరునుబట్టి ప్రార్థన చేయుడు; అయితే మీరు అగ్నియేమియు క్రింద వేయవద్దని చెప్పగా
18:26 వారు తమకు ఇయ్యబడిన యెద్దును తీసికొని సిద్ధముచేసి, ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకుబయలా, మా ప్రార్థన వినుమని బయలు పేరునుబట్టి ప్రార్థనచేసిరి గాని యొక మాటయైనను ప్రత్యుత్తరమిచ్చువాడెవడును లేకపోగా, వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులువేయ మొదలుపెట్టిరి.
18:36 అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలీయా దగ్గరకు వచ్చి యీలాగు ప్రార్థనచేసెనుయెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము.
18:37 యెహోవా, నా ప్రార్థన ఆలకించుము; యెహోవావైన నీవే దేవుడవై యున్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగచేయుదువనియు ఈ జనులకు తెలియునట్లుగా నా ప్రార్థన అంగీకరించుము.
18:38 అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను.
19:4 తాను ఒక దినప్రయాణము అరణ్యములోనికి పోయి యొక బదరీవృక్షముక్రింద కూర్చుండి, మరణా పేక్షగలవాడైయెహోవా, నా పితరులకంటె నేను ఎక్కువవాడను కాను, ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసికొనుము అని ప్రార్థనచేసెను.
2 రాజులు (8)
4:33 తానే లోపలికిపోయి వారిద్దరే లోపలనుండగా తలుపువేసి, యెహోవాకు ప్రార్థనచేసి
6:17 యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థనచేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషాచుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథములచేతను నిండియుండుట చూచెను.
6:18 ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషాఈ జనులను అంధత్వ ముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషాచేసిన ప్రార్థనచొప్పున వారిని అంధత్వముతో మొత్తెను.
6:20 వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడుయెహోవా, వీరు చూచునట్లు వీరి కండ్లను తెరువుమని ప్రార్థనచేయగా యెహోవా వారి కండ్లను తెరవచేసెను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలిసికొనిరి.
19:4 జీవముగల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానునిచేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నియు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవాకు వినబడియున్న ఆ మాటలనుబట్టి ఆయన అష్షూరురాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషముకొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము.
19:15 యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థనచేసెనుయెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యా కాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోక మందున్న సకల రాజ్యములకు దేవుడవైయున్నావు.
19:20 అంతట ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెనుఇశ్రాయేలీయుల దేవు డగు యెహోవా సెలవిచ్చు నదేమనగా అష్షూరురాజైన సన్హెరీబు విషయమందు నీవు నా యెదుట చేసిన ప్రార్థననేను అంగీకరించియున్నాను.
20:5 నీవు తిరిగి నా ప్రజలకు అధిపతియైన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుమునీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున దేమనగానీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించి యున్నాను; నేను నిన్ను బాగుచేసెదను; మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు.
2 దినవృత్తాంతములు (17)
6:12 ఇశ్రాయేలీయు లందరు సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను.
6:13 తాను చేయించిన అయిదు మూరల పొడవును అయిదు మూరల వెడల్పును మూడు మూరల యెత్తునుగల యిత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమునందుంచి, దానిమీద నిలిచియుండి, సమాజముగా కూడియున్న ఇశ్రాయేలీయు లందరి యెదుటను మోకాళ్లూని, చేతులు ఆకాశమువైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థనచేసెను.
6:19 దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థనయందును విన్న పమునందును లక్ష్యముంచి, నీ సేవకుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొఱ్ఱను ఆలకించుము.
6:21 నీ సేవకుడును నీ జనులైన ఇశ్రా యేలీయులును ఈ స్థలముతట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలను నీవు ఆలకించుము, ఆకాశముననున్న నీ నివాసస్థలమందు ఆలకించుము, ఆలకించునప్పుడు క్షమించుము.
6:26 వారు నీ దృష్టియెదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియ కున్నప్పుడు, వారు ఈ స్థలముతట్టు తిరిగి ప్రార్థనచేసి నీ నామమును ఒప్పుకొని, నీవు వారిని శ్రమపెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచి పెట్టి తిరిగినయెడల
6:29 ఎవడైనను ఇశ్రా యేలీయులగు నీ జనులందరు కలిసియైనను, నొప్పిగాని కష్టముగాని అనుభవించుచు, ఈ మందిరముతట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నియు ప్రార్థనలన్నియు నీ నివాసస్థలమైన ఆకాశమునుండి నీవు ఆలకించి క్షమించి
6:33 నీ నివాసస్థలమగు ఆకాశమునుండి నీవు వారి ప్రార్థన నంగీకరించి, నీ జనులగు ఇశ్రాయేలీయులు తెలిసికొనినట్లు భూజనులందరును నీ నామమును తెలిసికొని, నీయందుభయభక్తులు కలిగి, నేను కట్టిన యీ మందిరమునకు నీ పేరు పెట్టబడెనని గ్రహించునట్లుగా ఆ యన్యులు నీకు మొఱ్ఱపెట్టిన దానిని నీవు దయచేయుదువు గాక.
6:35 ఆకాశమునుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించుదువుగాక.
6:39 నీ నివాసస్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి, నీ దృష్టియెదుట పాపముచేసిన నీ జనులను క్షమించుదువుగాక.
7:1 సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించి నప్పుడు అగ్ని ఆకాశమునుండి దిగి దహనబలులను ఇతర మైన బలులను దహించెను; యెహోవా తేజస్సు మంది రమునిండ నిండెను,
7:14 నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును.
7:15 ఈ స్థలమందు చేయబడు ప్రార్థనమీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును,
13:14 యూదావారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలిసికొని యెహోవాకు ప్రార్థన చేసిరి, యాజకులును బూరలు ఊదిరి.
20:12 మా దేవా, నీవు వారికి తీర్పుతీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు; ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను.
30:20 యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను.
30:27 అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారిమాటలు వినబడెను; వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను.
33:19 అతడు చేసిన ప్రార్థనను గూర్చియు, అతని మనవి వినబడుటను గూర్చియు, అతడు చేసిన పాపద్రోహములన్నిటిని గూర్చియు, తాను గుణ పడకముందు ఉన్నత స్థలములను కట్టించి దేవతాస్తంభములను చెక్కిన విగ్రహములను అచ్చట నిలుపుటను గూర్చియు, దీర్ఘదర్శులు రచించిన గ్రంథములలో వ్రాయ బడియున్నది.
ఎజ్రా (3)
6:9 మరియు ఆకాశమందలి దేవునికి దహనబలులు అర్పించుటకై కోడెలేగాని గొఱ్ఱపొట్టేళ్లేగాని గొఱ్ఱ పిల్లలేగాని గోధుమలే గాని ఉప్పే గాని ద్రాక్షారసమే గాని నూనెయేగాని, యెరూషలేములో నున్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసనయైన అర్పణలను అర్పించి, రాజును అతని కుమారులును జీవించునట్లు ప్రార్థనచేయు నిమిత్తమై వారు చెప్పినదానినిబట్టి ప్రతిదినమును తప్పకుండ
9:15 యెహోవా ఇశ్రా యేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై యున్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము; మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థనచేసితిని.
10:1 ఎజ్రా యేడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు, పాపమును ఒప్పుకొని ప్రార్థనచేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడివచ్చి బహుగా ఏడ్వగా
నెహెమ్యా (4)
1:6 నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీ కరించుము. నీకు విరోధముగ పాపముచేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి యింటివారును పాపము చేసియున్నాము.
2:4 అప్పుడు రాజుఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్నడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి
4:9 మేము మా దేవునికి ప్రార్థనచేసి, వారి భయముచేత రాత్రింబగళ్లు కావలి యుంచితివిు.
11:17 ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా ప్రార్థన స్తోత్రముల విషయములో ప్రధానుడు; తన సహోదరులలో బక్బుక్యాయును యెదూతూను కుమారుడైన గాలాలునకు పుట్టిన షమ్మూయ కుమారుడైన అబ్దాయును ఈ విషయములో అతని చేతిక్రింది వారు
యోబు (6)
16:16 నాచేత బలాత్కారము జరుగకపోయిననునా ప్రార్థన యథార్థముగా నుండినను
21:15 మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడెవడు? మేము ఆయననుగూర్చి ప్రార్థనచేయుట చేత మాకేమి లాభము కలుగును? అని వారు చెప్పుదురు
22:27 నీవు ఆయనకు ప్రార్థనచేయగాఆయన నీ మనవి నాలకించునునీ మ్రొక్కుబళ్లు నీవు చెల్లించెదవు.
27:10 వాడు సర్వశక్తునియందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా?
42:8 కాబట్టి యేడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసికొని, నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైనయోబు మీ నిమిత్తము ప్రార్థనచేయును. మీ అవివేకమునుబట్టి మిమ్మును శిక్షింపక యుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను; ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్నుగూర్చి యుక్తమైనది పలుక లేదు.
42:10 మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను.
కీర్తనల గ్రంథము (38)
4:1 నా నీతికి ఆధారమగు దేవా, నేను మొఱ్ఱపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము.
5:3 యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందును.
6:9 యెహోవా నా విన్నపము ఆలకించి యున్నాడు యెహోవా నా ప్రార్థన నంగీకరించును.
14:4 యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచుపాపము చేయువారికందరికిని తెలివి లేదా?పాపము చేయువారు బహుగా భయపడుదురు.
17:1 యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొఱ్ఱనంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవులనుండి వచ్చునదికాదు.
18:6 నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను.
20:5 యెహోవా నీ రక్షణనుబట్టి మేము జయోత్సాహము చేయుచున్నాముమా దేవుని నామమునుబట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నియు యెహోవా సఫలపరచునుగాక.
21:2 అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలోనుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు.
32:6 కావున నీ దర్శనకాలమందు భక్తిగలవారందరు నిన్ను ప్రార్థనచేయుదురు. విస్తార జలప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారిమీదికి రావు.
35:13 వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని ఉపవాసముచేత నా ప్రాణమును ఆయాసపరచు కొంటిని అయినను నా ప్రార్థన నా యెదలోనికే తిరిగి వచ్చి యున్నది.
39:12 యెహోవా, నా ప్రార్థన ఆలంకిపుము నా మొఱ్ఱకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనముగానుండకుము నీ దృష్టికి నేను అతిథివంటివాడను నా పితరులందరివలె నేను పరవాసినైయున్నాను
42:8 అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును రాత్రివేళ ఆయననుగూర్చిన కీర్తనయు నా జీవదాతయైన దేవునిగూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును.
53:4 దేవునికి ప్రార్థనచేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివిలేదా?
54:2 దేవా, నా ప్రార్థన ఆలకింపుము నా నోటి మాటలు చెవినిబెట్టుము.
55:1 దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖుడవై యుండకుము.
55:17 సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును
61:1 దేవా, నా మొఱ్ఱ ఆలకింపుము నా ప్రార్థనకు చెవియొగ్గుము
65:2 ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీయొద్దకు వచ్చెదరు
66:20 దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నాయొద్దనుండి తన కృపను తొలగింపలేదు; ఆయన సన్నుతింపబడును గాక.
72:15 అతడు చిరంజీవియగును, షేబ బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయు దురు దినమంతయు అతని పొగడుదురు.
72:20 యెష్షయి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను.
79:6 నిన్నెరుగని అన్యజనులమీదను నీ నామమునుబట్టి ప్రార్థనచేయని రాజ్యములమీదను నీ ఉగ్రతను కుమ్మరించుము.
84:8 యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము యాకోబు దేవా, చెవియొగ్గుము.(సెలా.)
86:6 యెహోవా, నా ప్రార్థనకు చెవి యొగ్గుము నా మనవుల ధ్వని ఆలకింపుము,
88:2 నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక నా మొఱ్ఱకు చెవి యొగ్గుము
88:13 యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును.
99:6 ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి ఆయన నామమునుబట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి కుత్తరమిచ్చెను.
102:1 యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము నా మొఱ్ఱ నీయొద్దకు చేరనిమ్ము.
102:17 ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనవైపు తిరిగియున్నాడు.
109:4 నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నామీద పగ పట్టియున్నారు అయితే నేను మానక ప్రార్థనచేయుచున్నాను.
109:7 వాడు విమర్శలోనికి తేబడునప్పుడు దోషియని తీర్పు నొందును గాక వాని ప్రార్థన పాపమగునుగాక
116:13 రక్షణపాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను.
116:17 నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను, యెహోవా నామమున ప్రార్థనచేసెదను
122:6 యెరూషలేముయొక్క క్షేమముకొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు.
130:2 ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము.
141:2 నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ దృష్టికి అంగీకారములగును గాక.
141:5 నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థనచేయుచున్నాను.
143:1 యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపములకు చెవి యొగ్గుము నీ విశ్వాస్యతనుబట్టియు నీ నీతినిబట్టియు నాకు ఉత్తరమిమ్ము.
సామెతలు (3)
15:8 భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము.
15:29 భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును.
28:9 ధర్మశాస్త్రమువినబడకుండ చెవిని తొలగించుకొనువాని ప్రార్థన హేయము.
యెషయా (9)
1:15 మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి.
16:12 మోయాబీయులు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాస పడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించునప్పుడు వారికేమియు దొరకకపోవును.
19:22 యెహోవా వారిని కొట్టును స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన నంగీకరించి వారిని స్వస్థపరచును.
26:16 యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి నీ శిక్ష వారిమీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి
37:4 జీవముగల దేవుని దూషించు టకై అష్షూరురాజైన తన యజమానునిచేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవాకు వినబడియున్న ఆ మాటలనుబట్టి ఆయన అష్షూరురాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషముకొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము.
37:15 యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థనచేసెను
37:21 అంతట ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెనుఇశ్రాయేలీయుల దేవు డగు యెహోవా సెలవిచ్చునదేమనగా అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా యెదుట ప్రార్థన చేసితివే.
38:5 నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుమునీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చున దేమనగానీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను;
56:7 నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను నా బలిపీఠముమీద వారర్పించు దహనబలులును బలులును నాకు అంగీకారములగును నా మందిరము సమస్తజనులకు ప్రార్థనమందిరమన బడును.
యిర్మియా (9)
7:16 కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థనచేయకుము, వారికొరకు మొఱ్ఱ నైనను ప్రార్థననైనను చేయకుము, నన్ను బతిమాలుకొనకుము, నేను నీ మాట వినను.
11:14 కావున నీవు ఈ ప్రజలనిమిత్తము ప్రార్థనచేయకుము; వారి నిమిత్తము మొఱ్ఱపెట్టకుము ప్రార్థనచేయకుము, వారు తమ కీడును బట్టి నాకు మొఱ్ఱపెట్టునప్పుడు నేను వినను.
14:11 మరియు యెహోవా నాతో ఇట్లనెనువారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము.
29:7 నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణముయొక్క క్షేమముకోరి దానికొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును.
29:12 మీరు నాకు మొఱ్ఱపెట్టుదురేని మీరు నాకు ప్రార్థనచేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును.
32:16 నేరీయా కుమారుడైన బారూకుచేతికి ఆ క్రయ పత్రమును నేనప్పగించిన తరువాత యెహోవాకు ఈలాగున ప్రార్థన చేసితిని
37:3 రాజైన సిద్కియా షెలెమ్యా కుమారుడైన యెహుకలును యాజకుడైన మయశేయా కుమారుడగు జెఫన్యాను ప్రవక్తయైన యిర్మీయా యొద్దకు పంపిదయచేసి మన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుమని మనవిచేసెను.
42:2 మేము ఎంత కొంచెము మంది మిగిలియున్నామో నీవు చూచుచున్నావు గదా? చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి, శేషించియున్న మా యందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థనచేయుము.
42:20 మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తము ప్రార్థనచేసి మన దేవుడైన యెహోవా చెప్పునదంతయు మాకు తెలియ జెప్పినయెడల మేమాలాగు చేయుదుమని చెప్పుచు మిమ్మును మీరే మోసపుచ్చుకొనుచున్నారు.
విలాపవాక్యములు (2)
3:8 నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండ తన చెవి మూసికొని యున్నాడు.
3:44 మా ప్రార్థన నీయొద్ద చేరకుండ నీవు మేఘముచేత నిన్ను కప్పుకొనియున్నావు.
దానియేలు (10)
6:10 ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసికొనినను అతడు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను.
6:11 ఆ మనుష్యులు గుంపుకూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థనచేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి
6:12 రాజు సముఖమునకు వచ్చి శాసనవిషయమును బట్టిరాజా, ముప్పది దినములవరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదు; ఎవడైన చేసినయెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా? అని మనవి చేయగా రాజుమాదీయులయొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిప్రకారము ఆ సంగతి స్థిరము; ఎవరును దాని రద్దుపరచజాలరనెను.
6:13 అందుకు వారుచెరపట్ట బడిన యూదులలోనున్న ఆ దానియేలు, నిన్నేగాని నీవు పుట్టించిన శాసనమునేగాని లక్ష్యపెట్టక, అనుదినము ముమ్మారు ప్రార్థనచేయుచు వచ్చుచున్నాడనిరి.
9:3 అంతట నేను గోనెపట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసికొని ఉపవాసముండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని యెదుట నా మనస్సును నిబ్బరము చేసి కొంటిని.
9:4 నేను నా దేవుడైన యెహోవా యెదుట ప్రార్థనచేసియొప్పుకొన్నదేమనగా ప్రభువా, మాహాత్మ్యము గలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారియెడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకముచేయు వాడా,
9:17 ఇప్పుడైతే మా దేవా, దీనినిబట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి, ప్రభువు చిత్తానుసారముగా శిథిలమై పోయిన నీ పరిశుద్ధ స్థలముమీదికి నీ ముఖప్రకాశము రానిమ్ము.
9:19 ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, యీ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే; నీ ఘనతనుబట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని.
9:20 నేను ఇంక పలుకుచు ప్రార్థనచేయుచు, పవిత్ర పర్వతముకొరకు నా దేవుడైన యెహోవా యెదుట నా పాపమును నా జనముయొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచునుంటిని.
9:21 నేను ఈలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచునుండగా, మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను.
యోవేలు (1)
2:32 యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండమీదను యెరూషలేము లోను తప్పించుకొనినవారుందురు, శేషించినవారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు.
యోనా (1)
2:2 నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవిచేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను; పాతాళగర్భములోనుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన నంగీకరించియున్నావు.
మీకా (1)
7:7 అయినను యెహోవాకొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన నాలకించును.
హబక్కూకు (1)
3:1 ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన. (వాద్యములతో పాడదగినది)
జెఫన్యా (1)
3:10 చెదరిపోయినవారై నాకు ప్రార్థనచేయు నా జనులు కూషుదేశపు నదుల అవతలనుండి నాకు నైవేద్యముగా తీసి కొని రాబడుదురు.
మత్తయి (12)
5:44 నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.
6:5 మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
6:6 నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును.
6:7 మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు;
6:9 కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము
⇔ విధేయత
పాపి మారుమనస్సు పొందుటకు ఆధారములు
రాజులు మొదటి గ్రంథము 21:29
29 అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుటచేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండ ఆపి, అతని కుమారుని కాలమునందు అతని కుటుంబికులమీదికి నేను దాని రప్పించెదను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 12:6-7
6 అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులును రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి.
7 వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమైయీలాగు సెలవిచ్చెనువారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనముచేయక, షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేముమీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసెదను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 33:12-13
12 అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించు కొని.
13 ఆయనకు మొరలిడగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసికొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై యున్నాడని మనష్షే తెలిసికొనెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 34:27
27 నీ మనస్సు మెత్తనిదై యీ స్థలముమీదను దాని కాపురస్థులమీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని.
లూకా వ్రాసిన సువార్త 15:18-24
18 నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి--తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని;
19 ఇకమీదట నీ కుమారుడనని అని పించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదు ననుకొని, లేచి తండ్రియొద్దకు వచ్చెను.
20 వాడింక దూర ముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను.
21 అప్పుడు ఆ కుమారుడు అతనితోతండ్రీ, నేను పరలోక మునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యు డను కాననెను.
22 అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికికట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి;
23 క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము;
24 ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రదికెను, తప్పిపోయి దొరకెనని చెప్పెను; అంతట వారు సంతోషపడసాగిరి.
⇔ విధేయత
రోమీయులకు (5)
5:19 ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడు దురు.
6:16 లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా?
11:30 మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై యుండి, యిప్పుడు వారి అవిధేయతనుబట్టి కరుణింప బడితిరి.
11:32 అందరియెడల కరుణ చూపవలెనని, దేవుడు అందరిని అవిధేయతాస్థితిలో మూసివేసి బంధించియున్నాడు.
16:19 మీ విధేయత అందరికిని ప్రచురమైనది గనుక మిమ్మునుగూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులును, కీడు విషయమై నిష్కపటులునై యుండవలెనని కోరుచున్నాను.
2 కోరింథీయులకు (2)
7:15 మరియు మీరు భయముతోను వణకుతోను తన్ను చేర్చుకొంటిరని అతడు మీయందరి విధేయతను జ్ఞాపకముచేసికొనుచుండగా, అతని అంతఃకరణము మరి యెక్కువగా మీ యెడల ఉన్నది.
10:6 మీరు సంపూర్ణ విధేయతను కనుపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండనచేయ సిద్ధపడి యున్నాము.
ఫిలిప్పీయులకు (1)
2:8 మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందు నంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.
1 తిమోతికి (1)
2:11 స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను.
హెబ్రీయులకు (4)
2:2 ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున, ప్రతి అతి క్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా
4:6 కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించు దురను మాట నిశ్చయము గనుకను, ముందు సువార్త వినినవారు అవిధేయతచేత ప్రవేశింపలేదు గనుకను,
4:11 కాబట్టి అవిధేయతవలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండ ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము.
5:8 ఆయన,కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను.
విద్య
వైద్యుడైన లూకా వ్రాసిన అపోస్తులుల కార్యములు 7:22
22 మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.
సామెతలు 12:23
23 వివేకియైనవాడు తన విద్యను దాచి పెట్టును అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు.
సామెతలు 16:21
21 జ్ఞానహృదయుడు వివేకి యనబడును రుచిగల మాటలు పలుకుటవలన విద్యయెక్కువగును.
సామెతలు 16:23
23 జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును.
యెషయా ప్రవచన గ్రంథము 28:9
9 వాడు ఎవరికి విద్య నేర్పును? ఎవరికి వర్తమానము తెలియ జేయును? తల్లిపాలు విడిచినవారికా? చన్ను విడిచినవారికా?
ప్రవక్తయైన యిర్మియా గ్రంథము 9:20
20 స్త్రీలారా, యెహోవా మాట వినుడిమీరు చెవియొగ్గి ఆయన నోటిమాట ఆలకించుడి, మీ కుమార్తె లకు రోదనము చేయనేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి.
వైద్యుడైన లూకా వ్రాసిన అపోస్తులుల కార్యములు 4:13
13 వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి.
వైద్యుడైన లూకా వ్రాసిన అపోస్తులుల కార్యములు 7:22
22 మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.
పేతురు వ్రాసిన రెండవ పత్రిక 3:16
16 వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు.
నిర్గమకాండము (1)
31:5 సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞానవిద్యా వివేకములును సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి యున్నాను
సంఖ్యాకాండము (1)
24:16 దేవవాక్కులను వినిన వాని వార్త మహాన్నతుని విద్య నెరిగినవాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను.
1 దినవృత్తాంతములు (1)
8:40 ఊలాము కుమారులు విలువిద్యయందు ప్రవీణులైన పరాక్రమశాలులు; వీరికి నూట యేబదిమంది కుమారు లును కుమారుల కుమారులును కలిగిరి; వీరందరును బెన్యా మీనీయులు.
సామెతలు (3)
12:23 వివేకియైనవాడు తన విద్యను దాచి పెట్టును అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు.
16:21 జ్ఞానహృదయుడు వివేకి యనబడును రుచిగల మాటలు పలుకుటవలన విద్యయెక్కువగును.
16:23 జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును.
ప్రసంగి (3)
1:16 యెరూషలేమునందు నాకు ముందున్న వారందరి కంటెను నేను చాల ఎక్కువగా జ్ఞానము సంపాదించితి ననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితి ననియు నా మనస్సులో నేననుకొంటిని.
1:18 విస్తార మైన జ్ఞానాభ్యాసముచేత విస్తారమైన దుఃఖము కలుగును; అధిక విద్య సంపాదించినవానికి అధిక శోకము కలుగును.
12:12 ఇదియు గాక నా కుమారుడా, హితోపదేశములు వినుము; పుస్తక ములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు; విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము.
యెషయా (3)
28:9 వాడు ఎవరికి విద్య నేర్పును? ఎవరికి వర్తమానము తెలియ జేయును? తల్లిపాలు విడిచినవారికా? చన్ను విడిచినవారికా?
44:25 నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయు వాడను సోదెకాండ్రను వెఱ్ఱివారినిగా చేయువాడను జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే.
47:10 నీ చెడుతనమును నీవు ఆధారము చేసికొని యెవడును నన్ను చూడడని అనుకొంటివి నేనున్నాను నేను తప్ప మరి ఎవరును లేరని నీవను కొనునట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను.
యిర్మియా (1)
9:20 స్త్రీలారా, యెహోవా మాట వినుడి మీరు చెవియొగ్గి ఆయన నోటిమాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయనేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి.
దానియేలు (10)
1:3 రాజు అష్పెనజు అను తన నపుంసకుల యధిపతిని పిలిపించి అతనికీలాగు ఆజ్ఞాపించెను ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై, లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును గలిగి,
1:4 తత్వజ్ఞానము తెలిసినవారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి, కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము.
1:20 రాజు వీరియొద్ద విచారణ చేయగా జ్ఞానవివేకముల సంబంధ మైన ప్రతివిషయములో వీరు తన రాజ్యమందంతటనుండు శకునగాండ్రకంటెను గారడీవిద్య గలవారందరికంటెను పది యంతలు శ్రేష్ఠులని తెలియబడెను.
2:2 కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను గారడీవిద్యగలవారిని మాంత్రికులను కల్దీయులను పిలువ నంపుడని యాజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖ మున నిలచిరి.
2:10 అందుకు కల్దీయులు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చిరి -భూమిమీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, ఏ చక్రవర్తియు అధికారియు శకునగానియొద్దను గారడీవిద్య గలవానియొద్దను కల్దీయునియొద్దను ఇట్టి సంగతి విచారింప లేదు.
2:27 దానియేలు రాజుసముఖములో ఈలాగు ప్రత్యుత్తర మిచ్చెను రాజడిగిన యీ మర్మము జ్ఞానులైనను గారడీవిద్య గలవారైనను శకున గాండ్రయినను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు.
4:7 శకున గాండ్రును గారడీవిద్యగలవారును కల్దీయులును జ్యోతిష్యులును నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావమును నాకు తెలుపలేక పోయిరి.
5:7 రాజు గారడీ విద్యగల వారిని కల్దీయులను జ్యోతిష్యులను పిలువనంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి, బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను- ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పువాడెవడో వాడు ఊదా రంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడినవాడై రాజ్యములో మూడవ యధిపతిగా ఏలును.
5:11 నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు; నీ తండ్రికాలములో అతడు దైవజ్ఞానమువంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై యుండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రియైన రాజగు నెబుకద్నెజరు శకున గాండ్రకును గారడీవిద్యగల వారికిని కల్దీయులకును జ్యోతిష్యులకును పై యధిపతిగా అతని నియమించెను.
5:15 ఈ వ్రాత చదివి దాని భావము తెలియజెప్పవలెనని జ్ఞానులను గారడీవిద్యగల వారిని పిలిపించితిని గాని వారు ఈ సంగతియొక్క భావమును తెలుపలేక పోయిరి.
అపో. కార్యములు (4)
4:13 వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి.
7:22 మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.
19:19 మరియు మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరియెదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల యేబదివేల వెండి రూకలాయెను.
26:24 అతడు ఈలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు- పౌలా, నీవు వెఱ్ఱివాడవు, అతి విద్యవలన నీకు వెఱ్ఱిపట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను.
2 పేతురు (1)
3:16 వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు.
⇔ ప్రార్థన
నీవు ప్రార్థన చేయునప్పుడు
మత్తయి వ్రాసిన సువార్త 6:4-15
4 అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును
5 మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
6 నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును.
7 మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు;
8 మీరు వారివలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలి యును
9 కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, పర లోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక,
10 నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక,
11 మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.
12 మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.
13 మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి1 మమ్మును తప్పించుము.
14 మనుష్యుల అప రాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును
15 మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.
ఆకాశపక్షులను చూడుడి
మత్తయి వ్రాసిన సువార్త 6:26-29
26 ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?
27 మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?
28 వస్త్రములను గూర్చి మీరు చింతింప నేల? అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలో చించుడి. అవి కష్టపడవు, ఒడకవు
29 అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు.
అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును
మత్తయి వ్రాసిన సువార్త 7:7-12
7 అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును,ఒ తట్టుడి మీకు తీయబడును.
8 అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయ బడును.
9 మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినయెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగినయెడల పామునిచ్చునా?
10 మీరు చెడ్డ వారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్య నెరిగి యుండగా
11 పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును.
12 కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉప దేశము నైయున్నది.
నీ కంటిలో దూలముండగా
మత్తయి వ్రాసిన సువార్త 7:3-5
3 నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల?
4 నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచినీకంటిలో నున్న నలుసును తీసి వేయనిమ్మని చెప్ప నేల?
5 వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కన బడును.
నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక
వైద్యుడైన లూకా వ్రాసిన సువార్త 6:41-42
41 నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేల?
42 నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితోసహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయ నిమ్మని నీవేలాగు చెప్ప గలవు? వేషధారీ, మొదట నీ కంటిలో ఉన్న దూల మును తీసివేయుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.
పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి
మత్తయి వ్రాసిన సువార్త 7:6
6 పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులయెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీమీద పడి మిమ్మును చీల్చి వేయును.
ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను
మత్తయి సువార్త 3:16-17
16. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను.
17. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనానందించు చున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
మార్కు సువార్త 1:9-11
9. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతునుండి వచ్చి యొర్దానులో యోహానుచేత బాప్తిస్మము పొందెను.
10. వెంటనే ఆయన నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూచెను.
11. మరియు నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
లూకా సువార్త 3:21-22
21. ప్రజలందరును బాప్తిస్మము పొందినప్పుడు యేసుకూడ బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి
22. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఆయనమీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
యోహాను సువార్త 1:32-34
32. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని; ఆ ఆత్మ ఆయనమీద నిలిచెను.
33. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలొ బాప్తిస్మ మిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవనిమీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మ మిచ్చువాడని నాతో చెప్పెను.
34. ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చి తిననెను.
మత్తయి సువార్త 17:5
5. అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక మేఘము వారిని కమ్ముకొనెను; ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను.
మార్కు సువార్త 9:7-8
7. మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను.
8. వెంటనే వారు చుట్టు చూచినప్పుడు, తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు.
పేతురు వ్రాసిన రెండవ పత్రిక 1:17-18
17. ఆయన మహాత్మ్యమును మేము కన్నులార చూచినవారమై తెలిపితివిు. ఈయన నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్యమహిమనుండి ఆయనయొద్దకు వచ్చి నప్పుడు, తండ్రియైన దేవునివలన ఘనతయు మహిమయు ఆయన పొందగా
18. మేము ఆ పరిశుద్ధ పర్వతముమీద ఆయనతోకూడ ఉండిన వారమై, ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి.
లూకా సువార్త 9:35-36
35. మరియు ఈయన నే నేర్పరచుకొనిన నా కుమారుడు,ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను.
36. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికిని తెలియ జేయక వారు ఊరకుండిరి.
తండ్రియైన దేవుని తలంచుకొనుచు(పాత నిబంధనలోని పాఠము చదువవలెను)
మోషే లిఖించిన చతుర్థి గ్రంథము
సంఖ్యాకాండము 10:8-10
8 అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను; నిత్య మైన కట్టడనుబట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును.
9 మిమ్మును బాధించు శత్రువులకు విరోధ ముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్లునప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను అప్పుడు మీ దేవు డైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువులనుండి రక్షింపబడుదురు.
10 మరియు ఉత్సవ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభ ములయందును మీరు దహనబలులనుగాని సమాధానబలు లనుగాని అర్పించునప్పుడు ఆ బూరలు ఊదవలెను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడైన యెహోవాను నేనే.
మోషే లిఖించిన చతుర్థి గ్రంథము
సంఖ్యాకాండము 10:1-5
1 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనునీవు రెండు వెండి బూరలు చేయించుకొనుము;
2 నకిషిపనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తర్లించుటకును నీకుండవలెను.
3 ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునెదుట నీ యొద్దకు కూడి రావలెను.
4 వారు ఒకటే ఊదినయెడల ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీయొద్దకు కూడి రావలెను.
5 మీరు ఆర్భాటముగా ఊదునప్పుడు తూర్పుదిక్కున దిగి యున్న సైన్యములు సాగవలెను.
మోషే లిఖించిన మొదటి గ్రంధమ ఆదికాండము 27:28-29
28 ఆకాశపుమంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీ కనుగ్రహించుగాక
29 జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధుజనులకు నీవు ఏలికవై యుండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక
సామెతలు 16:20-25
20 ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలునొందును యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు.
21 జ్ఞానహృదయుడు వివేకి యనబడును రుచిగల మాటలు పలుకుటవలన విద్యయెక్కువగును
22 తెలివిగలవానికి వాని తెలివి జీవపు ఊట మూఢులకు వారి మూఢత్వమే శిక్ష
23 జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును.
24 ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్య కరమైనవి.
25 ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును.
మోషే లిఖించిన మొదటి గ్రంధమ ఆదికాండము
ఆదికాండము 12:1-4
1 యెహోవానీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.
2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామ మును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.
3 నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశ ములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా
4 యెహోవా అతనితో చెప్పినప్రకారము అబ్రాము వెళ్లెను. లోతు అతనితో కూడ వెళ్లెను. అబ్రాము హారానునుండి బయలుదేరినప్పుడు డెబ్బదియైదేండ్ల యీడు గలవాడు.
యెషయా ప్రవచన గ్రంథము 41:8-11
8 నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేనేర్పరచుకొనిన యాకోబూ,నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా,
9 భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా,
10 నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం దును.
11 నీమీద కోపపడినవారందరు సిగ్గుపడి విస్మయ మొందె దరు నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు
మోషే లిఖించిన మొదటి గ్రంధమ ఆదికాండము
ఆదికాండము 14:19-20
19 అప్పు డతడు అబ్రామును ఆశీర్వదించిఆకాశమునకు భూమి కిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవునివలన అబ్రాము ఆశీర్వ దింపబడునుగాక అనియు,
20 నీ శత్రు వులను నీ చేతి కప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్ని టిలో ఇతనికి పదియవవంతు ఇచ్చెను.
దావీదు కీర్తనలు 23:1-6
1 యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.
2 పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడుశాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు.
3 నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించు చున్నాడు.
4 గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనునీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును.
5 నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధ పరచుదువునూనెతో నా తల అంటియున్నావునా గిన్నె నిండి పొర్లుచున్నది.
6 నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చునుచిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను.
కుమారుడైన తండ్రిని తలంచుకొనుచు ( సువార్తలలోని పాఠము చదువవలెను)
మార్కు వ్రాసిన సువార్త 11:9-11
9 మరియు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండిన వారును జయము
10 ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక వచ్చుచున్న మన తండ్రియైన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము1 అని కేకలు వేయుచుండిరి.
11 ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి, చుట్టు సమస్తమును చూచి, సాయంకాల మైనందున పండ్రెండుమందితో కూడ బేతనియకు వెళ్లెను.
మత్తయి వ్రాసిన సువార్త 12:18-21
18 ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొంటిని ఈయన నా ప్రాణమున కిష్టుడైన నా ప్రియుడు ఈయనమీద నా ఆత్మ నుంచెదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును.
19 ఈయన జగడమాడడు, కేకలువేయడు వీధులలో ఈయన శబ్దమెవనికిని వినబడదు
20 విజయమొందుటకు న్యాయవిధిని ప్రబలము చేయువరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు
21 ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అను
మత్తయి వ్రాసిన సువార్త 19:16-19
16 ఇదిగో ఒకడు ఆయనయొద్దకు వచ్చిబోధకుడా, నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయ వలెనని ఆయనను అడిగెను.
17 అందుకాయనమంచి కార్యమునుగూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచి వాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరినయెడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగ
18 యేసునరహత్య చేయవద్దు, వ్యభిచరింప వద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తలిదండ్రు లను సన్మానింపుము,
19 నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పెను.
మత్తయి వ్రాసిన సువార్త 7:7-12
7 అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును,ఒ తట్టుడి మీకు తీయబడును.
8 అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయ బడును.
9 మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినయెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగినయెడల పామునిచ్చునా?
10 మీరు చెడ్డ వారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్య నెరిగి యుండగా 11 పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును.
12 కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉప దేశము నైయున్నది.
యోహాను వ్రాసిన సువార్త 14:5-7
5 అందుకు తోమా ప్రభువా, యెక్కడికి వెళ్లుచున్నావో మాకు తెలియదే; ఆ మార్గమేలాగు తెలియునని ఆయన నడుగగా
6 యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.
7 మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు; ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పెను.
మత్తయి వ్రాసిన సువార్త 5:1-10
1 ఆయన ఆ జనసమూహములను చూచి కొండయెక్కి కూర్చుండగా ఆయన శిష్యు లాయనయొద్దకు వచ్చిరి.
2 అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను
3 ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.
4 దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.
5 సాత్వికులు ధన్యులు ; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.
6 నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారుతృప్తిపరచబడుదురు.
7 కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.
8 హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.
9 సమాధానపరచువారు ధన్యులు ; వారు దేవుని కుమారులనబడుదురు.
10 నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.
పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనుచు ( పత్రికలోని పాఠము చదువవలెను)
అపోస్తులుడైన పౌలు
కొలొస్సయులకు వ్రాసిన పత్రిక 3:16-17
16 సంగీత ములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపా సహి తముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానము చేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.
17 మరియు మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి.
అపోస్తులుడైన పౌలు
కొలొస్సయులకు వ్రాసిన పత్రిక 3:18-24
18 భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండుడి; ఇది ప్రభువునుబట్టి యుక్తమైయున్నది.
19 భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి.
20 పిల్లలారా, అన్ని విషయములలో మీ తలిదండ్రుల మాట వినుడి; ఇది ప్రభువునుబట్టి మెచ్చుకొనతగినది.
21 తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి.
22 దాసులారా, మనుష్యులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలెనని కాక, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణగలవారై, శరీరమునుబట్టి మీ యజమానులైనవారికి అన్ని విషయములలో విధేయులై యుండుడి.
23 ప్రభువువలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని యెరుగుదురు గనుక,
24 మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మన స్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై యున్నారు.
యాకోబు వ్రాసిన పత్రిక 1:5-6
5 మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్ర హింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.
6 అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును.
యాకోబు వ్రాసిన పత్రిక 5:13-16
13 మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా? అతడు ప్రార్థనచేయవలెను; ఎవనికైనను సంతోషము కలిగెనా? అతడు కీర్తనలు పాడవలెను.
14 మీలో ఎవడైనను రోగియై యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతనికొరకు ప్రార్థనచేయవలెను.
15 విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును.
16 మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును.
పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2:6-7
6 ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులొ స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడియున్నది.
7 విశ్వ సించుచున్న మీకు, ఆయన అమూల్యమైనవాడు; విశ్వ సింపనివారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను. మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను.
8 కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి.
అపోస్తులుడైన పౌలు
ఫిలేమోనుకు వ్రాసిన పత్రిక 1:4-7
4 నీ ప్రేమనుగూర్చియు, ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధులయెడలను నీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు నేను విని
5 నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనముచేయుచు, ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు,
6 క్రీస్తునుబట్టి మీయందున్న ప్రతి శ్రేష్ఠమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుటవలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను.
7 సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమనుబట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను.
యాకోబు వ్రాసిన పత్రిక 5:13-16
13 మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా? అతడు ప్రార్థనచేయవలెను; ఎవనికైనను సంతోషము కలిగెనా? అతడు కీర్తనలు పాడవలెను.
14 మీలో ఎవడైనను రోగియై యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతనికొరకు ప్రార్థనచేయవలెను.
15 విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును.
16 మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లుబ ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును.
యోహోను వ్రాసిన ప్రకటన గ్రంథము
ప్రకటన గ్రంథము 1:4-7
4 యోహాను ఆసియలో ఉన్న యేడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూతభవిష్య త్కాలములలో ఉన్నవానినుండియు, ఆయన సింహా సనము ఎదుటనున్న యేడు ఆత్మలనుండియు,
5 నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక.
6 మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావ మును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.
7 ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్.
అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 1:5-10
5 క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనయందు మీరు ప్రతి విషయములోను,
6 అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్య వంతులైతిరి;
7 గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు.
8 మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై యుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపర చును.
9 మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు.
10 సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాట లాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సు తోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండ వలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.
అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక 4:1-8
1 దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా
2 వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయ మందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము.
3 ఎందుకనగా జనులు హితబోధను6 సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అను కూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని,
4 సత్యమునకు చెవినియ్యక కల్పనాకథలవైపునకు తిరుగుకాలము వచ్చును.
5 అయితే నీవు అన్నివిషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము.
6 నేనిప్పుడే పానార్పణముగ పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై యున్నది.
7 మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.
8 ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధి పతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్ర హించును.
శాఖమూరు వాక్యం చదివేవారు
I. సజీవరావు గారు , G. ఎలియాజరు గారు , G. సువార్త రాజు గారు , l. ప్రేమచందు గారు , G. వరప్రసాద్ గారు , G. కృష్ఠ ఫర్ గారు , G. దాసు బాబు గారు.
G. ప్రేమ కుమారి గారు , G. రోజా కుమారి గారు , K.మార్తమ్మ గారు , E. రత్న సలోమి గారు , I. మహిమ రాజ్యం గారు , K. మేరీ కుమారి గారు , G. కవిత గారు , G. శిరీష గారు , G. జ్యోతి గారు , G. సుకన్య గారు , J. శ్రీలత గారు , J. మౌనిక గారు , G . శారమ్మ గారు .
మందడం వాక్యం చదివేవారు T. పౌలు రాజు గారు , A. సెల్వరాజ్ గారు , B. మోతిలాల్ గారు , P. సుగుణ రావు గారు , T. సూరిబాబు గారు , T. సుబ్బారావు గారు , K. యోహాను గారు , Y. సురేష్ గారు . B. నిర్మల గారు , P. రూతు గారు , K. రమాదేవి గారు , B. అన్నామణి గారు , Y. సిలువమ్మ గారు , K. ఎమేల్యేమ్మ గారు , Y. కోటేశ్వరి గారు .
K. అనూష గారు, A.సువర్ణ గారు, T.రాకడ మేరీ గారు, లక్ష్మి గారు, Y.కోటేశ్వరి గారు.
వెలగపూడి వాక్యం చదివేవారు విజయ్ కుమార్ గారు , శుభాకర్ గారు , రవీంద్ర నాద్ గారు , జ్యోతి గారు , స్వప్న గారు , శ్రీలక్ష్మి గారు , రోజ్ మేరీ గారు.
M.పూర్ణచంద్రరావు గారు, M.జయశీల గారు, M.త్రిపుర నాద్ గారు, M.ప్రసన్న గారు,
M.సంపూర్ణ గారు, M.చంద్రమోళి గారు, M.త్రినాద్ గారు, M.ఝాన్సీ గారు, M.మహిమ గారు, M.చరిష్మా గారు.
తాళ్ళయి పాలెం వాక్యం చదివేవారు
భారతమ్మ గారు, సుప్రియ గారు, శేఖర్ గారు, సోను బాబు గారు, రాజారావు గారు , సుశీలమ్మ గారు , సీతారామయ్య గారు, దేవమ్మ గారు , నెహెమ్యా గారు , సునీత గారు, చంద్రిక గారు , రామ గారు , ప్రణతి గారు , సుధారాణి గారు , సుధాకర్ గారు , సిరి గారు , వికాస్ గారు , తిరుపతి గారు , చిన్న కవిత గారు , సహస్ర గారు .
భారతి గారు, అన్న గారు, సీయోను కుమారి గారు, అనురాధ గారు.
రండి యుత్సాహించి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే
1. రండి కృతజ్ఞత స్తోత్రముతో
రారాజు సన్నిధికేగుదము
సత్ప్రభు నామము కీర్తనలన్
సంతోషగానము చేయుదము ||రండి||
2. మన ప్రభువే మహాదేవుండు
ఘన మహాత్మ్యముగల రాజు
భూమ్యాగాధపు లోయలును
భూధర శిఖరము లాయనవే ||రండి||
3. సముద్రము సృస్టించె నాయనదే
సత్యుని హస్తమే భువిన్ జేసెన్
ఆయన దైవము పాలితుల
మాయన మేపెడి గొఱ్ఱెలము ||రండి||
4. ఆ ప్రభు సన్నిధిన్ మోకరించి
ఆయన ముందర మ్రొక్కుదము
ఆయన మాటల గైకొనిన
నయ్యవి మనకెంతో మేలగును||రండి||
5. తండ్రి కుమార శుద్ధాత్మకును
దగు స్తుతి మహిమలు కల్గుగాక
ఆదిని నిప్పుడు నెల్లప్పుడు - నయినట్లు
యుగములనౌను ఆమెన్ ||రండి||
1. నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు?
1. My God, My God, why hast Thou forsaken Me? Why art Thou so far from helping Me, and from the words of My groaning?
34. మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము.
34. And at the ninth hour Jesus cried out with a loud voice, saying, "Eloi, Eloi, lama sabachthani?" which is, being interpreted, "My God, My God, why hast Thou forsaken Me?"
15. నా బలము యెండిపోయి చిల్లపెంకువలె ఆయెను నా నాలుక నా దౌడను అంటుకొని యున్నదినీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి యున్నావు.
15. My strength is dried up like a potsherd, and My tongue cleaveth to My jaws; and Thou hast brought Me into the dust of death.
28. అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లునేను దప్పిగొను చున్నాననెను.
28. After this Jesus, knowing that all things were now accomplished, that the Scripture might be fulfilled, said, "I thirst."
31. వారు వచ్చిఆయన దీని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురుఆయన నీతిని వారికి ప్రచురపరతురు.
31. They shall come and shall declare His righteousness unto a people that shall be born, that He hath done this.
30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను.
30. When Jesus therefore had received the vinegar, He said, "It is finished." And He bowed His head and gave up the ghost.
5. నా ఆత్మను నీ చేతికప్పగించుచున్నాను యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే.
5. Into Thine hand I commit my spirit; Thou hast redeemed me, O LORD God of truth.
46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి -తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను.
46. And when Jesus had cried out with a loud voice, He said, "Father, into Thy hands I commend My spirit." And having said thus, He gave up the ghost.
నిర్గమకాండము 20:12
12. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
12. "Honor thy father and thy mother, that thy days may be long upon the land which the LORD thy God giveth thee.
రండి యుత్సాహించి పాడుదము
రండి యుత్సాహించి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే
1. రండి కృతజ్ఞత స్తోత్రముతో
రారాజు సన్నిధికేగుదము
సత్ప్రభు నామము కీర్తనలన్
సంతోషగానము చేయుదము ||రండి||
2. మన ప్రభువే మహాదేవుండు
ఘన మహాత్మ్యముగల రాజు
భూమ్యాగాధపు లోయలును
భూధర శిఖరము లాయనవే ||రండి||
3. సముద్రము సృస్టించె నాయనదే
సత్యుని హస్తమే భువిన్ జేసెన్
ఆయన దైవము పాలితుల
మాయన మేపెడి గొఱ్ఱెలము ||రండి||
4. ఆ ప్రభు సన్నిధిన్ మోకరించి
ఆయన ముందర మ్రొక్కుదము
ఆయన మాటల గైకొనిన
నయ్యవి మనకెంతో మేలగును||రండి||
5. తండ్రి కుమార శుద్ధాత్మకును
దగు స్తుతి మహిమలు కల్గుగాక
ఆదిని నిప్పుడు నెల్లప్పుడు - నయినట్లు
యుగములనౌను ఆమెన్ ||రండి||
మార్గము చూపుము ఇంటికి
1.మార్గము చూపుము ఇంటికి నా తండ్రి యింటికి
మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి(2)
2.పాప మమతలచేత పారిపోయిన నాకు ప్రాప్తించెక్షామము
పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమగోరుచు పంపుము క్షేమము
ప్రభు నీదు సిలువముఖము చెల్లనినాకు పుట్టించే ధైర్యము ||మా||
3.ధనమే సర్వంబనుచు సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి
ధరణీభోగములెల్ల బ్రతుకు ధ్వంసముజేయ దేహి నినుచేరితి
దేహి అని నీవైపు చేతులెత్తిననాకు దారినిజూపుము ||మా||
4.దూరదేశములోన బాగుండుననుకొనుచు తప్పితి మార్గము
తరలిపోయిరి నేను నమ్మినహితులెల్ల తరిమే దారిద్ర్యము
దాక్షిణ్యమూర్తి నీదయ నాపై కురిపించి ధన్యుని జేయుము ||మా||
5.అమ్ముకొంటిని నేను అధముడొకనికి నాడు ఆకలిబాధలో
అన్యాయమయిపోయె పందులు సహవెలివేయ అలవడెను వేదన
అడుగంటె అవినీతి మేల్కొనియె మానవత ఆశ్రయము గూర్చుము ||మా||
6.కొడుకునే కాదనుచు గృహమే చెరసాలను కోపించి వెళ్ళితి
కూలివీనిగనైన నీ యింట పనిచేసి కనికరమే కోరుదు
కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు క్షమియించు బ్రోవుము ||మా||
7.నా తండ్రి ననుజూచి పరుగిడుచు ఏ తెంచి నాపై బడి ఏడ్చెను
నవజీవమును కూర్చి యింటికి తోడ్కొనివెళ్ళి నన్ను దీవించెను
నా జీవిత కథయంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై యుండును ||మా||
మార్గము చూపుము ఇంటికి
1.మార్గము చూపుము ఇంటికి నా తండ్రి యింటికి
మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి(2)
2.పాప మమతలచేత పారిపోయిన నాకు ప్రాప్తించెక్షామము
పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమగోరుచు పంపుము క్షేమము
ప్రభు నీదు సిలువముఖము చెల్లనినాకు పుట్టించే ధైర్యము ||మా||
3.ధనమే సర్వంబనుచు సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి
ధరణీభోగములెల్ల బ్రతుకు ధ్వంసముజేయ దేహి నినుచేరితి
దేహి అని నీవైపు చేతులెత్తిననాకు దారినిజూపుము ||మా||
4.దూరదేశములోన బాగుండుననుకొనుచు తప్పితి మార్గము
తరలిపోయిరి నేను నమ్మినహితులెల్ల తరిమే దారిద్ర్యము
దాక్షిణ్యమూర్తి నీదయ నాపై కురిపించి ధన్యుని జేయుము ||మా||
5.అమ్ముకొంటిని నేను అధముడొకనికి నాడు ఆకలిబాధలో
అన్యాయమయిపోయె పందులు సహవెలివేయ అలవడెను వేదన
అడుగంటె అవినీతి మేల్కొనియె మానవత ఆశ్రయము గూర్చుము ||మా||
6.కొడుకునే కాదనుచు గృహమే చెరసాలను కోపించి వెళ్ళితి
కూలివీనిగనైన నీ యింట పనిచేసి కనికరమే కోరుదు
కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు క్షమియించు బ్రోవుము ||మా||
7.నా తండ్రి ననుజూచి పరుగిడుచు ఏ తెంచి నాపై బడి ఏడ్చెను
నవజీవమును కూర్చి యింటికి తోడ్కొనివెళ్ళి నన్ను దీవించెను
నా జీవిత కథయంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై యుండును ||మా||
రండి యుత్సాహించి పాడుదము
రండి యుత్సాహించి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే
1. రండి కృతజ్ఞత స్తోత్రముతో
రారాజు సన్నిధికేగుదము
సత్ప్రభు నామము కీర్తనలన్
సంతోషగానము చేయుదము ||రండి||
2. మన ప్రభువే మహాదేవుండు
ఘన మహాత్మ్యముగల రాజు
భూమ్యాగాధపు లోయలును
భూధర శిఖరము లాయనవే ||రండి||
3. సముద్రము సృస్టించె నాయనదే
సత్యుని హస్తమే భువిన్ జేసెన్
ఆయన దైవము పాలితుల
మాయన మేపెడి గొఱ్ఱెలము ||రండి||
4. ఆ ప్రభు సన్నిధిన్ మోకరించి
ఆయన ముందర మ్రొక్కుదము
ఆయన మాటల గైకొనిన
నయ్యవి మనకెంతో మేలగును||రండి||
5. తండ్రి కుమార శుద్ధాత్మకును
దగు స్తుతి మహిమలు కల్గుగాక
ఆదిని నిప్పుడు నెల్లప్పుడు - నయినట్లు
యుగములనౌను ఆమెన్ ||రండి||
గీతం గీతం
గీతం గీతం జయ జయ గీతం
చేయి తట్టి పాడెదము (2)
యేసు రాజు లేచెను హల్లెలూయ
జయ మార్భటించెదము (2) || గీతం||
1. చూడు సమాధిని మూసినరాయి
దొరలింపబడెను
అందు వేసిన ముద్ర కావలి నిల్చెను
దైవ సుతుని ముందు || గీతం||
2. వలదు వలదు యేడువవలదు
వెళ్ళుడి గాలిలయకు
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను
పరుగిడి ప్రకటించుడి || గీతం||
3. అన్న కాయప వారల సభయు
అదరుచు పరుగిడిరి
ఇంక దూత గణముల ధ్వనిని వినుచు
వణకుచు భయపడిరి || గీతం||
4. గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి
జయ వీరుడు రాగా
మీ మేళతాళ వాద్యముల్ బూర
లెత్తి ధ్వనించుడి || గీతం||
గీతం గీతం
గీతం గీతం జయ జయ గీతం
చేయి తట్టి పాడెదము (2)
యేసు రాజు లేచెను హల్లెలూయ
జయ మార్భటించెదము (2) || గీతం||
1. చూడు సమాధిని మూసినరాయి
దొరలింపబడెను
అందు వేసిన ముద్ర కావలి నిల్చెను
దైవ సుతుని ముందు || గీతం||
2. వలదు వలదు యేడువవలదు
వెళ్ళుడి గాలిలయకు
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను
పరుగిడి ప్రకటించుడి || గీతం||
3. అన్న కాయప వారల సభయు
అదరుచు పరుగిడిరి
ఇంక దూత గణముల ధ్వనిని వినుచు
వణకుచు భయపడిరి || గీతం||
4. గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి
జయ వీరుడు రాగా
మీ మేళతాళ వాద్యముల్ బూర
లెత్తి ధ్వనించుడి || గీతం||
జయ జయ యేసు
జయ జయ యేసు -జయ యేసు – జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు
జయ జయ రాజా జయ రాజా – జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం
1. మరణము గెల్చిన -జయ యేసు – మరణము ఓడెను జయ యేసు
పరమ బలమొసగు – జయ యేసు- శరణం నీవె జయ యేసు || జయ ||
2. సమాధి గెల్చిన జయ యేసు- సమాధి ఓడెను జయ యేసు
మరణము గెల్చిన జయ యేసు – అమర మూర్తివి జయ యేసు || జయ ||
3. బండను గెల్చిన జయ యేసు – బండయు ఓడెను జయ యేసు
బండలు దీయుము -జయ యేసు – అండకు జేర్చుము జయ యేసు || జయ ||
4. ముద్రను గెల్చిన -జయ యేసు- ముద్రయు ఓడెను జయ యేసు
ముద్రను దీయుము-జయ యేసు – ముద్రించుము నను జయ యేసు || జయ ||
5. కావలి గెల్చిన- జయ యేసు- కావలి ఓడెను జయ యేసు
సేవలో బలము-జయ యేసు – జీవము నీవె-జయ యేసు || జయ ||
6. సాతానును గెల్చిన-జయ యేసు – సాతాను ఓడెను జయ యేసు
పాతవి గతించె -జయ యేసు- దాతవు నీవే -జయ యేసు
|| జయ ||
జయ జయ యేసు
జయ జయ యేసు -జయ యేసు – జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు
జయ జయ రాజా జయ రాజా – జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం
1. మరణము గెల్చిన -జయ యేసు – మరణము ఓడెను జయ యేసు
పరమ బలమొసగు – జయ యేసు- శరణం నీవె జయ యేసు || జయ ||
2. సమాధి గెల్చిన జయ యేసు- సమాధి ఓడెను జయ యేసు
మరణము గెల్చిన జయ యేసు – అమర మూర్తివి జయ యేసు || జయ ||
3. బండను గెల్చిన జయ యేసు – బండయు ఓడెను జయ యేసు
బండలు దీయుము -జయ యేసు – అండకు జేర్చుము జయ యేసు || జయ ||
4. ముద్రను గెల్చిన -జయ యేసు- ముద్రయు ఓడెను జయ యేసు
ముద్రను దీయుము-జయ యేసు – ముద్రించుము నను జయ యేసు || జయ ||
5. కావలి గెల్చిన- జయ యేసు- కావలి ఓడెను జయ యేసు
సేవలో బలము-జయ యేసు – జీవము నీవె-జయ యేసు || జయ ||
6. సాతానును గెల్చిన-జయ యేసు – సాతాను ఓడెను జయ యేసు
పాతవి గతించె -జయ యేసు- దాతవు నీవే -జయ యేసు
|| జయ ||
నిదురించే గగనంలో
నిదురించే గగనంలో - నవ్వే నక్షత్రం
శోక తప్త శిశిరంలో - వెలిగే వసంతం
జో-జో--లాలి-జో-జో- జో-జో--లాలి-జో-జో-- || 2సార్లు ||
1. మరియ పేగు తెంచుకొచ్చి- మనిషి వైతివో .....
ఆత్మశక్తి నింపుకొచ్చి-దైవమైతివో.....
శిలువ ఊయల మీద-నీకు జోల పాడనా
లోకమాత కంటనీట-నీకు లాలపోయనా
జో-జో--లాలి-జో-జో- జో-జో--లాలి-జో-జో-- || 2సార్లు ||
2. కాలనాగు పడగ మీద- పారాడే పాపవో--
కోరి కోరి మరణ ఛాయ-కప్పు కొన్నావో
శిలువ ఊయల మీద-నీకు జోల పాడనా
లోక మాత కంట నీట-నీకు లాలపోయనా
జో-జో--లాలి-జో-జో- జో-జో--లాలి-జో-జో--
|| 2సార్లు ||
నిదురించే గగనంలో
నిదురించే గగనంలో - నవ్వే నక్షత్రం
శోక తప్త శిశిరంలో - వెలిగే వసంతం
జో-జో--లాలి-జో-జో- జో-జో--లాలి-జో-జో-- || 2సార్లు ||
1. మరియ పేగు తెంచుకొచ్చి- మనిషి వైతివో .....
ఆత్మశక్తి నింపుకొచ్చి-దైవమైతివో.....
శిలువ ఊయల మీద-నీకు జోల పాడనా
లోకమాత కంటనీట-నీకు లాలపోయనా
జో-జో--లాలి-జో-జో- జో-జో--లాలి-జో-జో-- || 2సార్లు ||
2. కాలనాగు పడగ మీద- పారాడే పాపవో--
కోరి కోరి మరణ ఛాయ-కప్పు కొన్నావో
శిలువ ఊయల మీద-నీకు జోల పాడనా
లోక మాత కంట నీట-నీకు లాలపోయనా
జో-జో--లాలి-జో-జో- జో-జో--లాలి-జో-జో--
|| 2సార్లు ||
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి
జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా
ఆ ఆ చల్లగ చూడుమయ్యా
పనికిరాని పాత్రనని – పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా (2)
సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండ
సాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రి
ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి||
విలువలేని పాత్రను నేను – కొనువారు లేరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో – వెలుగొందు పాత్రగజేసి (2)
ఆటంకములనుండి తప్పించి నన్ను – ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను – సరిచేసి వాడుమయ్య
ఆ ఆ సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి||
లోకాశతో మార్గం నిండి ఉప్పొంగుచూ –బు నే దప్పితిన్
మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే – మనశ్శాంతి కోల్పోతిని (2)
పోగొట్టుకున్న పాత్రయనుచు – పరుగెత్తి నను పట్టితివి
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే – నీ పాదంబుల్ పట్టితిన్
ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి
జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా
ఆ ఆ చల్లగ చూడుమయ్యా
పనికిరాని పాత్రనని – పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా (2)
సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండ
సాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రి
ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి||
విలువలేని పాత్రను నేను – కొనువారు లేరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో – వెలుగొందు పాత్రగజేసి (2)
ఆటంకములనుండి తప్పించి నన్ను – ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను – సరిచేసి వాడుమయ్య
ఆ ఆ సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి||
లోకాశతో మార్గం నిండి ఉప్పొంగుచూ –బు నే దప్పితిన్
మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే – మనశ్శాంతి కోల్పోతిని (2)
పోగొట్టుకున్న పాత్రయనుచు – పరుగెత్తి నను పట్టితివి
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే – నీ పాదంబుల్ పట్టితిన్
ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||
సీయోను పాటలు సంతోషముగా
సీయోను పాటలు సంతోషముగా
పాడుచు సీయోను వెల్లుదము (2)
లోకాన శాశ్వతానందమేమియు
లేదని చెప్పెను ప్రియుడేసు (2)
పొందవలె నీ లోకమునందు
కొంతకాలమెన్నో శ్రమలు (2) ||సీయోను||
ఐగుప్తును విడచినట్టి మీరు
అరణ్యవాసులే ఈ ధరలో (2)
నిత్యనివాసము లేదిలలోన
నేత్రాలు కానానుపై నిల్పుడి (2) ||సీయోను||
మారాను పోలిన చేదైన స్థలముల
ద్వారా పోవలసియున్ననేమి (2)
నీ రక్షకుండగు యేసే నడుపును
మారని తనదు మాట నమ్ము (2) ||సీయోను||
ఐగుప్తు ఆశలనన్నియు విడిచి
రంగుగ యేసుని వెంబడించి (2)
పాడైన కోరహు పాపంబుమాని
విధేయులై విరాజిల్లుడి (2) ||సీయోను||
ఆనందమయ పరలోకంబు మనది
అక్కడనుండి వచ్చునేసు (2)
సీయోను గీతము సొంపుగ కలసి
పాడెదము ప్రభుయేసుకు జై (2) ||సీయోను||
సీయోను పాటలు సంతోషముగా
సీయోను పాటలు సంతోషముగా
పాడుచు సీయోను వెల్లుదము (2)
లోకాన శాశ్వతానందమేమియు
లేదని చెప్పెను ప్రియుడేసు (2)
పొందవలె నీ లోకమునందు
కొంతకాలమెన్నో శ్రమలు (2) ||సీయోను||
ఐగుప్తును విడచినట్టి మీరు
అరణ్యవాసులే ఈ ధరలో (2)
నిత్యనివాసము లేదిలలోన
నేత్రాలు కానానుపై నిల్పుడి (2) ||సీయోను||
మారాను పోలిన చేదైన స్థలముల
ద్వారా పోవలసియున్ననేమి (2)
నీ రక్షకుండగు యేసే నడుపును
మారని తనదు మాట నమ్ము (2) ||సీయోను||
ఐగుప్తు ఆశలనన్నియు విడిచి
రంగుగ యేసుని వెంబడించి (2)
పాడైన కోరహు పాపంబుమాని
విధేయులై విరాజిల్లుడి (2) ||సీయోను||
ఆనందమయ పరలోకంబు మనది
అక్కడనుండి వచ్చునేసు (2)
సీయోను గీతము సొంపుగ కలసి
పాడెదము ప్రభుయేసుకు జై (2) ||సీయోను||
నే యేసుని వెంబడింతునని
నే యేసుని వెంబడింతునని
నేడేగా నిశ్చయించితిని
నే వెనుదిరుగన్ వెనుకాడన్
నేడేసుడు పిల్చిన సుదినం ||నే యేసుని||
నా ముందు శిలువ నా వెనుక లోకాశల్
నాదే దారి నా మనస్సులో
ప్రభు నా చుట్టు విరోధుల్
నావారెవరు నా యేసుని మించిన మిత్రుల్
నాకిలలో గానిపించరని ||నే యేసుని||
కరువులైనను కలతలైనను
కలసిరాని కలిమి లేములు
కలవరంబులు కలిగిననూ
కదలనింకా కష్టములైనా
వదలను నాదు నిశ్చయము ||నే యేసుని||
శ్రమయైననూ బాధలైననూ
హింసయైన వస్త్రహీనత
ఉపద్రవములు ఖడ్గములైన
నా యేసుని ప్రేమనుండి
నను యెడబాపెటి వారెవరు ||నే యేసుని||
నే యేసుని వెంబడింతునని
నే యేసుని వెంబడింతునని
నేడేగా నిశ్చయించితిని
నే వెనుదిరుగన్ వెనుకాడన్
నేడేసుడు పిల్చిన సుదినం ||నే యేసుని||
నా ముందు శిలువ నా వెనుక లోకాశల్
నాదే దారి నా మనస్సులో
ప్రభు నా చుట్టు విరోధుల్
నావారెవరు నా యేసుని మించిన మిత్రుల్
నాకిలలో గానిపించరని ||నే యేసుని||
కరువులైనను కలతలైనను
కలసిరాని కలిమి లేములు
కలవరంబులు కలిగిననూ
కదలనింకా కష్టములైనా
వదలను నాదు నిశ్చయము ||నే యేసుని||
శ్రమయైననూ బాధలైననూ
హింసయైన వస్త్రహీనత
ఉపద్రవములు ఖడ్గములైన
నా యేసుని ప్రేమనుండి
నను యెడబాపెటి వారెవరు ||నే యేసుని||
https://us05web.zoom.us/j/7206807144?pwd=eUp0a1R3eHlkUnZrV0xXbTVBbUtqUT09